'నిత్యానందను ఒకసారి కలవాలనుంది' | Actress Miramitun Showing Intrest To Meet Nityananda | Sakshi
Sakshi News home page

'నిత్యానందను ఒకసారి కలవాలనుంది'

Published Sat, Mar 14 2020 9:00 AM | Last Updated on Sat, Mar 14 2020 10:14 AM

Actress Miramitun Showing Intrest To Meet Nityananda - Sakshi

పెరంబూరు : 'ఒకే ఒక్క చాన్స్‌ ఇవ్వండి.. నేనేంటో నిరూపిస్తా..' అని ఖడ్గం చిత్రంలో హీరోయిన్‌ సంగీత చాలా దీనంగా అడుగుతుంది. అయితే అది రీల్‌లైప్‌లో.. కానీ ఇక్కడ నటి మీరామిథున్‌ మాత్రం ఒకే ఒక్కసారి అంటూ రియల్‌గా ఒక వ్యక్తిని కలవాలని కోరుకుంటోంది. ఇంతకీ ఈమె ఎవరిని కలవాలనుకుంటుందో తెలుసా.. నిత్యానందను. అవును మీరు విన్నది నిజమే.. మహిళలను లైంగింకంగా వేధించాడని పలు ఆరోపణలను ఎదుర్కొంటున్న నిత్యానందపై పలు కేసులు ఉన్న విషయం తెలిసిందే. కొన్నినెలల క్రితం నిత్యానంద విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో ఆయన్ని పట్టుకోవడానికి పోలీసులు ఇప్పటికి  ప్రయత్నిస్తూనే ఉన్నారు. (కమెడియన్‌ కునాల్‌పై ప్రయాణ నిషేధం)

ఇకపోతే నటి మీరామిథున్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోడలింగ్‌ రంగం నుంచి సినిమాకు పరిచయమైన ఈ బామ ఇటీవలే బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలోనూ పాల్గొని ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. అయితే మీరామిథున్‌పై కూడా పలు కేసులు ఉన్నాయి. అయినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్న మీరామిథున్‌ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. గతంలో చెన్నై పోలీసులు అక్రమార్కులు, లంచగొండులు అంటూ విమర్శించిన మీరా తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. అందులో నిత్యానందను ఒక్కసారి అయినా కలిసి ఆయనతో మాట్లాడాలన్నది తన కోరిక అని పేర్కొంది. అంతే కాకుండా నిత్యానంద రాసిన 'లివింగ్‌ ఎన్‌లైట్‌మెంట్‌' అనే పుస్తకంపై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. మీరామిథున్‌ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement