Perambur
-
Crime: రూ. 900 కోట్ల బంగారం స్వాధీనం
చెన్నై: ఎన్నికల వేళ తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ పరిధిలో కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది. అటుగా వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్ లారీలను సోదా చేశారు. ఓ లారీలో 1,025 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం గుర్తించారు. స్వాధీనం చేసుకుని వివరాలు ఆరా తీశారు. బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్ సమీప మన్నూర్‌లోని ఓ గోదాముకు తరలిస్తున్నట్లు తెలిసింది. 400 కిలోలకు ఆధారాలు ఉన్నాయని మిగిలినదానికి లేనట్లు తెలిసింది. అధికారులు చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులను సంప్రదించారు. వీటి మొత్తం విలువ రూ.900 కోట్లు ఉంటుందని అంచనా. ఇదిలా ఉంటే.. ఎలక్షన్ ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ పంచాయితీ ప్రెసిడెంట్ ఇంటి నుంచి కోటి రూపాయాల్ని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎట్టారై గ్రామం పంచాయితీ ప్రెసిడెంట్ దివ్య అన్బరసన్ నుంచి ఈ సొమ్మును రికవరీ చేశారు. ఆమె అన్నాడీఎంకేకు చెందిన నేత. -
రాజీవ్ హత్య.. సినిమాను మించే ట్విస్ట్‌లు.. అసలు ఆనాడేం జరిగింది?
నరకం, అవును నిజంగా నరకమే. చేసిన పాపం వెంటాడుతుంటే.. కటకటాల వెనక దశాబ్దాల పాటు ఉంటుంటే.. రేపు అనేది ఏమవుతుందో తెలియకపోతే.. నిజంగా నరకమే. 1991లో అప్పటి సమీకరణాల దృష్ట్యా రాజీవ్‌ను మట్టుపెట్టిన ఎల్టీటీఈ గ్యాంగులో మెజార్టీ దోషులు సెనైడ్ మింగి ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన కొందరు ఏళ్ల కొద్ది జైల్లో ఉన్నారు. వీరికి ఉరి శిక్ష తృటిలో తప్పినా.. యావజ్జీవం మాత్రం వెంటాడింది. మెజార్టీ తమిళులు మద్దతివ్వడంతో బయటకు వస్తామన్న ఆశలు పెరిగి చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే పరిస్థితి కలిగింది. అసలు నాడేమీ జరిగింది.? జైలు పక్షుల సమగ్ర కథనం ఇది.. ఒక నాయకుడు... ఒక నిర్ణయం... ఒక హత్య, తెర వెనక కొన్ని వందలమంది, అరెస్టయింది 26 మంది... శిక్ష పడింది ఏడుగురికి, ఉరి శిక్ష మాత్రం నలుగురికి. సినిమాను మించిన ఎన్నో ట్విస్టులను ఒక్కబిగిన చూపించే ఇలాంటి కేసు బహుశా భారతదేశ చరిత్రలో మరొకటి ఉండదేమో. 1991లో రాజీవ్ హత్య జరిగింది. ఆ కేసు చాలా మలుపులు తిరిగింది. ఎంతో మందిని ఈ కేసులో అరెస్ట్ చేసినా.. చివరికి దోషులుగా తేలింది 26మంది. అయితే వీరిలోనూ నేరుగా ప్రమేయమున్న వాళ్ల సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. దాదాపు ఐదేళ్ల పాటు సిట్ విచారణ జరిగింది. ఆ తర్వాత కోర్టులోనూ సుదీర్ఘంగా కేసు నడిచింది. 1999లో ఏడుగురికి మరణశిక్ష పడింది. ఇక తమ జీవితం ముగిసిందనుకున్నారు దోషులు. రాజీవ్‌ను చంపిన పాపానికి నేడో, రేపో ఉరి తీయడం ఖాయమనుకున్నారు. అయితే ఎక్కడో ఆశ మిగిలింది. సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లారు. కేసు మరికొంత కాలం సాగింది. ఈలోగా తమిళనాడులో సీను మారింది. రాజీవ్‌ను హత్య చేయడం సరే కానీ, అరెస్టయిన వాళ్లు అమాయకులు, కేవలం ఓ ఆపరేషన్‌లో భాగమయ్యారన్న ప్రచారం తమిళనాడంతా పాకింది. దీంతో దేశంలో ఎప్పుడూ లేనట్టుగా నేరస్థులపై సానుభూతి వెల్లువెత్తింది. 1999లో నలుగురికి మరణశిక్షను నిర్దారించింది సుప్రీం. అయితే తమిళనాడులో పరిస్థితి మాత్రం మారింది. దోషులకు అనుకూలంగా రాజకీయ పార్టీలు, ప్రముఖులు, ఒకరేంటీ తమిళనాట జనమంతా ఒక్కతాటిపైకి వచ్చారు. ఇటు కేంద్రంలో పరిస్థితి మారింది. కాంగ్రెస్ స్థానంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈలోగా కేంద్రంలో బలమైన ప్రభుత్వాలు లేకపోవడం, తమిళనాడులో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదో ఒక పార్టీ అటు ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం రావడంతో శిక్ష అమలులో జాప్యం జరిగింది. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు లేకున్నా.. అనధికారికంగా నాన్చివేత ధోరణిని ప్రదర్శించారు ఢిల్లీ పెద్దలు. ఈ లోగా 2006లో మరో బాంబు పేల్చింది ఎల్టీటీఈ. 2006లో రాజీవ్ హత్య వెనక అసలు కారణాలను బహిరంగంగా ప్రపంచానికి వెల్లడించింది ఎల్టీటీఈ. తమ పట్ల శాంతి దళాలు అమానుషంగా ప్రవర్తించాయని, అసలు భారత దళాలను రాజీవ్ పంపడం వల్లే తాము కక్ష పెంచుకున్నామని తెలిపాడు ప్రభాకరన్. నిజానికి 1990లలో ప్రభాకరన్ ఢిల్లీకి వచ్చినట్టు చెబుతారు. అప్పట్లో కొందరు తమిళ నేతలు, ఎల్టీటీఈ లీడర్లతో కలిసి ఢిల్లీ వచ్చిన ప్రభాకరన్.. నేరుగా రాజీవ్‌ను కలిసినట్టు చెబుతారు. ఈ చర్చల్లో ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకపోవడంతో ఎల్టీటీఈ నుంచి ఇక సమస్య ఉండదనుకున్నారు రాజీవ్. రాజీవ్ చేసిన ప్రతిపాదనను ఢిల్లీలో అంగీకరించిన ప్రభాకరన్.. జాఫ్నా వెళ్లిన తర్వాత మాత్రం అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నట్టు తమిళ వర్గాల సమాచారం. ఈ విషయంలోనే రాజీవ్‌కు కాసింత ఆగ్రహం వచ్చిందట. దీన్నే ఆసరాగా తీసుకుని అప్పట్లో ఇంటలిజెన్స్ అధికారులు కొందరు శాంతి దళాలు పంపే విషయంలో రాజీవ్‌తో అంగీకారం తీసుకున్నట్టు ఢిల్లీ వర్గాల బోగట్టా. నిజానికి ఆ సమయంలో ప్రధాని ఎవరున్నా.. నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చన్నది సీనియర్ అధికారులు ఎవరయినా చెబుతారు. ఎవరూ ఊహించనివిధంగా పెరంబూదూర్లో హత్యకు స్కెచ్ వేసిన ఎల్టీటీఈ పకడ్బందీగా దాన్ని నిర్వహించింది. ఆ తర్వాత అంతే వేగంగా సిట్ అధికారులు హత్య కేసును చేధించారు. 2006లో ఈ విషయన్నాంతా వెల్లడించిన ఎల్టీటీఈ.. తప్పు చేశాడు కాబట్టే శిక్షించాం అన్న రీతిలో వ్యవహరించింది. ఎల్టీటీఈ ప్రకటనతో జైల్లో ఉన్న ఖైదీల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో యూపీఏలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే ఎప్పటికప్పుడు ఉరి విషయానికి బ్రేకులు వేస్తూ వచ్చింది. ఇదే సమయంలో కథ మరో మలుపు తిరిగింది. (రాజీవ్ హత్యకేసుకు సంబంధిత కథనాల కోసం కింద లింక్స్ క్లిక్ చేయండి) (Rajiv Gandhi Case: ఆ ఫొటోగ్రాఫర్ ఇంట్లో దొరికిన రసీదే.. హంతకులను తెరపైకి తెచ్చిందా?!) (రాజీవ్ గాంధీ హత్యకు ఇంత ప్లాన్ చేశారా.. గంధపు దండ వల్లే దారుణం!) (ఇందిర చేసిన తప్పే రాజీవ్‌ను బలి తీసుకుందా?) -
రాజీవ్ గాంధీ హత్యకు ఇంత ప్లాన్ చేశారా.. గంధపు దండ వల్లే దారుణం!
శ్రీ పెరంబుదూర్.. ప్రస్తుత చెన్నై ఒకప్పటి మద్రాస్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం చేయాల్సిన ప్రాంతం ఇదే. ఇందిరాగాంధీకి సన్నిహిత మిత్రురాలైన శ్రీమతి మరకతం చంద్రశేఖర్ అనే సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు అక్కడి నుంచే పోటీ చేస్తుండడంతో ఆమె తరఫున ప్రచారం చేయడానికి రాజీవ్‌గాంధీ ఒప్పుకున్నారు. దీంతో పెరంబుదూర్‌లోని ఒక మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన నిర్వాహకులు రాజీవ్ వచ్చేవరకు ప్రజలను ఉత్సాహపరిచేందుకు సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. జరగబోయే దారుణం తెలియని ప్రజలు రాజీవ్‌ను చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి RK రాఘవన్ సభాస్థలి వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లను చూస్తున్నారు. దాదాపు 300 మంది పోలీసు సిబ్బంది కాపలాగా ఉన్నారు. ఈ ఏర్పాట్లు రాఘవన్‌కు సంతృప్తి కలిగించలేదు. రాజీవ్ నడిచే ఎర్ర తివాచీకి ఇరు వైపులా కట్టిన బారికేడ్లు గట్టిగా లేవన్నారు. ఈ వాదనను స్థానిక నేతలు పట్టించుకోలేదు. జనాన్ని కంట్రోల్ చేసే బాధ్యతను మరకతం అసిస్టెంట్ AJ దాస్‌కు అప్పగించారు. రాజీవ్ వద్దకు ఎవరిని అనుమతించాలనే జాబితాను ఆయనే చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న లతా కణ్నన్.. తన కూతురి కోకిలను ఆ లిస్ట్‌లో చేర్చాలంటూ దాస్‌పై ఒత్తిడి తెచ్చారు. లతా కణ్నన్ మరకతం కూతురు లతా ప్రియకుమార్ దగ్గర పని చేస్తుండేది. ఐతే లతా కణ్నన్ ఎంత బతిమాలినా దాస్ ఒప్పుకోలేదు. చివరకు లతా ప్రియాకుమార్ చెప్పడంతో రాజీవ్‌కు అభివాదం చేసే 24మందిలో కోకిలను చేర్చడానికి ఒప్పుకున్నాడు. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ వైజాగ్ నుంచి బయల్దేరడానికి రెడీ అవుతున్నారు. ఐతే విమానంలో లోపం ఏర్పడినట్లు కెప్టెన్ చందోక్ గుర్తించారు. కమ్యూనికేషన్ సిస్టమ్ పని చేయడం లేదని కనుక్కున్నారు. స్వతహాగా పైలట్ ఐన రాజీవ్.. తాను కూడా ఓ చేయి వేసి లోపాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. ఇక ప్రయాణం లేదని అనుకుంటూ రాజీవ్ హోటల్‌కు వెళ్లిపోయారు. పరిస్థితి అలాగే ఉంటే రాజీవ్ బతికే ఉండే వారేమో కానీ కాసేపటికే ఫ్లైట్ రిపేర్ అయిందంటూ సమాచారం రావడంతో రాజీవ్ విమానం వద్దకు వచ్చేశారు. సాయంత్రం 6.30కి రాజీవ్ స్వయంగా ఫ్లైట్ నడుపుతూ రాత్రి 8.20 నిమిషాలకు మద్రాస్‌లోని మీనంబాకం ఎయిర్‌పోర్ట్‌కు చేరారు. అక్కడి నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారులో మరకతం చంద్రశేఖర్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు వాళప్పాడి రామ్మూర్తి, పర్సనల్ సెక్యూరిటీ అధికారులతో కలసి రాజీవ్ బయల్దేరారు. న్యూయార్క్ టైమ్స్, గల్ఫ్ న్యూస్ పత్రికలకు కారులో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన దారిలో పోరూరు, పూనమల్లిల్లో ప్రసంగించారు. అలా పెరంబుదూర్ వైపు ఆయన ప్రయాణం సాగింది. రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో రాజీవ్ పెరంబుదూర్ చేరుకున్నారు. రాజీవ్ రావడంతో సభా ప్రాంగణం సందడిగా మారిపోయింది. ముందుగా సభా స్థలి దగ్గర్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాల వేసిన రాజీవ్ అక్కడి నుంచి సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. వేదికవైపు వడివడిగా నడుచుకుంటూ వెళ్తున్న రాజీవ్‌ను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోటీపడ్డారు. ఇదే సమయంలో లతా కణ్నన్ తన కూతురుతో సహా స్టేజి దగ్గరకు చేరింది. ఐతే ఊహించని విధంగా కళ్లద్దాలు పెట్టుకున్న ఓ యువతి.. గంధపు దండ చేతిలో పట్టుకొని లోపలికి వచ్చేసింది. స్థానిక ఫోటోగ్రాఫర్ హరిబాబుతో కలిసి వచ్చిన ఆ యువతి మరో ఇద్దరు అమ్మాయిలు నళిని, శుభలతో కలసి మహిళా విభాగంలో కూర్చుంది. లతా కణ్నన్, ఆ పక్కనే ఆమె కూతురు కోకిల, వారికి కాస్త దూరంగా విలేఖరిలా ఉన్న ఓ యువకుడు, అతనికి దగ్గర్లో ఫోటోగ్రాఫర్ హరిబాబు.. వారికి సమీపంలో గంధపు దండ చేతిలో పట్టుకున్న కళ్లద్దాల యువతి.. ఆమెకు కొద్ది దూరంలో మరో ఇద్దరు అమ్మాయిలు నళిని, శుభ. ఇదీ సభా స్థలి వద్ద పరిస్థితి. ఒక్కో క్షణం భారంగా గడుస్తోంది. రాజీవ్‌ను మింగేయడానికి మృత్యువు నెమ్మదిగా ముందుకొస్తోంది. ఇవేమీ తెలియని రాజీవ్... చకచకా నడుస్తున్నారు. ఆయన వెంట మరకతం చంద్రశేఖర్ కార్యకర్తలను అదుపు చేస్తూ పరుగులు పెడుతున్నారు. ఆ ఊపులోనే స్టేజి వద్దకు వచ్చిన రాజీవ్ అభిమానుల నుంచి అభివాదాలు, పూలమాలలు స్వీకరిస్తున్నారు. లత కణ్నన్ కూడా తన కూతురు కోకిలని పరిచయం చేసింది. ఇదే అదనుగా కోకిల వెనకాలే నిలుచున్న కళ్లద్దాల యువతి.. రాజీవ్ ముందుకు రావడానికి ప్రయత్నించింది. ఐతే మహిళా SI అనసూయ ఆమెను ఆపేయడంతో ఆ యువతి నిరాశ చెందింది. కాలం కూడా ఒక్క క్షణం ఊపిరి తీసుకుంది. SI వద్దన్నప్పటికీ రాజీవ్ అంగీకరించడంతో కళ్లద్దాల యువతి రాజీవ్ వద్దకు చేరింది. తాను తీసుకొచ్చిన గంధపు పూలమాలను రాజీవ్ మెడలో వేసే ప్రయత్నం చేసింది. ఆ దండని స్వీకరించడానికి రాజీవ్ కొద్దిగా తల వంచారు. ఆయన మళ్లీ తల ఎత్తేలోపే ఆ యువతి పాదాభివందనం చేయడానికి అన్నట్లు కిందకు వంగింది. అంతే చెవులు బద్దలైపోయేంత శబ్దంతో మైదానం మోగిపోయింది. దాదాపు 20 అడుగుల ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. స్జేజ్ చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్మకుపోయింది. హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. అప్పటి వరకు చిరునవ్వులు చిందించిన రాజీవ్‌ను మృత్యువు కాటేసింది. -
ఐసీఎఫ్‌కు ‘వందే భారత్’
సాక్షి, చెన్నై: చెన్నై ఐసీఎఫ్‌లో వందేభారత్ రైళ్లు 30 రూపు దిద్దుకోనున్నాయి. ఈ మేరకు ఒక్కో రైలుకు రూ. వంద కోట్లు వెచ్చించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చెన్నై పెరంబూరులోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) ఘన చరిత్ర గురించి తెలిసిందే. ఈ ఫ్యాక్టరీ నుంచి దేశ విదేశాలకు వేలాది రైలు బోగీలు తయారు చేసి పంపించారు. ఇటీవల పట్టాలెక్కిన రెండు వందే భారత్ రైళ్లను ఇక్కడే సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం రైల్వే యంత్రాంగం వందే భారత్ రైళ్లను మరిన్ని పట్టాలెక్కించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పంజాబ్‌లోని ఐసీఎఫ్, ఉత్తర ప్రదేశ్‌లోని ఐసీఎఫ్‌కు తలా 14 చొప్పున రైళ్ల తయారీకి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే, చెన్నైలోని ఐపీఎఫ్‌లో ఏకంగా 30 రైళ్లకు సంబంధించిన బోగీలు తయారు చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికత, వసతులు కలిగిన 16 బోగీలతో కూడిన ఒక వందే భారత్ రైలుకు రూ. వంద కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 2024 మార్చి 31 నాటికి ఈ రైళ్లను కేంద్ర రైల్వే యంత్రాంగానికి అప్పగించే లక్ష్యంతో పనులపై దృష్టి సారించారు. ఎలక్ట్రిక్ బస్సులు మాకొద్దు.. కేంద్రం నిధులతో కొనుగోలు చేయదలిచిన ఎలక్ట్రిక్ బస్సులకు మంగళం పాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. చెన్నైలో 525 ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపేందుకు కసరత్తులు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ బస్సుల్ని కేంద్రం నిధులు, కేంద్రం ఇచ్చే సూచనలకు అనుగుణంగా కొనుగో లు చేయాల్సి ఉంది. దీంతో కేంద్రం నిధులతో ఈ బస్సులు తమకు వద్దన్న నిర్ణయానికి డీఎంకే పాల కులు వచి్చనట్లు సచివాలయ వర్గాల సమాచారం. -
'నిత్యానందను ఒకసారి కలవాలనుంది'
పెరంబూరు : 'ఒకే ఒక్క చాన్స్ ఇవ్వండి.. నేనేంటో నిరూపిస్తా..' అని ఖడ్గం చిత్రంలో హీరోయిన్ సంగీత చాలా దీనంగా అడుగుతుంది. అయితే అది రీల్‌లైప్‌లో.. కానీ ఇక్కడ నటి మీరామిథున్ మాత్రం ఒకే ఒక్కసారి అంటూ రియల్‌గా ఒక వ్యక్తిని కలవాలని కోరుకుంటోంది. ఇంతకీ ఈమె ఎవరిని కలవాలనుకుంటుందో తెలుసా.. నిత్యానందను. అవును మీరు విన్నది నిజమే.. మహిళలను లైంగింకంగా వేధించాడని పలు ఆరోపణలను ఎదుర్కొంటున్న నిత్యానందపై పలు కేసులు ఉన్న విషయం తెలిసిందే. కొన్నినెలల క్రితం నిత్యానంద విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో ఆయన్ని పట్టుకోవడానికి పోలీసులు ఇప్పటికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. (కమెడియన్ కునాల్‌పై ప్రయాణ నిషేధం) ఇకపోతే నటి మీరామిథున్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోడలింగ్ రంగం నుంచి సినిమాకు పరిచయమైన ఈ బామ ఇటీవలే బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలోనూ పాల్గొని ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. అయితే మీరామిథున్‌పై కూడా పలు కేసులు ఉన్నాయి. అయినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్న మీరామిథున్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. గతంలో చెన్నై పోలీసులు అక్రమార్కులు, లంచగొండులు అంటూ విమర్శించిన మీరా తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. అందులో నిత్యానందను ఒక్కసారి అయినా కలిసి ఆయనతో మాట్లాడాలన్నది తన కోరిక అని పేర్కొంది. అంతే కాకుండా నిత్యానంద రాసిన 'లివింగ్ ఎన్‌లైట్‌మెంట్' అనే పుస్తకంపై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. మీరామిథున్ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. View this post on Instagram At the end of the day, I'M AT PEACE, because my intentions are good and my heart is pure 💫✨👼 A post shared by Meera Mitun (@meeramitun) on Mar 12, 2020 at 12:49pm PDT -
రజనీకి హత్యా బెదిరింపులు
పెరంబూరు : తమిళ సినీ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాక ముందే ఆయనపై రాజకీయ దాడి జరుగుతోందా? అని అనిపించేది. అయితే ఏ విషయాన్నైనా ఆచి తూచి మాట్లాడే రజనీకాంత్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో డ్రావిడులు అభిమానించే పెరియార్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురవుతున్నారు.1971లో పెరియార్ ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన ర్యాలీలో ఆయన హిందూ దేవుళ్ల చిత్ర పటాలను అవమానించేలా ప్రవర్తించారన్న విషయాన్ని నటుడు రజనీకాంత్ ప్రస్థావించారు. అది ఇప్పుడు ఆయనకు పెద్ద తల నొప్పిగా మారింది. (రజనీపై పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు) ద్రవిడ విడుదలై కళగం, డీఎంకే వంటి పార్టీ నాయకులు రజనీపై మండి పడుతున్నారు. ఆయనపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌కు రజనీకాంత్ తలొగ్గలేదు. పత్రికల్లో చదివిందీ, విన్నదే తాను చెప్పానని, సారీ చెప్పనని రజనీకాంత్ తెగేసి చెప్పారు. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రజనీకాంత్‌పై హాత్యాబెదిరింపులు వస్తున్నాయంటూ సినోరా పీఎస్.అశోక్ అనే వ్యక్తి చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం పిర్యాదు చేశారు. అందులో గత 22వ తేదీన స్థానిక తేనాపంపేట సమీపంలో సెంమొళి పూంగా వద్ద ద్రావిడ విడుదలై కళగంకు చెందిన కొందరు ఉమాపతి ఆధ్వర్యంలో రజనీకాంత్‌కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. రజనీకాంత్‌ను ప్రాణాలతో నవడవనీయమని హెచ్చరించారన్నారు. కాబట్టి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరపాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. (పెరియార్‌పై వ్యాఖ్యలు : క్షమాపణకు సూపర్‌స్టార్ నో..) -
లారెన్స్ పేరుతో డబ్బు వసూలు చేశారు
పెరంబూరు : నృత్యదర్శకుడు, నటుడు రాఘవలారెన్స్ పేరుతో నకీలీ వెబ్‌సైట్‌ను ప్రారంభించి ప్రజల నుంచి కొందరు డబ్బును దోచుకుంటున్నట్లు లారెన్స్ ప్రజాసేవా సంఘం కార్యదర్శి శంకర్ బుధవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో నటుడు లారెన్స్ పేరు, ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా కొందరు ఆయన పేరుతో నేనే లారెన్స్ అంటూ నకిలీ ఐడీతో వెబ్‌సైట్‌ను ప్రారంభించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. చెన్నైలోని కొలత్తూర్, సెలం, ఊటీ, రామనాథపురం, బెంగళూర్ ప్రాంతాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటివి నటుడు లారెన్స్ పేరు, ప్రతిష్టలకు కళంకం తీసుకొస్తున్నాయన్నారు. కాబట్టి లారెన్స్ పేరుతో నకిలీ వెబ్సైట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారిని కనిపెట్టి వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ప్రజలు, అభిమానులు సాయం చేయాలనుకుంటే నిజమైన రాఘవలారెన్స్ ట్రస్ట్‌ను సంప్రదించగలరని శంకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
అశ్లీల చిత్రాలతో బెదిరింపులు
సాక్షి, చెన్నై(పెరంబూరు) : తనతో సన్నిహితంగా ఉన్న అశ్లీల చిత్రాల విడియోతో బెదిరిస్తున్నాడంటూ బుల్లితెర నటుడిపై మరో సినీ, బుల్లితెర సహాయ నటి శనివారం రాత్రి స్థానిక వడపళని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ వివరాలు చూస్తే స్థానిక వడపళని, ఆర్కాడు రోడ్డులో నివశిస్తున్న సినీ, బుల్లితెర సహాయ నటి జెనీఫర్. ఈమె శనివారం రాత్రి స్థానిక వడపళని పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేసింది. అందులో మూడేళ్ల క్రితం ప్రకృద్దీన్ అనే సహాయ నటుడు తనకు పరిచయం అయ్యాడని పేర్కొంది. అతను భార్యను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నట్లు చెప్పాడంది. దీంతో తాను అతనితో సన్నిహితంగా మెలిగానని తెలిపింది. కాగా తాను అతనితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను వీడియోగా చిత్రీకరించి తనను బెదిరిస్తున్నట్లు చెప్పింది. ఇంతకు ముందే అతనిపై తాను ట్రిప్లికేన్, పుళల్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, అప్పుడు పోలీసులు అతన్ని పిలిపించి హెచ్చరించారని తెలిపింది. కాగా ఇప్పుడు మళ్లీ తనను బెదిరిస్తున్నట్లు పేర్కొంది. శనివారం ప్రకృద్దీన్ తన ఇంటికి వచ్చి తన తల్లిని చంపుతానని బెదిరించాడని ఆరోపించింది. దీంతో వడపళని పోలీసులు సహాయ నటుడు ప్రకృద్దీన్పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
దర్శకుడు పా.రంజిత్‌కు కోర్టు అక్షింతలు
పెరంబూరు: సినీ దర్శకుడు పా.రంజిత్‌కు కోర్టు అక్షంతలు వేసింది. వివరాలు.. అట్టకత్తి, మెడ్రాస్, కబాలి, కాలా చిత్రాల దర్శకుడు పా.రంజిత్ ఇటీవల కుంభకోణం సమీపంలోని తిరుప్పనంద గ్రామంలో దళిత సంఘం నిర్వహించిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఆ వేదికపై ఆయన రాజరాజ చోళన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. నటుడు కరుణాస్ వంటి వారు పా.రంజిత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇదిలాఉండగా తిరుప్పనంద గ్రామంలో పా.రంజిత్ చేసిన వ్యాఖ్యలపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఆయన వ్యాఖ్యలు భారతీయ మతసామరస్యానికి వ్యతిరేకం అని, తమిళ స్త్రీల మనోభావాలను కించపరచేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పా.రంజిత్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. ఆ ప్రాంత ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు దర్శకుడు పా.రంజిత్‌పై మతకలహాలను రేకెత్తించడం, శాంతి భద్రతకు భంగం కలిగించడం లాంటి నేరాలపై కేసులు నమోదు చేశారు. దీంతో పా.రంజిత్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ మదురై హైకోర్టు శాఖలో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను చరిత్రలో ఉన్న విషయాలనే చెప్పానని, తన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాలు వక్రీకరించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్ గురువారం న్యాయమూర్తి రాజమాణిక్యం సమక్షంలో విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది దర్శకుడు పా.రంజిత్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదని వాదించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సమాజంలో మాట్లాడటానికి ఎన్నో విషయాలు ఉండగా ప్రజలు గొప్పగా భావించే రాజరాజచోళన్ గురించి ప్రస్థావించాల్సిన అవసరం ఏముందని దర్శకుడు పా.రంజిత్‌కు అక్షింతలు వేశారు. అదే విధంగా ఈ నెల 19 వరకూ దర్శకుడిని అరెస్ట్ చేయరాదని ఉత్తర్వులు జారీ చేస్తూ, ఈ కేసుకు సంబంధించి తిరుప్పనంద పోలీస్ ఇన్స్పెక్టర్ బదులు పిటిషన్‌ను 19వ తేదీన కోర్టులో దాఖలు చేయాల్సిందిగా ఆదేశించారు. -
అమ్మా నీకో దండం!
పెరంబూరు: నా విషయంలో ఒక తల్లి ఏమేం చేయకూడదో అవన్నీ చేశావు. అమ్మా నీకో దండం అని నటి సంగీత ఆవేదనను వ్యక్తం చేశారు. దక్షిణాది భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించిన సంగీతపై ఆమె తల్లి భానుమతి ఇటీవల తమిళనాడు మహిళా పోలీస్ కమిషన్‌లో ఫిర్యాదు చేసి కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. తన కూతురు తన ఇంటిని అపహరించడానికి ప్రయత్నిస్తోందని, అవసాన దశలో ఉన్న తనను ఇంటి నుంచి బయటకు పొమ్మంటోంది లాంటి ఆరోపణలను ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నటి సంగీతకు నోటీసులు జారీ చేయడం, ఆమె తన భర్త క్రిష్‌తో కలిసి పోలీస్ కమిషనర్ ముందు హాజరవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నటి సంగీత తన తల్లిపై ఆరోపణలు గుప్పిస్తూ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అందులో ప్రియమైన అమ్మకు నన్ను ఈ లోకానికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. నా పాఠశాల చదువును నిలిపేసి 13 ఏళ్లకే పనికి పంపావే అందుకు కృతజ్ఞతలు. ఖాళీ చెక్కులపై నీవు చెప్పినట్టల్లా సంతకాలు చేయించుకున్నావే అందుకు కృతజ్ఞతలు. పనికే వెళ్లకుండా, శ్రమ అన్నది తెలియని నీ కొడుకులకు మద్యం కోసం, డబ్బు కోసం నన్ను తప్పుడు పనులకు వాడుకున్నావే అందుకు కృతజ్ఞతలు. అందుకు నేను వ్యతిరేకించినప్పుడు సొంత ఇంటిలోనే నిర్భంధించావే అందుకూ కృతజ్ఞతలు. నేను గొడవ చేసి బయటకు వచ్చే వరకూ నాకు పెళ్లి చేయలేదే అందుకూ కృతజ్ఞతలు. నా భర్తపై ఒత్తిడి చేశావు, నా కుటుంబానికి సంతోషాన్ని దూరం చేసినందుకూ చాలా చాలా కృతజ్ఞతలు. ఒక తల్లి ఎలా ఉండకూడదో అలాంటి చేసి నాకు ఉదాహరణగా ఉన్నావు అందుకూ కృతజ్ఞతలు. చివరిగా నాపై అసత్యపు ఫిర్యాదు చేశావు అందుకూ కృతజ్ఞతలు. ఎందుకంటే నువ్వు ఒక మైనముద్రలో ఉన్న నన్ను పోరాడే ధైర్యవంతురాలిగా మారడానికి, ఆరితేరడానికి కారణం అయ్యావు. ఈ ఒక్క కారణంగానే నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనూ ఉంటాను. మోహం నుంచి నువ్వు ఒక రోజు బయటపడి నన్ను చూసి గర్వపడతావు అని నటి సంగీత పేర్కొంది. -
వైభవంగా హీరో కూతురి వివాహం
సాక్షి, పేరంబూరు: నటుడు, దర్శకుడు పార్థిబన్, సీత కూతురు కీర్తన వివాహ వేడుక అక్షయ్‌తో గురువారం ఉదయం స్థానిక రాజా అన్నామలైపురంలోని ఒక నక్షత్ర హోటల్లో ఘనంగా జరిగింది. కీర్తన మణిరత్నం దర్శకత్వం వహించిన కన్నత్తిల్ ముత్తమిట్లాల్ చిత్రంలో బాల నటిగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మణిరత్నం వద్ద సహాయ దర్శకురాలిగా పని చేస్తున్న కీర్తన త్వరలో మెగాఫోన్ పట్టనున్నారు. అక్షయ్, కీర్తన ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఇటీవలే వివాహ నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. గురువారం అక్షయ్, కీర్తనల పెళ్లికి ఈ శుభం కార్డు పడింది. వీరి వివాహ వేడుకను పార్థిబన్, సీత కలిసి ఘనంగా నిర్వహించారు. పార్థిబన్, సీత మనస్పర్థల కారణంగా చాలా కాలం క్రితమే విడిపోయిన విషయం తెలిసిందే. అయితే కూతురి పెళ్లి పార్థిబన్, సీతల సమక్షంలో ఒక వేడుకలా జరగడం విశేషం. అక్షయ్, కీర్తన వివాహవేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, దయానిధిమారన్, ఎండీఎంకే నేత వైగోలతో పాటు మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ వంటి పలువురు రాజకీయనేతలతో పాటు నటుడు రజనీకాంత్, లతారజనీకాంత్, శివకుమార్, సూర్య, విశాల్, అరుణ్‌విజయ్, విజయ్‌కుమార్, నటి జ్యోతిక, మీనా, శ్రీప్రియ, లక్ష్మి, కుష్బూ, సందర్.సీ సత్యరాజ్, జయంరవి, ప్రభుదేవా, జీవీ.ప్రకాశ్‌కుమార్, విజయ్‌సేతుపతి, ఉదయనిధిస్టాలిన్, దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని మణిరత్నం, రోహిణి, రాధిక శరత్‌కుమార్, నిర్మాత ఆర్బీ.చౌదరి. ఇళయరాజా, ఏఆర్.రెహ్మాన్, గాయకుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం, సంగీతదర్శకుడు హరీష్‌జయరాజ్, కే.భాగ్యరాజ్,శంకర్, సినీ ప్రముఖులు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రాణం తీసిన కుంపటి..!
కొత్తూరు: పారాపురం ఏబీ రోడ్డుకు అనుకొని ఉన్న ఎస్సీ వీధిలో వృద్ధురాలు రీసి శాంతమ్మ చిన్న పూరింట్లో నివాసం ఉంటుంది. చలి నుంచి రక్షణ కోసం కుంపట్లో నిప్పు రవ్వలు వేసుకొని శుక్రవారం రాత్రి నిద్రించారు. అయితే అర్ధరాత్రి తరువాత నిప్పు రవ్వల నుంచి వ్యాపించిన మంటలు ఆమె మంచానికి, ఇంటికి వ్యాపించాయి. దీంతో ఆమె మంచంపైనే సజీవ దహనమైంది. శాంతమ్మ ఇంటితోపాటు పక్కన ఉన్న మరో నాలుగు ఇళ్లు కూడా ఈ ఘటనలో కాలిపోయాయి. గాఢ నిద్రలో ఉన్నవారంతా మంటల వేడికి మేల్కొని ఏం జరుగుతుందో తెలియక భయంతో పిల్లాపాలను తీసుకొని ఆరుబయటకు పరుగులు తీశారు. కళ్లెదుటే ఇళ్లు కాలిపోవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఈ ఘటనలో తూత సుందరరావు, వీరయ్య, కొర్ర రవి, ఏకాశిలకు చెందిన ఇళ్లు బూడిదయ్యాయి. సుందరరావు గతంలో ఓ వ్యక్తి దగ్గర మూడు లక్షల రూపాయలు అప్పు చేశారు. దాన్ని తీర్చేందుకు మరో వ్యక్తి వద్ద రెండు రోజుల క్రితం మూడు లక్షల రూపాయలను అప్పుగా తెచ్చి బీరువాలో పెట్టగా.. ప్రమాదంలో ఆ డబ్బులతో పాటు 5 తులాల బంగారం కాలిపోయాయి. కొర్ర రవికి చెందిన లక్షల రూపాయలు, 5 తులాల బంగారు వస్తువులు కూడా బూడిదయ్యాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చిన మంటలను అదుపు చేశారు. రూ. 20 లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. సంఘటన స్థలం వద్దే పోస్టుమార్టం సజీవ దహనమైన శాంతమ్మ ఎములు మాత్రమే మిగిలాయి. దీంతో పాలకొండ ఏరియా ఆస్పత్రి వైద్యుడు విశ్వేశ్వరరావు ప్రమాద స్థలం వద్దే పోస్టుమార్టం నిర్వహించారు. కొత్తూరు ఇన్చార్జి ఎస్సై రాము కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ కాంతారావు తెలిపారు. సంబరం జరుపుకున్న కొన్ని గంటల్లోనే... తూత సుందరరావు ఇంట్లో శుక్రవారం రాత్రి వరకు జామి ఎల్లారమ్మ పండుగ జరిగింది. బంధువులు, స్నేహితుల సమక్షంలో సందడిగా జరుపుకున్నారు. తరువాత అంతా నిద్రలోకి జారుకున్నారు. ఇంతలోనే ఇల్లు కాలిపోయి..తీవ్ర నష్టాన్ని, విషాదాన్ని మిగిల్చింది. బాధితులకు రెడ్డి శాంతి పరామర్శ పారాపురం అగ్నిప్రమాద బాధితులను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి శనివారం పరామర్శించారు. ప్రమాదానికి కారణాలు, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కలిసి కోరుతామని బాధితులకు హామీ ఇచ్చారు. ఆమె వెంట పార్టీ జిల్లా కార్యదర్శి రేగేటి కన్నయ్య స్వామి, మండల కార్యదర్శి ఎం.తిరుపతిరావు, నాయకులు వను ము లక్ష్మీనారాయణ, పిన్నింటి శేషగిరి నాగేశ్వరరావు, బూరాడ గోవిందరావు, కొల్ల కృష్ణ ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు
సాక్షి, చెన్నై: యువ హీరో జై, ప్రేమ్‌జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో జై, ప్రేమ్‌జీలకు గాయాలయ్యాయి. గురువారం ఉదయం మందవల్లి నుంచి ప్రయాణిస్తున్న కారు అడయార్ బ్రిడ్జి సమీపంలో అదుపు తప్పి గోడను ఢీ కొట్టింది. అయితే కారు డ్రైవ్ చేస్తున్న జై అజాగ్రత్త కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. అంతేకాక ఆయనకు రూ.500/- జరిమానా విధించినట్లు సమాచారం. కాగా వీరిద్దరూ దర్శకుడు వెంకట్ ప్రభు తాజా చిత్రం పార్టీలో ఆయన నటిస్తున్నారు. -
వైభవంగా శ్రీనివాస కల్యాణం
టీ.నగర్, న్యూస్‌లైన్: చెన్నై పెరంబూరులోని శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం శ్రీనివాస కల్యాణ వైభవంగా జరిగింది. చెన్నై మూలకడై జంక్షన్‌లోని వల్లి మహల్లో కల్యాణోత్సవం జరిగింది. కాంచీపురం వరదరాజ పెరుమాల్ ఆస్థాన పండితులు రంగన్ భట్టాచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీనివాస కల్యాణం జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ పాలకమండలి సభ్యుడు ఎన్.కన్నయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరిం చారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం 21 ఏళ్లుగా శ్రీనివాస కల్యాణం నిర్వహిం చడం అభినందనీయమని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రెసిడెంట్ తమ్మినేని బాబు మాట్లాడుతూ శ్రీవారి కల్యాణం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. శనివారం రాత్రి పెరంబూరు ఆనంద నిలయం ఆధ్వర్యంలో గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరిగిందన్నారు. ఈ ఊరేగింపు నాలుగు వీధులు తిరిగి ఆనంద నిలయం చేరుకోగా రాత్రి 9.30 గంటలకు నిశ్చితార్థం కార్యక్రమం జరిగిందన్నారు. మూలకడై వల్లిమహల్ లో ఆదివారం ఉదయం జరిగిన కల్యాణోత్సవంలో స్వామి వారికి గణపతి హోమం, అభిషేకం, తిరుమంజనం, ఉయ్యాల సేవ, పూల దండల మార్పు, మహా దీపారాధన నిర్వహించినట్టు తెలిపారు. వరుడి తరపున శ్రీనివాసన్ దంపతులు, శ్రీదేవి, భూదేవి తరపున డి.జంబులింగం దంపతులు ఉభయదారులుగా పాల్గొని కల్యాణం జరిపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం కార్యదర్శి ఆర్ఎం శేషన్, కోశాధికారి డి.రామలింగం పాల్గొన్నారు.