సాక్షి, చెన్నై: చెన్నై ఐసీఎఫ్‌లో వందేభారత్ రైళ్లు 30 రూపు దిద్దుకోనున్నాయి. ఈ మేరకు ఒక్కో రైలుకు రూ. వంద కోట్లు వెచ్చించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చెన్నై పెరంబూరులోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) ఘన చరిత్ర గురించి తెలిసిందే. ఈ ఫ్యాక్టరీ నుంచి దేశ విదేశాలకు వేలాది రైలు బోగీలు తయారు చేసి పంపించారు. ఇటీవల పట్టాలెక్కిన రెండు వందే భారత్ రైళ్లను ఇక్కడే సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం రైల్వే యంత్రాంగం వందే భారత్ రైళ్లను మరిన్ని పట్టాలెక్కించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పంజాబ్‌లోని ఐసీఎఫ్, ఉత్తర ప్రదేశ్‌లోని ఐసీఎఫ్‌కు తలా 14 చొప్పున రైళ్ల తయారీకి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే, చెన్నైలోని ఐపీఎఫ్‌లో ఏకంగా 30 రైళ్లకు సంబంధించిన బోగీలు తయారు చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికత, వసతులు కలిగిన 16 బోగీలతో కూడిన ఒక వందే భారత్ రైలుకు రూ. వంద కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 2024 మార్చి 31 నాటికి ఈ రైళ్లను కేంద్ర రైల్వే యంత్రాంగానికి అప్పగించే లక్ష్యంతో పనులపై దృష్టి సారించారు.
ఎలక్ట్రిక్ బస్సులు మాకొద్దు..
కేంద్రం నిధులతో కొనుగోలు చేయదలిచిన ఎలక్ట్రిక్ బస్సులకు మంగళం పాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. చెన్నైలో 525 ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపేందుకు కసరత్తులు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ బస్సుల్ని కేంద్రం నిధులు, కేంద్రం ఇచ్చే సూచనలకు అనుగుణంగా కొనుగో లు చేయాల్సి ఉంది. దీంతో కేంద్రం నిధులతో ఈ బస్సులు తమకు వద్దన్న నిర్ణయానికి డీఎంకే పాల కులు వచి్చనట్లు సచివాలయ వర్గాల సమాచారం.
ఐసీఎఫ్‌కు ‘వందే భారత్’
Published Sun, Sep 5 2021 6:22 AM | Last Updated on Sun, Sep 5 2021 9:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment