ICF
-
గరీబ్‌రథ్ జాడేది?
♦ హైదరాబాద్–విశాఖపట్నం మధ్య నిత్యం తిరిగే గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం 12 గంటల 35 నిమిషాలు. ఇందులో మూడో శ్రేణి ఏసీ తరగతి టికెట్ ధర రూ.1395 ♦ సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య వారంలో మూడురోజులు తిరిగే దురొంతో ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం 10 గంటల 15 నిమిషాలు. ఇందులో మూడో శ్రేణి ఏసీ తరగతి టికెట్ ధర రూ.1630 ♦ సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య రోజూ తిరిగే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం 11 గంటలే. ఇందులో మూడో శ్రేణి ఏసీ తరగతి టికెట్ ధర రూ.1085 మాత్రమే. ♦ గోదావరి, దురొంతో ఎక్స్‌ప్రెస్‌లతో పోలి స్తే గరీబ్రథ్కు డిమాండ్ ఎక్కువ. కానీ, ఆ శ్రేణి రైళ్ల సంఖ్య పెంచేందుకు కేంద్రప్ర భుత్వం ససేమిరా అంటోంది. కేవలం రంగు మార్పు, ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల ఏర్పాటుకే పరిమితమవుతున్నట్టు తెలుస్తోంది. సాక్షి, హైదరాబాద్: పేదలు కూడా తక్కువ ధరతో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో 17 ఏళ్ల క్రితం రైల్వేశాఖ గరీబ్‌రథ్ కేటగిరీ రైళ్లు ప్రారంభించింది. లాలూప్రసాద్‌యాదవ్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇవి పట్టాలెక్కాయి. సులభంగా ప్రజలకు తెలిసేలా పూర్తి ఆకుపచ్చ రంగుతో ఈ రైళ్లు ఉన్నాయి. వీటిల్లో అన్నీ ఏసీ మూడో శ్రేణి కోచ్‌లే. గరిష్ట వేగం గంటకు దాదాపు 130 కిలోమీటర్లు. సూపర్‌ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకంటే ఇవి వేగంగా పరుగుపెడతాయి. అందుకే వాటితో పోలిస్తే ఇవి కొంత తొందరగా గమ్యం చేరుతాయి. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల మూడోశ్రేణి ఏసీ కోచ్‌లలో ఉండే టికెట్ ధర కంటే దాదాపు 15 శాతం తక్కువ ధరకే గరీబ్‌రథ్ రైళ్లలో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ♦ 2008 ఫిబ్రవరిలో సికింద్రాబాద్–యశ్వంతపూర్ మధ్య, అదే సంవత్సరం అక్టోబరులో సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య రెండు రైళ్లను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారు. దేశవ్యాప్తంగా ఈ రైళ్లు వారంలో కొన్ని రోజులు మాత్రమే తిరు గుతాయి. ఒక్క విశాఖపట్నం గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే నిత్యం తిరుగుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నందున అందులో టికెట్ దొర కటం గగనమే. ♦ గతేడాది సంక్రాంతి రోజున సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. 16 కోచ్‌లతో తిరుగుతున్న ఆ రైలులో ఆక్యుపెన్సీ రేషియో 114– 120 శాతంగా ఉంటోంది. దీంతో ఇటీవలే అదే రూట్లో 8 కోచ్‌లుండే మరో వందేభారత్‌ను ప్రారంభించారు. కానీ, దీనికంటే ఎక్కువ డిమాండ్ ఉన్నా.. ఆ మార్గంలో రెండో గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌ను మాత్రం కేటాయించటం లేదు. ♦ ఇతర నగరాలకు కూడా గరీబ్‌రథ్ రైళ్లు నడపా లని కోరుతున్నా పట్టించుకోవటం లేదు. సాధా రణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఏసీ కోచ్ టికెట్ ధరలను కూడా పేదలు భరించలేరన్న ఉద్దేశంతో గరీబ్‌రథ్ రైళ్లను ప్రారంభించారు. అలాంటిది వందేభారత్ కేటగిరీ రైలు టికెట్ ధరలను అసలే భరించలేరు. కానీ, వాటి సంఖ్యను మాత్రం పెంచుతూ, 17 ఏళ్లు గడుస్తున్నా రెండో గరీబ్‌రథ్‌ను ప్రారంభించలేదు. త్వరలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ప్రస్తుతం గరీబ్‌రథ్ రైళ్లు సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌లతో తిరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు వీటితో తీవ్ర ప్రాణనష్టం జరుగుతోందన్న ఉద్దేశంతో.. అన్ని రైళ్లకు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఏర్పాటు చేయాలని గతంలోనే కేంద్రం నిర్ణయించింది. వేగంగా ఆ పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు గరీబ్‌రథ్ కేటగిరీ రైళ్లకు మాత్రం వాటిని ఏర్పాటు చేయలేదు. త్వరలో వాటన్నింటికి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఏర్పాటు చేయాలని తాజాగా రైల్వే నిర్ణయించింది. తొలినుంచి ఆకుపచ్చ రంగు కోచ్‌లే ఉన్నందున, ఇప్పుడు వాటి రంగు మార్చాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎరుపురంగు వేయాలని భావిస్తున్నట్టు అనధికార సమాచారం. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఏర్పాటు చేసినప్పుడు, 3 ఏసీ ఎకానమీ నమూనా కోచ్‌లు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. వీటిల్లో బెర్తుల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం గరీబ్‌రథ్‌లో ఒక్కో కోచ్‌లో 78 మంది ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఆ సంఖ్య 83కు చేరుతుందని సమాచారం. -
దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలు
సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్)... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం అప్రెంటిస్ ఖాళీలు: 4103 ► అప్రెంటిస్ వివరాలు: ఏసీ మెకానిక్– 250, కార్పెంటర్–18, డీజిల్ మెకానిక్–531, ఎలక్ట్రీషియన్–1019, ఎలక్ట్రానిక్ మెకానిక్–92, ఫిట్టర్–1460, మెషినిస్ట్–71, ఎంఎంటీఎం–5, ఎంఎండబ్ల్యూ–24, పెయింటర్–80, వెల్డర్–553. ► అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. ► వయసు: 04.10.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.రాత పరీక్ష, వైవా(ఇంటర్వ్యూ)వంటివి ఉండవు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021 ► వెబ్సైట్: https://scr.indianrailways.gov.in ఐసీఎఫ్, చెన్నైలో 794 అప్రెంటిస్‌లు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం ఖాళీల సంఖ్య: 794 ► ట్రేడులు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్,వెల్డర్, ఎంఎల్టీ, పాసా. ► అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్సీవీటీ/ఎస్వీటీ జారీచేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. ► వయసు: 26.10.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.10.2021 ► వెబ్సైట్: https://icf.indianrailways.gov.in/ -
ఐసీఎఫ్‌కు ‘వందే భారత్’
సాక్షి, చెన్నై: చెన్నై ఐసీఎఫ్‌లో వందేభారత్ రైళ్లు 30 రూపు దిద్దుకోనున్నాయి. ఈ మేరకు ఒక్కో రైలుకు రూ. వంద కోట్లు వెచ్చించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చెన్నై పెరంబూరులోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) ఘన చరిత్ర గురించి తెలిసిందే. ఈ ఫ్యాక్టరీ నుంచి దేశ విదేశాలకు వేలాది రైలు బోగీలు తయారు చేసి పంపించారు. ఇటీవల పట్టాలెక్కిన రెండు వందే భారత్ రైళ్లను ఇక్కడే సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం రైల్వే యంత్రాంగం వందే భారత్ రైళ్లను మరిన్ని పట్టాలెక్కించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పంజాబ్‌లోని ఐసీఎఫ్, ఉత్తర ప్రదేశ్‌లోని ఐసీఎఫ్‌కు తలా 14 చొప్పున రైళ్ల తయారీకి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే, చెన్నైలోని ఐపీఎఫ్‌లో ఏకంగా 30 రైళ్లకు సంబంధించిన బోగీలు తయారు చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికత, వసతులు కలిగిన 16 బోగీలతో కూడిన ఒక వందే భారత్ రైలుకు రూ. వంద కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 2024 మార్చి 31 నాటికి ఈ రైళ్లను కేంద్ర రైల్వే యంత్రాంగానికి అప్పగించే లక్ష్యంతో పనులపై దృష్టి సారించారు. ఎలక్ట్రిక్ బస్సులు మాకొద్దు.. కేంద్రం నిధులతో కొనుగోలు చేయదలిచిన ఎలక్ట్రిక్ బస్సులకు మంగళం పాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. చెన్నైలో 525 ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపేందుకు కసరత్తులు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ బస్సుల్ని కేంద్రం నిధులు, కేంద్రం ఇచ్చే సూచనలకు అనుగుణంగా కొనుగో లు చేయాల్సి ఉంది. దీంతో కేంద్రం నిధులతో ఈ బస్సులు తమకు వద్దన్న నిర్ణయానికి డీఎంకే పాల కులు వచి్చనట్లు సచివాలయ వర్గాల సమాచారం. -
ప్రత్యేక రైలు బోగీలో నోట్ల కట్టలు, నగలు!
-
ప్రత్యేక రైలు బోగీలో నోట్ల కట్టలు, నగలు!
సాక్షి, చెన్నై: ప్రత్యేక రైలు బోగీలో రైల్వే భద్రతాధికారి కరెన్సీ కట్టలు, నగలు తరలిస్తుండగా సీబీఐ వాటిని స్వాధీనంచేసుకున్న ఘటన మంగళవారం తమిళనాడులో జరిగింది. ఆర్పీఎఫ్ ఐజీ అయిన అతణ్ని సీబీఐ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఎస్కే పారి చెన్నై ఐసీఎఫ్‌లో భద్రతాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆర్పీఎఫ్ ఐజీ హోదాలో ఉన్న పారి.. తిరుచ్చి నుంచి చెన్నై మీదుగా హౌరా వెళ్లే రైలులో ప్రత్యేకంగా ఒక ఏసీ బోగీని రిజర్వ్ చేసుకున్నారు. ఈ బోగీలో నల్లధనం, నగలను తరలిస్తున్నట్లు సీబీఐకి సమాచారం అందింది. దీంతో ఎనిమిది మంది అధికారుల బృందం చెన్నైలోని ఎగ్మూర్ స్టేషన్లో సిద్ధంగా ఉండి అక్కడికొచ్చిన హౌరా రైలులోని ప్రత్యేక బోగీని సీజ్ చేసి రైలును పంపించేశారు. బోగీలో పెద్ద మొత్తంలో నల్లధనం, నగలు ఉన్నట్టు సమాచారం. అవన్నీ ఒకే వ్యక్తివా లేక, రైల్వే యంత్రాంగంలోని ఉన్నతాధికారులవా..? అనే కోణంలో సీబీఐ విచారణ కొనసాగుతోంది.