సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్)... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం అప్రెంటిస్ ఖాళీలు: 4103
► అప్రెంటిస్ వివరాలు: ఏసీ మెకానిక్– 250, కార్పెంటర్–18, డీజిల్ మెకానిక్–531, ఎలక్ట్రీషియన్–1019, ఎలక్ట్రానిక్ మెకానిక్–92, ఫిట్టర్–1460, మెషినిస్ట్–71, ఎంఎంటీఎం–5, ఎంఎండబ్ల్యూ–24, పెయింటర్–80, వెల్డర్–553.
► అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
► వయసు: 04.10.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
► ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.రాత పరీక్ష, వైవా(ఇంటర్వ్యూ)వంటివి ఉండవు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2021
► దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021
► వెబ్‌సైట్: https://scr.indianrailways.gov.in
ఐసీఎఫ్, చెన్నైలో 794 అప్రెంటిస్‌లు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
► మొత్తం ఖాళీల సంఖ్య: 794
► ట్రేడులు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్,వెల్డర్, ఎంఎల్‌టీ, పాసా.
► అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ/ఎస్‌వీటీ జారీచేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
► వయసు: 26.10.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.10.2021
► వెబ్‌సైట్: https://icf.indianrailways.gov.in/
Comments
Please login to add a commentAdd a comment