బెంగళూరులోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ వీల్ ఫ్యాక్టరీ.. అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 192
► ఖాళీల వివరాలు: ఫిట్టర్–85, మెషినిస్ట్–31, మెకానిక్–08, టర్నర్–05, సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్(సీఓఈ గ్రూప్)–23, ఎలక్ట్రీషియన్–18, ఎలక్ట్రానిక్ మెకానిక్–22.
► అర్హత: కనీసం 50శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
► వయసు: 13.09.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.
► స్టయిపెండ్: నెలకు రూ.12,261 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్ పర్సనల్ ఆఫీసర్, పర్సనల్ డిపార్ట్‌మెంట్, రైల్ వీల్ ఫ్యాక్టరీ, యలహంక, బెంగళూరు–560064 చిరునామకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021
► వెబ్‌సైట్: rwf.indianrailways.gov.in
బెంగళూరు రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌లు
Published Tue, Aug 24 2021 2:17 PM | Last Updated on Tue, Aug 24 2021 2:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment