
సాక్షి, చెన్నై: యువ హీరో జై, ప్రేమ్‌జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో జై, ప్రేమ్‌జీలకు గాయాలయ్యాయి. గురువారం ఉదయం మందవల్లి నుంచి ప్రయాణిస్తున్న కారు అడయార్ బ్రిడ్జి సమీపంలో అదుపు తప్పి గోడను ఢీ కొట్టింది. అయితే కారు డ్రైవ్ చేస్తున్న జై అజాగ్రత్త కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.
అంతేకాక ఆయనకు రూ.500/- జరిమానా విధించినట్లు సమాచారం. కాగా వీరిద్దరూ దర్శకుడు వెంకట్ ప్రభు తాజా చిత్రం పార్టీలో ఆయన నటిస్తున్నారు.