పెరంబూరు : నృత్యదర్శకుడు, నటుడు రాఘవలారెన్స్ పేరుతో నకీలీ వెబ్‌సైట్‌ను ప్రారంభించి ప్రజల నుంచి కొందరు డబ్బును దోచుకుంటున్నట్లు లారెన్స్ ప్రజాసేవా సంఘం కార్యదర్శి శంకర్ బుధవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో నటుడు లారెన్స్ పేరు, ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా కొందరు ఆయన పేరుతో నేనే లారెన్స్ అంటూ నకిలీ ఐడీతో వెబ్‌సైట్‌ను ప్రారంభించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
చెన్నైలోని కొలత్తూర్, సెలం, ఊటీ, రామనాథపురం, బెంగళూర్ ప్రాంతాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటివి నటుడు లారెన్స్ పేరు, ప్రతిష్టలకు కళంకం తీసుకొస్తున్నాయన్నారు. కాబట్టి లారెన్స్ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారిని కనిపెట్టి వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ప్రజలు, అభిమానులు సాయం చేయాలనుకుంటే నిజమైన రాఘవలారెన్స్ ట్రస్ట్‌ను సంప్రదించగలరని శంకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment