
సాక్షి, విజయవాడ : సీఆర్డీఏ పేరుతో నకిలీ వెబ్‌సైట్ సృష్టించి ఉద్యోగాల పేరుతో ఒక యువకుడు నిరుద్యోగులకు టోకరా వేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే .. నిందితుడు ప్రకాశం జిల్లాకు చెందినవాడు. సీఆర్డీఏ పేరుతో నకిలీ వెబ్‌సైట్ రూపొందించి నిరుద్యోగులకు విజయవాడలో ఫేక్ ఇంటర్యూలు నిర్వహించాడు. అయితే యువకుడి మీద అనుమానం వచ్చిన నిరుద్యోగులు సీఆర్డీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిందితుడు రూపొందించిన వెబ్‌సైట్‌ను పరిశీలించగా అది నకిలీ వెబ్‌సైట్‌గా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పరారీలో ఉన్న యువకుడి మీద కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment