Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి భార్యాభర్తల మోసాలు.. | wife and husband arrested to fake website | Sakshi
Sakshi News home page

Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి భార్యాభర్తల మోసాలు..

Published Thu, Mar 14 2024 6:47 AM | Last Updated on Thu, Mar 14 2024 6:47 AM

wife and husband arrested to fake website - Sakshi

హైదరాబాద్‌: పెళ్లి పేరుతో అమ్మాయిలను ట్రాప్‌ చేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు (భార్యాభర్తలను) హైదరాబాద్‌ సీసీఎస్‌ స్పెషల్‌ జోనల్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీసీఎస్‌ పోలీసులు వివరాల ప్రకారం యెలిగేటి రంజిత్‌ అలియాస్‌ యడ్ల శ్రీ రాధా కృష్ణ అలియాస్‌ రాకేష్, యెలిగేటి సంధ్య వీరిద్దరూ భార్యభర్తలు. వీరు సిరిసిల్ల జిల్లా వెంకంపేటకు చెందిన వారు. నగరంలోని పీర్జాదిగూడ వినాయక్‌ నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. 

వీరు ఆన్‌లైన్‌లోని మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లలో ఉన్నత వర్గాలకు చెందిన అమ్మాయిల ప్రొఫైల్‌ ద్వారా వారి వివరాలను సేకరిస్తారు. ఆ వివరాల ఆధారంగా అమ్మాయిలను టార్గెట్‌ చేసి, నిందితుడు యెలిగేటి రంజిత్‌ తన పేరు యడ్ల శ్రీ రాధా కృష్ణగా నకిలీ పేరుతో పరిచయం చేసుకుంటాడు. తాను ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తినని రియల్‌ వ్యాపారాలు ఉన్నాయని నమ్మిస్తాడు. మాట్రిమోనీ సైట్లలో పరిచయమైన అమ్మాయిలతో  పరిచయం చేసుకొని వారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వారితో చనువుగా మాట్లాడి పరిచయం పెంచుకుంటాడు. తన భార్య యెలిగేటి సంధ్యను తన మేనేజర్‌గా వారికి పరిచయం చేస్తాడు. అనంతరం అమ్మాయిల పేరెంట్స్‌తో సైతం వారి ఇంటికి వెళ్లి మాయమాటలు చెప్పి నమ్మించేవాడు.బాగా పరిచయం అయ్యాక వారిని పెళ్లి చేసుకుంటానని వారిని ఒప్పించేవాడు. 

అనంతరం తనకు రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో అత్యవసరంగా డబ్బు అవసరం ఉందంటూ లక్షల రూపాయలు తీసుకునే వాడు. మరో కేసులో బాధితుల నుంచి కట్నం,పెళ్లి గిఫ్ట్‌ల పేరుతో లక్షల రూపాయలు దండుకున్నాడు. గతంలో బాధితలు పిర్యాదు పై కేసు నమోదు చేసుకుని, సీసీఎస్‌  స్పెషల్‌ జోనల్‌ క్రైమ్‌ టీమ్‌ ఇ¯Œన్‌స్పెక్టర్‌ డి.బిక్షపతి ఆధ్వర్యంలో బృందం నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు  తరలించారు. ఈ విధంగా నిందితులు భార్యభర్తలు కలిసి 12 మంది బాధితుల నుంచి సుమారు రూ.30 లక్షలకు పైగా మోసాలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఓ సాంట్రో కారు,ద్విచక్ర వాహనం పోలీసులు సీజ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement