
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా డిసీసీబీ బ్యాంక్‌లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. గత పాలక మండలి హయాంలో 10 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం అయినట్లు ప్రస్తుత బ్యాంక్ సీఈవో గుర్తించారు. సీఈవో అట్లూరి వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ చైర్మన్‌తో పాటు 20 మంది డైరెక్టర్లపై 403, 406, 409, 420 సెక్షన్ల కింద ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత పాలక మండలి హయాంలో జరిగిన అవకతవకలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టనున్నారు.
చదవండి:
ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్‌లో ఆత్మహత్య
హైదరాబాద్: రోడ్డు పైకి వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment