Massive Fraud
-
Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి భార్యాభర్తల మోసాలు..
హైదరాబాద్: పెళ్లి పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు (భార్యాభర్తలను) హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ పోలీసులు వివరాల ప్రకారం యెలిగేటి రంజిత్ అలియాస్ యడ్ల శ్రీ రాధా కృష్ణ అలియాస్ రాకేష్, యెలిగేటి సంధ్య వీరిద్దరూ భార్యభర్తలు. వీరు సిరిసిల్ల జిల్లా వెంకంపేటకు చెందిన వారు. నగరంలోని పీర్జాదిగూడ వినాయక్ నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరు ఆన్లైన్లోని మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో ఉన్నత వర్గాలకు చెందిన అమ్మాయిల ప్రొఫైల్ ద్వారా వారి వివరాలను సేకరిస్తారు. ఆ వివరాల ఆధారంగా అమ్మాయిలను టార్గెట్ చేసి, నిందితుడు యెలిగేటి రంజిత్ తన పేరు యడ్ల శ్రీ రాధా కృష్ణగా నకిలీ పేరుతో పరిచయం చేసుకుంటాడు. తాను ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తినని రియల్ వ్యాపారాలు ఉన్నాయని నమ్మిస్తాడు. మాట్రిమోనీ సైట్లలో పరిచయమైన అమ్మాయిలతో పరిచయం చేసుకొని వారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వారితో చనువుగా మాట్లాడి పరిచయం పెంచుకుంటాడు. తన భార్య యెలిగేటి సంధ్యను తన మేనేజర్‌గా వారికి పరిచయం చేస్తాడు. అనంతరం అమ్మాయిల పేరెంట్స్‌తో సైతం వారి ఇంటికి వెళ్లి మాయమాటలు చెప్పి నమ్మించేవాడు.బాగా పరిచయం అయ్యాక వారిని పెళ్లి చేసుకుంటానని వారిని ఒప్పించేవాడు. అనంతరం తనకు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో అత్యవసరంగా డబ్బు అవసరం ఉందంటూ లక్షల రూపాయలు తీసుకునే వాడు. మరో కేసులో బాధితుల నుంచి కట్నం,పెళ్లి గిఫ్ట్‌ల పేరుతో లక్షల రూపాయలు దండుకున్నాడు. గతంలో బాధితలు పిర్యాదు పై కేసు నమోదు చేసుకుని, సీసీఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్ ఇ¯Œన్స్పెక్టర్ డి.బిక్షపతి ఆధ్వర్యంలో బృందం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విధంగా నిందితులు భార్యభర్తలు కలిసి 12 మంది బాధితుల నుంచి సుమారు రూ.30 లక్షలకు పైగా మోసాలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఓ సాంట్రో కారు,ద్విచక్ర వాహనం పోలీసులు సీజ్ చేశారు. -
కిసాన్ క్రెడిట్ కార్డులపై రుణాల పేరిట భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: కిసాన్ క్రెడిట్ కార్డ్(కేసీసీ)లపై చేపల చెరువుల నిర్మాణానికి రుణాలు ఇచ్చినట్టు లెక్కల్లో చూపి కోట్ల రూపాయలు దారిమళ్లించిన కేసు దర్యాప్తును ఈడీ అధికారులు ముమ్మరం చేశారు. సీబీఐ విశాఖపట్నం బ్రాంచ్ ఏసీబీ విభాగం నమోదు చేసిన ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 29న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి మొత్తం ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు ఈడీ అధికారులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ సోదాలు ఏ ప్రాంతాల్లో చేశారన్న విషయాలు ఈడీ అధికారులు వెల్లడించలేదు. రాజమండ్రిలోని ఐడీబీఐ బ్యాంక్‌లో కిసాన్ క్రెడిట్కార్డులపై రుణాల పేరిట మొత్తం రూ. 311.05 కోట్లు దారిమళ్లించినట్టు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. నిందితులు వారి సంస్థలో పనిచేసే ఉద్యోగులు పలువురి నుంచి కేవైసీ డాక్యుమెంట్లు, బ్లాంక్ చెక్కులు, మరికొందరు రైతుల నుంచి వారికి సంబంధించినపత్రాలను సేకరించి వారి పేరిట రుణాలు మంజూరు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ సొమ్మును తర్వాత నిందితులు తమ కంపెనీల్లో పెట్టుబడులకు, కుటుంబసభ్యులు, బినామీల పేరిట ఆస్తుల కొనుగోలుకు వాడినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. నిందితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో కొన్ని కీలకపత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వా«దీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. -
ఈ–చలానాల పేరిట రూ.కోట్లు కొట్టేశారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పోలీసులు విధించే ఈ–చలానా వసూళ్లలో రూ.36.53 కోట్లను పక్కదారి పట్టించి భారీ మోసానికి పాల్పడిన ఘటనపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని గుంటూరు రేంజి ఐజీ జి.పాలరాజు తెలిపారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ–చలానా వసూలుకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థ ఒక క్లోన్ అకౌంట్ ద్వారా ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించామని, సంబంధిత వ్యక్తుల అన్ని ఖాతాలు సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో గతంలో డీజీపీగా పనిచేసిన నండూరి సాంబశివరావు అల్లుడు అవినాశ్ కొమ్మిరెడ్డి, అతని సోదరి అక్షిత, మరికొందరి పాత్ర ఉన్నట్టు గుర్తించినట్టు వెల్లడించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, ప్రజల సొమ్ము ప్రభుత్వానికి రాకుండా చేసిన ఈ కేసులో ఉన్న ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రూపాయికే టెండర్ వేసి.. రూ.కోట్లు కొల్లగొట్టారు మోటారు వాహనాలపై విధించే చలానాల వసూలుకు సంబంధించి 2015 నుంచి ‘కృష్ణా సొల్యూషన్స్’ అనే సంస్థ కొన్ని జిల్లాల్లో సేవలు అందిస్తోందని ఐజీ పాలరాజు చెప్పారు. ఈ అప్లికేషన్ వాడుతున్నందుకు ప్రతి చెల్లింపుదారు నుంచి రూ.5 చొప్పున యూజర్ చార్జీగా ఆ సంస్థ వసూలు చేస్తోందన్నారు, 2017 జూన్‌లో అప్పటి డీజీపీ నండూరి సాంబశివరావు ‘డేటా ఎవాన్ సొల్యూషన్స్’ అనే సంస్థ ఆధునికీకరించిన సాఫ్ట్వేర్ ఉందని, దీనిని కూడా ఉపయోగించమని సర్క్యులర్ ఇచ్చారని వివరించారు. దీంతో కృష్ణా సొల్యూషన్స్‌తో పాటు డేటా ఎవాన్ సొల్యూషన్స్ సేవలను కూడా వచ్చారన్నారు. 2018లో ఒక్కో జిల్లాలో ఒక్కో పద్ధతి వాడుతుండటంతో అన్నిచోట్ల ఒకే పద్ధతి ఉండాలనే ఉద్దేశంతో డేటా సొల్యూషన్స్ ఎంపిక కోసం ఓపెన్ టెండర్లు పిలిచామన్నారు. టెండర్ విలువ రూ.2 కోట్లుగా నిర్ణయించామని చెప్పారు. ఈ టెండర్లలో రెండు సంస్థలు పాల్గొన్నాయన్నారు. కృష్ణా సొల్యూషన్స్ రూ.1.97 కోట్లకు టెండర్ వేయగా.. డేటా ఎవాన్ సొల్యూషన్స్ కేవలం ఒక్క రూపాయికే టెండర్ వేసిందన్నారు. అదేమని అడగ్గా.. తాము ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున సేవగా చేయాలన్న ఉద్దేశంతో కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటున్నామని, మిగిలిన రాష్ట్రాల్లో వచ్చిన డబ్బులతో సంస్థను నడుపుతామని చెప్పడంతో డేటా ఎవాన్ సంస్థకే టెండర్ కేటాయించినట్టు వివరించారు. అందరిపైనా కేసులు డేటా ఎవాన్ సొల్యూషన్‌తో పాటు రేజర్పీఈ అనే నకిలీ కంపెనీని సృష్టించి నగదు దారి మళ్లించిన వారందరిపైనా కేసులు నమోదు చేశామని ఐజీ తెలిపారు. తమ శాఖకు సాంకేతిక సహకారం అందిస్తున్న కొత్తపల్లి రాజశేఖర్‌ను అరెస్ట్ చేశామని, అతని బినామీ ఆస్తులను గుర్తిస్తున్నామని చెప్పారు. కంపెనీ డైరెక్టర్లు కొమ్మిరెడ్డి అవినాష్, అక్షిత, రవికిరణ్‌తో పాటు సాఫ్ట్‌వేర్‌ను ఎవరు నిర్వహించారో, ఎవరు సహకరించారో వారిని కూడా గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. త్వరలోనే ఈ కేసు విచారణ పూర్తిచేసి బాధ్యులందరినీ అరెస్ట్ చేస్తామని పాలరాజు స్పష్టం చేశారు. ఇలా కొట్టేశారు ఈ–చలానా అప్లికేషన్‌కు డబ్బులు వివిధ పేమెంట్ గేట్‌వేల ద్వారా వస్తాయని పాలరాజు చెప్పారు. పేటీఎం, ఏపీ ఆన్లైన్, మీసేవ, డెబిట్, క్రెడిట్ కార్డులు, వెబ్, రేజర్‌పే వంటి విధానాల్లో చలానా మొత్తాల చెల్లింపులు జరుగుతుంటాయని పేర్కొన్నారు. ఇలా వచ్చిన డబ్బులన్నీ డీజీ అకౌంట్‌కు అనుసంధానం అవుతాయన్నారు. చెల్లింపులు జరుగుతున్న తరుణంలో కొంత అవకతవకలు జరుగుతున్నట్టు తిరుపతి యూనిట్లో గుర్తించారన్నారు. ప్రతి రోజూ ఎంత వస్తుందన్నది డాష్‌బోర్డులో కనపడుతుందని, ప్రతినెలా 1వ తేదీన వసూలు చేసిన మొత్తం కొద్దిరోజుల తర్వాత చూస్తే తగ్గుతున్నట్టు గుర్తించడంతో విచారణ మొదలు పెట్టామన్నారు. దీనిపై లోతుగా విచారణ చేయడంతో పెద్దఎత్తున మోసం జరుగుతున్న విషయం వెలుగు చూసిందన్నారు. రేజర్‌పే ద్వారా వచ్చిన మొత్తాన్ని వేరే ఖాతాకు మళ్లించుకున్నట్టు గుర్తించామన్నారు. దీనికి సంబంధించి 2018లోనే ఒక క్లోనింగ్ ఖాతాను సృష్టించి.. దానిద్వారా డబ్బులను తమ ఖాతాలకు మళ్లించుకున్నారన్నారు. ఈ విధంగా పోలీసు శాఖకు రావాల్సిన రూ.36.53 కోట్లను వివిధ ఖాతాలకు మళ్లించినట్టు గుర్తించి వాటిని సీజ్ చేశామన్నారు. ఏ ఖాతాలకు మళ్లించారో ఆ ఖాతాల ద్వారా 2019 నుంచి కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించామని వివరించారు. -
మంత్రి సబిత పీఏలమంటూ నమ్మించి భారీ మోసం
బంజారాహిల్స్(హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కార్యాలయ సిబ్బందిమంటూ పరిచయం చేసుకుని ప్రముఖ షూస్ తయారీ కంపెనీని మోసం చేసిన ఏడుగురు వ్యక్తులపై బంజారాహిల్స్‌పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో షూస్, స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఆర్డర్‌ను తమకు కేటాయించాలని హరియాణా రాష్ట్రంలోని కర్నైల్ పట్టణానికి చెందిన లిబర్టీ షూస్ లిమిటెడ్ సంస్థ 2019 డిసెంబర్లో రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. కొన్ని రోజుల తర్వాత విద్యాశాఖ మంత్రి పర్సనల్ అసిస్టెంట్‌ను అంటూ జీకే.కుమార్, సెకండ్‌పర్సనల్ అసిస్టెంట్ అంటూ బెల్లి తేజ, పోలిటికల్ సెక్రటరీ అంటూ ప్రవీణ్‌వర్మ తదితరులు లిబర్టీ సంస్థ ప్రతినిధి కమల్ ధవన్‌కు ఫోన్ చేశారు. షూస్ కాంట్రాక్ట్ విషయంపై మాట్లాడదామంటూ హైదరాబాద్‌కు పిలిపించారు. కాంట్రాక్ట్ విషయం ఫైనల్ చేస్తామని దీనికోసం ప్రాసెసింగ్ ఫీజులతో పాటు ఇతర చార్జీల కింద ఇవ్వాలంటూ రూ.17.66 లక్షలు వసూలు చేశారు. చదవండి: HYD: మలక్‌పేట్‌లో కలకలం.. మొండెం లేని మహిళ తల లభ్యం వివిధ అకౌంట్ నెంబర్లకు ఈ డబ్బును పంపించాలని సూచించారు. వారి సూచనల మేరకు డబ్బు చెల్లించిన లిబర్టీ సంస్థ ప్రతినిధులు ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్ట్ రాకపోవడంతో అనుమానం వచ్చి వాకబు చేయగా కుమార్ అనే వ్యక్తి గతంలో పనిచేసిన మాట వాస్తవమేనని, అతడిని ఉద్యోగంలోంచి తొలగించారని తేలింది. దీంతో తమను మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని లిబర్టీ షూస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి కమల్ ధావన్ సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జీకే.కుమార్, బెల్లితేజ, ప్రవీణ్‌వర్మ, స్వాతి, విక్రమ్ పురి, అంజనేయులు, రమేష్ రెడ్డి అనే వ్యక్తులపై ఐపీసీ 406,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నమ్మకం మాటున మోసం.. శ్రీశైలం వెళ్తున్నామంటూ..
ఫిరంగిపురం(తాడికొండ): ఎన్నో ఏళ్లుగా చిట్టీ పాటలు నిర్వహిస్తూ నమ్మకం మాటున తమను మోసం చేసి రూ.2 కోట్ల 5 లక్షలతో ఓ కుటుంబం పరారయ్యిందని ఫిరంగిపురం మండలం పొనుగుపాడు వాసులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో నిడమానూరి భీమేశ్వరరావు, సుబ్బాయమ్మ దంపతులు కిరాణ, బట్టల కొట్టు, మందుల షాపు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా చిట్టీపాటలు నిర్వహిస్తూ గ్రామంలో మంచి వారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలకు వివాహాలు కాగా అబ్బాయి శివప్రసాద్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. చదవండి: Chandrababu: ప్రజలకు బుద్ధి, జ్ఞానం లేదు రెండేళ్ల కిందట కరోనా ప్రభావంతో వర్క్‌ఫ్రం హోంలో భాగంగా శివప్రసాద్ ఇంటికి చేరాడు. గ్రామంలోని వారికి తన బ్యాంకు అకౌంట్ నంబర్‌ను ఇచ్చి వారిచేత తన అకౌంట్లో చిట్టీల డబ్బు వేయిస్తూ వస్తున్నాడు. అయితే శుక్రవారం సాయంత్రం శ్రీశైలం వెళుతున్నామంటూ చెప్పి ఇంటికి తాళాలు వేసి వెళ్లిన భీమేశ్వరరావు, సుబ్బాయమ్మ, కొడుకు శివప్రసాద్ ఫోన్లు, వాట్సాప్ నంబర్లతో సహా బ్లాక్‌లో పెట్టడంతో.. ఫోన్ చేసిన వారికి స్విచ్చాఫ్ అని వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే భీమేశ్వరరావు దంపతులు చిట్టీల పేరుతో డబ్బు వసూలు చేసి పరారయ్యారని భావించిన 48 మంది బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు రూ.2 కోట్ల 5 లక్షలతో పరారయ్యారని బాధితులు ఫిర్యాదు చేశారని, మరికొందరు బాధితులున్నట్లు సమాచారం ఉందని ఎస్ఐ అజయ్‌బాబు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రూ.300 కోట్లకు ముంచేశాడు.. ఆన్లైన్ ప్రాజెక్టు పేరిట భారీ మోసం
ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం జిల్లా): పెట్టుబడి పెట్టండి.. లాభాలొస్తాయి.. అని చెప్పాడు. కొద్దిరోజులు కొందరికి లాభాలు ఇచ్చాడు. తరువాత వేలమంది పెట్టుబడి పెట్టారు. వీరంతా రూ.300 కోట్ల వరకు అతడికి ఇచ్చినట్లు తెలిసింది. అంతే.. ఆయన కుటుంబంతో సహా అదృశ్యమయ్యాడు. ఈ విషయం తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు. ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. బాధితులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సమీపంలోని ఎస్ఎం పురం గ్రామానికి చెందిన మద్ది నాగేశ్వరరావు ఏడాదిగా ఎచ్చెర్లలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సూర్య నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆన్లైన్ ప్రాజెక్టులు సంపాదించి వాటితో వ్యాపారం చేసేవాడు. పలువురు విద్యార్థుల వద్ద డబ్బు వసూలు చేసి ఈ ప్రాజెక్టు పనులు చేసేందుకు ఉద్యోగాలిచ్చాడు. ఈ ప్రాజెక్టులు సాగుతుండగానే మరో భారీ మోసానికి తెరతీశాడు. ఈ ఆన్లైన్ ప్రాజెక్టుల్లో తనతోపాటు పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు సంపాదించవచ్చని ప్రచారం చేశాడు. ఈ మాటలు నమ్మిన కొందరు మొదట్లో నెలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టారు. వారికి నెలనెలా రూ.5 వేల వంతున లాభాల పేరిట ఇచ్చేవాడు. ఇదిచూసి మరికొందరు పెట్టుబడి పెట్టారు. ఈ విషయం విస్తృతంగా ప్రచారమవడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా అనేకమంది ఆకర్షితులయ్యారు. దాదాపు 4 వేలమంది సుమారు రూ.300 కోట్ల మేర పెట్టుబడి పెట్టారు. వీరిలో కొందరు రూ.60 లక్షల వరకు ఇచ్చిన వారున్నారు. డబ్బు తీసుకున్నట్లు కొందరికి చేత్తో రాసి ఇచ్చాడు. పెట్టుబడి పెట్టినవారికి లాభాల పేరుతో ఇస్తున్న డబ్బును మూడు నెలలుగా ఇవ్వడంలేదు. అడిగినవారికి ప్రస్తుతం ఆ ప్రాజెక్టు వర్క్ పరిస్థితి మెరుగ్గా లేదని, కొన్ని రోజుల్లో బాగుపడుతుందని చెప్పేవాడు. పెట్టుబడి పెట్టినవారి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో భార్య, ఇద్దరు పిల్లలతో సహా నాగేశ్వరరావు అదృశ్యమయ్యాడు. అతడి తల్లిదండ్రులు మాత్రం ఇక్కడున్నారు. నాగేశ్వరరావు కనిపించడంలేదని తెలిసిన తరువాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నారు. గురువారానికి 50 మంది వరకు ఎచ్చెర్ల పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితుల్లో నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తాం ఎస్ఎం పురానికి చెందిన మద్ది నాగేశ్వరరావు ఎచ్చెర్లలో సూర్య నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆన్లైన్ ప్రాజెక్టు పేరుతో డిపాజిట్లు స్వీకరించినట్లు కొందరు స్టేషన్‌కు వచ్చి చెప్పారు. రాత పూర్వకంగా ఫిర్యాదు రాలేదు. బాధితుల వద్ద ఉన్న ఆధారాలు, రాత పూర్వక ఫిర్యాదు వస్తే దర్యాప్తు ప్రారంభిస్తాం. కె.రాము, ఎస్ఐ, ఎచ్చెర్ల -
దొరికిన ఇంటి దొంగ: సెలవుల పేరిట రూ.10 కోట్ల లూటీ
అహ్మదాబాద్ (గుజరాత్): ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఆయనే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టాడు. లొసుగులను ఆసరాగా చేసుకుని ఏకంగా దాదాపు పది కోట్ల రూపాయల వరకు మోసం చేశాడు. ఆ నిధులను తన కుటుంబసభ్యుల ఖాతాల్లో జమ చేయించి ఏమీ తెలియని వ్యక్తిలా మళ్లీ కార్యాలయంలో కొనసాగుతున్నాడు. ఈ అవకతవకలు వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టగా అతడి మోసం బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ప్రాథమిక విద్యా శాఖ (ప్రైమరీ ఎడ్యుకేషన్)లో డిప్యూటీ అకౌంటెంట్‌గా రాజేశ్ రామి పని చేస్తున్నాడు. అకౌంట్ వ్యవహారాలు ఆయన ద్వారానే జరుగుతుండడంతో మనసులో దుర్బుద్ధి కలిగింది. అనుకుందే తడువుగా ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల పేరిట మోసం చేయాలని పన్నాగం పన్నాడు. అందులో భాగంగా ఉపాధ్యాయుల పేరిట 5,000 నకిలీ పెయిడ్ లీవ్స్ (చెల్లింపు సెలవు)ను దరఖాస్తు చేశాడు. ఆ పెయిడ్ లీవ్స్‌ను రూ.9.99 కోట్ల మేర నగదుగా మార్చుకున్నాడు. అతడి ఖాతాలో కాకుండా తన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాలకు మళ్లించాడు. అయితే ప్రతి సంవత్సరం ఆడిట్ నిర్వహించడం ప్రతి శాఖలో జరుగుతుంది. ఈ క్రమంలో ప్రాథమిక విద్యా శాఖకు సంబంధించి అహ్మదాబాద్ జిల్లాలో ఆడిట్ నిర్వహించగా అతడి మోసం బహిర్గతమైంది. 2016-17, 17-18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడు తాలుకా పరిధిలో మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో జూలై 15వ తేదీన రాజేశ్ రామిపై ఫిర్యాదు చేశారు. కరంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు వివరాలు ఆరా తీశారు. ఈ మోసం బయటపడడంతో రాజేశ్ పరారయ్యాడు. -
ఆన్లైన్ గోల్డ్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ ఇస్తామంటూ డబ్బులు కాజేస్తున్న ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిలో ఇద్దరిని ముంబయిలో అరెస్ట్ చేసి పిటి వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. పెట్టుబడి పెడితే ఎక్కువ కమిషన్ వస్తుందంటూ ముఠా మోసాలకు పాల్పడుతోంది. వారి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రెండు లాప్ ట్యాప్‌లు, నాలుగు చెక్ బుక్‌లు, 13 సిమ్ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 417,419,420, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: ‘జోతిష్యుడి’ కథ అడ్డం తిరిగింది! అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ -
ఖమ్మం డీసీసీబీ బ్యాంకులో బయటపడ్డ భారీ అవకతవకలు
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా డిసీసీబీ బ్యాంక్‌లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. గత పాలక మండలి హయాంలో 10 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం అయినట్లు ప్రస్తుత బ్యాంక్ సీఈవో గుర్తించారు. సీఈవో అట్లూరి వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ చైర్మన్‌తో పాటు 20 మంది డైరెక్టర్లపై 403, 406, 409, 420 సెక్షన్ల కింద ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత పాలక మండలి హయాంలో జరిగిన అవకతవకలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టనున్నారు. చదవండి: ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య హైదరాబాద్: రోడ్డు పైకి వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త! -
అన్నీ తానై... భారీ మోసాలకు స్కెచ్ !
సాక్షి, సిటీబ్యూరో: నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్, ఆలిండియా యాంటీ కరెప్షన్ కమిషన్, అభయబీ4యూ ఛానల్స్ న్యూస్ ఇన్చార్జ్, సీఐడీ డీఎస్పీ... ఇన్ని అవతారాలు ఎత్తి భారీ మోసానికి కుట్న పన్నిన ఓ వ్యక్తిని సైబరాబాద్ ఈస్ట్ పరిధిలోని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన ఎంవీఎల్ నాగేశ్వరరావు మల్కాజిగిరిలోని శివపురికాలనీలో స్థిరపడ్డాడు. రూ.5 వేలు వెచ్చించి న్యూఢిల్లీలో నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్, ఆలిండియా యాంటీ కరెప్షన్ కమిషన్ పేర్లతో రెండు సంస్థల్ని ఎన్జీఓల పేరుతో రిజిస్టర్ చేయించాడు. వీటి ద్వారా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, అధికారుల అవినీతిపై ప్రచారం చేస్తామని దరఖాస్తుల్లో పేర్కొన్నారు. ఆ రెండు సంస్థలకూ తానే జాతీయ అధ్యక్షుడిగా ప్రచారం చేసుకున్న నాగేశ్వరరావు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పోస్టులు ఇస్తానంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురికి ఎర వేశాడు. సాధారణ సభ్యత్వానికి రూ.1500 ధర నిర్ణయించాడు. తన సంస్థల్లో రెండేళ్ల కాలపరిమితో ఉండే వివిధ హోదాల్లో పోస్టులు ఇవ్వడానికి రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు రేట్లు నిర్ణయించాడు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ సభ్యుల్ని నియమించడం ద్వారా ప్రతి రెండేళ్లకూ రూ.5 కోట్లు చొప్పున దండుకోవాలని పథకం వేశాడు. అలాగే యాంటీ కరెప్షన్ కమిషన్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి డబ్బు దండుకోవాలని కుట్రపన్నాడు. దీంతో పాటు ‘తెలుగు ప్రపంచం’ పేరుతో మరో సంస్థను రిజిస్టర్ చేయించిన నాగేశ్వరరావు రెండు రాష్ట్రాల్లోనూ దుకాణాలు, వ్యాపార సంస్థలకు తెలుగు బోర్డులు ఏర్పాటు చేసే బాధ్యతల్ని ప్రభుత్వాలు తనకు ఇచ్చాయని ప్రచారం చేసుకున్నాడు. అలానే అలిండియా కన్జ్యూమర్ రైట్స్ పేరుతో మాస పత్రికను ముద్రించాలని రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. తన వద్ద సభ్యులుగా, వివిధ హోదాల్లో చేరిన వారికి తన రెండు సంస్థల పేర్లతో ఉన్న స్టిక్కర్లను రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు విక్రయించే వాడు. అభయ ఛానల్ న్యూస్ ఇన్ చార్జీ బీ4యూ న్యూస్ ఛానల్ హెడ్‌గా, ఫిల్మ్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ బోర్డ్ కోశాధికారిగా, సీఐడీలో డీఎస్పీగా... ఇలా వివిధ రకాలైన నకిలీ ఐడీ కార్డులు తయారు చేసుకున్న నాగేశ్వరరావు వీటిని వినియోగించి బెదిరించడం ప్రారంభించాడు. ఇతడి వ్యవహారాలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.