సాక్షి, హైదరాబాద్: గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ ఇస్తామంటూ డబ్బులు కాజేస్తున్న ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిలో ఇద్దరిని ముంబయిలో అరెస్ట్ చేసి పిటి వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. పెట్టుబడి పెడితే ఎక్కువ కమిషన్ వస్తుందంటూ ముఠా మోసాలకు పాల్పడుతోంది. వారి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రెండు లాప్ ట్యాప్‌లు, నాలుగు చెక్ బుక్‌లు, 13 సిమ్ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 417,419,420, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
చదవండి: ‘జోతిష్యుడి’ కథ అడ్డం తిరిగింది!
అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం.. నలుగురు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment