
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.53 లక్షల నగదును సీజ్ చేయడంతో పాటు, బ్యాంకులోని రూ.21,82,254 లక్షల నగదును ఫ్రీజ్ చేసినట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. స్పోర్ట్స్ బుక్, ఆన్‌లైన్ పోకర్, ఆన్‌లైన్ బింగో అనే వెబ్ సైట్లు కూడా గుర్తించామని.. వీళ్లు బుకి, సబ్ బుకీలుగా పనిచేస్తున్నారని సీపీ తెలిపారు. నేపాల్‌కు చెందిన నలుగురు అమ్మాయిలని ఉద్యోగులుగా పెట్టుకుని.. టెలిగ్రాం ద్వారా అందరితో కాంటాక్ట్ అయ్యేలా చేస్తున్నారన్నారు. కిరణ్ అనే వ్యక్తి విదేశాలకు వెళ్లి ఈ ఆట గురించి తెలుసుకుని వచ్చాడని.. వేయి మంది వీళ్ల చేతిలో మోసపోయినట్లు విచారణలో తేలిందని సీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment