betting gang
-
కేసీఆర్ గెలుస్తారు.. లేదు వాళ్లదే విజయం.. కోట్లలో బెట్టింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇక, ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ సైతం ఆసక్తికర ఫలితాలను వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారం ఎవరిది అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కొందరు నేతలు మాత్రమ ఎగ్జిట్‌పోల్స్ ఫైనల్ కాదు.. విజయం తమదంటే తమదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలపై ఏపీలో జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడుతుందని కొందరు.. లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మరికొందరు జోరుగా పందాలు కాస్తున్నారు. వందల కోట్లతో తెలంగాణ ఫలితాలపై పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోట్ల రూపాయల నగదు చేతులు మారుతున్నట్టు సమాచారం.. మరోవైపు.. రెండు సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ముఖ్యంగా గజ్వేల్‌లో ఎంత మెజార్టీ వస్తుందని కూడా బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ ఖాస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా సిద్దిపేటలో ఈసారి మంత్రికి హారీశ్ రావుకి గతం కంటే ఎక్కువ వస్తుందా? లేదా తగ్గుతుందా అంటూ బెట్టింగ్ జరుగుతోంది. మరోవైపు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారా? లేదా గెలుస్తారా? అని కూడా తెలంగాణ, ఏపీలో భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేస్తుందంటూ మరో బెట్టింగ్ నడుస్తోంది. అలాగే, బీజేపీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది. ఏయే స్థానాల్లో గెలుస్తుందని కోట్లలో బెట్టింగ్ నడుస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ఐపీఎల్ క్రికెట్ సీజన్ ను క్యాష్ చేసుకుంటున్న బెట్టింగ్ ముఠాలు
-
ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.53 లక్షల నగదును సీజ్ చేయడంతో పాటు, బ్యాంకులోని రూ.21,82,254 లక్షల నగదును ఫ్రీజ్ చేసినట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. స్పోర్ట్స్ బుక్, ఆన్లైన్ పోకర్, ఆన్లైన్ బింగో అనే వెబ్ సైట్లు కూడా గుర్తించామని.. వీళ్లు బుకి, సబ్ బుకీలుగా పనిచేస్తున్నారని సీపీ తెలిపారు. నేపాల్‌కు చెందిన నలుగురు అమ్మాయిలని ఉద్యోగులుగా పెట్టుకుని.. టెలిగ్రాం ద్వారా అందరితో కాంటాక్ట్ అయ్యేలా చేస్తున్నారన్నారు. కిరణ్ అనే వ్యక్తి విదేశాలకు వెళ్లి ఈ ఆట గురించి తెలుసుకుని వచ్చాడని.. వేయి మంది వీళ్ల చేతిలో మోసపోయినట్లు విచారణలో తేలిందని సీపీ తెలిపారు. -
ట్రంపే ఫెవరేట్ అంటున్న బెట్టింగ్ మార్కెట్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ల మధ్య హోరాహోరి పోరు నడుస్తుంది. గద్దెనెక్కెదేవరో.. ఇంటికి వెళ్లేది ఎవరో మరి కాసేపట్లో తేలనుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ట్రంప్‌కు అనుకూలంగా బెట్టింగ్ మార్కెట్లలో పందాలు కాస్తున్నారట. న్యూజిలాండ్‌కు చెందిన ప్రిడిక్షన్స్ మార్కెట్ డొనాల్డ్ ట్రంప్, బైడెన్ కంటే అధిక్యంలో ఉన్నారని తెలిపింది. కొద్ది సేపటికే న్యూజిలాండ్ ప్రిడిక్ట్ వెబ్‌సైట్‌కు అంతరాయం కలిగింది. దాంతో సదరు వెబ్సైట్ వీలైనంత త్వరగా సేవలను తిరిగి పప్రారంభించడానికి" కృషి చేస్తున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే అంతరాయానికి గల కారణాలు మాత్రం తెలపలేదు. ఇదిలా ఉండగా బ్రిటిష్ బెట్టింగ్ ఎక్స్ఛేంజ్ బెట్‌ఫెయిర్ ట్రంప్ గెలిచే అవకాశం 75 శాతం ఉందని తెలిపింది. అయితే మంగళవారం ఉదయం ఎన్నికలు ప్రారంభమైనప్పుడు ట్రంప్ గెలిచే అవకాశం 39శాతంగా ఇచ్చింది. అది క్రమంగా పెరిగి ప్రస్తుతం 75శాతానికి చేరింది. ఇక బైడెన్ విషయానికి వస్తే తొలుత 61శాతం ఇవ్వగా ప్రస్తుతం అది 25 శాతానికి పడిపోయింది. ఉదయం 10.30 గంటల నాటికి, జో బైడెన్ వైట్ హౌస్ పోటీలో 200 కి పైగా ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్ 118 ఎన్నికల ఓట్లను సాధించారు. అమెరికా అధ్యక్ష పదవిని గెలుచుకోవడానికి ఒక అభ్యర్థికి 270 ఓట్లు అవసరం. "ట్రంప్, బిడెన్‌ను గణనీయంగా అధిగమించాడు. ఇప్పుడు మంచి పొజిషన్లోఉన్నాడు" అని బెట్‌ఫెయిర్ ప్రతినిధి సామ్ రోస్బోట్టమ్ అన్నారు. బ్రిటన్ ఆధారిత స్మార్కెట్స్ ఎక్స్ఛేంజ్ ట్రంప్ మరోసారి గెలవడానికి 55శాతం అవకాశం ఉందని తెలిపింది. కాగా పోల్స్ ప్రారంభమైనప్పుడు ఇది 39 శాతంగా ఉండటం గమనార్హం. స్మార్కెట్లలో బైడెన్ విజయావకాశాలు 61శాతం నుంచి 45 శాతానికి పడిపోయాయి. (చదవండి: ట్రంప్‌కి గట్టి పోటీ ఇస్తున్న కమల) "క్యూబా జనాభా అధికంగా ఉన్న మయామి-డేడ్ కౌంటీలో డొనాల్డ్ ట్రంప్ చాలా బలంగా ఉన్నారు. కీలకమైన స్వింగ్ స్టేట్ ఫ్లోరిడాలో ట్రంప్ విజయానికి ఇది ప్రధాన కారణం" అని స్మార్కెట్స్లోని రాజకీయ విశ్లేషకుడు పాట్రిక్ ఫ్లిన్ అన్నారు. అంతేకాక ఫ్లోరిడా మొదటి నుంచి ట్రంప్‌కే అనుకూలంగా ఉందని తెలిపారు. కీలకమైన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాలలో బైడెన్ తన అధిక్యాన్ని ప్రదర్శించగలిగితే.. అతను ఎన్నికల్లో విజయం సాధిస్తాడు అని తెలిపారు. -
వ్యాపారి అదృశ్యం వెనుక బెట్టింగ్ కోణం?
అమలాపురం టౌన్: పట్టణంలో అదృశ్యమైన విజయవాడకు చెందిన బంగారు నగల వ్యాపారి జైన్ కౌశిక్ ఆచూకీ మిస్టరీగా మారింది. నగల ఆర్డర్ల కోసం నాలుగు రోజుల క్రితం అమలాపురం వచ్చిన జైన్ కౌశిక్ ఆ రాత్రి ఓ లాడ్డిలో బస చేశాడు. ఆ మర్నాడు విజయవాడలోని తన కుటుంబీకులకు అమలాపురం నుంచి బయలుదేరుతున్నట్టు ఫోన్లో చెప్పినప్పటికీ అతను ఇంటికి చేరుకోలేదు. ఆ మర్నాడు కూడా అతడి జాడ తెలియకపోవడంతో చివరకు జైన్ కౌశిక్ కుటుంబీకులు అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో మ్యాన్ మిస్సింగ్ కేసు పెట్టారు. పట్టణ సీఐ బాజీలాల్ కేసు దర్యాప్తు ప్రారంభించారు. అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయించారు. ఈ దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. మలుపు తిరిగిన కేసు దర్యాప్తు: ముప్పై ఏళ్ల యువకుడైన జైన్ కౌశిక్ నగల వ్యాపారిగా అమలాపురం వచ్చి, అదృశ్యం కావడంపై డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా దృష్టి పెట్టారు. ఆయన విజయవాడ పోలీసులతో మాట్లాడి అక్కడ జైన్ కౌశిక్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో కౌశిక్ 2016లో అరెస్టయినట్టు తేలింది. ఇప్పటి అతడి అదృశ్యానికి... నాటి క్రికెట్ బెట్టింగులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేశారు. కౌశిక్ ఫోన్ కాల్స్ డేటాను సేకరించి అదృశ్యానికి ముందు అతడు ఎవరెవరిని కాంటాక్ట్ చేశాడో వంటి వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు డీఎస్పీ బాషా నాలుగు పోలీసు బృందాలను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్య నగరాలకు పంపించారు. కౌశిక్ బస చేసిన లాడ్జిలో పోలీసులు ఆరా తీయగా ఆ రోజు ఉదయమే అతడు లాడ్జి రూమ్ ఖాళీ చేసి వెళ్లినట్టు సమాచారం వచ్చింది. లాడ్జిలో రూమ్ ఖాళీ చేసిన తర్వాత నగల వ్యాపారి ఉదయం నుంచి రాత్రి వరకూ అమలాపురంలోనే ఉన్నాడా...? అతడిని బయట నుంచి వచ్చిన అపరిచితులు ఎవరైనా కలిశారా తెలియాల్సి ఉంది. -
బెజవాడలో బెట్టింగ్ ముఠా అరెస్టు
సాక్షి, అమరావతి బ్యూరో: పదుల సంఖ్యలో సబ్ బుకీలు, పంటర్లను పెట్టుకుని యథేచ్ఛగా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠా గుట్టును విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి బెట్టింగ్ నిర్వహణకు ఉపయోగించే సామగ్రితోపాటు రూ. 16.02 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోలీసు కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో నగర సీపీ ద్వారకా తిరుమలరావు విలేకరుల సమావేశంలో బెట్టింగ్ ముఠా వివరాలు వెల్లడించారు. విజయవాడ మాచవరం పరిధిలోని మారుతీనగర్ మసీదు వీధిలో నివాసం ఉండే పైలా ప్రసాద్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో 9 మంది పంటర్లతో క్రికెట్ బెట్టింగ్‌కు శ్రీకారం చుట్టాడు. పశ్చిమగోదావరి జిల్లా కైకారం గ్రామానికి చెందిన ప్రధాన బుకీ కళ్యాణ్ చక్రవర్తితో కలిసి బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఈ ముఠా సభ్యులు ఆంధ్రప్రదేశ్‌తోపాటు హైదరాబాద్‌లోని ఇతర బెట్టింగ్ ముఠాలతో సంబంధాలు పెట్టుకుని యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కళ్యాణ చక్రవర్తి గురించి చెప్పడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. వీరితోపాటు విజయవాడలోని మొగల్రాజపురానికి చెందిన మోహన్‌కృష్ణ, కృష్ణలంకకు చెందిన ఉండి శరత్‌చంద్రను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 16.02 లక్షల నగదుతోపాటు 19 సెల్ఫోన్లు, ఒక లైన్‌బాక్స్, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసును మాచవరం పోలీసులకు అప్పగించారు. -
బెట్టింగ్‌రాయుళ్ల ఒత్తిళ్లతో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, గుంటూరు రూరల్ : బెట్టింగ్ రాయుళ్ల ఒత్తిళ్లతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని అంకిరెడ్డిపాలెంలో గురువారం వెలుగులోకి వచ్చింది. నల్లపాడు సీఐ కె.వీరాస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వాకా వెంకటేశ్వరరెడ్డి (40) అలియాస్ పిల్లారెడ్డి మిర్చియార్డులో కమీషన్ కొట్టు ద్వారా తన అన్నతో కలిసి వ్యాపారం చేస్తుండేవాడు. పదేళ్ల కిందట నగరంలోని హౌసింగ్ బోర్డుకు నివాసాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలో బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. ఏడాది క్రితం బెట్టింగ్‌లో మధ్యవర్తిత్వం చేస్తూ పల్నాడు, మిర్చియార్డు తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి నగదును బెట్టింగ్ కోసం వసూలు చేశాడు. ఆ నగదును మార్కాపురానికి చెందిన సానికొమ్ము సుబ్బారెడ్డి అనే వ్యక్తితో బెట్టింగ్ పెట్టి సుమారు రూ.1.75 కోట్లు ముట్టజెప్పాడు. ఈ క్రమంలో బెట్టింగ్‌లలో ఓడిపోయాడు. అనంతరం వెంకటేశ్వరరెడ్డి వద్ద బెట్టింగ్ పెట్టిన వ్యక్తులు బెట్టింగ్‌లో తాము గెలిచినందున నగదు ఇవ్వాలని వెంకటేశ్వర్‌రెడ్డిని ఒత్తిడి చేశారు. వెంకటేశ్వర్‌రెడ్డి సుబ్బారెడ్డిని ఒత్తిడి చేశాడు. సుబ్బారెడ్డి ఎంతకూ తిరిగి నగదు ఇవ్వక పోవడంతో మార్కాపురంలో సుబ్బారెడ్డిపై వెంకటేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆతడిని పిలిపించి సుబ్బారెడ్డి నుంచి సుమారు కోటి రూపాయల వరకూ తిరిగి ఇప్పించారు. మిగిలిన రూ.75 లక్షల్లో వెంకటేశ్వర్‌రెడ్డి సుమారు రూ.20 లక్షలకుపైగా తన ఆస్తులను అమ్ముకుని బెట్టింగ్ రాయుళ్లకు ముట్ట జెప్పాడు. మిగిలిన వ్యక్తులు నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో నగదుకు వడ్డీ కలిపి మరింత పెరిగింది. ఈ క్రమంలో మిగిలిన నగదు ఇవ్వాలని వెంకటేశ్వర్‌రెడ్డి సుబ్బారెడ్డిని కోరగా ఆయన తప్పించుకుని తిరుగుతున్నాడు. వెంకటేశ్వర్‌రెడ్డి వద్ద బెట్టింగ్ పెట్టిన వ్యక్తులు తమకు రావాల్సిన నగదుకు వడ్డీతో కలిపి వెంటనే ఇవ్వాలని ఒత్తిడి చేయటం ప్రారంభించారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం ఉదయం స్థానిక బార్లో మద్యం తీసుకుని అంకిరెడ్డిపాలెం సమీపంలోని పొలాల్లోకి వెళ్లి మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు కారణం బెట్టింగ్ పెట్టిన వ్యక్తులు, సుబ్బారెడ్డి కారణమని సూసైడ్ లెటర్ సైతం రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య కొండమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
బెట్టింగ్ బంగార్రాజులు
సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : బెట్టింగ్ మాఫియా కన్ను పట్టణాలు, పల్లెలపై పడింది. మెట్రో నగరాల్లో వీరి కార్యకలాపాలకు అక్కడ పోలీసు యంత్రాంగం చెక్ పెడుతుండటంతో ఇటువైపు దృష్టిసారించింది. ఇటీవల శ్రీకాకుళం, రాజాంలో బయటపడిన బెట్టింగ్ బాగోతాలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇక్కడ యువతలో క్రికెట్ మోజును బలహీనతగా చేసుకున్న ఓ ముఠా ప్రత్యేక యాప్ ద్వారా బెట్టింగ్ రొంపిలోకి దించుతోంది. దీంతో ఆర్థికంగా చితికిపోయి జీవితాలను నాశనం చేసుకునే స్థితికి దిగజార్చుతోంది. రాజాంలో గుట్టుగా సాగిస్తున్న బెట్టింగ్ వ్యవహారాన్ని ఇటీవల పోలీసులు రట్టు చేశారు. ప్రపంచకప్ సెమీఫైనల్ –2 మ్యాచ్ సందర్భంగా ఐదుగురు బెట్టింగ్ రాయుళ్లను ఈ నెల 11న అదుపులోకి తీసుకోగా, పరారైన మరో ఐదుగురిని ఈనెల 17న అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 5.05 లక్షలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసిన విషయం విదితమే. యువతే టార్గెట్..... ప్రస్తుతం యువత ప్రపంచీకరణ మోజులోపడింది. డబ్బులు ఈజీగా సంపాదించే ఆలోచనలోనే బెట్టింగ్ ముఠా వలలో చిక్కుతోంది. ఇదే అదునుగా చేసుకుని వందకు వెయ్యి, వెయ్యికి పది వేలు, రూ. పది వేలకు రూ.లక్ష అంటూ పదింతలు సంపాదించవచ్చునని ఆశపెడుతోంది. మ్యాచ్ ఏదైనా బెట్టింగ్ మాత్రం ఒకటే. ముందుగానే ఇటువంటి బలహీనత యువతను గుర్తించి వారి ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడడం వంటివి చేస్తుండడం గమనార్హం. ఒక్క రాజాంలోనే కాకుండా జిల్లా అంతటా ఇదే తంతు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొంతమంది యువత విలువైన వస్తువులతోపాటు బైక్‌లను, ల్యాప్‌టాప్‌లను కుదవపెట్టి బెట్టింగ్‌లకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఎక్కడో పెద్ద పట్టణాల్లో సాగిన బెట్టింగ్ చిన్న పట్టణాలకు పాకడంతో విజ్ఞులు నిట్టూరుస్తున్నారు. కాదేదీ బెట్టింగ్‌కు అనర్హం... బెట్టింగ్ రాయుళ్లు ఉచ్చులో చిక్కుకున్న యువత రంజీ, ఐపీఎల్, టీ20, వన్డే మ్యాచ్‌లతోపాటు టీవీల్లో వచ్చే లైవ్ మ్యాచ్‌లకు బెట్టింగ్‌కు పాల్పడుతోంది. ఈ బెట్టింగ్‌ల్లో బాల్ టూ బాల్, ఓవర్ టూ ఓవర్, బ్యాటింగ్, వికెట్లు, సిక్సర్స్, ఫోర్స్ వంటి వాటిపై కూడా ఉత్కంఠగా బెట్టింగ్ కాయడం. ఒకవేళ చేతిలో సొమ్ములు అయిపోతే వారి వద్ద ఉన్న గోల్డ్, ఇతర విలువైన వస్తువులు కూడా పద్దు రూపంలోను, అమ్మకం చేసో పోగొట్టుకున్న సొమ్మును రాబెట్టుకునేందుకు బెట్టింగ్లవైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఆర్థికంగా చితికిపోయి ఎక్కువ వడ్డీకి అప్పులు చేయడం, పరారైపోవడంతో కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్నారు. ఒకవేళ బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించే సమయంలో కేవలం సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కొద్ది మొత్తంలో సొమ్ము మాత్రమే దొరుకుతోంది. కోట్లలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నప్పటికీ ఎవరికీ దొరకుండా జాగ్రత్త పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతా యాప్‌లోనే.... క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి యాప్‌ల ద్వారా సాగిస్తున్నారు. యాప్ ద్వారా రేటింగ్స్ ముందుగానే లెక్కించి ఏ జట్టుకు బెట్టింగ్ కాస్తే లాభదాయకంగా ఉంటుందో తెలియజేసి, తదనుగుణంగా బెట్టింగ్‌లోకి దించుతున్నారు. దీనికి సంబంధించి లాగిన్ ఐడీ ఇచ్చి ముందుగానే డిపాజిట్ కూడా చేయిస్తున్నారనే విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదంతా విజయవాడ కేంద్రంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను బెట్టింగ్ నిర్వాహకులు భారీగానే ఆర్జిస్తున్నారు. బెట్టింగ్‌లో రెండు వైపుల నుంచి కూడా వీరికి భారీస్థాయిలో కమీషన్ అందుతున్నట్లు తెలుస్తోంది. అంతా గోప్యంగానే..... బెట్టింగ్ రాయుళ్లు ఎవరి కంటా పడకుండా అంతా గోప్యంగానే సాగిస్తున్నారు. నలుగురిలో తిరుగుతూ పక్కవాడికి కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దీనికోసం శివార్లలో ఇళ్లను ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే లాడ్జీల్లో రూమ్‌లు తీసుకుని బెట్టింగ్ గుట్టుగా సాగిస్తున్నారు. అంత వరకు సామాన్యుడిలా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా లైఫ్‌స్టైల్ మార్చడం, కొన్ని రోజులకే పూర్వ స్థితికిరావడం తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం, పలుచోట్ల సంభవిస్తున్నాయి. అయితే రాజాంలో కలకలం రేపిన బెట్టింగ్ వ్యవహారంలో పది మంది మాత్రమే ఇప్పటివరకు పట్టుబడ్డారు. వీరు మాత్రమేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది పట్టణంలో గుసగుసలాడుకుంటున్నారు. దీనిని మొగ్గలోనే తుంచి ఈ భూతాన్ని తరిమివేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బెట్టింగ్‌లపై నిఘా పెట్టాం పట్టణాలతోపాటు పల్లెల్లో కూడా బెట్టింగ్‌ల వ్యవహారంపై ఇప్పటికే నిఘా పెట్టాం. ఇందులో భాగంగానే ఇటీవల పది మంది బెట్టింగ్ రాయుళ్లును అదుపులోకి తీసుకున్నాం. ఎవరైనా ఎక్కడైనా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారనే సమాచారం అందిస్తే, వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు బెట్టింగ్ రాయుళ్లును పట్టుకుంటాం. జి.సోమశేఖర్, సీఐ, రాజాం టౌన్ -
నీ దూకుడు.. తాడిపత్రి చూడు!
సాక్షి, అనంతపురం: జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న సత్య యేసుబాబు విధినిర్వహణలో తనదైన దూకుడు కనబరుస్తున్నారు. ఈనెల 9న విధుల్లో చేరిన ఆయన ఇప్పటి వరకు ఒక్క తాడిపత్రి నియోజకవర్గంలోనే వంద మందికి పైగా అసాంఘిక శక్తులను అరెస్టు చేయించారు. వీళ్లందరిపైనా గతంలో కేసులు నమోదైనా అక్కడి ‘బ్రదర్స్’ కొమ్ముకాశారు. అయితే సత్య యేసుబాబు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించడంతో అరెస్టుల పర్వం మొదలైంది. రాప్తాడు, ధర్మవరం తదితర సమస్యాత్మక ప్రాంతాలపైనా ఆయన గట్టి నిఘా సారించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాడిపత్రిలో వేళ్లూనుకున్న ‘మట్కా.. పేకాట.. బెట్టింగ్’ ఎస్పీకి ఓ సవాల్ అనే చెప్పాలి. జేసీ బ్రదర్స్ కనుసన్నల్లో తాడిపత్రి నాలుగు దశాబ్దాలకు పైగా నలిగిపోయింది. ఆ ప్రాంతంలో వాళ్లు చెప్పిందే వేదం.. చెసిందే శాసనం. అలా మొదలైన కథ.. ఏ అధికారి వచ్చినా ఆ కనుసన్నల్లో మెలగాల్సిందే. పోలీసులదీ అదే దారి. ఈ నేపథ్యంలోనే తాడిపత్రి జూద గృహంగా మారిపోయింది. డీఎస్పీలు.. సీఐలు.. ఎస్ఐలు.. ఎవరు మారినా ఆ మహమ్మారికి ముకుతాడు వేయలేకపోయారు. పైగా ఆ ఊబిలో కూరుకుపోయారు. అక్కడి నేతలు ప్రజలకు కనీస అవసరాలైన మంచినీటిని అందించలేకపోయినా.. వాళ్ల అనుచరులు పేకాట, మట్కా, బెట్టింగ్‌ను మాత్రం వీధివీధికీ విస్తరించారు. ఏ స్థాయిలో అంటే.. అడ్డొస్తే పోలీసులైనా దాడులకు తెగబడేంతగా. గత ఏడాది ఓ సీఐపై మట్కా డాన్ రషీద్ దాడులకు పాల్పడినా అక్కడి ప్రజాప్రతినిధులు బాధ్యతను విస్మరించారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏకంగా పోలీసులకు వ్యతిరేకంగా, మట్కారాయుళ్లకు అండగా పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఇలాంటి పాలనలో పోలీసులు కూడా మౌనం దాల్చడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ ధైర్యం చేసినా.. బదిలీకి సిద్ధపడాల్సిందే. ఈ కారణంగా అసాంఘిక శక్తులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. పోలీసు శాఖలోని కీలక అధికారుల కొత్త వాహనాలకు నెలవారీ కంతులు, ఇతర ఖర్చులకు ఈ ముఠాలే సర్దుబాటు చేస్తుండటంతో ప్రతినెలా జూదం ‘కోట్లు’ దాటింది. జూద కేంద్రంగా తాడిపత్రి తాడిపత్రిలో పేకాట ఆడేందుకు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి కూడా వస్తుంటారు. ఇక్కడ రూ.లక్ష, రూ.2లక్షల బ్యాంకు ఆట కూడా జరుగుతుంది. మునిసిపాలిటీలోని పాలకవర్గం సభ్యుడు ఒకరు ఇక్కడ పేకాటక్లబ్‌లకు ఇన్చార్జి. ఇతను జేసీ బ్రదర్స్‌కు నమ్మిన బంటు. గతంలో ఇతని ఇల్లే పేకాట క్లబ్బు. తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమలు అధికం. అల్ట్రాటెక్, పెన్నా సిమెంట్స్‌తో పాటు గెర్డావ్ స్టీల్‌ప్లాంట్ ఉంది. వీటిలో పనిచేసేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఎక్కువగా సిబ్బంది వస్తుంటారు. ఆర్థికలావాదేవీలు కూడా ఎక్కువే. దీన్ని ఆసరగా చేసుకుని అక్కడి కొంతమంది నేతలు తమ అనుచరులతో పేకాట నిర్వహిస్తున్నారు. దీన్ని కూడా స్థానిక నేతలు ఆదాయమార్గంగా ఎంచుకున్నారు. ఇక పక్కనే ప్రొద్దుటూరు ఉండటంతో క్రికెట్ బెట్టింగ్ కూడా అధికంగా నడుస్తోంది. అనంతపురం జిల్లాలో జరిగే బెట్టింగ్ తాడిపత్రి కేంద్రంగానే సాగుతోంది. అదేవిధంగా మట్కా సంగతి చెప్పక్కర్లేదు. గతంలో అశోక్‌కుమార్ ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 72మంది మట్కారాయుళ్లను తాడిపత్రి నుంచి బహిష్కరించారు. అయితే ఆ తర్వాత నేతల ఒత్తిడి పెరగడంతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. పోలీసుల నిస్సహాయత ఇక్కడ పేకాట, మట్కా ఎవరు నిర్వహిస్తున్నారు? బెట్టింగ్ బుకీలు ఎవరు? అనే సంగతి అక్కడి పోలీసులకు తెలియనిది కాదు. అయినా ఎలాంటి చర్యలు ఉండవు. ఏమాత్రం జోక్యం చేసుకున్నా అక్కడి ఓ మాజీ ప్రజాప్రతినిధి, ఆయన పీఏ నుంచి ఫోన్లు రావడం సర్వసాధారణం. పోలీసులతో రాయ‘బేరాలు’ నడిపి నెలమామూళ్లు కట్టిపడేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ నేపథ్యంలోనే బదిలీ కంటే బహుమానాలే ఉత్తమమనే భావన ఉన్నట్లు కనిపిస్తుంది. పోలీసులే మౌనం దాలిస్తే వ్యవహారం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. తాడిపత్రిలో అధిక భాగం వ్యసనాలకు బానిసైంది. అప్పుల ఊబిలో ఎన్నో కుటుంబాలు ఉక్కిరిబిక్కిరి కాగా.. హత్యలు, ఆత్మహత్యలు కోకొల్లలు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా అసాంఘిక శక్తుల నుంచి తాడిపత్రికి విముక్తి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇప్పటికే తనదైన ముద్ర కనపరుస్తున్న నూతన ఎస్పీ చేతుల్లో తాడిపత్రి ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి. డిసెంబర్ 30, 2018 మట్కా డాన్ రషీద్‌ను అరెస్టు చేసేందుకు వచ్చిన సీఐ హమీద్‌ఖాన్‌పై ఆయనతో పాటు అనుచరులు దాడి చేశారు. పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. సీఐతో పాటు పోలీసులు గాయపడ్డారు. -
జోరుగా పేకాట..!
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ శివారులో పేకాట జోరుగా సాగుతోంది. పట్టణ సమీపంలోని గ్రామాల్లో గట్లు, పొలాలే స్థావరాలుగా పేకాట నిర్వహిస్తున్నారు. యాద్గార్పల్లి గ్రామ శివారులోని కాల్వపల్లికి వెళ్లే దారిలో కాలువ వెంట ద్విచక్రవాహనాలు వెళ్లే దారిలో, అవంతీపురం సమీపంలోని గట్లు పేకాటకు అడ్డాగా మారాయి. యాద్గార్పల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన సొంత వ్యవసాయ భూమిలో అడ్డాను ఏర్పాటు చేసి డబ్బులు తీసుకొని పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా అవంతీపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అవంతీపురం సమీపంలో పేకాట అడ్డా సాగిస్తున్నట్లు తెలిసింది. ఉదయం 10గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షిఫ్టుల వారిగా పేకాట సాగిస్తున్నారు. పేకాట స్థావరాలకు ఎవరూ రాకుండా ఉండే విధంగా, ఒక వేళ వచ్చినా ముందస్తుగానే సమాచారం అందే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. చేతులు మారుతున్న రూ.లక్షలు మిర్యాలగూడ మండలంలోని యాద్గార్పల్లి శివా రులో నిర్వహిస్తున్న పేకాట అడ్డాలోనే రోజుకు రూ.15 లక్షల రూపాయల నుంచి రూ.20 లక్షల రూపాయల వరకు బెట్టింగ్‌లు సాగుతున్నట్లు సమాచారం. ఆటలో కూర్చునే వ్యక్తి వద్ద కనీసం పాతిక వేల రూపాయలు ఉన్నట్లుగా ముందుగానే చూపించాల్సి ఉంది. ఆ రూపాయలు ఉంటేనే ఆటలో కూర్చోనిస్తారు. అలా కనీసం ఒక్కో అడ్డా వద్ద 20 మందికి పైగా పేకాట ఆడుతున్నారు. అందర్.. బాహర్ పేకాటలో ఎక్కువ మొత్తం డబ్బులు పెట్టడంతో పాటు అతి త్వరగా ముగించే ఆట అందర్– బాహర్. దీని వల్ల ఒక్కొక్కరు లక్షల రూపాయలు పొగొట్టుకున్న వారు సైతం ఉన్నారు. కేవలం మూడు ముక్కలతో ఆడే ఆటలో ఎవరికి పెద్ద ముక్క వస్తే వారే ఆటలో గెలిచినట్లుగా భావిస్తారు. పెద్ద ముక్క వచ్చిందని భావించే వ్యక్తి పోటీగా కూడా పందెంలో అదనంగా కూడా డబ్బులు పెడతారు. పేకాట వల్ల మధ్య తరగతి వ్యక్తులు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. -
బెట్టింగ్ బంగార్రాజులు
మహబూబ్‌నగర్ క్రైం: క్రీడాభిమానులకు ఐపీఎల్ జ్వరం పట్టుకున్నట్లు.. రాజకీయ అభిమానులకు కూడా అదే జ్వరం పట్టుకుంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడు.. అనే దానిపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. నిన్న మొన్నటి వరకు రాజకీయ రణక్షేత్రంలో హోరాహోరీగా తలపడిన నేతల్లో విజేత ఎవరోననే ఉత్కంఠ రేపుతోంది. అభ్యర్థులు, వారి అనుచరులతోపాటు రాజకీయ నేతలతో పాటు ప్రజలు కూడా ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చేనెల 23 వరకు ఆగాల్సిందే.. పోటీలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలడానికి ఇంకా సమయం ఉంది. అందుకే ఫలితాలపై ఆసక్తి పెరగడంతో లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు. ప్రభుత్వ వ్యాపారులు, యువత, నాయకులు, ఉద్యోగులు సైతం బెట్టింగ్‌పై దృష్టి పెట్టారంటే పోరు ఎంత రసవత్తరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహబూబ్‌నగ్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ఈ అంశమే వినవస్తోంది. ఎన్నికలు ముగిసి వారం కావస్తున్నా అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న కార్యాలయాల్లో, హోటళ్లలో, దుకాణాల్లో అందరినోటా ఇదే ముచ్చట వినపడుతోంది. ఎవరి అంచనాలో వారు.. ఈనెల 11న సాయంత్రం 5గంటలకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసింది. అప్పటి నుంచి ఎవరి అంచనాల్లో వారున్నారు. మరోవైపు కొందరు ఎవరు నాయకుడు అవుతాడనే అంశంపై బెట్టింగ్ వేస్తున్నారు. ఇప్పటికే ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువరించినా.. పార్టీల వారీగా ఉన్న కార్యకర్తలు, అభిమానులు ఎవరి ధీమాలో వారున్నారు. ఇ అంతట ఇదే చర్చ పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై అందరు ఇదే చర్చ జరుగుతోంది. ఉదయం వేళ మైదానంలో రన్నింగ్ చేస్తున్న వారి దగ్గరి నుంచి సాయంత్రం టీ దుకాణాల దగ్గర ముచ్చట్లు పెట్టే వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు ఫలితాలు ఎట్లుంటయోనని ఒకటే ముచ్చట్లు పెడుతున్నారు. టీ కొట్లు, హోటల్స్, స్నాక్స్ దుకాణాలు, పని చేసే ప్రదేశాలు, వాకింగ్ మైదానాలు ఇలా ఎక్కడికి వెళ్లినా ఫలితాలపైనే ఆసక్తికర సంభాషణలు నడుస్తున్నాయి. ఫలానా వ్యక్తి గెలువబోతున్నారని ఒకరంటే.. కాదు కాదు ఇంకో వ్యక్తి గెలుస్తారంటూ వాదనలకు దిగుతున్నారు. ఏదేమైనా ఫలితాల ఎలా ఉండబోతున్నాయని తెలుసుకోవాలంటే వచ్చేనెల 23వరకు ఆగాల్సిందే. -
కాయ్ రాజా కాయ్..
సాక్షి, ఏలూరు టౌన్: పశ్చిమలో బెట్టింగురాయుళ్ళు బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు ఉంటే.. మరోవైపు ఐపీఎల్ పోరు సాగుతోంది. దీంతో బెట్టింగు రాజాలకు చేతినిండా పనిదొరికినట్లు అయ్యింది. రాజకీయ పార్టీల మధ్య రసవత్తరపోరు సాగుతుండగా ఇదే అదనుగా బెట్టింగురాయుళ్ళు రెచ్చిపోతున్నారు. ఆయా రాజకీయ పార్టీలకు అనుకూల వర్గాలు సైతం బెట్టింగులతో బిజీగా మారిపోయాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే టీడీపీ ఓడిపోయే చోట్ల వ్యూహాత్మకంగా ఆ పార్టీ నేతలు తామే గెలుస్తామంటూ బెట్టింగులు కడుతూ ఓటర్లను ప్రభావితం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా జిల్లాలో బెట్టింగురాయుళ్ళ ప్రలోభాలతో పార్టీ నేతలు, కార్యకర్తలు జేబులు ఖాళీ చేసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో లగడపాటి సర్వేను నమ్ముకుని బెట్టింగులు కాసిన వందలాది మంది భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ సార్వత్రిక ఎన్నికల్లో చావోరేవో తేల్చుకునేందుకు అధికార టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జోరును అడ్డుకునేందుకు ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బహుమతులు, డబ్బు, మద్యం భారీఎత్తున పంపిణీ చేస్తూనే.. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు, క్యాడర్‌ను ఆత్మరక్షణలో పడేసేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీ అభ్యర్థి గెలుపు తథ్యమని.. కావాలంటే పందేలు కాసుకోవచ్చని సవాల్ విసురుతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎలాగూ ఓడిపోతామనే అభిప్రాయానికి వస్తున్న నాయకులు తమ అనుకూల వర్గాలతో బెట్టింగులకు తెరలేపుతున్నారు. పందేలు కాస్తే రెట్టింపు సొమ్ములు ఇస్తామంటూ బీరాలు పలుకుతున్నారు. ఇక గెలుపు సంగతి అటుంచితే ఒక అడుగు ముందుకేసి మరీ భారీ మెజార్జీ ఖాయమంటూ పందేలు కాస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులే టార్గెట్‌గా గ్రామాల్లో బెట్టింగులు కాస్తూ తటస్థులైన ఓటర్లను ప్రభావితం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎలాగూ త్రిముఖపోటీ నేపథ్యంలో గెలుపుపై కొన్ని చోట్ల సందిగ్ధత నెలకొన్న దశలో టీడీపీ నేతలు కుటిల రాజకీయ ఎత్తుగడలతో ఓటర్లును మాయ చేసేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఐపీఎల్‌పైనా జోరుగా పందాలు సందట్లో సడేమియా లాగా.. ఒకవైపు పోలీసు యంత్రాంగం అంతా సార్వత్రిక ఎన్నికల హడావుడిలో నిమగ్నం కావటంతో ఐపీఎల్‌పై బెట్టింగులు కాసే వారికి అడ్డులేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది క్షణం తీరికలేకుండా విధుల్లో ఉండడం పందెంరాయుళ్ళకు కలిసివచ్చింది. జిల్లావ్యాప్తంగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. లాడ్జీలు, ఇళ్ళు, అపార్టుమెంట్ల నుంచి పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఏలూరు నగరంతోపాటు, జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లోనూ క్రికెట్ బెట్టింగులు సాఫీగా సాగిపోతున్నట్లు సమాచారం. బెట్టింగులకు కౌంటర్లు ఏర్పాటు జిల్లా కేంద్రం ఏలూరుతోపాటు, దెందులూరు ఇంకా పలు నియోజకవర్గాల పరిధిలో బెట్టింగులకు ఏకంగా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆయా రాజకీయ పార్టీల సానుభూతిపరులకు, పార్టీ నేతలకు, క్యాడర్‌కు బెట్టింగులు కట్టేందుకు ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. రాజకీయ పార్టీల అభ్యర్థుల గెలుపుతోపాటు, వారికి వచ్చే మెజార్టీ పైనా భారీగా పందేలు కాసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఊహించని స్థాయిలో సీట్లు గ్యారంటీ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక టీడీపీ సైతం అదేస్థాయిలో ఓడిపోయే నియోజకవర్గాల్లో సైతం బెట్టింగులు కాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 5 వేలు, 10 వేల మెజార్జీలపైనా భారీగా పందేలు కాస్తున్నారని సమాచారం. ఎవరైనా పందేలు కాస్తే ముందుగానే డబ్బులు చెల్లిస్తే.. వారికి రశీదులు ఇస్తున్నారని.. ఎన్నికల ఫలితాల అనంతరం గెలుపు, ఓటములను బట్టి వారికి డబ్బులు చెల్లించేలా బెట్టింగురాయుళ్ళు కౌంటర్లు తెరిచినట్లు చెబుతున్నారు. అయితే టీడీపీ నేతల వద్దనే కౌంటర్లు ఏర్పాటు చేయటంతో బెట్టింగురాయుళ్ళు భయపడుతున్నట్లు సమాచారం. గెలిచినా ఓడినా తాము ఆ నేతలను డబ్బులు అడిగే అవకాశం ఉండదని, ఇక పందేలు కాసి ఉపయోగమేంటని అనుమానిస్తున్నారట. మరో విషయం ఏమిటంటే బెట్టింగులు కట్టే డబ్బునే ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసే ఆలోచనలో సైతం ఆయా నేతలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురి అరెస్ట్
తూర్పుగోదావరి,కాకినాడ క్రైం: జిల్లాలో మూడు చోట్ల దాడులు నిర్వహించి బెట్టింగ్‌కి పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.11.26 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన బెట్టింగ్ సామగ్రిని, 180 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ విశాల్‌గున్ని తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ సూర్యనారాయణపురం యాళ్లవారివీధిలో చీకట్ల ఈశ్వరరావు ఇంట్లో డబ్బులతో క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు దాడి చేసి ఈశ్వరరావు, అతడికి సహాయకుడిగా ఉన్నా అట్లూరి శివనాగవెంకటేశ్వరరావు అనే వ్యక్తులను పట్టుకున్నట్టు వెల్లడించారు. వీరి నుంచి ఒక లైన్బాక్సు, రెండు సెల్ఫోన్లు, ఒక డెల్ ల్యాప్‌ట్యాప్, ఒక ప్రింటర్, ఒక సోనీ ఎల్ఈడీ టీవీ, బెట్టింగ్‌లో ఉపయోగించిన రూ.1.71 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ విశాల్‌గున్ని వివరించారు. ఈశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు కాకినాడ సాంబమూర్తినగర్ రెవెన్యూకాలనీ, సాయిబాబాగుడి వీధిలో ఒక ఇంటి వద్ద జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న దండు గోపాలకృష్ణంరాజు అలియాస్ గోపాల్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుంచి లైన్ బాక్సు, 20 సెల్ఫోన్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్, బెట్టింగులో ఉపయోగించే రూ.9,55,900 నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ విశాల్‌గున్ని వివరించారు. గోపాలకృష్ణంరాజును ప్రశ్నించగా అతడు ఇచ్చిన సమాచారం మేరకు రాజమండ్రిలో బెస్ట్ ప్రెస్ ఎదురుగా గల శ్రీసాయి ఎవెన్స్ అపార్టుమెంట్లో ప్లాటు నంబర్ 504లో మూడేళ్ల నుంచి బెట్టింగ్ నడుపుతున్న సికింద్రాబాద్‌కు చెందిన కుప్ప ప్రవీణ్‌కుమార్, భీమవరం చిన అప్పారావుతోటకు చెందిన మేకల కళ్యాణ్, భీమవరం డీఎన్ఆర్ కాలేజీ ఎదురుగా ఉంటున్న అడపాల జగదీష్‌ప్రసాద్, పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన కలిదిండి శివధర్మతేజలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సోలాపూర్, రాజస్థాన్, విశాఖపట్నం తదితర లైన్ల నుంచి వచ్చే నాలుగు లైన్ బాక్సులు, 124 సెల్ ఫోన్లు, ఒక ప్రింటర్, ఒక ల్యాప్‌ట్యాప్, ఎల్సీడీ టీవీలను బెట్టింగ్‌లో ఉపయోగిస్తున్న వాటిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ విశాల్‌గున్ని వివరించారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు ముద్దాయిలను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ దాడుల్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ విశాల్ గున్ని అభినందించారు. విలేకర్ల సమావేశంలో ఎస్బీ డీఎస్పీ పల్లపురాజు, కాకినాడ డీఎస్పీ రవివర్మలు పాల్గొన్నారు. -
బెట్టింగ్ పేరుతో భారీ మోసం
ఒంగోలు: బెట్టింగ్ పేరుతో ఓ విద్యార్థిని భయపెట్టి అతని నుంచి రూ.30 లక్షల సొత్తును చోరీ చేసిన యేమిరెడ్డి నరేంద్రరెడ్డిని అరెస్టు చేసినట్లు ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు తెలిపారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి వివరాలను ఆయన వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. బాధిత బీటెక్ విద్యార్థికి నరేంద్రరెడ్డి పరిచయం అయ్యాడు. క్రికెట్, ప్రోకబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్ గేమ్స్ వంటి ఆడటం ద్వారా డబ్బులు బాగా వస్తున్నాయని, నీవు కూడా బెట్టింగ్ పెడితే బాగా లాభాలు సంపాదించవచ్చంటూ బీటెక్ విద్యార్థిని నమ్మించాడన్నారు. తండ్రి మరణంతో వచ్చిన బీమా సొమ్ము మొత్తం బ్యాంకులో ఉండగా వ్యాపారం పేరుతో ఆ నగదును బీటెక్ విద్యార్థి బయటకు తీసి విడతల వారీగా నరేంద్రరెడ్డికి ఇచ్చాడు. చివరకు 300 గ్రాముల తూకం ఉండే మూడు బంగారు బిస్కెట్లను కూడా హస్తగతం చేసుకోవడంతో పాటు ఇంకా పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరిస్తున్న నేపథ్యంలో చేసేదిలేక బీటెక్ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి 300 గ్రాముల తూకం ఉండే మూడు బంగారు బిస్కెట్లు, రూ.12.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా బెట్టింగ్ ఆడటమే ఒక నేరమైతే, బెట్టింగ్ పేరుతో డబ్బులు తీసుకొని బెట్టింగ్‌లో డబ్బులు పెట్టకుండానే చీట్ చేసిన నేరం మరొకటి వెలుగు చూసింది. డబ్బులతో బెట్టింగ్ ఆడవచ్చంటూ నిందితుడు యేమిరెడ్డి నరేంద్రరెడ్డిని ప్రోత్సహించిన మహేష్ అనే మరొకడు పరారీలో ఉన్నాడు. అతడికి బెట్టింగ్ కోసం రూ.6.30 లక్షలు ఇచ్చినట్లు నరేంద్రరెడ్డి పోలీసులతో చెప్పాడు. మహేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన డీఎస్పీ రాధేష్ మురళి, ఒంగోలు టూటౌన్ సీఐ రాంబాబుతో పాటు సిబ్బంది రఘు తదితరులను ఎస్పీ అభినందించారు. కాలేజీ విద్యార్థులూ..తస్మాత్ జాగ్రత్త! బెట్టింగ్ వైపు దృష్టి సారించి విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్‌ను రూపుమాపేందుకు పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. అందులో భాగంగా అన్ని కాలేజీల్లో బెట్టింగ్ వంటి వాటితో విద్యార్థుల జీవితాలు ఎలా నాశనం అవుతాయనే దానిపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. బెట్టింగ్ కేసుల్లో అరెస్టయిన వారికి భవిష్యత్తులో పాస్‌పోర్టులు మంజూరు కావని, నేడు ప్రైవేటు సెక్యూరిటీ గార్డు పోస్టుకు సైతం ఎంక్వయిరీ తప్పనిసరైనందున ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు సైతం అనర్హులుగా మిగిలిపోతారని ఎస్పీ హెచ్చరించారు. బెట్టింగ్ బ్యాచ్‌ని గుర్తించేందుకు చర్యలు ఇదిలా ఉంటే క్రికెట్ ఆటలు ఆడే విద్యార్థులు, యువకుల వద్దకు వెళ్లి యువతను ప్రలోభ పెట్టే బ్యాచ్‌ను గుర్తించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని ఎస్పీ సత్యఏసుబాబు తెలిపారు. బీటెక్ విద్యార్థిని మోసం చేసిన కేసులో రెండో నిందితుడైన మహేష్‌ను అరెస్టు చేసి విచారిస్తే బెట్టింగ్ యాప్ గురించిన వివరాలు కూడా వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామన్నారు. త్వరగా డబ్బు సంపాదించాలనే కోరిక ఇందుకు కారణంగా ఉంటుందని, బెట్టింగ్ రాయుళ్ల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇవే కాకుండా వన్‌టైం పాస్‌వర్డు పేరుతో ప్రలోభపెట్టి డబ్బును ఆన్లైన్ ద్వారా కాజేసే ఆర్థిక నేరగాళ్లు పెరిగిపోయారని, ఇందులో బాధితులు ఉన్నత విద్యావంతులు కావడం బాధకలిగిస్తోందన్నారు. తాజాగా ఆన్లైన్ ద్వారా రుణం ఇప్పిస్తామంటూ కూడా మోసం చేసే బ్యాచ్‌లు రంగంలోకి వచ్చాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మోసాలు అరికట్టాలంటే ప్రజలు బ్యాంకింగ్‌కు సంబంధించి రహస్య సమాచారాన్ని ఇతరులకు తెలియజేయవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. -
జోరుగా సింగిల్ నంబర్ ఆట
గుంటూరు ఈస్ట్: గుంటూరు నగరంలో సింగిల్ నంబర్ ఆట జోరుగా సాగుతోంది. నెలకు కోటి రూపాయలకు పైగా బెట్టింగ్‌ల కింద కాయకష్టం చేసుకునే పేద, మధ్య తరగతి వ్యక్తుల కష్టార్జితాన్ని నిర్వాహకులు దోచుకుంటున్నారు. ఒక అరండల్‌పేటలోనే వంద మీటర్ల దూరంలో మూడు చోట్ల సింగిల్ నంబర్ ఆట నిర్వహిస్తున్నారంటే ఏ స్థాయిలో నడుస్తోందో చెప్పనవసరం లేదు. నిర్వాహకులకు పోలీసుల అండదండలు లేనిదే ఇది కొనసాగదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క కొరిటిపాడు పరిధిలో నెలకు రూ. 30 లక్షలకు పైగా చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. అమరావతి రోడ్డు, స్వర్ణభారతీ నగర్ తదితర ప్రాంతాలలోనూ నిర్వాహకులు ధైర్యంగా మెయిన్ రోడ్లలోని చిన్నచిన్న బంకులు కేంద్రంగా సింగిల్ నంబర్ ఆట నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ నేపథ్యంలో అన్ని కాలనీలలో పెద్దసంఖ్యలో రోజు వారి కూలీలలతోపాటు మధ్య తరగతివారు పోటీ పడి టికెట్లు కొంటున్నారు. ప్రధాన నిర్వాహకుడు ఓ ఖరీదైన లాడ్జిలో ఉండి అన్ని కాలనీల్లో ఆర్థికంగా చితికిపోయిన వ్యక్తుల్ని మధ్యవర్తులుగా నియమించాడు. కొందరికి కమీషన్ రూపంలో, కొందరికి రోజుకు కొంత మొత్తం చెల్లిస్తూ కిందిస్థాయి పోలీసుల ద్వారా మామూళ్లూ పంపుతూ ధైర్యంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆట ఆటకు ఓ పేరు సినీ నటి శ్రీదేవి మరణించిన రెండు రోజుల నుంచి ప్రారంభించిన ఆటకు శ్రీదేవి అని పేరు పెట్టారు. కల్యాణి, శ్రీదేవి, టైజజార్, మెలాండే, వివిధ పేర్లతో నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో అన్ని కాలనీల్లో టిక్కెట్లు విక్రయిస్తున్నారు. 11.30 నిమిషాలకు మొదటి ఫలితాలు వస్తాయి. 12.30కు రెండో ఫలితం, 1 గంటకు 3 ఫలితం వెల్లడవుతాయి. సాయంత్ర 5 గంటలకు ముగుస్తాయి. బాంబే పేరుతో నిర్వహించే ఆట రాత్రంతా కొనసాగుతుంది. టికెట్ మీద ఉన్న నంబర్ తగిలితే 10 రూపాయలకు 70 , 100 రూపాయలకు 700 ఇస్తారు. ఈ ఆశతో ఎక్కువ మంది డబ్బులు వెచ్చిస్తున్నారు.అయితే, నెంబర్ తగిలేది కొంతమందికే. పబ్లిక్‌గా రోజువారి వసూళ్లు సింగిల్ నంబర్ ఆటల నిర్వాహకుల నుంచి కానిస్టేబుళ్లు, హోంగార్డులు పబ్లిక్‌గా రోజువారి మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్టు వదిలేస్తున్నరని విమర్శలు వినిపిస్తున్నాయి. రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీనగర్ ఠాగూర్ బొమ్మ సెంటర్, అరండల్‌పేట 7వ లైను, పిచ్చుకల గుంట గోడ పక్కన ఆటలు నిర్వహిస్తున్నారని స్థానికులు వీడియో, ఫోటోలు తీసి రుజువు చూపిస్తున్నారు. ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న హోంగార్డులు, కానిస్టేబుళ్లు ఆ సమయంలో వెళ్లి పబ్లిక్‌గా మామూళ్లు తీసుకుంటుంటారని స్థానికులు విమర్శిస్తున్నారు. -
బెట్టింగ్ గ్యాంగ్ చిక్కింది!
సాక్షి, సిటీబ్యూరో: ఏడాదిగా గుట్టుచప్పుకు కాకుండా బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న ఓ బుకీని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. అతడితో పాటు ఇద్దరు ‘ఉద్యోగులను’ కటకటాల్లోకి పంపినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. వీరి నుంచి రూ.2.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నగరంలోని మంగళ్‌హాట్‌కు చెందిన సుశీల్‌సింగ్ దాదాపు ఏడాది క్రితం బుకీగా మారి క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడ, ఏ మ్యాచ్ జరిగినా ఇతను పరిచయస్తులు, పరిచయస్తులు కాని పంటర్ల నుంచి సెల్‌ఫోన్ ద్వారా పందాలు అంగీకరిస్తూ ఉంటాడు. పందాలు కాసే వారి నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్ చేసుకోవడానికి పతంగుల వ్యాపారం చేసే నరేన్ సింగ్, బెట్టింగ్‌లకు సంబంధించిన పద్దులు రాయడానికి నిరుద్యోగి సందీప్ కుమార్‌లను ఉద్యోగులుగా నియమించుకున్నాడు. సుశీల్ సింగ్ బెట్టింగ్ రేష్యోను నేరుగా ఢిల్లీ నుంచి గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా ఫోన్లో సంగ్రహిస్తాడు. సోమవారం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ నేపథ్యంలో వీరు పందాలు నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీ తమ బృందాలతో దాడి చేశారు. సుశీల్, నరేన్, సందీప్‌లను పట్టుకుని టీవీ, సెట్‌టాప్ బాక్స్ తదితరాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను మంగళ్‌హాట్ పోలీసులకు అప్పగించారు. సుశీల్‌పై గతంలోనూ మంగళ్‌హాట్ ఠాణాలో రెండు బెట్టింగ్ కేసులు నమోదై ఉన్నట్లు డీసీపీ తెలిపారు. -
కొడంగల్ ఫలితంపై జోరుగా బెట్టింగ్
సాక్షి, కొడంగల్: కొడంగల్ అసెంబ్లీ స్థానంపై బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. రేవంత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి అభిమానులతోపాటు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు వేలు, లక్షల్లో బెట్టింగులు కాస్తున్నారు. రేవంత్‌రెడ్డి గెలుస్తారని కొందరు.. లేదు నరేందర్‌రెడ్డి విజయం సాధిస్తారని మరికొందరు పందేలు కాస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు ఎవరూ గెలువలేదు. గతంలో గురునాథ్‌రెడ్డి రెండు పర్యాయాలు గెలిచినా హాట్రిక్ సాధించలేదు. తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం మూడోసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు. మూడోసారి గెలిచి హాట్రిక్ సాధిస్తాననే ధీమాతో రేవంత్ ఉన్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షra, పరోక్ష ఎన్నికల్లో ఇప్పటివరకు ఓడిపోలేదు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఆయన ఓటమి చూడలేదు. కాగా, ప్రస్తుతం కొడంగల్ ఎన్నికలు ఫలితం ఎవరికీ అంతుపట్టడం లేదు. నెలరోజుల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతోపాటు రెండు పార్టీలకు చెందిన అగ్రనేతలు సైతం బరిలోకి దిగి ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేశారు. నరేందర్‌రెడ్డి మంత్రి మహేందర్‌రెడ్డికి స్వయాన సోదరుడు కావడంతో ఆయన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కొడంగల్‌లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని గులాబీ అధిష్టానం కంకణం కట్టుకుంది. ఈక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి సహకారం తీసుకున్నారు. గెలుస్తామనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సైతం ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి సైతం విజయంపై భరోసాతో ఉన్నారు. ఈనెల 11న ఫలితం వెలువడనుంది. ఈనేపథ్యంలో కొడంగల్ ఫలితంపై నేతలు బెట్టింగ్ కాస్తున్నారు. -
11మంది క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
ఆదోని: ఓపక్క అరెస్టులు జరుగుతున్నాక్రికెట్ బెట్టింగ్‌లు ఆగడంలేదు. ఇదే క్రమంలో కర్నూలు జిల్లా ఆదోనిలోనూ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు సోమవారం రట్టు చేశారు. 11మందిని అరెస్టు చేశారు. వారినుంచి రూ.3.65 లక్షల నగదును, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
బెట్టింగ్ ముఠా అరెస్ట్
నెల్లూరు: ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 11 మంది బుకీలను గురువారం అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ. 9.45 లక్షల నగదుతో పాటు 42 సెల్ఫోన్లు, ఓ టీవీ స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసుల అదుపులో బెట్టింగ్ ముఠా
హైదరాబాద్: ఆసియాకప్ ఫైనల్ సందర్భంగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ముఠాను ఆదివారం పోలీసులు అదుపులో తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ముఠా నుంచి పెద్ద ఎత్తున డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకన్న డబ్బు కోట్లలో ఉన్నట్లు సమాచారం. నగరంలోని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు భారి ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్‌కు పాల్పడుతున్న బూకీలను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. -
పేకాట రాయుళ్ల అరెస్టు.. విడుదల
హైదరాబాద్: పేకాట ఆడుతున్న ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 45,137, ఒక కారు, మూడు బైక్‌లు, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికార పార్టీ నేతలు వారిని విడిపించుకెళ్లారు. సీఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. గాజులరామారం దేవేందర్‌నగర్ సమీపంలో ఉన్న ఓ క్వారీ షెడ్డులో కొంత కాలంగా పోతారం దుర్గయ్య అనే వ్యక్తి పేకాట స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. మంగళవారం రాత్రి ఎస్ఐ లింగ్యానాయక్ సిబ్బందితో కలసి పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ క్రమంలో గాజులరామారం గ్రామానికి చెందిన దుర్గయ్య(50), రాజు (45), శ్రీనివాస్‌రావు (41), మోహన్‌రెడ్డి (41), కూకట్‌పల్లికి చెందిన మురుగేశ్ (55), షాపూర్‌నగర్‌కు చెందిన రాములు (45), రావి నారాయణరెడ్డి నగర్‌కు చెందిన గోవింద్ (45) అనే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.45,137, ఒక కారు, మూడు బైక్‌లు, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోతారం దుర్గయ్య పై గతంలో పలు ఫిర్యాదులు వచ్చాయని, ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్న అతడిని ఎట్టకేలకు పట్టుకున్నామని సీఐ తెలిపారు. అధికార నేతల హడావుడి.. పేకాట రాయుళ్ల అరెస్టుపై టీఆర్ఎస్ నేతలు, ఓ మాజీ కార్పొరేటర్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం హడావుడి చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధాహ్నం 12 గంటల వరకు స్టేషన్లోనే ఉండి దర్జాగా తమ వారిని బెయిల్ పేరిట తీసుకెళ్లారు. (జీడిమెట్ల) -
బెట్టింగ్‌లే... బెట్టింగ్‌లు
సాక్షి, గుంటూరు :బెట్టింగ్... ఒకప్పుడు ఐపీఎల్, టెస్ట్‌మ్యాచ్‌లు, వన్డే మ్యాచ్‌ల సందర్బంలో వినిపించే పదం. ఇప్పుడు ఎన్నికల ఫలితాలపైనా బెట్టింగ్ జోరందుకుంది. ఈ ఏడాది మార్చినెల నుంచి మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికలు వరుసగా జరగడం, మే 12, 13, 16 తేదీల్లో వీటి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరికెన్ని సీట్లు వస్తాయి అనేఅంశాలపై భారీ ఎత్తున పందేలు కాశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 200 కోట్లకు పైగా పందేలు జరిగాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రంగంలోకి దిగిన బుకీలు ఈ పందేలు పకడ్బందీగా నిర్వహించేందుకు కొందరు బుకీలు రంగంలోకి దిగారు. పందాలు కాసిన ఇరుపార్టీలనుంచి నగదు ఓ మధ్యవర్తిదగ్గర ఉంచేలా ఒప్పందాలు చేసుకున్నారు. అందులో ఎవరు గెలిస్తే మధ్యవర్తి ఆ మొత్తాన్ని వారికిచ్చేయాలన్నమాట. కోట్ల రూపాయల్లో పందాలు కాసినవారు అంత మొత్తం దాచలేక స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను షూరిటీ పెట్టే ఏర్పాటు చేశారు. గెలిచినవారికి నిర్థిష్ట గడువులోగా డబ్బు చెల్లించకుంటే ఓడినవారి ఆస్తులు స్వాధీనం చేసుకునేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ మేరకు అగ్రిమెంటు పత్రాలు రాసుకున్నారు. సోమవారం రాత్రి గుంటూరు నగరంలోని ఓ లాడ్జిలో భారీ మొత్తంలో పందెం డబ్బు చేతులు మారుతున్న విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు కొందరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తి దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం రూ. 7 లక్షలు మాత్రమే నగదు దొరకిందని వారు తెలిపినప్పటికీ దాడుల సమయంలో లాడ్జి కింద ఉన్న ఇన్నోవా వాహనంలో కోట్ల రూపాయల డబ్బుతో మధ్యవర్తి ఒకరు ఉన్నట్లు సమాచారం. పోలీసులు రావడాన్ని గమనించిన ఆయన ఆ కారులోనే ఉడాయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ డబ్బు, స్థిరాస్తి దస్తావేజులు టీడీపీకి చెందిన నాయకులది కావడంతో ప్రమాణ స్వీకారాలు చేయకముందే పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసును నీరుగార్చారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థిరాస్తి దస్తావేజులను పక్కకు తప్పించి కేవలం లక్షల్లో మాత్రమే వారిని చూపిస్తున్నట్లు చెబుతున్నారు. మామూలుగానే వ్యవహరించిన పోలీసులు బాహాటంగానే ఈ వ్యవహారాలు జిల్లా వ్యాప్తంగా సాగుతున్నా పోలీసులు వాటిని షరా మామూలుగానే చూసీచూడనట్టు వదిలేశారు. గెస్ట్‌హౌస్‌లు, లాడ్జీల్లో ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు సహాయంతో ఢిల్లీ, ముంబాయి వంటి నగరాల్లో ఉన్న బుకీలతో ఆన్లైన్ ద్వారా పందేలు కాస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. కొందరు మాత్రం ఊబిలో దిగి అప్పుల పాలై రోడ్డున పడుతున్నారు. కొందరైతే అప్పు తీర్చలేక , వారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ లీగ్ స్థాయి నుంచి సెమీఫైనల్స్‌కు చేరనుండటంతో పందేల జోరు మరింత పెరిగింది. ఇప్పటికైనా పోలీసు అధికారులు బెట్టింగ్ రాయుళ్ళపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.