GOLD TRADING
-
అధిక లాభాలు ఆశ .. గోల్డ్ ట్రేడింగ్‌లో మోసపోయిన 500మంది బాధితులు
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరిట సుమారు 500 మంది మోసపోయినట్లు తెలుస్తోంది. హబ్సిగూడా కేంద్రంగా నిందితుడు రాజేష్ ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో కార్యకాలపాల్ని ప్రారంభించాడు. ఈ కార్యాలయంలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఐదు నెలల్లో రెట్టింపు చేస్తానంటూ ప్రచారం చేశాడు. ఆ ప్రచారాన్ని నమ్మిన సుమారు 500 మంది నుంచి ఒక్కొక్కరు రూ.5 లక్షల నుంచి రూ.కోటిరూపాయల వరకు వసూలు చేశాడు. ఆపై వారిని నమ్మించేందుకు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్లో 2 శాతం లాభాల్ని వారానికి ఒకసారి చెల్లిస్తామని హామీ ఇచ్చాడు. చెప్పినట్లుగా రెండు నెలల పాటు వారం వారం కొంత మొత్తంలో చెల్లించాడు.దీంతో ప్రహణేశ్వరి ట్రేడర్ పేరు మారుమ్రోగింది. హబ్బిగూడ పరిసర ప్రాంతాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. వందల కోట్లు వచ్చిపడ్డాయి. అదును చూసిన రాజేష్ బిచానా ఎత్తేశాడు. రాజేష్ తీరుపై అనుమానం రావడంతో పెట్టుబడి దారులు తాము మోసపోయామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్ సీసీఎస్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడు రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఆన్లైన్ గోల్డ్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ ఇస్తామంటూ డబ్బులు కాజేస్తున్న ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిలో ఇద్దరిని ముంబయిలో అరెస్ట్ చేసి పిటి వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. పెట్టుబడి పెడితే ఎక్కువ కమిషన్ వస్తుందంటూ ముఠా మోసాలకు పాల్పడుతోంది. వారి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రెండు లాప్ ట్యాప్‌లు, నాలుగు చెక్ బుక్‌లు, 13 సిమ్ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 417,419,420, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: ‘జోతిష్యుడి’ కథ అడ్డం తిరిగింది! అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ -
రికార్డు స్థాయి నుంచి కిందకు దిగిన పసిడి
న్యూఢిల్లీ: పసిడి ధరలు రికార్డుస్థాయి నుంచి గురువారం కిందకు దిగాయి. ఢిల్లీ స్పాట్ బులియన్ మార్కెట్లో పూర్తి స్వచ్ఛత, ఆభరణాల బంగారం ధర బుధవారం రికార్డు ధరతో పోల్చితే, రూ.1,575 తగ్గింది. దీనితో ఈ ధరలు వరుసగా రూ.32,325, రూ.32,125కు దిగివచ్చాయి. ఇక వెండి విషయానికి వస్తే, రూ.2,790 పడి, రూ.55,710కి చేరింది. డాలర్ మారకంలో రూపాయి విలువ గణనీయస్థాయిలో బలోపేతం కావడం, ఫ్యూచర్స్ మార్కెట్లలో బుధవారం పసిడి, వెండి ధరలు దాదాపు స్థిర స్థాయిలో ముగియడం దీనికి కారణం. అధిక ధరలు, ఆయా ఒడిదుడుకుల పరిస్థితుల వద్ద ఆభరణాల కొనుగోళ్లకు వినియోగదారుల నుంచి మద్దతు కొరవడం కూడా ట్రేడింగ్ బలహీనతకు కారణం. కాగా కడపటి సమాచారం అందేసరికి నెమైక్స్ కమోడిటీ డివిజన్లో ఔన్స్(31.1గ్రా) ధర స్వల్ప నష్టాల్లో 1,405 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో కూడా ఇదే ధోరణిలో రూ.250 నష్టంలో రూ. 33,120 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. ఇదిలావుండగా, దేశంలో ప్రధాన స్పాట్ ముంబై బులియన్ మార్కెట్ గురువారం కృష్ణాష్టమి సందర్భంగా పనిచేయలేదు. ఇతర పలు బులియన్ మార్కెట్లలో సైతం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.