DCCB bank
-
రైతు భూమి వేలానికి దండోరా
మదనాపురం: రైతు తీసుకున్న రుణాన్ని పూర్తిస్థాయిలో చెల్లించలేదని ఆత్మకూర్ డీసీసీబీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా గ్రామంలో డప్పు మోగిస్తూ.. సదరు రైతు భూమిని వేలం వేస్తామంటూ దండోరా వేశారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన రైతు లచ్చాగౌడ్ 2019లో గేదెల పెంపకం కోసం ఆత్మకూర్ డీసీసీబీలో తన రెండెకరాల పొలాన్ని కుదువపెట్టి రూ. 3.50 లక్షల అప్పు తీసుకున్నారు. దాదాపుగా రూ. 5 లక్షలకు పైగా బ్యాంక్‌కు చెల్లించినా అప్పు తీరలేదు. ఇంకా రూ.1.75 లక్షల బకాయి ఉందని.. బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతు లచ్చాగౌడ్ భూమిని వేలం వేస్తామంటూ మంగళవారం గ్రామంలోని ప్రధాన వీధుల్లో డప్పు మోగిస్తూ.. మైక్‌లో చాటింపు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో కట్టలేదు.. నేను అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు రూ. లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. పంటలు సరిగ్గా పండక పెట్టుబడులు మీద పడి నష్టం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల రూ. 1.75 లక్షల రుణం కట్టలేదు. నాకు రుణమాఫీ కూడా వర్తించలేదు. భూమి వేలం వేస్తామంటూ గ్రామంలో దండోరా వేయడం చాలా బాధగా ఉంది. – లచ్చాగౌడ్, రైతు, మదనాపురం -
వాణిజ్య బ్యాంక్‌లతో పోటీగా డిసీసీబీ.. రూ.1,500 కోట్ల చేరువలో..
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జాతీయ వాణిజ్య బ్యాంక్‌లతో పోటీ పడుతోంది. రైతుల బ్యాంక్‌గా అవతరించిన డీసీసీబీ రైతులతో పాటు ప్రజలకు బ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సాంకేతికపరంగా అభివృద్ధి దిశగా అడుగులు వేసింది. జిల్లా వ్యాప్తంగా జిల్లాలో 20 బ్రాంచ్‌లు కలిగి 177 మంది సిబ్బందితో లక్షలాది మంది రైతులు, ప్రజలకు విస్తృత సేవలు అందిస్తోంది. నెల్లూరు (వీఆర్సీసెంటర్): వందేళ్ల చరిత్ర కలిగిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) నేడు నూతన సాంకేతికతను వినియోగించుకుని జిల్లా రైతులకు, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు శ్రీకారం చుట్టింది. మారుతున్న సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకుని దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్‌ల్లో ఒకటిగా డీసీసీబీ రైతులకు, ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఐడీఏ సాంకేతికతను వినియోగించుకుంటున్న డీసీసీబీ తాజాగా టీసీఎస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకుంటూ మెరుగైన, త్వరితగతిన సేవలు అందిస్తోంది. ఈ నూతన సాఫ్ట్‌వేర్‌తో బ్యాంకు ఖాతాదారులు మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించుకునే అవకాశం కూడా ఏర్పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయూత కరోనా విపత్కర సమయంలో డీసీసీబీ ఆశించిన స్థాయిలో సేవలు అందించలేకపోవడంతో బ్యాంక్ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.33 కోట్లు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.40 కోట్లు మెత్తం రూ.77 కోట్లు షేర్ క్యాపిటల్ అందించడంతో బ్యాంక్ ఆర్థికంగా నిలదొక్కుకుంది. రెండేళ్లలో రూ.వెయ్యి కోట్ల లావాదేవీలను అధిగమించి రూ.1,485 కోట్ల మేర వ్యాపార లావాదేవీల స్థాయికి పెరిగింది. బ్యాంకు పురోగతి 2021–22లో డీసీసీబీ రూ.13.68 కోట్లు ఆదాయాన్ని గడించి అద్వితీయమైన పురోగతి సాధించింది. రూ.80 కోట్ల డిపాజిట్లు సేకరించడంతో మొత్తం రూ.397 కోట్లకు చేరింది. రూ.224 కోట్ల మేర రుణాలు అందించింది. మొత్తంగా రూ.1,485 కోట్ల లావాదేవీలకు పెరిగింది. జిల్లా లో డీసీసీబీ నూతనంగా 6 ఏటీఎం సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, ఒక నూతన మొబైల్ ఏటీఎం వాహనాన్ని ఏర్పాటు చేసింది. రైతులకు బంగారు రుణాలు ఇచ్చేందుకు జిల్లాలోని కొత్తపాళెం, ఊసుగుంటపాళెం, ఆల్తూరుపాడు, లింగసముద్రం, పడుగుపాడు, తోటపల్లిగూడూరు సహకార సంఘాలకు స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేస్తోంది. చదవండి: (అజీజ్ భాయ్ ఏ క్యా హై!) బ్యాంకు ద్వారా రుణాలు డీసీసీబీ ద్వారా జిల్లాలోని రైతాంగానికి, ఖాతా దారులకు వ్యక్తిగత రుణాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3.72 కోట్లు అందించింది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టుకుని రూ.కోటి రుణాలు అందించింది. రూ.2.30 కోట్లు హౌసింగ్, రూ.5.50 కోట్లు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, రూ.19 కోట్లు 182 స్వయం సహాయక గ్రూపులకు రుణాల రూపంలో అందజేసింది. 134 సమష్టి భాగస్వామ్య బృందాలకు రూ.3 కోట్లు, వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు రూ.6.50 కోట్లు అందిచడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పీఎం స్వానిధి, జగనన్న తోడు పథకాల ద్వారా అర్హులైన వారికి రూ.10 కోట్లు రుణాలు అందిస్తోంది. సీఎం సహకారంతో అభివృద్ధి డీసీసీబీ అభివృద్ధికి రెండేళ్లుగా షేర్ క్యాపిటల్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.77 కోట్లు ఆర్థిక సాయం అందించారు. ఆయన అందించిన సహాయంతో ఈ బ్యాంకు ఆర్థికంగా నిలదొక్కుకుంది. రానున్న కాలంలో బ్యాంకు మరింత అభివృద్ధి పథంలో పయనిచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, శాసనసభ్యులు, జిల్లా అధికారుల సూచనలతో రాష్ట్రంలో నెల్లూరు డీసీసీబీని అగ్రగామిగా నిలిచేలా కృషి చేస్తా. – కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, డీసీసీబీ చైర్మన్ మెరుగైన సేవలు అందిస్తాం డీసీసీబీలో నూతనంగా ఏర్పాటు చేసిన టీసీఎస్ సాఫ్ట్వేర్ ద్వారా రైతులకు, ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు వీలు పడింది. ఎస్ఓడీ రుణాలతో పాటు తక్కువ వడ్డీకే గృహ రుణాలు, ఎస్టీ లోన్లను విరివిగా ఇస్తున్నాం. రైతులకు స్వల్పకాలిక, దీర్ఘాకాలిక రుణాలను అందిస్తూ , జిల్లాలో రైతుల మన్ననలను పొందుతోంది – డాక్టర్ శంకర్‌బాబు, సీఈఓ -
ఏపీలో డీసీసీబీ ఉద్యోగాలు.. జిల్లాల వారీగా వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ది డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్(డీసీసీబీ) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయనుంది. డీసీసీబీ బ్యాంక్, కడపలో 75 క్లర్క్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాలో ది కడప డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్.. క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 75 ► అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌పై అవగాహనతోపాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ► వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఆన్లైన్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021 ► వెబ్సైట్: www.kadapadccb.in డీసీసీబీ బ్యాంక్, కర్నూలులో 17 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలో ది డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్(డీసీసీబీ).. క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 17 ► పోస్టుల వివరాలు: స్టాఫ్ అసిస్టెంట్లు/క్లర్క్‌లు–09, అసిస్టెంట్ మేనేజర్లు–08. ► స్టాఫ్ అసిస్టెంట్లు/క్లర్క్‌లు: అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్ నాలెడ్జ్ తోపాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► అసిస్టెంట్ మేనేజర్లు: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/కామర్స్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఎకనమిక్స్/స్టాటిస్టిక్స్/తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.10.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఆన్లైన్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు ఉంటుంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021 ► వెబ్సైట్: kurnooldccb. com డీసీసీబీ బ్యాంక్, నెల్లూరులో 65 పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలో ది నెల్లూరు డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్(ఏడీసీసీబీ).. ఉద్యోగాల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 65 ► పోస్టుల వివరాలు: స్టాఫ్ అసిస్టెంట్లు/క్లర్క్‌లు–42, అసిస్టెంట్ మేనేజర్లు–23. ► స్టాఫ్ అసిస్టెంట్లు/క్లర్క్‌లు: అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్ నాలెడ్జ్‌తో పాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► అసిస్టెంట్ మేనేజర్లు: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/కామర్స్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఎకనమిక్స్/స్టాటిస్టిక్స్/తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.10.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఆన్లైన్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021 ► వెబ్సైట్: nelloredccb. com -
బంగారు నగలు తాకట్టు పెడితే నకిలీవి ఇచ్చారు
సాక్షి, కర్నూల్: పట్ణంలోని డీసీసీబీ బ్రాంచ్‌లో బంగారు ఆభరణాలు తాకట్టు పెడితే నకిలీవి తిరిగి ఇచ్చారని ఓ ఖాతాదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక అంబేడ్కర్ నగర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ 2017లో 35.81 తులాల బంగారు ఆభరణాలు డీసీసీబీ బ్రాంచ్‌లో తాకట్టు పెట్టి రూ.4,98,600 రుణం పొందాడు. 2019 డిసెంబర్లో రెన్యూవల్ చేసుకోగా.. రుణం, వడ్డీ కలిపి మొత్తం రూ. 6,02,436 గురువారం మధ్యాహ్నం చెల్లించి బంగారు ఆభరణాలు విడిపించాడు. కాగా గంట తర్వాత మళ్లీ బ్యాంక్‌కు చేరుకుని బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన నగలు నకిలీవని, తనకు బంగారు నగలు ఇవ్వాలని చెప్పాడు. అయితే బ్యాంక్‌లోనే సరిచూసుకుని అడిగితే తమకు సంబంధమని, బయటకు వెళ్లి వస్తే తమది బాధ్యత కాదని మేనేజర్ మహబూబ్ చెబుతున్నాడు. అంతా సరిగా ఉన్నట్లు బ్యాంక్ రికార్డులో ప్రమోద్ కుమార్ సంతకం చేశాడని, సాక్ష్యంగా సీసీ ఫుటేజ్‌లు కూడా ఉన్నట్లు మేనేజర్ చెబుతున్నాడు. ఈ విషయంపై బాధితుడు, బ్యాంక్ మేనేజర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఇద్దరి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: అమ్మా.. నీవు లేని లోకంలో నేనుండలేను.. -
ఖమ్మం డీసీసీబీ బ్యాంకులో బయటపడ్డ భారీ అవకతవకలు
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా డిసీసీబీ బ్యాంక్‌లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. గత పాలక మండలి హయాంలో 10 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం అయినట్లు ప్రస్తుత బ్యాంక్ సీఈవో గుర్తించారు. సీఈవో అట్లూరి వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ చైర్మన్‌తో పాటు 20 మంది డైరెక్టర్లపై 403, 406, 409, 420 సెక్షన్ల కింద ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత పాలక మండలి హయాంలో జరిగిన అవకతవకలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టనున్నారు. చదవండి: ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య హైదరాబాద్: రోడ్డు పైకి వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త! -
డీసీసీబీ: అతివకేదీ సహకారం..?
సాక్షి, అచ్చంపేట: ఆకాశంలో సగం.. అంతటా మేం.. అంటూ అన్నిరంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్నిరకాల ఎన్నికల్లో కాస్తో.. కూస్తో ప్రాధాన్యం లభిస్తోంది. కానీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో మాత్రం అతివలకు ప్రాతినిథ్యం లేకుండా పోతోంది. సంఘాల్లో డైరెక్టర్ల పదవులు మహిళలకు కేటాయిస్తున్నా.. కీలకమైన సొసైటీలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులు మాత్రం అందని ద్రాక్షగానే మారాయి. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 87 సంఘాల్లో ఇద్దరు మాత్రమే పీఏసీఎస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. ఇక్కడప్రాధాన్యం కరువు ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు పంచాయతీలు, ప్రాదేశిక ఎన్నికల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులతోపాటు ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ పదవుల్లో సైతం సగం కేటాయించింది. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కూడా రొటేషన్ పద్ధతిలో మహిళలకు, ఇతర వర్గాలకు అవకాశాలు కలి్పంచింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం మారుతున్న విధానాలకు అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకువచ్చి ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇక్కడ మాత్రం 1964లో ఏర్పాటైన సహకార చట్టం ఆధారంగానే రిజర్వేషన్లు, ఇతర మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు. ప్రతి సంఘంలో 13 వార్డులుండగా ఇందులో రెండు మాత్రమే మహిళలకు రిజర్వు చేశారు. అంటే 15 శాతానికి మాత్రమే పరిమితమైంది. ఉన్న ఒకస్థానం తొలగించారు డీసీసీబీలో ‘ఎ’ కేటగిరి సంఘాల నుంచి 16 మంది, ‘బి’ కేటగిరి సంఘాల నుంచి నలుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. గతంలో మొత్తం 21 మంది పాలకవర్గ సభ్యులు ఉండగా ఈసారి ఒక డైరెక్టర్‌ను తగ్గించారు. గత ఎన్నికల్లో ఎస్సీ (మహిళ)కు ఒక డైరెక్టర్ స్థానం రిజర్వు చేయగా.. ఈసారి దాన్ని తొలగించారు. సభ్యత్వంలోనూ చిన్నచూపే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మంది మహిళలకు పట్టా భూములున్నాయి. ఐకేపీ ఆధ్వర్యంలోనైతే ఏకంగా మహిళలే ధాన్యం కొనుగోలు చేసి తమ సత్తా చాటుతున్నారు. వ్యవసాయంలోనూ కీలకంగా ఉన్న వీరిని కనీసం సభ్యత్వం విషయంలో పట్టించుకోవడం లేదు. సాధారణ ఓటర్ల విషయానికి వస్తే పలుచోట్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండి ఎన్నికల్లో గెలుపోటములు వారి చేతిలోనే ఉంటున్నాయి. ఇక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఆయా సంఘాల్లో కనీసం పదిశాతం కూడా దాటడం లేదు. దీంతో వీరి ప్రభావం కనిపించడం లేదు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 67,149 మంది పురుఘలు, 24,272 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన సంఘాల చైర్మన్లు ఎన్నుకోలేదు. మేకగూడ పీఏసీఎస్ నుంచి కంకటి మంజులారెడ్డి, ధరూర్ నుంచి కుర్వ మహదేవమ్మ ఇద్దరు మాత్రమే చైర్మన్లుగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కొంత వరకు నయంగా ఉండేది. అప్పుడు ఉమ్మడి జిల్లాలో నలుగురు మహిళా చైర్మన్లు ఎన్నికయ్యారు. స్థానం కల్పించలే.. వార్డు సభ్యులంతా కలిసి సహకార సంఘం చైర్మన్‌ని ఎన్నుకుంటారు. చైర్మన్ స్థానాలకు ఎలాంటి రిజర్వేషన్ లేకపోవడం.. మహిళలు పోను మిగిలిన 11 మంది దాదాపు పురుషులే ఉండటంతో చైర్మన్‌గా ఆమెకు అవకాశం రావడం లేదు. జిల్లా స్థాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్)లలో సొసైటీ చైర్మన్లు సభ్యులు కావడంతో ఇందులో ఒక్క మహిళకు అవకాశం దక్కడం లేదు. ఇందులో కూడా డైరెక్టర్లకు రిజర్వేషన్ వ్యవస్థ ఉన్నప్పటికీ మహిళలకు స్థానం కల్పించలేదు. సభ్యులో ఒకరు చైర్మన్, వైస్ చైర్మన్‌గా ఎన్నుకోనుండటంతో ఇక్కడ కూడా వీరికి ప్రాధాన్యం ఉండటం లేదు. -
అన్ని ఏకగ్రీవాలే..
సాక్షి, కరీంనగర్ : సహకార ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లుగా టీఆర్ఎస్కు చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులు, ప్రాథమికేతర సహకార సంఘాల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి మనోజ్‌కుమార్ ఎన్నికైన సభ్యుల జాబితాను ప్రకటించారు. ఎన్నికైన డైరెక్టర్లు ఈ నెల 29న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్‌తోపాటు మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకొంటారు. కాగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా సిట్టింగ్ టెస్కాబ్ చైర్మన్, సిరిసిల్ల జిల్లాకు చెందిన కొండూరి రవీందర్రావును ఎంపిక చేశారు. వైస్ చైర్మన్‌గా జమ్మికుంట మండలం విలాసాగర్‌కు చెందిన పింగిళి రమేష్‌కు అవకాశం దక్కింది. వీరిద్దరిని 29న డీసీఎంఎస్ కార్యాలయంలో జరిగే సమావేశంలో డీసీసీబీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్లుగా అధికారికంగా ఎన్నుకుంటారు. డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఎవరనేది తేలకపోయినా, ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ముదుగంటి సురేందర్‌రెడ్డి, వీర్ల వెంకటేశ్వర్రావులలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. అత్యధిక సొసైటీలు ఉన్న జగిత్యాల జిల్లాకు అవకాశం కల్పించాలని భావిస్తే ధర్మపురి సొసైటీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, లేని పక్షంలో మిగతా ఇద్దరిలో ఒకరు డీసీఎంఎస్ చైర్మన్ కానున్నట్లు సమాచారం. మంత్రి గంగుల నేతృత్వంలో ప్రక్రియ డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లుగా గ్రూప్–ఏ కింద టీఆర్ఎస్కు చెందిన పలువురు పీఏసీఎస్ అధ్యక్షులు పోటీపడ్డారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలనే పాటించారు. మంగళవారం ఉదయం కరీంనగర్‌లోని శ్రీనివాస హోటల్లో పీఏసీఎస్ అధ్యక్షులతోపాటు ప్రాథమికేతర సొసైటీల అధ్యక్షులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమావేశం అయ్యారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పింగళి రమేష్‌లను చైర్మన్, వైస్ చైర్మన్‌గా పార్టీ ఎంపిక చేసిన విషయాన్ని ప్రకటించిన మంత్రి డైరెక్టర్లుగా పార్టీ ఎంపిక చేసిన వారి పేర్లను ప్రకటించి, వారితో నామినేషన్లు దాఖలు చేయించారు. గ్రూప్–ఏలో 16 మంది నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, 13 మంది మాత్రమే నామినేషన్ వేశారు. గ్రూప్–బీ నుంచి ప్రాథమికేతర సంఘాల సభ్యులుగా నలుగురికి అవకాశం ఉన్నప్పటికీ, ఇద్దరే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నామినేషన్లు దాఖలు చేసిన 15 మందిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మనోజ్‌కుమార్ ప్రకటించారు. మరో ఐదుగురు డైరెక్టర్లను రిజర్వులో పెట్టినట్లు సమాచారం. డీసీఎంఎస్ డైరెక్టర్లుగా గ్రూప్–ఏ నుంచి ఐదుగురు సభ్యులు, గ్రూప్–బీ నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రూప్ ఏలో ఎస్టీ, గ్రూప్–బీలో ఎస్సీలకు చెందిన రెండు డైరెక్టర్లు ఖాళీగా ఉన్నారు. అన్ని జిల్లాలకు అవకాశం డీసీసీబీ చైర్మన్‌గా గజసింగవరం సొసైటీ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఎన్నికవుతారని మొదటి నుంచి ఊహించిందే. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా నుంచి ఆయనకు అవకాశం లభించింది. వైస్ చైర్మన్‌గా మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గానికి అవకాశవిుచ్చారు. డైరెక్టర్లుగా పెద్దపల్లి జిల్లా నుంచి సుల్తానాబాద్ సింగిల్‌విండ్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ముత్తారం మండలం సర్కారం చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డికి అవకాశం కల్పించారు. వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఎల్కతుర్తి సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్‌కు, రాజన్న సిరిసిల్ల నుంచి కొండూరితోపాటు భూపతి సురేందర్, జలగం కిషన్‌రావు, పి.మోహన్‌రెడ్డిలకు అవకాశం లభించింది. కరీంనగర్ నుంచి పింగిళి రమేష్ వైస్ చైర్మన్‌గా, సింగిరెడ్డి స్వామిరెడ్డి డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. జగిత్యాల జిల్లా నుంచి రమేష్‌రెడ్డి, సురేష్‌రెడ్డిలు ఎన్నికయ్యారు. డీసీసీబీకి ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లు ... కొండూరి రవీందర్రావు, గుజ్జుల రాజిరెడ్డి, జలగం కిషన్‌రావు, తక్కల్ల సురేష్‌రెడ్డి, దేవరవేని మోహన్‌రావు, పింగిళి రమేష్, మిట్టపల్లి రమేష్‌రెడ్డి, ముప్పాల రాంచందర్ రావు, పుచ్చిడి మోహన్‌రెడ్డి, సింగిరెడ్డి స్వామిరెడ్డి, భూపతి సురేందర్(ఎస్సీ), శ్రీగిరి శ్రీనివాస్(బీసీ), శ్రీపతి రవీందర్‌గౌడ్(బీసీ), పోరండ్ల కృష్ణప్రసాద్, వీరబత్తిని కమలాకర్. డీసీఎంఎస్ డైరెక్టర్లు : అలువాలు కోటయ్య(ఎస్సీ), వీర్ల వెంకటేశ్వర్రావు (బీసీ), ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఎలిశెట్టి భూమారెడ్డి, ముదుగంటి సురేందర్‌రెడ్డి, మహ్మద్ ఫక్రుద్దీన్(బీసీ), గాజుల నారాయణ, ఎ.గోవర్థన్‌రెడ్డి. కేడీసీసీబీ డైరెక్టర్లు వీరే.. పింగిళి రమేష్ ముప్పాల రాంచందర్‌రావు మిట్టపల్లి రమేష్‌రెడ్డి భూపతి సురేందర్ శ్రీగిరి శ్రీనివాస్ దేవరనేని మోహన్‌రావు జలగం కిషన్‌రావు శ్రీపతి రవీందర్‌గౌడ్ తక్కళ్ల నరేష్‌రెడ్డి వీరబత్తిని కమలాకర్ వుచ్చిడి మోహన్‌రెడ్డి సింగిరెడ్డి స్వామిరెడ్డి గుజ్జుల రాజిరెడ్డి -
జిల్లాలో ఎన్నికలు..టీఆర్ఎస్ పార్టీలో ఉత్కంఠ
సాక్షి, ఖమ్మం : డీసీసీబీ అధ్యక్ష పదవి ఎవరినీ వరిస్తుందనే అంశం అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉత్కంఠ రేపుతుండగా.. డీసీసీబీ, డీసీఎంఎస్ పాలక వర్గాల ఎన్నికకు ఈనెల 20వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నది. ఎన్నికల ప్రక్రియను ఈనెల 21వ తేదీన ప్రారంభించి.. 29వ తేదీ వరకు ముగించాలని సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయించింది. 28వ తేదీన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) డైరెక్టర్ల ఎన్నిక, 29వ తేదీన అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య జిల్లా సహకార శాఖ అధికారులు, డీసీసీబీ ఈఓలతో సమావేశమయ్యారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌లలో ఓటర్లుగా ఎవరెవరు అర్హులో గుర్తిస్తూ.. తక్షణమే ఓటర్ల జాబితా ఇవ్వాలని.. ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులతోపాటు వ్యవసాయేతర సహకార సంఘాలు ఎన్ని ఉన్నాయి.. వాటిలో డీసీసీబీ, డీసీఎంఎస్‌లో ఓటు కలిగి ఉండే అర్హత ఉన్న సంఘాలు ఎన్ని అనే అంశంపై రాష్ట్ర సహకార శాఖ జిల్లా అధికారులను ఓటర్ల జాబితాతో సహా నివేదిక కోరింది. ఈనెల 18వ తేదీ సాయంత్రం సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య మరోసారి జిల్లా సహకార శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. 21 డీసీసీబీ డైరెక్టర్ పదవులకు అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. డైరెక్టర్‌గా ఎన్నికైన వారి నుంచి డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు.. అలాగే డీసీఎంఎస్ డైరెక్టర్లుగా ఎన్నికైన వారి నుంచి డీసీఎంఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 101 పీఏసీఎస్‌లు ఉండగా.. అన్నింటికీ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో రెండు ములుగు జిల్లాలో.. రెండు మహబూబాబాద్ జిల్లాలో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో 76 సహకార సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల అధ్యక్షులు డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లను ఎన్నుకుంటారు. డీసీసీబీలో 16 మంది డైరెక్టర్లను సహకార సంఘాల అధ్యక్షులు, ఐదుగురు డైరెక్టర్లను 192 వ్యవసాయేతర సహకార సంఘాల అధ్యక్షులు ఎన్నుకుంటారు. డీసీఎంఎస్‌కు 13 మంది డైరెక్టర్లు ఉంటారు.. ముగ్గురు వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. 10 మంది డైరెక్టర్లు ఉంటారు. అందులో 6 సహకార సంఘాల నుంచి ఎన్నుకోబడతారు. నలుగురు వ్యవసాయేతర సహకార సంఘాల నుంచి ఎన్నుకోబడతారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఖమ్మం జిల్లా సహకార శాఖ అధికారి రాజేశ్వర శాస్త్రి, డీసీసీబీ సీఈఓ వసంతరావు, డీసీఎంఎస్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్ష పదవులకు హోరాహోరీ అధ్యక్ష పదవులకు హోరాహోరీ పోటీ నెలకొంది. ఇప్పటికే పీఏసీఎస్ అధ్యక్షులుగా ఎంపికైన వారిలో అనేక మంది ఈ పదవిని ఆశిస్తుండగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఏ ప్రాతిపదికన.. ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీకి చెందిన నేతలు, మాజీ డీసీసీబీ అధ్యక్షుడు మువ్వా విజయ్‌బాబు, తుళ్లూరు బ్రహ్మయ్య, రాయల శేషగిరిరావు, బీసీలకు అవకాశం ఇచ్చిన పక్షంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పలువురు నేతలు డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం సహకార సంఘ అధ్యక్షులు కూరాకుల నాగభూషణం, పాల్వంచ సహకార సంఘం అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, వైరా సహకార సంఘం అధ్యక్షులు బొర్రా రాజశేఖర్ తదితరులు ఈ పదవికి పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక డీసీఎంఎస్ చైర్మన్ పదవికి సైతం ఇదే స్థాయిలో పోటీ నెలకొంది. డీసీసీబీ అధ్యక్ష పదవి దక్కకపోయినా డీసీఎంఎస్ పదవి వరిస్తుందనే ఆశతో కొందరు నాయకులు ఉన్నారు. -
వరంగల్ డీసీసీబీ అక్రమాలపై సీబీ సీఐడీ విచారణ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో జరిగిన అవకతవకలు, అధికార దుర్విని యోగంపై సీబీ సీఐడీ విచారణకు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు డీజీపీ (సీఐడీ) ఈ కేసు విచారించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరంగల్ డీసీసీబీలో బంగారం తాకట్టు లేకుండానే రుణాలు ఇవ్వడంతో పాటు నిధులు దుర్వినియోగమైనట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017లో వరంగల్ డీసీసీబీలో అక్రమాలు జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యేలు సీఎంకు ఫిర్యాదు చేయడంతో సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్ విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదికను సమర్పిం చారు. అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని, దాదాపు రూ.9 కోట్ల వరకు నిధులు దుర్వినియోగమైనట్లు పేర్కొన్నారు. ఇందులో రూ.7 కోట్లు బ్యాంకు క్యాష్‌ను అక్రమంగా వాడినట్లు తెలిసిం ది. ఈ నేపథ్యంలో డీసీసీబీ పాలకవర్గాన్ని రద్దు చేయాలని నివేదికలో సూచించారు. పరిశీలించిన ప్రభుత్వం డీసీసీబీ కమిటీని ఇప్పటికే రద్దు చేసింది. తాజాగా అసలు అక్రమార్కులు ఎవరో తేల్చడంతోపాటు, నిధుల రికవరీ చేపట్టేందుకు సీబీ సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది -
బయటపడుతున్న డీసీసీబీ మాజీ ఛైర్మన్ అక్రమాలు
సాక్షి, రాజమహేంద్రవరం: డీసీసీబీ అక్రమాలు ఓ పక్క ఒక్కొక్కటి వెలుగు చూస్తుంటే మరోవైపు పలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో లొసుగులు బయటపడుతున్నాయి. డీసీసీబీ వేదికగా జరగిన అక్రమాలు తవ్వే కొద్దీ మరిన్ని నిధుల దుర్వినియోగాలు తెరపైకి వస్తున్నాయి. ప్రత్తిపాడు మండలం లంపకలోవ సహకార సంఘంలో పది కాదు...యాభై కాదు...వంద కాదు ఏకంగా 167 బోగస్ పాస్ బుక్కులను అడ్డుపెట్టుకుని రూ.1.67 కోట్ల మేర అడ్డదారిలో బినామీ రుణాలు పొందేసిన లొసుగుల గుట్టురట్టయింది. తాజా మాజీ డీసీసీబీ చైర్మన్ వరపుల రాజా ప్రాతినిధ్యం వహించిన లంపకలోవ సహకార సంఘంలో రూ.1.67 కోట్ల మేర బోగస్ పాస్ బుక్కుల ద్వారా దుర్వినియోగం కావడం...ఆ తప్పిదాలు అటు ‘51’ విచారణలోనూ...ఇటు రెవెన్యూ బృందం విచారణలోనూ బయటపడుతుండంతో డీసీసీబీ అక్రమాల చిట్టా చేంతాడులా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంఘంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సహకార శాఖలో కీలకమైన 51 విచారణ కొనసాగుతోంది. ఇదే సంఘంలో రైతులకు చెందిన భూములకు సంబంధించి సర్వే నెంబర్ల వివరాలతో ఉండే పాస్ బుక్కులను బోగస్‌వి సృష్టించి లేని రైతుల పేర్లతోనో...అసలు భూములే లేని రైతుల పేర్లతోనో రుణాలు తీసేసి సంఘం నిధులను పథకం ప్రకారం పక్కదారి పట్టించారు. ఈ వ్యవహారంపై ప్రత్తిపాడు తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, పది మంది వీఆర్వోలు ఆ సంఘంలో బుధవారం కేవలం పాస్‌బుక్కులపై విచారణ చేపట్టారు. ఈ సంఘ పరిధిలో మొత్తం 217 పాస్ బుక్కులుండగా అందులో 192 పాస్ బుక్కులపై విచారణ చేపట్టారు. విచారణాంతరం అందులో 167 పాస్ బుక్కులు బోగస్‌వని రెవెన్యూ అధికారుల బృందం నిర్ధారించింది. ఈ సంఘంలో గతం నుంచీ జరిగిన అక్రమాలు విచారణలో వెలుగు చూస్తున్నాయని, సంఘం త్రిసభ్య కమిటీ తరఫున కూడా గత లొసుగులను గుర్తించి విచారణాధికారులు ముందు ఉంచుతామని లంకపలోవ సంఘం త్రిసభ్య కమిటీపర్సన్ ఇన్‌ఛార్జి గొంతెన సురేష్ తెలిపారు. సాక్షాత్తు గత డీసీసీబీ చైర్మన్ రాజా హయాంలోనే లంపకలోవ సంఘంలో ఇంతటి భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరగడంతో ఈ విచారణలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లంకపలోవ సంఘంలో బోగస్ పాస్ పుస్తకాలపై విచారణ చేపట్టినట్లుగానే రెవెన్యూ అధికారుల బృందం ఏలేశ్వరం, శంఖవరం, కిర్లంపూడి మండల్లాలోని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని సంఘాల్లోనూ గురువారం విచారణ చేపట్టనుందని తెలిసింది. -
‘రాజా’ విలాసం... డీసీసీబీ విలాపం
సాక్షి, రాజమహేంద్రవరం: సొమ్ము తమది కాదంటే సోకులకేమీ లోటుండదనే నానుడిని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్, సీఈఓ ఇతర అధికారులు బాగా వంట పట్టించుకున్నట్టున్నారు. అందుకే అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో బరితెగించి మరీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నిధులను గడచిన ఐదేళ్లలో అడ్డగోలుగా దుబారా చేశారు. రైతుల రెక్కల కష్టంతో రాష్ట్రంలో లాభాల బాటలో పయనిస్తున్న డీసీసీబీలో మన డీసీసీబీ ఒకటి. అటువంటి బ్యాంకుపై రైతులు పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తూ చైర్మన్, సీఈఓలు ఇష్టారాజ్యంగా ఎడాపెడా విలాసాలకు లక్షల రూపాయలు వెచ్చించారు. డీసీసీబీ ఆస్తులు అయినకాడికి అప్పనంగా కట్టబెట్టడం దగ్గర నుంచి అడ్డగోలుగా భవంతులు నిర్మించడంతోపాటు విలాసాల కోసం కార్లు కొనుగోలు వరకూ అన్నింటా లక్షలాది రూపాయలు అనవసర ఖర్చులు చూపించి బ్యాంకును నష్టాల బాటలోకి నెట్టి అడ్డగోలుగా అప్పటి చైర్మన్ వరుపుల రాజా వాహనాలను కొనుగోలు చేయడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కార్ల పేరుతో లక్షలు దుబారా చేసినట్టు డీసీసీబీ ఆర్థిక లావాదేవీలపై నిర్వహించిన ప్రాథమిక విచారణలో నిగ్గు తేలింది. లక్షలు పెట్టి కొన్న కారు లక్షణంగా నడుస్తుంటే అది సరిపోదని కార్లపై కార్లు మార్చేసి ‘షి’కార్లు చేసి రైతుల నోట మట్టి కొట్టారు. 2016 సెప్టెంబరు 21న బ్యాంకు తీర్మానం నంబర్–5 ప్రకారం చైర్మన్‌కు కొత్త కారు కొనుగోలు చేయాలనుకున్నారు. అప్పటికే ఫార్చునర్ కారు (ఏపీ 05 సీపీ 1234)ను చైర్మన్ వినియోగిస్తున్నారు. ఆ ఫార్చునర్ కారు లక్షన్నర కిలోమీటర్లు తిరగడంతో తరచూ మరమ్మతులకు వచ్చేస్తోందని భావించారు. అందునా భద్రతా కారణాల రీత్యా కూడా ఆ కారును మార్చేసి కొత్త కారు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కొత్త కారు కొనుగోలు కోసం ఏదో తీర్మానం రాశారు కానీ, అసలు డీసీసీబీ చైర్మన్ భద్రతకు వచ్చిన ముప్పు ఎక్కడుందని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. సరే సీఈఓ ధర్మారావు పర్యవేక్షణలో డీసీసీబీ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలన్నీ వాస్తవమే అనుకుందాం. ఆ క్రమంలోనే ఫార్చునర్ స్థానంలో కొత్త ఇన్నోవా క్రిస్టల్ కారు కొనుగోలు చేయాలనుకున్నారు. ఈ కారు కొనుగోలు కోసం డీసీసీబీ నుంచి రూ.26,67,825 (రిజిస్ట్రేషన్ మినహాయించి) డ్రా చేశారు. చైర్మన్ పర్యటనలకు సౌకర్యవంతంగా లేదనే కారణంతో మరో కారు కొనుగోలుకు ప్రతిపాదించారు. ఇన్నోవా క్రిస్టల్ కారు కొనుగోలు చేసిన తొమ్మిది నెలలు కూడా తిరగకుండానే దానిని మార్పిడికి పెట్టి కొత్త కారు కొనుగోలుకు సిద్ధమయ్యారు. 2017 జూన్ 3వ తేదీన తీర్మానం నంబర్–42 ప్రకారం మరో కొత్త కారు టయోటా ఫార్చునర్ కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఇన్నోవా క్రిస్టల్ కారును వద్దని టయోటా ఫార్చునర్ కారు కొనుగోలుకు వారు చూపించిన కారణాన్ని ప్రాథమిక నివేదికలో చూసి సహకారశాఖ ఉన్నతాధికారులే విస్మయానికి గురయ్యారు. కారు కొనుగోలు చేసి తొమ్మిది నెలలు కూడా గడవకుండానే, అందునా అన్ని విధాలా సౌకర్యవంతమైనదిగా భావించే ఇన్నోవా కారు చైర్మన్‌కు సౌకర్యవంతంగా లేదని పేర్కొనడం చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తోందంటున్నారు. పోనీ అంతకు ముందు కొనుగోలుచేసిన ఇన్నోవా క్రిస్టల్ కారు ధర కంటే ఈ టయోటా ఫార్చునర్ కారు తక్కువకు కొనుగోలు చేశారంటే అదీ లేదు. అలా కొనుగోలుచేసి ఉంటే పోనీ బ్యాంకుకు భారం తగ్గించారనుకునే వారే. కానీ టయోటా ఫార్చునర్ కారును రూ.38,67,780కు కొనుగోలు చేశారు. అంటే రూ.15,67,780లకు కొత్త కారు కొనుగోలు చేయడం వల్ల బ్యాంకుపై అదనపు భారం పడింది. అంటే ఆ మేరకు బ్యాంకు లాభాల నుంచి కోత పడినట్టే కదా అని రైతు ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ డీసీసీబీ సీఈఓ ఆధ్వర్యంలో రూపొందించిన రికార్డు ప్రకారం చూస్తే ఇన్నోవా క్రిస్టల్ కారు మారకం ద్వారా ఫార్చునర్‌ను కొనుగోలు చేయడం ద్వారా రూ.3,67,825 మాత్రమే నష్టం జరిగినట్టుగా ఉంది. అన్ని విధాలా సౌకర్యవంతమైన ఇన్నోవా కారు కొని తొమ్మిది నెలలు కూడా గడవకుండానే మారకం పెట్టడం ద్వారా కొత్త కారు కొనుగోలు చేయడంతో రూ.15,67,780 అదనపు భారం పడిందనే విషయాన్ని డీసీసీబీ అధికారులు, రైతుల స్వేదంతోనే తమకు ఇన్ని సౌకర్యాలు, హోదా వచ్చాయనే విషయాన్ని మరిచిపోవడం ఎంతవరకు సమంజసమని డీసీసీబీ శ్రేయోభిలాషులు పేర్కొంటున్నారు.(చదవండి: ఇది ‘ధర్మమా’..‘రాజా’?) -
ఇది ‘ధర్మమా’..‘రాజా’?
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో గడచిన ఐదేళ్లలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. బ్యాంక్ సొమ్మును ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేసిన విషయం ప్రాథమికంగా నిర్దారణ కావడంతో సహకార చట్టాల్లో పాశుపతాస్త్రంగా పరిగణించే సెక్షన్–51ను ప్రయోగించింది. సహకార చట్టాల్లో ఈ సెక్షన్‌కు ఉన్న ప్రాధాన్యం మిగిలిన ఏ సెక్షన్‌కూ లేదు. ఇది అక్రమార్కులకు సింహస్వప్నం. అటువంటి సెక్షన్‌తో విచారణ ప్రారంభం కావడంతో డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, ప్రస్తుత సీఈఓ మంచాల ధర్మారావు సహా డీసీసీబీలో అన్ని స్థాయిల అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నిధుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగినా ప్రధాన బాధ్యుడైన సీఈఓతోనే పోదని, తమ మెడకు చుట్టుకుంటుందనే ఆందోళన డీసీసీబీ అధికారులకు గుబులు పుట్టిస్తోంది. చైర్మన్ రాజా, సీఈఓ ధర్మారావు లక్షల మంది నమ్మకాన్ని దెబ్బతీసి డీసీసీబీకి గండికొడతారా, ఇది ధర్మమా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కుంభకో ణంపై సెక్షన్ 51 విచారణకు ఆదేశించడంతో ఈ సెక్షన్ ఏమి చెబుతోంది? విచారణలో దీని పాత్ర ఏమిటి? విచారణ అనంతరం పరిణామాలు ఎలా ఉం టాయి? అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మెక్కిన సొమ్మును కక్కిస్తుంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లేదా, డీసీసీబీలో చాలా తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడే మాత్రమే అరుదుగా ఈ సెక్షన్‌ను వినియోగిస్తుంటారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో డీసీసీబీలో జరిగిన అవకతవకలపై సెక్షన్–51 వేయడం డీసీసీబీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సహకార బ్యాంక్‌లు, సంఘాల్లో లొసుగులు, లోతులను నిశితంగా కనుగొనే అవకాశం సెక్షన్ 51కి మాత్రమే ఉంది. సహకార చట్టం, సహకార బ్యాంక్‌ల బైలా, సంఘాల నిబంధనల అమలులో ఎక్కడైనా పాలకవర్గాలు, అధికారులు దారితప్పి నిధులను మింగేస్తే దారిలో పెట్టడమే కాకుండా, మెక్కిన నిధులను కక్కించే అధికారం కూడా ఈ విచారణకే ఉంది. అంతిమంగా నిగ్గు తేల్చడానికి... 1964లో రూపొందిన సహకార చట్టం ద్వారా సెక్షన్ 51 ఎంక్వయిరీ మొగ్గ తొడిగింది. సహకార చట్టం ఈ సెక్షన్‌కు విశేషాధికారాలు కట్టబెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే సహకార శాఖలో 51 ఎంక్వయిరీ అంటే తుది తీర్పుగా చెప్పుకోవచ్చు. సహకారశాఖ పరిధిలో నిధులు దుర్వినియోగం అయినప్పుడు తొలుత ప్రా«థమిక విచారణ చేపడతారు. ఆ ప్రాథమిక విచారణలో నిధుల దుర్వినియోగం రూ.కోట్లలో ఉన్నప్పుడు సమగ్ర విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రభుత్వం భావించినప్పుడు అక్రమాలు నిగ్గు తేల్చేందుకు 51 విచారణకు ఆదేశిస్తుంది. సహకార బ్యాంక్, సహకార సంఘంలో నిధులు దుర్వినియోగం జరిగినప్పుడు తొలుత ప్రాథమిక విచారణ నిర్వహిస్తారు. తర్వాత తనిఖీలు (ఇన్స్పెక్షన్లు) నిర్వహించే అధికారం సెక్షన్ 52కు ఉంటుంది. ఈ సెక్షన్‌ను వినియోగించి దుర్వినియోగం అయిన నిధులకు ఆడిట్ ఎలా జరిగింది, నిబంధనలకనుగుణంగానే ఆడిట్లు జరిగాయా, ఆడిట్ అభ్యంతరాలను కూడా అతిక్రమించారా వంటి విషయాలు నిర్ధారించేందుకు సెక్షన్ 50 విచారణ జరుగుతుంది. సాధారణంగా ఈ మూడు దశల విచారణలు పూర్తయ్యాకే అంతిమంగా నిధుల దుర్వినియోగం తీవ్రతను బట్టి సెక్షన్ 51 విచారణకు శ్రీకారం చుడతారు. సహకారశాఖ కమిషనర్, రిజిస్ట్రార్, జిల్లా సహకార అధికారులు...ఇలా పలు స్థాయిల్లో అధికారులు అన్ని కోణాల్లో పరిశీలన జరిపి సమగ్ర విచారణ అనివార్యమైనప్పుడు సెక్షన్ 51ని ప్రయోగిస్తారు. పలు కోణాల్లో శోధించి కుంభకోణం ఛేదించడమే లక్ష్యం 51 విచారణతో 2013 ఫిబ్రవరి నుంచి 2019 మార్చి నెల వరకూ డీసీసీబీ చైర్మన్ రాజా, గత సీఈఓ హేమసుందర్, ప్రస్తుత సీఈఓ మంచాల ధర్మారావు హయాంలో జరిగిన నిధులు దుర్వినియోగంపై లోతైన విచారణకు సమాయత్తమవుతున్నారు. డీసీసీబీ పదవీకాలంలో చివరి రెండు సంవత్సరాల్లోనే పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ కాలంలో సీఈఓ ధర్మారావు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని సహకారశాఖ కమిషనర్ వద్ద పక్కా సమాచారం ఉందంటున్నారు. ఈ క్రమంలోనే డీసీసీబీలో రుణాలు నిబంధనల మేరకే ఇచ్చారా? రుణాలు తీసుకున్నవారు అర్హులేనా? వారికి రుణాలు తిరిగి చెల్లించే ఆర్థిక స్తోమత ఉందా? రుణాలు తీసుకునే ముందు తనఖా పెట్టిన సాగు భూములు దస్తావేజులు సక్రమంగా ఉన్నాయా లేదా? చనిపోయిన వారి పేరుతో కూడా రుణాలు మంజూరు అయ్యాయా? సహకారశాఖ పేరుతో అధికారులు నిధుల దుర్వినియోగానికి ఎలా పాల్పడ్డారు, అందుకు పాలకవర్గం ఆమోదం సంపూర్ణంగా ఉందా లేదా..? పాలకవర్గ సభ్యుల ప్రయోజనాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిందా? తప్పుడు సమాచారం, తప్పుడు పత్రాలతో నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగిందా? పరపతేతర పేరుతో లేదా, రైతులకు విజ్ఞాన యాత్రల పేరుతో నిధులు మెక్కేశారా? చట్టం, బ్యాంక్‌లు, సంఘాల బైలాకు అనుగుణంగా సీఈఓ నిర్ణయాలు తీసుకున్నారా లేదా, బినామీ పేర్లతో స్వప్రయోజనాల కోసం తీసుకున్నారా? ఇలా పలు కోణాల్లో ఆయా సంఘాలు, బ్యాంక్‌ల్లో జరిగిన నిధుల దుర్వినియోగాన్ని బట్టి లోతైన విచారణ చేయడం సెక్షన్ 51 లక్ష్యం. అందుకే డీసీసీబీ చైర్మన్, సీఈఓలు అంతగా ఆందోళన చెందుతున్నారంటున్నారు. విచారణాధికారికి విశేషాధికారాలు.. సెక్షన్ 51 విచారణాధికారికి విశేషాధికారాన్ని కట్టబెట్టింది. ఈ వ్యవహారంలో విచారణాధికారిగా నియమితులైన అమలాపురం డివిజనల్ సహకార అధికారి బి.దుర్గాప్రసాద్ నిధుల దుర్వినియోగం ఎలా జరిగిందో పరిశీలించడమే కాకుండా అక్రమ వ్యవహారాలను వెలికితీస్తూనే ఆ నిధులు రికవరీ కూడా చేయనున్నారు. నిధులు రికవరీ అయినప్పుటికీ అక్రమార్కులపై చర్యలకు అవసరాన్ని బట్టి సమన్లు కూడా జారీచేసే అధికారం ఈ సెక్షన్ కట్టబెట్టింది. అక్రమార్కులను సస్పెండ్ చేయాలా... విధుల నుంచి పూర్తిగా ఉద్వాసన పలకాలా..? వంటి సూచనలు చేసే అధికారం విచారణాధికారికి ఉంటుంది. నిధులు కాజేసిన వారిపై పక్కా ఆధారాలతో సివిల్ లేదా క్రిమినల్ కేసులు పెట్టే అధికారం కూడా ఈ సెక్షన్లో ఉంది. ఎంతటి వారినైనా విచారించే అధికారం సెక్షన్ 51కి ఉంది సహకార శాఖలో నిధులు దుర్వినియోగం అయినప్పుడు ఎంతటి వారినైనా విచారించే సర్వాధికారం సెక్షన్ 51కు ఉంది. విచారణాధికారి బాధ్యులైన వారికి సమన్లు జారీ చేసే అధికారం కూడా ఉంది. సహకార చట్టంలో అత్యంత విశేష అధికారాలు ఒక్క 51కు మాత్రమే ఉన్నాయి. ఈ విచారణకు పరిధులు, పరిమితులు ఉండవు. ఏ కోణంలోనైనా విచారణ చేయవచ్చు. అనుమానాల నివృత్తికి, వాస్తవాల వెలికితీతకు విచారణాధికారి బాధ్యులుగా భావించే వారిని సమగ్రంగా విచారించే అధికారం ఉంటుంది. సహకార శాఖలో సెక్షన్ 51 ఎంక్వయిరీ పడిదంటే ఆ అక్రమాల అంతు అంతిమంగా తేలినట్టు. నిధులు దుర్వినియోగం వెలుగు చూడాల్సిందే. – మహ్మద్ అమీర్, విశ్రాంత సహకార అసిస్టెంట్ రిజిస్ట్రార్, అమలాపురం -
రాజమహేంద్రవరంలో డీసీసీబీ లీలలు
టీడీపీ హయాంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రైతులకు బదులుగా తన అనుయాయులకు ఆర్థిక వనరుగా మారింది. రైతుల సంక్షేమానికి వినియోగించాల్సిన కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించి తమ విలాసాలకు వాడుకోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి , రాజమహేంద్రవరం : ‘ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా’ అనే సామెతను టీడీపీ సర్కారు హయాంలో జిల్లా తెలుగు తమ్ముళ్లు బాగా వంట పట్టించుకున్న ట్టున్నారు. సీఎం స్థాయిలో చంద్రబాబే విమానయానాలతో ప్రజా సొమ్మును దుబారా చేస్తుంటే తాము తక్కువ తిన్నామా అన్నట్టు ఆ పార్టీ నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా వ్యవహరించిన వరుపుల రాజా రైతుల సొమ్ము ఇష్టానుసారంగా దుబారా చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటిని నియంత్రించాలి్సన డీసీసీబీకి గతంలో సీఈఓగా పనిచేసి రిటైరయిన హేమసుందర్, ప్రస్తుత సీఈఓ మంచాల ధర్మారావు వంతపాడారు. డీసీసీబీపై ఎంతో నమ్మకం ఉండబట్టే జిల్లాలో లక్షలాది మంది రైతులు రూ.1000 కోట్లు డిపాజిట్లు చేశారు. కేవలం ఐదేళ్ల కాలంలో తమ నమ్మకాన్ని వమ్ము చేసి బ్యాంక్‌పై విశ్వాసం కోల్పోయేలా వ్యవహరించారని తాజాగా వెలుగుచూస్తున్న ఉదంతాలపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలాసాలు, విందులు, ఆతి«థుల రాచమర్యాదల కోసం తమ కష్టాన్ని అడ్డుగోలుగా లక్షల రూపాయలను బొక్కేశారని రైతులు మండిపడుతున్నారు. ప్రశ్నించేవారే లేరన్న ధైర్యంతో అడ్డగోలుగా సాగించిన అక్రమ బాగోతాలపై రాష్ట్ర ప్రభుత్వం 51 ఎంక్వైరీ వేసిన సంగతి తెలిసిందే. విచారణాధికారిగా నియమితులైన దుర్గాప్రసాద్ విచారణ ప్రక్రియను ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో డీసీసీబీలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. జిల్లా కేంద్రం కాకినాడ దేవాలయం వీధిలో కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని అడ్డగోలుగా అసోసియేషన్‌కు కట్టబెట్టేసిన వ్యవహారం ‘సాక్షి’ ఈ నెల 29వ తేదీన ‘ఇదేమి సహ‘కారం’ శీర్షికతో వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇంచుమించు ఇటువంటి వ్యవహారమే మరొకటి రాజమహేంద్రవరంలో వెలుగులోకి వచ్చింది. నిబంధనలన్నీ తుంగలో... రాజమహేంద్రవరం శ్యామలా సెంటర్ అంటే నగరంలోనే అత్యంత ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం. సినిమా థియేటర్లు, హోటళ్లు, బ్యాంకులు తదితర వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు కేంద్ర బిందువు. అటువంటి సెంటర్లో డీసీసీబీకి ఎప్పుడో తొలినాళ్లలో ఏర్పాటు చేసిన బ్రాంచి ఉంది. ఈ భవంతికి వందేళ్ల చరిత్ర ఉంది. ఈ పురాతన బ్రాంచి కార్యాలయాన్ని ఆనుకుని గత పుష్కరాల సమయంలో లెక్కాపత్రం లేకుండా అత్యంత విలాసవంతమైన భవంతిని నిర్మించారు. అసలు ఎక్కడైనా ఒక లక్ష రూపాయల భవనం నిర్మించాలంటే ముందుగా ప్రతిపాదనలు, అంచనాలు, టెండర్లు...బిల్లులు...ఇలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. కోటి రూపాయలు విలువైన భవన నిర్మాణమైనా ఇదే విధానాన్ని పాటించాలి. కానీ డీసీసీబీలో మాత్రం వీటన్నింటినీ బుట్టదాఖలు చేసి అత్యంత విలాసవంతమైన భవంతిని నిర్మించేశారు. సుమారు రూ.కోటిన్నరతో ఈ విలాసవంతమైన భవనాన్ని పుష్కరాల సమయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చే అ«ధికార పార్టీ ప్రతినిధుల విడిది కోసం అగమేఘాలపై నిర్మించేశారు. రెండు అత్యంత ఖరీదైన సూట్లు ఉన్నాయి. ఒక సూట్ చైర్మన్‌కు, మరొకటి డీసీసీబీ సీఈఓకు. ఒక పెద్ద విలాసవంతమైన హాలు. పైన ఏడు గదులు నిర్మించారు. సహకార సంఘాల చట్టం లేదా, స్వయం ప్రతిపత్తి కలిగిన డీసీసీ బ్యాంక్ మనుగడ పూర్తిగా రైతుల కష్టంపైనే ఆధారపడి ఉంటుంది. అటువంటి బ్యాంకు సొమ్ములతో భవనాలు నిర్మించడం నిబంధనలకు విరుద్ధమంటున్నారు. పుష్కరాలు వస్తున్నాయనగా హడావుడిగా నిర్మించిన భవనం ఆ సమయంలో పలు జిల్లాల నుంచి వచ్చే టీడీపీ నేతల కోసం బాగా ఉపయోగపడింది. 2015లో గోదావరి పుష్కరాల్లో వినియోగంలోకి వచ్చిన ఈ భవంతికి ఇప్పటికీ డీసీసీబీలో బిల్లులు లేవని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా సహకార యంత్రాంగం ఇచ్చిన ప్రాథమిక నివేదికలో స్పష్టం చేడయం గమనార్హం. భవనం నిర్మాణం పూర్తి చేసి నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకూ ఏ ఒక్క దానికీ బిల్లులు లేకపోవడాన్ని పరిశీలిస్తే రైతుల సొమ్ము ఏ స్థాయిలో దుబారా జరిగిందో ఇట్టే అర్థమవుతోంది. ప్రతిపాదనలు సిద్ధం చేసినతరువాత టెండర్లు పిలిచి...పద్ధతి ప్రకారం తక్కువకు కోట్‌చేసే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. త్రిమెన్ కమిటీ పేరుతో సొంత వారికే నిర్మాణ పనులు అప్పగించి లక్షలు పక్కదోవపట్టించారని ప్రభుత్వానికి అందిన ప్రాథమిక నివేదికలో ఉంది. పార్టీ తరఫున చైర్మన్‌గా ఎన్నికై ఐదేళ్లు కాలమే పదవిలో ఉంటారు. కానీ డీసీసీబీకి సీఈఓ పోస్టు శాశ్వతం. రైతులకు చెందిన వెయ్యి కోట్ల రూపాయల డిపాజిట్లు కలిగిన డీసీసీబీలో కీలకం సీఈఓ. ఈ విషయాన్ని కూడా పెడచెవిన పెట్టడం విమర్శలపాలవుతోంది. అధికార పార్టీ పెద్దలు పైన ఉన్నారనే ధైర్యంతో సీఈఓ, ఇతర అధికారులు నిబంధనలను గాలికొదిలేసి భవన నిర్మాణాన్ని అడ్డగోలుగా చేపట్టి లక్షలు మింగేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై నిగ్గుతేల్చాల్సిన గురుతర బాధ్యత విచారణ అధికారిపై ఉంది. -
కదులుతున్న అవినీతి డొంక
సాక్షి, రాజమహేంద్రవరం : తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల ఏలుబడిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో జరిగిన అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా వెచ్చించిన వ్యవహారాలపై సహకార చట్టంలోని కీలకమైన ‘51’ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని డీసీసీబీ వ్యవహారాలపై ఆరోపణలు రావడాన్ని వ్యవసాయ, సహకారశాఖా మంత్రి కురసాల కన్నబాబు కూడా తీవ్రంగా పరిగణించారు. రైతుల పక్షాన నిలవాలి్సన డీసీసీబీ యంత్రాంగం, ప్రతినిధులు సహకార స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించడాన్ని ఉపేక్షించరాదని భావిస్తున్నారు. అవినీతి డొంక కదిలిందిలా... డీసీసీబీలో గడచిన ఐదేళ్లలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై ప్రాథమిక నివేదికను పరిశీలించాక డీసీసీబీ వ్యవహారాలపై విచారణాధికారిగా అమలాపురం డివిజనల్ సహకార అధికారి బీకే దుర్గాప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. సహకార శాఖ కమిషనర్ వాణీమోహన్ ఈ మేరకు విచారణాధికారి నియామక ఆదేశాలు జిల్లా సహకార అధికారికి జారీ చేశారు. దుర్గాప్రసాద్ విచారణ రెండు రోజుల కిందటే మొదలు పెట్టాల్సి ఉంది. ఈ నెల 25నే విచారణ అధికారి నియామకం జరిగినా 27వ తేదీ అమావాస్య కావడంతో మంచి ముహూర్తం చూసుకుని విచారణకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. విచారణ మొదలు పెట్టిన తేదీల దగ్గర నుంచి ఆరు నెలల కాలంలో విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. 2013 నుంచి 2019 వరకూ విచారణ... గత పాలక వర్గ పదవీకాలం 2013 ఫిబ్రవరి నుంచి 2019 మార్చి వరకూ జరిగిన కార్యకలాపాలపై నిశిత పరిశీలన జరిపి అన్ని లావాదేవీల గుట్టును ఈ విచారణ ద్వారా రట్టు చేయాల్సిన బాధ్యత విచారణాధికారికి ప్రభుత్వం అప్పగించింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ వరుపుల రాజా, తొలి సీఈఓ హేమసుందర్ (రిటైర్ అయ్యారు), ప్రస్తుత సీఈఓ మంచాల ధర్మారావు హయాంలో నడిచిన ప్రతి కార్యకలాపాన్నీ విచారించి నివేదిక అందజేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ‘సాక్షి’లో మంగళవారం ‘ఇదేమి సహ‘కారం’ శీర్షికన ప్రచురితమైన కథనం కూడా విచారణలో ఒక అంశంగా తీసుకుంటున్నారు. విచారణ పూర్తి చేసిన అనంతరం రాష్ట్ర సహకారశాఖ కమిషనర్‌కు నివేదిక అందిస్తారు. ఈ విచారణలో అవినీతి రుజువైతే చట్టపరమైన సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని భావిస్తున్నారు. ప్రాథమిక నివేదికతో కదిలిన ప్రభుత్వం... డీసీసీబీలో చోటుచేసుకున్న అవినీతి, అవకతవకలపై జిల్లా సహకార యంత్రాంగం అందజేసిన ప్రాథమిక నివేదిక చూసి సహకార ఉన్నతాధికారులు నిర్ఘాంతపోయారని సమాచారం. అడ్డగోలు కొనుగోళ్లు, బిల్లులు లేకుండా భవంతుల నిర్మాణం, నిబంధనలు తుంగలోకి తొక్కి విహార యాత్రలు, స్టడీ టూర్ల పేరుతో విచ్చలవిడిగా రైతుల లాభాల సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేయడం తదితర అంశాలను పరిశీలించిన అనంతరం వీటన్నింటినీ నిగ్గు తేల్చాలంటే 51 విచారణ ఒక్కటే మార్గమని ప్రభుత్వం నిర్థారణకు వచ్చింది. డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా సహా పలువురు ప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ యాత్రలు కూడా డీసీసీబీ నుంచి డబ్బులు భారీగా డ్రా చేయడం, కార్లు కొనుగోళ్లు, కాకినాడ దేవాలయం వీధిలోని డీసీసీబీ బ్రాంచికి చెందిన సుమారు రూ.3 కోట్ల విలువైన స్థలం బ్యాంకు ఉ ద్యోగుల సంఘానికి అప్పనంగా కట్టబెట్టడం తది తర విషయాలపై సమగ్ర విచారణ జరపనున్నారు. -
కేడీసీసీబీ చైర్మన్‌గా మాధవరం రామిరెడ్డి
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లకు ప్రభుత్వం ఏడుగురు సభ్యుల నాన్ అఫీషియల్ కమిటీలను ఖరారు చేసింది. మంత్రాలయం మండలం మంచాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) సభ్యుడిగా ఉన్న బీసీ నేత మాధవరం రామిరెడ్డిని కేడీసీసీబీ చైర్మన్‌గా, గోస్పాడు మండలం దీబగుంట్ల సొసైటీ త్రీమెన్ కమిటీ చైర్మన్ అయిన పీపీ నాగిరెడ్డిని డీసీఎంఎస్ చైర్మన్‌గా ఎంపిక చేసింది. వాస్తవానికి జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఏడుగురు సభ్యుల కమిటీ సోమవారమే పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసేందుకు ఒకట్రెండు రోజులు పట్టే అవకాశముంది. అంతవరకు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. వాల్మీకి నేత రామిరెడ్డి కేడీసీసీబీ చైర్మన్‌గా ఎంపికైన మాధవరం రామిరెడ్డి బీసీ సామాజిక వర్గ (వాల్మీకి) నేత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి పదవుల్లోనే కాదు.. నామినేటెడ్ పోస్టుల్లోనూ బీసీలకు పెద్దపీట వేశారనే విషయం రామిరెడ్డి నియామకంతో స్పష్టమవుతోంది. రామిరెడ్డికి మంత్రాలయం, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో మంచి నేతగా గుర్తింపు ఉంది. మాధవరం గ్రామానికి చెందిన ఈయనకు ఊరిపేరే ఇంటిపేరుగా స్థిరపడింది. ఈయన గతంలో రెండు సార్లు మంత్రాలయం ఎంపీపీగా పనిచేశారు. నిజాయితీ కల్గిన నేత పీపీ నాగిరెడ్డి డీసీఎంఎస్ చైర్మన్‌గా ఎంపికైన పీపీ నాగిరెడ్డికి నిజాయితీ కల్గిన నేతగా గుర్తింపు ఉంది. ఈయన 2013 నుంచి డీసీఎంఎస్ చైర్మన్‌గా కొనసాగుతూ... మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షులుగానూ ఉన్నారు. గతంలో ఈయన నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత జెడ్పీ చైర్మన్‌గా, జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్‌గానూ సమర్థవంతంగా పనిచేశారు. డీసీసీబీ నాన్ అఫీషియల్ కమిటీ చైర్మన్‌గా మాధవరం రామిరెడ్డి ఎంపిక కాగా..సభ్యులుగా అహోబిలం లక్ష్మీనరసింహ గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు నాసరి వెంకటేశ్వర్లు, నందవరం మండలం ముగితి గ్రామానికి చెందిన విరూపాక్షిరెడ్డి (ఈయన నందివరం సొసైటీలో సభ్యుడు), దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన దాసరి లుమాంబ (దేవనకొండ సొసైటీ సభ్యుడు), వెలుగోడు మండలం రేగడగూడూరు సొసైటీలో సభ్యురాలైన వెంకటేశ్వరమ్మ, సంజామల సొసైటీ త్రీమెన్ కమిటీ చైర్మన్ అయిన గుండం సూర్యప్రకాశ్‌రెడ్డి, కల్లూరు మండలం ఉలిందకొండ సొసైటీ సభ్యుడైన కె.వెంకటరమణారెడ్డి ఎంపికయ్యారు. డీసీఎంఎస్ కమిటీ చైర్మన్‌గా పీపీ నాగిరెడ్డి, సభ్యులుగా కర్నూలు మండలం గార్గేయపురం గ్రామానికి చెందిన బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన కే.వంశీధర్‌రెడ్డి, మహానంది మండలం గాజులపల్లికి చెందిన కె.రామకృష్ణ, డోన్ మండలం చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన డి.వెంకటసుబ్బమ్మ, పెద్దతుంబళం గ్రామానికి చెందిన సుబాన్‌బాష, మద్దూరుగ్రామానికి చెందిన వి.దేవభూషణం. డీసీఎంఎస్‌కు ఖరారు చేసిన కమిటీ ఈ నెల 15న బాధ్యతలు చేపట్టనుంది. -
డీసీసీబీ కుంభకోణం విచారణలో కీలక మలుపు
సాక్షి, (పశ్చిమ గోదావరి) : ఇప్పటివరకూ సమన్వయంతో బ్యాంకు డబ్బులు స్వాహా చేసిన అధికారులు, డీసీసీబీ చైర్మన్ తాజాగా నిర్వహించిన ‘సమన్’వయ భేటీ చర్చనీయాంశమైంది. జిల్లా సహకార బ్యాంకులో జరిగిన కుంభకోణం విచారణకు అధికారులు శనివారం హాజరుకావాలంటూ ఉన్నతాధికారుల నుంచి సమన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులతో హడావుడిగా సమావేశమైన డీసీసీబీ చైర్మన్ ముత్యాలరత్నం స్వాహాకు కథ, దర్శకత్వం తానే అయినా.. ఎలాగైనా బయటపడతానని.. మీ సంగతి మాత్రం చూసుకోవాలంటూ ఓ ఉచిత సలహా పడేశారు. దీంతో అవాక్కవడం అధికారుల వంతైంది. జిల్లా సహకార బ్యాంకులో జరిగిన కుంభకోణంపై విచారణ సాగుతూనే ఉంది. ఫ్రిబవరిలో పాలకవర్గాన్ని రెండోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పుడే విచారణ కూడా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే డీసీసీబీ చైర్మన్ గత ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి విచారణ సాగకుండా చేశారు. ఇప్పుడు తాజాగా ఈనెల 17న అధికారులందరూ విచారణకు హాజరుకావాలని విచారణ కమిటీ సభ్యులు డెప్యూటీ రిజిస్ట్రార్ ఎం.అబ్దుల్ లతీఫ్ డీసీసీబీ అధికారులకు సమన్లు జారీ చేయడంతో వారిలో టెన్షన్ మొదలైంది. దీంతో డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం అధికారులను తన ఇంటికి పిలిచి సమావేశం పెట్టారు. తాను ఎలాగొలా బయటకు వస్తానని, మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే విచారణ ఆపుకునే యత్నాలు చేయాలని సూచించినట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఈ నెల 27న జరగాల్సిన డీసీసీబీ బోర్డు సమావేశాన్ని 17వ తేదీకి మార్చారు. ప్రభుత్వం మారడంతో విచారణ ఆపుకునే అవకాశం లేదని, ఏం చేయాలోననే ఆందోళన అధికారుల్లోనూ, పాలకవర్గంలోనూ కనపడుతోంది. అసలేం జరిగిందంటే.. ఈ పాలకవర్గం హయాంలో డీసీసీబీలో సుమారు రూ.33.32 కోట్ల రుణం సెక్యూరిటీలు లేకుండా ఇచ్చి బ్యాంకు నష్టాలకు అధికారులు, ఉద్యోగులు కారణమయ్యారు. వీరిపై విచారణ చేపట్టాలని జనవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది ఖరీఫ్‌లో కస్టమ్ మిల్లింగ్ విధానంలో ధాన్యం ఆడించి పౌర సరఫరాల శాఖకు బియ్యం ఇచ్చే మిల్లర్లు సరైన సెక్యూర్టీలు లేకుండా యలమంచిలి బ్యాంకు నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. మిగిలిన బ్యాంకుల నుంచి మరో రూ.13 కోట్ల వరకూ అప్పులు పొందారు. యలమంచిలి బ్యాంకు ఇన్చార్జి మేనేజరు, మరి కొందరు ఉద్యోగులు మిల్లర్లు సరైన సెక్యూర్టీలు ఇవ్వకపోయినా రూ.20 కోట్ల వరకు రుణాలు ఇచ్చేశారు. కస్టమ్ మిల్లింగ్ విధానంలో ధాన్యాన్ని ఆడించి బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు సరఫరా చేయాల్సిన మిల్లర్లు వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మేసుకున్నారు. దీంతో గుట్టురట్టయింది. దీంతో మిల్లర్లపై చర్యలకు పౌర సరఫరాల శాఖ నోటీసులు ఇచ్చి, సెక్యూర్టీగా పెట్టిన ఆస్తులను జప్తుకు యత్నించింది. మిల్లర్లు స్పందించకపోవడంతో పౌరసరఫరాల శాఖ రుణం ఇచ్చిన డీసీసీబీపై చర్యలకు ఉపక్రమించింది. సెక్యూర్టీల్లేకుండా రూ. 20 కోట్లు రుణం ఎలా ఇచ్చారని, వారి తరఫున సెక్యూర్టీ ఇచ్చి న బ్యాంకు బాధ్యత వహించాలని నోటీసులు జారీ చేసింది. విచారణకు షురూ.. దీంతో బ్యాంకు అధికారులు మిల్లర్ల నుంచి రుణం వసూలుకు యత్నించినా ఫలితం లేదు. దీంతో బాధ్యులైన బ్యాంకు మేనేజరు, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అప్పటి కలెక్టర్ కాటంనేని భాస్కర్ రాష్ట్ర సహకార శాఖకు, ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ డెప్యూటీ రిజిస్ట్రార్ స్థాయి అధికారిని విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో హడావిడిగా డీసీసీబీ బ్యాంకు ఏజీఎం ఒకరు యలమంచిలి వెళ్లి మిల్లర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రుణం ఎగ్గొట్టి ఐపీ..! పాలకొల్లుకు చెందిన రైస్‌మిల్లర్ యలమంచిలి డీసీసీ బ్యాంకులో ఆస్తి తనఖా రిజిస్ట్రేషన్ చేయకుండా సుమారు రూ.11.90 కోట్లు రుణం పొందారు. దీన్ని ఎగ్గొట్టి ఐపీ దాఖలు చేసినట్లు సమాచారం. దీంతో బ్యాంకు అధికారులు హడావిడిగా పాలకొల్లు చాంబర్స్ కళాశాల సమీపంలోని పూలపల్లిలో ఎకరం రూ.2 కోట్లు విలువైన పంట పొలాన్ని హామీగా చూపి.. దాని విలువ రూ.8 కోట్లుగా చూపే యత్నం చేసినట్లు తెలిసింది. ఇరగవరం మండలానికి చెందిన ఇంకో రైతు రూ.6.90 కోట్లు తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులే బ్యాంకు సొమ్మును చెల్లించిన విషయాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రెండురోజుల క్రితం ఏజీఎం ఒకరు యలమంచిలి పోలీసులకు అప్పటి బ్యాంకు మేనేజర్, సిబ్బంది, రుణం తీసుకున్న సుందర రామిరెడ్డి అండ్ కోపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాల నుంచి బయటపడేందుకు సిబ్బంది చేసిన యత్నాలు సఫలం కాలేదు. ఈలోగా ప్రభుత్వం మారిపోవడంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు. -
మళ్లీ బరిలోకి !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది.. ఉమ్మడి జిల్లా సహకార సొసైటీ బ్యాంకు(డీసీసీబీ)కు ఏకధాటిగా 13 ఏళ్ల నుంచి కొనసాగుతుండడంతో అన్ని ప్రాంతాలపై పట్టు ఉంది.. ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ విప్‌గా పనిచేసిన సత్తా ఉంది.. అలాంటి నేత ప్రస్తుతం మరోసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.. ఆయనే పాలమూరు రాజకీయ భీష్ముడిగా పేరొందిన కె.వీరారెడ్డి. ‘సాక్షి’కి శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరారెడ్డి తన మనోగతాన్ని వెల్లడించారు. బ్యాంకు అభివృద్ధి, రైతులకు చేసిన సేవలతో పాటు రాజకీయ అనుభవం, ఈసారి ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతుండడానికి కారణాలు, ఉమ్మడి జిల్లా నేతలతో రాజకీయ సంబంధాలు.. ఇలా పలు అంశాలు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... రైతులకు అండగా నిలిచాం... జిల్లా సహకార సొసైటీ బ్యాంకు(డీసీసీబీ)ని రైతులకు చేరువ చేయడంలో విజయం సాధించగలిగాను. అందుకే ఏకధాటిగా 13 ఏళ్లుగా డీసీసీబీ చైర్మన్‌గా కొనసాగుతున్నా. రైతుల్లో నాపై నమ్మకం ఉండడంతోనే చైర్మన్‌గా ఎన్నుకుంటున్నా రు. సహకార ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తామే తప్ప.. అనంతరం రాజకీయాలకు అతీతంగా రైతులకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేస్తున్నా. రుణాల మంజూరు విషయంలో అర్హులైన వారందరికీ అందజేస్తాం. అందుకే ఇన్నాళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా చైర్మన్‌గా కొనసాగగలుగుతున్నా. నూతన ఒరవడి డీసీసీబీ చైర్మన్‌గా బ్యాంకు అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చా. గతంలో లోటు పరిస్థితి ఉండగా.. గత ఎనిమిదేళ్లుగా లాభాల్లోకి తీసుకొచ్చాం. ప్రస్తుతం బ్యాంకు వార్షికంగా రూ.2.48 కోట్ల లాభంతో నడుస్తోంది. ఉమ్మడి జిల్లాలో లక్ష మందికి పైగా రైతులకు రూ.865 కోట్ల రుణాలు అందజేశాం. నేను బ్యాంకు పగ్గాలు చేపట్టాకే బంగారు ఆభరణాలపై రుణాలు అందజేస్తున్నాం. డిపాజిట్లు కూడా రూ.277 కోట్లకు పెరిగాయి. అలాగే ప్రభుత్వ రంగం వాటిల్లో రూ.176 కోట్లను పెట్టుబడి పెట్టాం. ఈ ఏడాది పంట రుణాలను రూ.350 కోట్ల లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు రూ.250 కోట్లు అందజేశాం. ఈ 13 ఏళ్ల కాలంలో సంస్థకు స్థిరాస్థులు సమకూర్చగలిగా. ముఖ్యంగా తొమ్మిది బ్రాంచ్‌లకు సొంత భవనాలు నిర్మించడం గర్వంగా ఉంది. ఆప్కాబ్ బాధ్యతలు.. అదృష్టం ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఆప్కాబ్ చైర్మన్‌గా బాద్యతలు దక్కడం అదృష్టంగా భావిస్తాను. ఆప్కా బ్ చైర్మన్‌గా తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వíßహించిన వారిలో నేను రెండో వాడిని. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆప్కాబ్ చైర్మన్ పదవిని తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అప్పట్లో అంటే 2013లో మంత్రిగా ఉన్న డీకే అరుణ... సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు సహచర మంత్రులను ఒప్పించి నాకు పదవి ఇప్పించగలిగారు. ఆ సమయంలో కరీంనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి పదవి కోసం మంత్రిగా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్రంగా ప్రయత్నించినా డీకే.అరుణ పట్టుదలతో నాకే దక్కింది. డీకేతో వైరం లేదు.. ఆప్కాబ్ చైర్మన్‌తో పాటు డీసీసీబీ చైర్మన్ కావడంలో డీకే.అరుణ కృషి ఉంది. అలాంటిది ఆమెతో నాకు వైరం ఏర్పడినట్లు ప్రచారం చేయడం కరెక్టు కాదు. కాకపోతే రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం ఎమ్మెల్యేగా బరిలో నిలవాలని భావిస్తున్నా. గతంలో నేను అమరచింత(ప్రస్తుతం ఈ స్థానం రద్దయ్యింది) ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. 1978 నుంచి 83 వరకు ఓసారి, 1989 నుంచి 94 వరకు మ రోసారి గెలుపొందాను. రెండోసారి గెలిచినప్పు డు కేబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ విప్‌గా పనిచేశా ను. అనంతరం పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ తరఫున టికెట్ దక్కలేదు. అప్ప టి నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గత ఎన్నికల సందర్భంగా బరిలో దిగాలని భావించినా డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నాననే కారణంగా టికెట్ నిరాకరించారు. అందుకే ఈసారి చివరి ప్రయత్నంగా ఓసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నా. అయి తే నేను గతంలో ప్రాతినిధ్యం వహించిన అమరచింత 2009లో రద్దయి అందులోని మండలాలు మూడు నియోజకవర్గాల్లోకి వెళ్లాయి. ఆత్మకూరు, అమరచింత, నర్వ మండలాలు మక్తల్ నియోజకవర్గంలోకి, ధన్వాడ, మరికల్ మండలాలు నారాయణపేట నియోజకవర్గంలోకి, సీసీ కుంట, దేవరకద్ర మండలాలు దేవరక్రద నియోజకవర్గంలోకి వెళ్లాయి. ఇందులో కాస్త పట్టున్న మండలాలు మక్తల్‌లో కలిసినందున అక్కడి నుంచి బరిలో దిగాలని బావిస్తున్నా. లేదంటే నారాయణపేట అయినా ఓకే. అందుకు అనుగుణంగానే రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ అవకాశం ఇచ్చినా సరే అని కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. అందుకే జైపాల్‌రెడ్డి వెంట.. ఈసారి ఎట్టి పరిస్థితిలో ఎమ్మెల్యేగా బరిలో నిలవాలని కొంత కాలంగా ప్రయత్నిస్తున్నా. ఈ విషయమై పార్టీ ముఖ్యనేత డీకే.అరుణను సంప్రదించినా ఎలాంటి హామీ లభించలేదు. మక్తల్ లేదా నారాయణపేట నుంచి అవకాశం కల్పించాలని విన్నవించాను. కానీ రెండు చోట్ల కూడా నాకు అవకాశం కల్పించడం లేదు. నారాయణపేటలో నేను ముందు నుంచి పనిచేస్తున్నా... నన్ను కాదని టీఆర్ఎస్ నేత శివకుమార్‌ను తీసుకొచ్చారు. అందులో భాగంగానే ముందు నుంచి పనిచేస్తున్న అందరం కలిసి నారాయణపేటలో సభ ఏర్పాటు చేసి జైపాల్‌రెడ్డిని ఆహ్వానించాల్సి వచ్చింది. ఇవన్నీ రాజకీయంగా, కాకతాళీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలే తప్ప డీకే.అరుణతో వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదు. -
డమ్మీ పిస్తోల్.. ఒరిజినల్ బుల్లెట్..!
వరంగల్ క్రైం : హన్మకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ లాకర్ వ్యవహారం బ్యాంకును ఒక కుదుపు కుదిపింది. బ్యాంక్ లాకర్ 27/2లో లభ్యమైన డమ్మీ పిస్తోల్.. ఒరిజినల్ బుల్లెట్ వ్యవహారానికి ప్రస్తుత బ్యాంకు మేనేజర్ అయుబ్ ఔట్ అయ్యారు. ఈనెల 8న బ్యాంక్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ చేసిన లాకర్ వ్యవహారం ఎట్టకేలకు బ్యాంకు మేనేజర్ మెడకు చుట్టుకుంది. బ్యాంక్‌లో తుపాకీ విషయం వెలుగుచూసిన తర్వాత డీసీసీబీ ప్రత్యేక పరిపాలన అధికారి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత హన్మకొండ జిల్లా కోపరేటివ్ అధికారి కరుణాకర్‌ను బ్యాంక్‌లో జరుగుతున్న పరిణామాలపై విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో వరంగల్ అర్బన్ డీసీఓ కరుణాకర్ బ్యాంకులో 8న లాకర్ 27/2 కలిగిన బొద్దిరెడ్డి ప్రకాశ్‌రెడ్డిని బ్యాంకు మేనేజర్ పిలిపించి లాకర్‌ను అద్దెకు తీసుకోకుండా, లాకర్ తాళంచెవి పోయినందుకు, దాన్ని ఓపెన్ చేయడానికి టెక్నీషియన్ చార్జీలకు సంబంధించిన డబ్బులను ఆగస్టు 8న బ్యాంకులో జమచేయలేదు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని విచారణ అధికారులు భావించారు. టెక్నీషియన్ లాకర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో పిస్తోల్, బుల్లెట్ బయటపడిన తర్వాత సమాచారాన్ని బ్యాంకు ఉన్నతాధికారులకు మాత్రమే ఇచ్చారు. కానీ ఆ విషయాన్ని పోలీసులకు ఎందుకు చేరవేయలేదు? అనే విషయంపై విచారణ అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. బ్యాంకు లావాదేవీల్లో అధికారులు నిబంధనలు పాటించకపోవడంపై కూడా విచారణ అధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నట్లు తెలిసింది. బ్యాంకు లాకర్ విషయంలో జరిగిన అంశాలతోపాటు ప్రస్తుత పరిస్థితులపై డీసీఓ కరుణాకర్ వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్, డీసీసీబీ ప్రత్యేక అధికారి ఎం.హరితకు ఈనెల 24న నివేదిక అందజేశారు. దీంతో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత బ్యాంకు వ్యవహారంలో నిబంధనలు పాటించనందుకు బ్యాంకు మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని బ్యాంకు ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో గురువారం బ్యాంకు సీఈఓ అంజయ్య ప్రస్తుత మేనేజర్ ఎండీ.అయూబ్బేగ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. కొనసాగుతున్న పోలీసుల విచారణ బ్యాంకు లాకర్లో బయటపడ్డ డమ్మీ పిస్తోల్ వ్యవహారంలో సుబేదారి పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. లాకర్లో తుపాకీ ఎవరు పెట్టారు?, అందులో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఎంత? బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి బొద్దిరెడ్డి ప్రకాశ్‌రెడ్డి పాత్ర ఏ మేరకు ఉంది? రాజకీయ నేతలు ఎవరెవరికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే విషయాలపై ఓ వైపు విచారణ సాగుతుండగా, మరోవైపు శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా బ్యాంకు ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. బ్యాంకు లావాదేవీల విషయంలో నిబంధనలు పాటించనందుకు మేనేజర్ అయూబ్ బేగ్ సస్పెండ్ అయ్యారు. డమ్మీ పిస్తోల్ విషయంలో పోలీసులు ఎవరిని దోషులుగా గుర్తిస్తారో వేచిచూడాల్సి ఉంది. ఈ వ్యవహారంలో మరి కొంత మంది అధికారులపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
వాణిజ్య బ్యాంకులకు దీటుగా సేవలు
ఖమ్మంవ్యవసాయం : ఖమ్మం కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) ద్వారా వాణిజ్య బ్యాంకులకు దీటుగా సేవలు అందిస్తున్నట్లు చైర్మన్ మువ్వా విజయ్‌బాబు అన్నారు. బ్యాంకు లావాదేవీలను విస్త్రృతంగా పెంచి రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపామన్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్(డీసీసీబీ ఈయూ) సర్వసభ్య సమావేశం ఆదివారం ఖమ్మంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆయన అతిథిగా హాజరైన మాట్లాడారు. మరో రెండేళ్లయితే సహకార వ్యవస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదేళ్ల కిత్రం రైతాంగం, సహకార సంఘాలు డీసీసీబీకి సేవచేసే అవకాశాన్ని ఇచ్చాయన్నారు. తాను పదవిని చేపట్టేనాటికి రూ.800 కోట్ల టర్నోవర్‌తో ఉన్న ఈ బ్యాంక్ నేడు రూ. 2,115 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందన్నారు. డిపాజిట్లతో బ్యాంక్ అభివృద్ధి చెందుతుందని భావించి ఆ దిశగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడి వివిధ పథకాల కింద వచ్చిన నిధులను డిపాజిట్లు చేయించామన్నారు. బ్రాంచిలను ఆధునికీకరించామన్నారు. దీంతో రైతుల్లో సహకార బ్యాంక్‌పై నమ్మకం పెరిగిందన్నారు. 30 బ్రాంచిలతో ఉన్న ఖమ్మం డీసీసీబీని నేడు 50 బ్రాంచిలకు పెంచామన్నారు. మరో 8 బ్రాంచిలకు ప్రతిపాదనలు కూడా చేశామన్నారు. కొత్తగూడెం, పాల్వంచ వంటి పట్టణాల్లో నూతన బ్రాంచిల ఏర్పాటుకు కృషి జరుగుతుందన్నారు. ప్రతి మండలంలో డీసీసీబీ బ్రాంచి ఏర్పాటు చేయటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆ లక్ష్యం నెరవేరిందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో బ్యాంక్‌ను అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. సంక్షేమ నిధి తో ఏర్పాటయిన సీ-స్టార్ ఆస్పత్రిని ఎన్ని అవాంతరాలు వచ్చినా నిర్వహించి తీరుతామన్నారు. డీసీసీబీ ఉద్యోగులు తమ రెండు రోజుల వేతనం రూ. 5లక్షలను ఆసుపత్రి అభివృద్ధికి ఇవ్వటం అభినందనీయమన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఉద్యోగ సంఘానికి గౌరవ అధ్యక్షడిగా బాధ్యతలు అప్పగించారని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి ఉంటుందన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వసంతరావు మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకులకు దీటుగా డీసీసీబీని ముందుకు తీసుకుపోవాలని కోరారు. ఈ నూతనకమిటీ అధ్యక్షులు జిప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాలకవర్గసభ్యులు బోజెడ్ల అప్పారావు, మండే వీరహన్నంతరావు, రాయల శేషగిరిరావు, పోలుదాసు కృష్ణమూర్తి, సామినేని వెంకటయ్య, తాతా రఘురాం, బెఫీ యూనియన్ ప్రతినిధి ఆనందరావు, సంఢం ప్రధాన కార్యదర్శి కె.ఉపేంద్రనాథ్, ఉపాధ్యక్షులు రాయపూడి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బి.రవికుమార్, కోశాధ్యక్షులు చందర్రావు, నిర్వహణా కార్యదర్శి వెంకటరెడ్డి, ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీబీలో డిపాజిట్ లీలలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో రోజుకో లీల బయటకు వస్తోంది. ఏకంగా ఉద్యోగం చేస్తూనే మూడేళ్ల పాటు రెగ్యులర్‌గా లా కోర్సు చదవడంతోపాటు అధిక వడ్డీ కోసం ఉద్యోగుల పేరుతో భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వ్యవహారం ఆ శాఖలో చర్చనీయాంశమవుతోంది. కర్నూలు, ఎమ్మిగనూరు తదితర బ్యాంకు బ్రాంచ్‌ల్లో ఒక ఉద్యోగి రూ.60 లక్షల మేర ఫిక్స్డ్ డిపాజిట్లు(ఎఫ్డీలు) చేసినట్లు సమాచారం. తన తల్లితో పాటు ఉద్యోగి పేరు మీద కలిసి ఈ డిపాజిట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు అయినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధిక శాతం వడ్డీ వస్తుందనే ఆశతోనే ఈ విధంగా భారీ మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఇదే ఉద్యోగి ఉద్యోగం చేస్తూనే రెగ్యులర్‌గా లా కోర్సు చేశారన్న వ్యవహారం బయటకు వచ్చినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా తొక్కిపెట్టారు. ఇదే తరహాలో తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్ వ్యవహారంపై కూడా తూతూమంత్రంగా విచారణ జరిపి కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా సదరు ఉద్యోగికి పదోన్నతి ఇవ్వాలని కూడా అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తుండటం కొసమెరుపుగా మారింది. అధిక వడ్డీ ఆశతో... కేడీసీసీ బ్యాంకులో సొంత ఉద్యోగులు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇవ్వడం ఆనవాయితీ. బయటి వ్యక్తులు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ కంటే ఒక శాతం అదనంగా సొంత శాఖ ఉద్యోగులకు ఇస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని సుమారు రూ.60 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను వేర్వేరు బ్రాంచులలో తన తల్లి, స్థానికంగా బ్యాంకులో పనిచేసే బ్యాంకు ఉద్యోగి పేరు మీద ఎఫ్డీలు చేయించారు. ఇందుకోసం స్థానికంగా బ్యాంకులలో పనిచేసే సిబ్బంది కూడా విమర్శలు ఎదుర్కొంటున్న ఉద్యోగికి సహకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు మొత్తం నోట్ల రద్దు సమయంలో పాత నోట్ల రూపంలో వచ్చి పడ్డాయా అనేది కూడా తేలాల్సి ఉంది. అంటే అక్రమ సంపాదనను ఈ విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో అది కూడా అధిక వడ్డీ వచ్చే విధంగా మొత్తం వ్యవహారం నడపడం కేడీసీసీబీలో కలకలం రేపుతోంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందినట్లు తెలుస్తోంది. అయితే ఇదే ఉద్యోగిపై గతంలో లా కోర్సు చదివిన వ్యవహారంపై అడ్డంగా బుక్ అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాజా ఎపిసోడ్‌లోనూ చర్యలు ఉండవనే ధీమా వ్యక్తమవుతోంది. పదోన్నతి కోసం... వాస్తవానికి కేడీసీసీలో పనిచేసే సదరు ఉద్యోగి 2001 నుంచి 2003 వరకు కర్నూలులోని శ్రీప్రసన్న కాలేజ్ ఆఫ్ లాలో ఎల్ఎల్బీ కోర్సును రెగ్యులర్‌గా చదివారు. ఉద్యోగానికి సెలవు పెట్టకుండానే ఈ కోర్సు చదివారు. దీనిపై పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదు. తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్ల వ్యవహారం కూడా దుమారం రేపుతోంది. అయినప్పటికీ సదరు ఉద్యోగికి పదోన్నతి ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతుండటం గమనార్హం. పదోన్నతి ఇవ్వాలంటూ అధికార పార్టీకి చెందిన పలువురు రాజకీయ నేతలు కేడీసీసీబీ ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరుగుతున్న డీసీసీబీ పాలకవర్గ సమావేశం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
ఖమ్మం డీసీసీబీ ‘ఉత్తుత్తి బ్యాంక్’!
సాక్షి, హైదరాబాద్: దశాబ్దం క్రితం తెలుగులో ఓ సినిమా వచ్చింది. అందులో ‘ఉత్తుత్తి బ్యాంకు’ అని ఓ బ్యాంకు ఏర్పాటు చేస్తారు. అప్పటికప్పుడు ఓ సెటప్ చేసి డబ్బు వసూళ్లు సాగిస్తారు. సరిగ్గా అదే తీరులో ఖమ్మం పూర్వ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పాలక వర్గం కూడా దర్జాగా ఒక సహకార బ్యాంకు బ్రాంచిని తెరిచి రైతుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసింది. దానికి రిజర్వు బ్యాంకు అనుమతి లేదు సరికదా కనీసం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్)కు సమాచారం కూడా లేదు. టెస్కాబ్ జరిపిన విచారణలో ఈ విషయం బయటపడినట్లు సహకార శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు రైతుల నుంచి దర్జాగా వసూళ్లకు పాల్పడుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి నిర్మాణం రైతులకు రుణాలు, బ్యాంకు లావాదేవీలు జరపాల్సిన డీసీసీబీ.. ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఆసుపత్రి నిర్మించడం రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధం. ఖమ్మం డీసీసీబీ రైతు సంక్షేమ నిధి పేరుతో రైతులకిచ్చే పంట రుణాల నుంచి వసూళ్లకు పాల్పడిందని గతంలో జరిపిన విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. అలా రూ.8.11 కోట్లు వసూలు చేసి ఆసుపత్రి నిర్మించింది. అంతేగాక రైతు సంక్షేమ నిధి పేరిట పెద్ద ఎత్తున నిధులను ఆసుపత్రికి వెచ్చిస్తూ, వాహనాల కొనుగోళ్లకు భారీగా ఖర్చు చేస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. వసూలు చేసిన సొమ్మును రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నట్లు పాలకవర్గం ఇచ్చిన వివరణ రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధమని టెస్కాబ్ ఇప్పటికే స్పష్టంచేసింది. వచ్చే నెలాఖరుకు పాలకవర్గ కాలపరిమితి ముగియనుంది. ఆరోపణలు నిజమేనని తేలాక కూడా ప్రభుత్వం మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
రైతన్నల కోసం కార్పొరేట్ హాస్పిటల్
-
పీఏసీఎస్‌లలో ఇక మినీ ఏటీఎంలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) తమ ఖాతాదారులు ఆయా సంఘాల్లోనే నగదు తీసుకునే వినూత్న అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సహకార బ్యాంకులను బలోపేతం చేయడం కోసం ప్రతి సంఘాన్ని మినీ ఏటీఎం కేంద్రంగా మార్చేందుకు నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని 99 ప్రాథమిక సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారు ఇక నగదు తీసుకునేందుకు బ్యాంకులను ఆశ్రయించే ఇబ్బంది లేకుండా.. నేరుగా మినీ ఏటీఎంల ద్వారా సహకార సంఘంలోనే నగదు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం అన్ని సంఘాలకు ఏటీఎంలతోపాటు మైక్రో సిమ్ కార్డులను పంపిణీ చేసింది. అయితే సహకార బ్యాంకులో ఖాతా ఉండి.. ఏటీఎం కార్డు ఉన్న వారికి ఇది ఉపయోగపడనుంది. ఒక్క ఏటీఎం కార్డు నుంచి రోజుకు రూ.10వేల వరకు నగదు తీసుకునే అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లలో కలిపి 1.60లక్షల మంది సభ్యులు ఉండగా.. ఇప్పటికే 1.50లక్షల మందికి ఏటీఎం కార్డులు జారీ చేశారు. వివిధ కారణాల వల్ల వీటిలో అనేకం ఉపయోగించకపోవడం, కొన్నిచోట్ల రైతులు వీటిని వినియోగించాలన్నా అవి పనిచేయకపోవడం వంటి అంశాలను గుర్తించిన సహకార బ్యాంకు అధికారులు యుద్ధప్రాతిపదికన ఏటీఎం కార్డులన్నింటినీ యాక్టివేట్ చేస్తున్నారు. ఎర్రుపాలెం సహకార సంఘంలోని మినీ ఏటీఎం అక్కడి రైతులకు సేవలందిస్తోంది. ఇదే తరహాలో అన్నిచోట్ల రైతులకు సేవలందించేలా ఏటీఎం కేంద్రాలను సిద్ధం చేయాలని సహకార శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రారంభ దశలో కేవలం రైతుల ఖాతాలో ఉన్న నగదును తీసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నా.. మరో మూడు నెలల్లో కొత్త సాఫ్ట్వేర్ సహాయంతో ఆయా ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాలో ఇదే ఏటీఎం ద్వారా డబ్బులు వేసుకోవడం.. ఇతర ఖాతాల్లోకి నగదు బదిలీ చేసుకోవడం వంటి సేవలను కూడా అందించాలని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. రోజుకు వెయ్యి మందికి సరిపోను.. ప్రతి రోజు ఒక్కో సహకార సంఘం నుంచి వెయ్యి మంది రైతులు రూ.10వేల చొప్పున నగదు తీసుకునేందుకు అనువుగా డబ్బును సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో ఖమ్మం, వైరా, సత్తుపల్లి, పెనుబల్లి, మర్లపాడు, అశ్వారావుపేట, కొత్తగూడెం, కూసుమంచి, ఎర్రుపాలెం, చర్ల, వెంకటాపురంలో ఏటీఎం కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటికి బహుళ ఆదరణ ఉండటంతో మరో ఐదు ప్రాంతాల్లో కొత్త ఏటీఎం కేంద్రాల కోసం సహకార బ్యాంకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. సహకార బ్యాంకుల్లో ఖాతా ఉన్న వారే కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంలు కలిగిన ఖాతాదారులు సైతం సహకార సంఘాల వద్ద ఉన్న మినీ ఏటీఎంల ద్వారా నగదు తీసుకునే సౌలభ్యం కల్పించారు. దీంతో నగదు అవసరాల కోసం మండల, పట్టణ కేంద్రాలకు వచ్చి ఏటీఎంలు, బ్యాంకుల వద్ద గంటలతరబడి బారులు తీరాల్సిన అవసరం రైతులకు, గ్రామీణ ప్రాంత ఖాతాదారులకు లేకుండా.. ఆయా గ్రామాల్లోనే ఈ ఏటీఎం కేంద్రాలను నిర్వహించడం వల్ల రైతుకు సమయం ఆదా అవుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మరో వారం, పది రోజుల్లో జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో మినీ ఏటీఎం కేంద్రాలు రైతులకు, డీసీసీబీ ఖాతాదారులకు సేవలు అందించనున్నాయి. జిల్లాలో 47 కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచిలు ఉండగా.. వాటి పరిధిలో పనిచేసే పీఏసీఎస్‌లు ఆయా బ్యాంకుల నుంచి రోజువారీగా నగదు తీసుకుని రైతులకు ఏటీఎం కేంద్రాల ద్వారా అందజేసి.. మిగిలిన మొత్తాన్ని లేదా ఆరోజు లావాదేవీలను బ్యాంకు అధికారులకు ఖాతాలవారీగా సమర్పించనున్నారు. -
‘సహకార’ సేవలను సద్వినియోగం చే సుకోవాలి
ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి నర్సాపూర్ : సహకార బ్యాంకు సేవలను రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి సూచించారు. మంగళవారం డీసీసీబీ నర్సాపూర్ శాఖలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన బ్యాంకులో పూజలు చేసిన అనంతరం ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మదన్‌రెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకులు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు రుణాలు ఇస్తున్నాయని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ డెయిరీ ఫారాల ఏర్పాటుకు దరఖాస్తు చేసిన 20 రోజుల్లో రుణాలు అందచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సన్నకారు రైతులకు 25శాతం సబ్సిడీ, ఎస్సీ,ఎస్టీలకు 35 శాతం సబ్సిడీ ఇవ్వనున్నామన్నారు. డీసీసీబీ కేంద్ర బ్యాంకు సీఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఏడు బ్యాంకులలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను ప్రారంభించామని, మంగళవారం నర్సాపూర్‌తో పాటు జోగిపేట శాఖలలో ప్రాంభించనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ ఉపాద్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, నర్సాపూర్ శాఖ మేనేజర్ శ్రీనివాస్, ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నర్సాపూర్ సొసెటీ ఇన్చార్జి చైర్పర్సన్ శారద, శివ్వంపేట సొసైటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి పలువురు టీఆర్ఎస్ నాయకులు అశోక్‌గౌడ్, బోగ చంద్రశేకర్, హబీబ్ ఖాన్, భిక్షపతి, వెంకటేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టపగలే భారీ చోరీ
షాద్‌నగర్: రాత్రీ, పగలనే తేడా లేదు. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపిస్తే చాలు దొంగలు తమ పని పూర్తి చేసుకుని వెళుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని విజయ్‌నగర్ కాలనీలో మంగళవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.80 వేల నగదు చోరీకి గురైంది. మహబూబ్‌నగర్‌లోని డీసీసీబీ బ్యాంకులో డీజీఎంగా పనిచేసే లక్ష్మి మంగళవారం ఉదయం విధులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఆమె భర్త ఇంటికి తాళం వేసి ఓ ఫంక్షన్‌కు వెళ్లగా... తిరిగొచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపల బీరువా తలుపులు కూడా తెరచి ఉన్నాయి. సమాచారం అందుకున్న ఏఎస్పీ కల్మేశ్వర్ సిబ్బందితో కలసి సాయంత్రం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, మధ్యాహ్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ జరిగిన ఇంటి వద్ద తచ్చాడుతుండగా చూసినట్టు స్థానికులు చెబుతున్నారు.