ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి
నర్సాపూర్ : సహకార బ్యాంకు సేవలను రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి సూచించారు. మంగళవారం డీసీసీబీ నర్సాపూర్ శాఖలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన బ్యాంకులో పూజలు చేసిన అనంతరం ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మదన్‌రెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకులు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు రుణాలు ఇస్తున్నాయని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ డెయిరీ ఫారాల ఏర్పాటుకు దరఖాస్తు చేసిన 20 రోజుల్లో రుణాలు అందచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
సన్నకారు రైతులకు 25శాతం సబ్సిడీ, ఎస్సీ,ఎస్టీలకు 35 శాతం సబ్సిడీ ఇవ్వనున్నామన్నారు. డీసీసీబీ కేంద్ర బ్యాంకు సీఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఏడు బ్యాంకులలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను ప్రారంభించామని, మంగళవారం నర్సాపూర్‌తో పాటు జోగిపేట శాఖలలో ప్రాంభించనున్నట్లు ఆయన చెప్పారు.
కార్యక్రమంలో డీసీసీబీ ఉపాద్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, నర్సాపూర్ శాఖ మేనేజర్ శ్రీనివాస్, ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నర్సాపూర్ సొసెటీ ఇన్‌చార్జి చైర్‌పర్సన్ శారద, శివ్వంపేట సొసైటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి పలువురు టీఆర్‌ఎస్ నాయకులు అశోక్‌గౌడ్, బోగ చంద్రశేకర్, హబీబ్ ఖాన్, భిక్షపతి, వెంకటేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.