mla madan reddy
-
బీ–ఫారాలు ఇవ్వనున్న బీఆర్ఎస్.. అయినా మదన్‌రెడ్డికి అందని పిలుపు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టిక్కెట్టు దక్కని నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో అధినేత కేసీఆర్ చర్చించేందుకు సుముఖంగా లేరా..? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మదన్‌రెడ్డితో మాట్లాడుతుండటమే ఇందుకు కారణమా..? అవుననే అంటున్నాయని రాజకీయ వర్గాలు. సీఎం కేసీఆర్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బరిలో ఉంటానని మదన్‌రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ఆయనతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆయన పట్టు వీడటం లేదు. సీఎంతో ఉన్న సన్నిహితంతో కాస్త వెనక్కి తగ్గే యోచనలో ఉన్నప్పటికీ, ఆయన అనుచరులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. దీంతో నర్సాపూర్ అభ్యర్థిత్వంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా, ఈనెల 15వ తేదీన బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ ప్రక్రియకు ఇంకా ఒక రోజే గడువుంది. అయినప్పటికీ మదన్‌రెడ్డికి సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రాకపోవడంతో ఆయన ఎటూ తేల్చు కోలేకపోతున్నారు. పెండింగ్‌లో కాంగ్రెస్ టిక్కెట్? ఆర్ఎస్ అభ్యర్థిత్వం విషయంలో సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఈ టిక్కెట్టు ప్రకటన విషయంలో వేచి చూసే ధోరణిలో ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇంకా ఏ నియోజకవర్గానికి అభ్యర్థిత్వాలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ, చాలా చోట్ల అభ్యర్థులకు పరోక్షంగా టిక్కెట్లపై సంకేతాలిచ్చింది. నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని, ప్రజలను కలిసి మద్దతు కూడగట్టాలని అనధికారికంగా అభ్యర్థులకు ఆదేశాలిచ్చింది. ఈ సంకేతాలున్న ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతున్నారు. కానీ, నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఈ సంకేతాలు ఎవరికీ లేవనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. దీంతో మదన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోందనే చర్చ స్థానికంగా జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, గట్టి క్యాడర్ ఉన్న మదన్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా సునీతా లక్ష్మారెడ్డిపై బలమైన అభ్యర్థిని రంగంలోకి దించినట్లు అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఎటూ తేల్చుకోలేకపోతున్న క్యాడర్ నర్సాపూర్ అభ్యర్థిత్వం ఎటూ తేలకపోవడంతో బీఆర్ఎస్ క్యాడర్లో అయోమయం నెలకొంది. జనగామ టిక్కెట్టు విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చిన అధినాయకత్వం నర్సాపూర్ విషయంలో ఇంకా ఈదిశగా చర్యలు చేపట్టకపోవడంతో క్యాడర్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. మదన్‌రెడ్డితో ఉండాలా, సునీతారెడ్డి వైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నారు. అయితే మదన్‌రెడ్డి అనుచరుల్లో కొందరు సునీతాలక్ష్మారెడ్డి వైపు క్రమంగా మొగ్గు చూపుతుండటం ఆసక్తిగా మారింది. సునీతారెడ్డికి పరోక్షంగా సంకేతాలు.. నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిత్వంపై అధినేత నుంచి సంకేతాలు రావడంతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి స్థానిక ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పక్షం రోజుల క్రితం నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న ఆమె గ్రామాల్లో పర్యటిస్తూ అందరినీ కలుసుకుంటున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. గురువారం కూడా చిలప్‌చెడ్, నర్సాపూర్ మండలాల్లో పర్యటించారు. -
ఎనిమిది వేల ఇళ్లు మంజూరు చేయిస్తా
నర్సాపూర్: నర్సాపూర్ నియోజకవర్గానికి త్వరలో ఎనిమిది వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయిస్తానని స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ప్రకటించారు. శనివారం స్థానిక ఓ ఫంక్షన్ హాలులో ఆసరా పింఛన్ లబ్దిదారులకు పెరిగిన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొనగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి నియోజకవర్గానికి ఎనిమిది వేల డబుల్ బెడ్రూంలను మంజూరు చేయించి నియోజకవర్గంలోని పేదలందరికీ గూడు కల్పిస్తానని చెప్పారు. కాగా రాబోయె రెండేళ్లలో కాళేశ్వరం నీళ్లు నియోజకవర్గానికి రానున్నాయని, సీఎంతో మాట్లాడి కాళేశ్వరం నీళ్లు ఎక్కువ వచ్చేలా చేస్తానని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు వస్తే కరువు ఉండదని నీటి సమస్య కూడా ఉండదన్నారు. కాగా గ్రామాలు, పురపాలక సంఘాలను మరింత అభివృద్ధి చేసే దిశగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అండర్ గ్రౌండ్ మురికి కాలువలు నిర్మిచేందుకు సీఎం ఆలోచిస్తున్నారని చెప్పారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఎవరికి వారు తమ బాధ్యతలను నెరవేర్చాలని మదన్‌రెడ్డి సూచించారు. పార్టీలకు అతీతంగా సమష్టిగా ముందుకు సాగితేనే గ్రామాలు పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు. కాగా గత ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పింఛన్ సొమ్మును పెంచారని తెలిపారు. త్వరలో సీఎం జిల్లాలో పర్యటించి సమీక్ష జరిపి అక్కడే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని మదన్‌రెడ్డి పేర్కొన్నారు. వేసవిలో నీటి కొరత తలెత్తగా సర్పంచ్‌లు, అధికారులు నీటి సమస్యను పరిష్కరించేందుకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. -
‘తండాలను పంచాయతీలు చేసినం’
కౌడిపల్లి(నర్సాపూర్): టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే మదన్ర్రెడ్డి తెలిపారు. శుక్రవారం మడలంలోని రాజిపేట పంచాయతీ జాజితండాను కొత్తగా పంచాయతీగా ఏర్పాటు చేయడంతో సర్పంచ్ మహ్మపాష ఆధ్వర్యంలో తండాలో టీఆర్ఎస్పార్టీ జెండా అవిష్కరణ, పార్టీలో చేరిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరుకాగా వెంకట్రావ్‌పేట్ గేట్ నుంచి తండా వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు కొత్త పథకాలను సైతం ప్రవేశపెడుతూ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. తండాలను పంచాయతీలుగా చేస్తామన్న ఎన్నికల హామీ మేరకు కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పంచాయతీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పదేళ్లపాటు రిజర్వేషన్ల అమలు ఉండేలా చట్టం తెచ్చిందన్నారు. దీంతో ఎన్నికైన సర్పంచ్‌లు అభివృద్ధికి పాటు పడుతారని తెలిపారు. తండాలలో సర్పంచ్ల కోసం ఎన్నికల్లో పోటిపడటానికి మంచి వ్యక్తులను చూసి ఏకగ్రీవం చేసుకోవాలని కోరారు. సమైఖ్యంగా ఉండి అభివృద్ధి చేసుకునే వీలుంటుందని చెప్పారు. తండాలో టీఆర్ఎస్పార్టీ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. టీఆర్ఎస్లో చేరిక ః జాజి, జగ్య, జయరాం, రామాలయం తండాలకు చెందిన మాజీ సర్పంచ్ పత్తినాయక్, వార్డుసభ్యులు అంబిబాయ్, అంబుర్యనాయక్, మాజీ వార్డు సభ్యులు వాల్య, రాములు నాయక్‌తోపాటు లక్ష్మన్, కిషన్, హీర్య, రెడ్య, విఠల్, హర్య, కాశ్య, గోపాల్, జీవుల, రాజు, వాల్య, గోప్య, గేమ్య తదితర వంద మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సార రామాగౌడ్, సర్పంచ్ ఎండీ పాష, నాయకులు లింగంగౌడ్, గణేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సహకార’ సేవలను సద్వినియోగం చే సుకోవాలి
ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి నర్సాపూర్ : సహకార బ్యాంకు సేవలను రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి సూచించారు. మంగళవారం డీసీసీబీ నర్సాపూర్ శాఖలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన బ్యాంకులో పూజలు చేసిన అనంతరం ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మదన్‌రెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకులు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు రుణాలు ఇస్తున్నాయని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ డెయిరీ ఫారాల ఏర్పాటుకు దరఖాస్తు చేసిన 20 రోజుల్లో రుణాలు అందచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సన్నకారు రైతులకు 25శాతం సబ్సిడీ, ఎస్సీ,ఎస్టీలకు 35 శాతం సబ్సిడీ ఇవ్వనున్నామన్నారు. డీసీసీబీ కేంద్ర బ్యాంకు సీఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఏడు బ్యాంకులలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను ప్రారంభించామని, మంగళవారం నర్సాపూర్‌తో పాటు జోగిపేట శాఖలలో ప్రాంభించనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ ఉపాద్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, నర్సాపూర్ శాఖ మేనేజర్ శ్రీనివాస్, ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నర్సాపూర్ సొసెటీ ఇన్చార్జి చైర్పర్సన్ శారద, శివ్వంపేట సొసైటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి పలువురు టీఆర్ఎస్ నాయకులు అశోక్‌గౌడ్, బోగ చంద్రశేకర్, హబీబ్ ఖాన్, భిక్షపతి, వెంకటేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
'అక్బర్.. గన్ మిస్‌ఫైర్ కావడంతోనే చనిపోయాడు'
హైదరాబాద్: గన్ మిస్‌ఫైర్ కావడంతోనే డ్రైవర్ అక్బర్ చనిపోయాడని డీసీపీ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. గన్‌మెన్ రవీందర్ చేతిలోంచి గన్ను అక్బర్ అడిగితీసుకున్నాడని చెప్పారు. మంగళవారం డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. డ్రైవర్ అక్బర్ గన్ చూస్తున్న సమయంలో గన్ ఒక్కసారిగా మిస్‌ఫైర్ అవడంతో అతడి చాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని పేర్కొన్నారు. దాంతో అక్బర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. సర్వీస్ రివాల్వర్ ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదని హెచ్చరించారు. ఈ విషయంలో చట్టరీత్యా గన్‌మెన్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. వ్యక్తి ప్రాణాలు పరోక్షంగా తీసిన గన్‌మెన్ రవీందర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీసీపీ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. కాగా, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంగళవారం మధ్యాహ్నం మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్ అక్బర్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
'ఎమ్మెల్యే డ్రైవర్ మృతిపై అనుమానాలున్నాయి'
హైదరాబాద్: హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్ అక్బర్ మృతిపై అనుమానాలున్నాయని అతడి పిన్ని రషీదా ఆరోపించారు. వారం రోజులుగా అక్బర్ మౌనంగా ఉంటున్నాడనీ, కొత్త డ్రైవర్‌తో ఏదో ఒకటి తేల్చుకుంటానని అతడు ఉదయం అన్నట్టుగా రషీదా చెప్పింది. అయితే మధ్యాహ్నానికల్లా అక్బర్ చనిపోయాడని తనకు తెలిసిందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్ అక్బర్ మంగళవారం మధ్యాహ్నం గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
గన్ మిస్‌ఫైర్: నర్సాపూర్ ఎమ్మెల్యే డ్రైవర్ మృతి
హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాల్పులు కలకలం రేపాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్ అక్బర్ మంగళవారం మధ్యాహ్నం మరణించాడు. తొలుత అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే.. గన్‌మన్ నుంచి గన్ తీసుకుని దాన్ని చూస్తుండగా మిస్‌ఫైర్ అయ్యి, బుల్లెట్ బయటకు వచ్చి అతడు మరణించినట్లు తర్వాత తేలింది. గన్‌మన్, డ్రైవర్ ఇద్దరూ వాహనం దగ్గరే ఉండటం, ఎమ్మెల్యే లోపలకు వెళ్లడంతో గన్ మన్ వద్ద ఉన్న తుపాకిని అక్బర్ తీసుకుని చూస్తున్నట్లు తెలిసింది. అంతలో.. అది పొరపాటున పేలడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మొత్తమ్మీద తుపాకి చూడాలన్న సరదా.. నిండు ప్రాణాలను బలిగొంది.