టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
కౌడిపల్లి(నర్సాపూర్): టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే మదన్‌ర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మడలంలోని రాజిపేట పంచాయతీ జాజితండాను కొత్తగా పంచాయతీగా ఏర్పాటు చేయడంతో సర్పంచ్ మహ్మపాష ఆధ్వర్యంలో తండాలో టీఆర్‌ఎస్‌పార్టీ జెండా అవిష్కరణ, పార్టీలో చేరిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరుకాగా వెంకట్రావ్‌పేట్ గేట్ నుంచి తండా వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు కొత్త పథకాలను సైతం ప్రవేశపెడుతూ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.
తండాలను పంచాయతీలుగా చేస్తామన్న ఎన్నికల హామీ మేరకు కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పంచాయతీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పదేళ్లపాటు రిజర్వేషన్ల అమలు ఉండేలా చట్టం తెచ్చిందన్నారు. దీంతో ఎన్నికైన సర్పంచ్‌లు అభివృద్ధికి పాటు పడుతారని తెలిపారు. తండాలలో సర్పంచ్‌ల కోసం ఎన్నికల్లో పోటిపడటానికి మంచి వ్యక్తులను చూసి ఏకగ్రీవం చేసుకోవాలని కోరారు. సమైఖ్యంగా ఉండి అభివృద్ధి చేసుకునే వీలుంటుందని చెప్పారు. తండాలో టీఆర్‌ఎస్‌పార్టీ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు.
టీఆర్‌ఎస్‌లో చేరిక ః
జాజి, జగ్య, జయరాం, రామాలయం తండాలకు చెందిన మాజీ సర్పంచ్ పత్తినాయక్, వార్డుసభ్యులు అంబిబాయ్, అంబుర్యనాయక్, మాజీ వార్డు సభ్యులు వాల్య, రాములు నాయక్‌తోపాటు లక్ష్మన్, కిషన్, హీర్య, రెడ్య, విఠల్, హర్య, కాశ్య, గోపాల్, జీవుల, రాజు, వాల్య, గోప్య, గేమ్య తదితర వంద మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సార రామాగౌడ్, సర్పంచ్ ఎండీ పాష, నాయకులు లింగంగౌడ్, గణేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment