రాత్రీ, పగలనే తేడా లేదు. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపిస్తే చాలు దొంగలు తమ పని పూర్తి చేసుకుని వెళుతున్నారు.
షాద్‌నగర్: రాత్రీ, పగలనే తేడా లేదు. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపిస్తే చాలు దొంగలు తమ పని పూర్తి చేసుకుని వెళుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని విజయ్‌నగర్ కాలనీలో మంగళవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.80 వేల నగదు చోరీకి గురైంది. మహబూబ్‌నగర్‌లోని డీసీసీబీ బ్యాంకులో డీజీఎంగా పనిచేసే లక్ష్మి మంగళవారం ఉదయం విధులకు వెళ్లారు.
మధ్యాహ్నం సమయంలో ఆమె భర్త ఇంటికి తాళం వేసి ఓ ఫంక్షన్‌కు వెళ్లగా... తిరిగొచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపల బీరువా తలుపులు కూడా తెరచి ఉన్నాయి. సమాచారం అందుకున్న ఏఎస్పీ కల్మేశ్వర్ సిబ్బందితో కలసి సాయంత్రం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, మధ్యాహ్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ జరిగిన ఇంటి వద్ద తచ్చాడుతుండగా చూసినట్టు స్థానికులు చెబుతున్నారు.