Pune ACP Bharat Gaikwad Shoots Himself After Killing ​His Wife And Nephew - Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి భార్య, మేనల్లుడిని చంపి.. గన్‌తో కాల్చుకున్న ఏసీపీ.. ఏం జరిగింది?

Published Mon, Jul 24 2023 12:45 PM | Last Updated on Mon, Jul 24 2023 12:58 PM

Pune ACP Bharat Gaikwad Shoots ​His Wife And Nephew After Suicide - Sakshi

పూణే: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి.. తన భార్య, మేనల్లుడిని సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చి.. అనంతరం తనను తాను కాల్చకుని చనిపోయాడు. ఈ ఘటన పూణేలో చోటుచేసుసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. 

వివరాల ప్రకారం.. అమరావతి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ భరత్‌ గైక్వాడ్‌ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. అంతకంటే ముందు తన భార్య మోని (44), మేనల్లుడు దీపక్ (35)లను తుపాకీతో కాల్చి చంపాడు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

అ‍యితే, గైక్వాడ్ భార్య తమ ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్నారు. గైక్వాడ్‌ అమరావతి ఏసీపీగా విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన తర్వాతే ఇలా జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించి.. ఆ ముగ్గురినీ జూపిటర్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, కాల్పులపై కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

ఇది కూడా చదవండి: ప్రియుడు మరో యువతితో తిరుగుతున్నాడని...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement