Gold metals
-
20 బంగారు పతకాలతో అగ్రస్థానం
కొలంబో: మొదటి రోజు 11 స్వర్ణాలతో మెరిసిన అథ్లెట్లు రెండో రోజు 9 బంగారు పతకాలతో సత్తా చాటడంతో దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ అగ్రస్థానాన నిలిచింది. ఏడు దేశాలు తలపడిన ఈ మీట్ ఆదివారంతో ముగిసింది. మొత్తం 20 స్వర్ణాలు, 22 రజతాలు, 8 కాంస్యాలతో భారత్ పతకాల పట్టికలో మొదటి స్థానం దక్కించుకుంది. 12 స్వర్ణాలు, 10 రజతాలు, 19 కాంస్యాలతో ఆతిథ్య శ్రీలంక ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులు జపాన్‌లోని జిఫులో వచ్చే నెల 7 నుంచి 10 వరకు నిర్వహించే ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. -
చోరీలకు పాల్పడుతోన్న ఐదుగురి అరెస్ట్
రాజేంద్రనగర్(హైదరాబాద్‌సిటీ): తాళం వేసిన ఇళ్ల తాళాలు పగులగొట్టి వరుస చోరీలకు పాల్పడుతోన్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 25 తులాల బంగారు ఆభరణాలు, 5 టీవీలు, ఒక బైక్, మూడు సిలిండర్లు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. పట్టుబడ్డ ఐదుగురు దొంగలు ఉప్పర్‌పల్లి వాసులుగా పోలీసులు వెల్లడించారు. -
బంగారు ఆభరణాలు పాలిష్ చేస్తామని చెప్పి..
హైదరాబాద్‌సిటీ: ఎస్ఆర్ నగర్లో బంగారు ఆభరణాలు పాలిష్ చేస్తామని చెప్పి ఇంట్లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బంగారంతో ఉడాయించారు. సబీనా సుల్తానా అనే మహిళ దృష్టి మరల్చి 3.8 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కలసపాడు ఎస్బీఐలో రూ.4.30 లక్షలు చోరీ
కలసపాడు(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా కలసపాడులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బులు జమచేసేందుకు వెళ్లిన ఒక వ్యక్తి నుంచి రూ.4.30 లక్షలు అపహరించిన సంఘటన శనివారం ఉదయం జరిగింది. కలసపాడు ఎంపీపీ రామకృష్ణారెడ్డి కుమారుడు తిరుపతిరెడ్డి(బాబు) బంగారు నగలపై తీసుకున్న రుణం చెల్లించేందుకు రూ.4.30 లక్షలు తీసుకె ళ్లాడు. నగదు ఉంచిన బ్యాగు పక్కన పెట్టుకుని పేయీ స్లిప్ రాస్తుండగా పక్కనే ఉన్న ముగ్గురు వ్యక్తులు నగదు సంచిని తీసుకుని ఉడాయించారు. ఈ విషయమై తిరుపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
4 తులాల బంగారు ఆభరణాలు, నగదు చోరీ
అనంతసాగరం: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఖాదర్ మస్తాన్ అనే వ్యక్తిలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు నాలుగు తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదును అపహరించుకుపోయారు. పక్కనే ఉన్న ఖాదర్‌వలీ ఇంటి ఆవరణలోకి వెళ్లి కిటికీ ద్వారా లోపల చిల్లకు తగిలించిన షర్ట్‌ను బయటకు తీసి నగదు, సెల్‌ఫోన్‌ను తస్కరించుకుపోయారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. -
మూడు రైళ్లలో దొంగల బీభత్సం
అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సిగ్నల్ కోసం ఆగి ఉన్న రైళ్ల పై దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఇదే అదునుగా చేసుకొని మూడు రైళ్లలోని నాలుగు భోగీలలో చోరీలకు పాల్పడ్డారు. వివరాలు.. నాందేడ్ నుంచి బెంగళూరు వెళ్తున్న నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి చేసిన దుండగులు అనంతరం బోగీలలోకి చొరబడి ప్రయాణికుల నుంచి సుమారు 50 తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. అనంతరం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ పై కూడా ఇదే విధంగా దాడి చేసిన దుండగులు 4 బోగీల్లోని దోపిడీకి పాల్పడ్డారు. ఆ తర్వాత ముంబాయి నుంచి బెంగళూరు వెళ్తున్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ లో కూడా దోపిడీకి దిగారు. దీంతో బాధితులు రైల్వే పోలీసులను ఆశ్రయించారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న లోకో పైలట్ భాస్కర్ దొంగలను ప్రతిఘటించడానికి ప్రయత్నించడంతో దొంగలు అతని పై దాడికి దిగారు. దీంతో భాస్కర్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో ప్రయాణికుడు గాయపడ్డారు. ఈ మూడు ఘటనలలో సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. సుమారు10 మంది దుండగులు అకస్మాత్తుగా వచ్చి కత్తులతో బెదిరించి దాడి చేశారని ప్రయాణికులు చెబుతున్నారు. కాగా గతంలో కూడా ఇదే ప్రాంతంలో రెండుసార్లు ఇలాంటి ఘటనలు జరిగిన అధికారులు కళ్లు తెరవకపోవడం గమనార్హం. -
అగ్నిప్రమాదంలో రూ. 3 లక్షల ఆస్తి నష్టం
రెడ్డిగూడెం(కృష్ణా): ప్రమాదవశాత్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి రెండు పూరిళ్లు ఇళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో ఇంటిలో ఉన్న రూ. 62 వేల నగదుతో పాటు బంగారు ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో.. మంటలు ఎగిసిపడి రెండు పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు వ్యాపించకుండా.. అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రూ. మూడు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు సమాచారం. -
20 తులాల బంగారు ఆభరణాలు చోరీ
నాగోలు: ఇంటి తాళాలు పగులగొట్టి 20 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాక్‌టౌన్‌కాలనీలోని ఓ అపార్ట్మెంటులో గడ్డం ప్రియదర్శిని ప్రైవేటు ఉద్యోగిని. శనివారం రాత్రి ఉద్యోగానికి వెళ్లి ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి వెళ్లింది. అప్పటికే ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బయటకు వెళుతున్నారా! ఇల్లు జాగ్రత్త!
శంకరపట్నం(కరీంనగర్): బయటకు వెళుతున్నారా? అయితే మీ ఇల్లు జాగ్రత్త! ఇంటికి తాళం వేశాము కదా ఏమౌతుందిలే.. అనుకోకండి.. అది గమనించిన దోపిడీ దొంగలు అదను చూసుకుని పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన బుర్రా సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలసి సోమవారం ఉదయం హుస్నాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగుల గొట్టి ఇంట్లో ప్రవేశించారు. బీరువాలో దాచిన ఆరు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. కొద్దిసేపటి తర్వాత ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని చుట్టుపక్కల వారు చూసి, సత్యనారాయణకు ఫోన్లో సమాచారం అందించారు. దాంతో ఆయన వచ్చి ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రవికుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, కరీంనగర్ నుంచి క్లూస్‌టీంను రప్పించారు. -
ఇల్లు అద్దెకు కావాలని పిలిచి దోపిడీ... నిందితుల అరెస్ట్
కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి): ఓ వ్యాపారిని బెదిరించి దోపిడికి పాల్పడిన ఐదుగురిని పేట్ బషీరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుచిత్ర సమీపంలోని గోదావరి హోమ్స్‌లో నివాసముండే రమేష్ బాబుకు స్థానికంగా జేకే నగర్లో మరో ఇల్లు ఇంది. ఇందులో పై పోర్షన్‌ను శర్మ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. కింది పోర్షన్ గోదాం కోసం కావాలని జూలై 16న రమేష్‌బాబును పిలిపించాడు. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులు వ్యాపారి రమేష్‌పై దాడి చేసి 3.5 తులాల బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డు తీసుకున్నారు. దాని ద్వారా రూ.50 వేలు డ్రా చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం సుచిత్ర చౌరస్తా సమీపంలో గుంటూరు జిల్లాకు చెందిన పొట్టసిరి అంకారావు అలియాస్ శర్మ (36), జలగం నాగేంద్రబాబు (24), అద్దంకి రమేష్ (30), వజ్రోజి చంద్రమౌళి (52), పొట్టసిరి చిన్న శంకర్రావు (49)ను క్రైం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తామే దోపిడీకి పాల్పడినట్లు అంగీకరించారు. వీరి నుంచి ఆభరణాలు, నగదును రికవరీ చేశారు. -
పట్టపగలే భారీ చోరీ
షాద్‌నగర్: రాత్రీ, పగలనే తేడా లేదు. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపిస్తే చాలు దొంగలు తమ పని పూర్తి చేసుకుని వెళుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని విజయ్‌నగర్ కాలనీలో మంగళవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.80 వేల నగదు చోరీకి గురైంది. మహబూబ్‌నగర్‌లోని డీసీసీబీ బ్యాంకులో డీజీఎంగా పనిచేసే లక్ష్మి మంగళవారం ఉదయం విధులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఆమె భర్త ఇంటికి తాళం వేసి ఓ ఫంక్షన్‌కు వెళ్లగా... తిరిగొచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపల బీరువా తలుపులు కూడా తెరచి ఉన్నాయి. సమాచారం అందుకున్న ఏఎస్పీ కల్మేశ్వర్ సిబ్బందితో కలసి సాయంత్రం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, మధ్యాహ్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ జరిగిన ఇంటి వద్ద తచ్చాడుతుండగా చూసినట్టు స్థానికులు చెబుతున్నారు. -
సామర్లకోటలో దారుణ హత్య
తూర్పుగోదావరి(సామర్లకోట): సామర్లకోట మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. చంద్రశేఖర స్వామి గుడి వీధిలో ఓ ఆగంతకుడు ఇంట్లో దూరి కంచర్ల వడ్డి కాసులు(58) అనే మహిళ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకోవడమే కాకుండా కత్తితో పొడిచి చంపాడు. బయటి వారికి అరుపులు వినపడకుండా లోపలి గడియపెట్టి టీవీ సౌండ్ పెంచాడు. గ్యాస్‌సిలిండర్ లీక్ చేసి గొళ్లెం పెట్టి వెళ్లిపోయాడు. ఇంతలో భర్త ఇంటికి వచ్చి చూసేసరికి భార్య రక్తపుమడుగులో పడి ఉంది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. -
గరీబ్ కా గోల్డ్
హైదరాబాద్: రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు ఓవైపు.. చైన్ స్నాచర్ల బెడద మరోవైపు.. దీంతో బంగారు నగలు దరించి బయటకు వెళ్లి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుతామనే భరోస మహిళలకు లేకుండా పోతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు పెళ్లిల్లకు వెళ్లాలంటే నగలు లేకుండా వెళ్లడం ఎలా..? ఈ ప్రశ్నకు ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తున్న వన్‌గ్రాం గోల్డ్ నగలు సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. బంగారు నగలకు ఏ మాత్రం తీసిపోని ఈ అభరణాలపై మగువలే కాక కళాశాల యువత కూడా మక్కువ చూపుతున్నారు. ఈ నగలను ధరిస్తే స్వచ్చమైన బంగారు నగలు దరించినట్టే ఉండడం వల్ల ఇవి ఇంతటి ఆదరణ పొందుతున్నాయి. ఈ వన్ గ్రాం గోల్డ్ నగలు నగరంలోని బేగం బజార్, చార్మినార్ ప్రాంతాల్లో విరివిగా లభిస్తున్నాయి. -
ధర్మవరంలో దొంగల ముఠా అరెస్ట్
జిల్లాలో ధర్మవరంలో దొంగల ముఠాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో కానిస్టేబుల్ లింగరాజు సహా, ఐదుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 75 వేల విలువ చేసే బంగారు అభరణాలు, ఒక ఇన్నోవో కారును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దొంగల ముఠాపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. -
అన్‌కట్ అదుర్స్
ఆభరణాలనేవి ఐశ్వర్యానికి ప్రతీకలుగా అన్పించేవేమోగానీ... ఇప్పుడలా కాదు. ఆధునిక పోకడలు పోతున్న నగరవాసుల దృష్టిలో అవి జీవనశైలికి ప్రతిబింబాలు. ధరించే దుస్తులైనా, ఆభరణాలైనా అభిరుచికి తగినట్లుగా ఉండాలని నవతరం కోరుకుంటోంది. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. ఇంట్లో జరిగే చిన్న శుభకార్యం నుంచి ఎంగేజ్మెంట్ల వరకు మహిళలు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక పెళ్లిళ్లైతే చెప్పనవసరం లేదు. జీవితంలో ఒకేసారి జరిగే పెళ్లిలో వధువు అందంగా, ఆకర్షణీయంగా ఉండేందుకు ధగధగలాడే నగలు ధరించేలా నగరవాసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారి ఆసక్తిని బట్టి నగరంలోని జ్యువెలరీ సంస్థలు ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా నగల డిజైన్లను మారుస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో అన్‌కట్ డైమండ్ ఆభరణాలకు విపరీతమైన క్రేజ్. టెంపుల్ విత్ పచ్చి, రూబీ ఎంబ్రాల్డ్ సీజెడ్ (జిర్కాన్), వివిధ డిజైన్లతో కూడిన సరికొత్త వడ్డాణం, జడ, నెక్లెస్, షార్ట్ నెక్లెస్లపై కూడా సిటీవాసులు మోజు పెంచుకుంటున్నారు. ఏ పండుగ వచ్చినా ఆభరణాలు కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్లలో ఏ జ్యువెలరీ షాపు చూసినా రద్దీగా కనిపిస్తుంటుంది. మధ్యతరగతి, సంపన్న కుటుంబాలు ఈ ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. హైదరాబాద్‌లోనే తయారీ సిటీవాసులను కట్టిపడేస్తున్న ఈ ఆభరణాలన్నీ నగరంలోనే తయారవడం విశేషం. ఇవన్నీ హ్యండ్‌మేడ్ నగలు. దీంతో ధర ఎంతైనా కొనుగోలు చేసేందుకు వెనకాడడం లేదు. మెరుగైన డిజైన్లు చేయగల అద్భుత అనుభవం నగరవాసుల స్పెషాలిటీగా చెప్పవచ్చు. ఇక్కడి నుంచే అన్‌కట్ డైమండ్, టెంపుల్ విత్ పచ్చి, రూబీ ఎంబ్రాల్డ్ సీజెడ్ (జిర్కాన్) తదితర ఆభరణాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దుబాయ్, అమెరికాలో ఈ జ్యువెలరీకి మంచి డిమాండ్. దక్షిణ భారతదేశంలో మంచి మార్కెట్ ఉంది. అష్టలక్ష్మీ లాకెట్, విష్ణు, కృష్ణా, గణేష్.. ఇలా దేవతల బొమ్మలతో వీటిని తయారు చేస్తున్నారు. కెంపులు పచ్చలతో నెక్లెస్, జడ, బెల్టులు రెడీ చేస్తున్నారు. ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాం దేశవిదేశాల మధ్య పెరిగిన రాకపోకలు, ఇంటర్నెట్, టీవీ చానల్స్ తదితర మాధ్యమాలు అంతులేని ఫ్యాషన్లను కుమ్మరిస్తున్నాయి. ఈ క్రమంలో తాము ధరించే ఆభరణాల డిజైన్ సరికొత్తగా ఉండాలని కోరుకునే ఫ్యాషన్ ప్రియులు ఎక్కువయ్యారు. అందుకనుగుణంగానే అన్‌కట్ డైమండ్ తదితర ఆభరణాలను నగరంలోనే తయారు చేస్తున్నారు. సిటీవాసులు వీటినే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. - మహేందర్ తయాల్, అధ్యక్షుడు, హైటెక్ సిటీ జ్యువెలరీ మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ - - వాంకె శ్రీనివాస్ -
స్టైల్ ఎక్స్పో
మగువ అందాన్ని రెట్టింపు చేసే డిజైనర్ చీరలు, డ్రెస్ మెటీరియుల్స్, ఆభరణాలు బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో కొలువుదీరారుు. పండుగల సీజన్‌ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ ‘ట్రెండ్జ్’ లైఫ్‌స్టైల్ ఎక్స్‌పోలో బ్రైడల్ వేర్ ప్రత్యేక ఆకర్షణ. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నుంచి వచ్చిన ఔత్సాహిక ఫ్యాషన్ డిజైనర్లు ఇక్కడ తవు డిజైన్లను ప్రదర్శిస్తున్నారు. నటుడు కృష్ణుడు... ఆయున సతీవుణి గాయుత్రి, కువూర్తె నిత్యతో కలసి షాపింగ్ చేశారు. ప్రవుుఖ డిజైనర్ అవ్రూపాల్ హొయలొలికించారు. వుంగళవారం కూడా ప్రదర్శన ఉంటుంది. -
చందేరీ అందాలు
చందేరీ చేనేత వస్త్రాలు భాగ్యనగరిలో కనువిందు చేస్తున్నాయి. అక్కడి హస్తకళాకారులు తీర్చిదిద్దిన ఆభరణాలు ఇక్కడి మగువల మనసు దోచుకుంటున్నాయి. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లా చందేరీ పట్టణానికి చెందిన ‘కల్యాణ్ బున్కర్ హ్యాండ్లూమ్’ సంస్థ బేగంపేటలోని తాజ్ వివంతా హోటల్లో చందేరీ వస్త్రాలు, ఆభరణాల ప్రదర్శనను మంగళవారం ప్రారంభించింది. ‘చందేరీ చేనేత కార్మికులు నేసిన వస్త్రాలకు, హస్త కళాకారులు తయారు చేసిన నగలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దీనిని ఆసరా చేసుకుని కొందరు వ్యాపారులు చందేరీ పేరుతో నకిలీ వస్త్రాలను, ఆభరణాలను విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు మోసపోకుండా ఉండేందుకు, చందేరీ వస్త్రాలు, నగలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాం’ అని సంస్థ నిర్వాహకుడు షోయబ్ ఖాన్ చెప్పారు. ఈ ప్రదర్శనలో హ్యాండ్‌మేడ్ బీడెడ్ జ్యూవెలరీ, చేనేత వస్త్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చందేరీ చీరలు రూ.3 వేల నుంచి రూ.30 వేల వరకు, ఆభరణాలు రూ.300 నుంచి రూ.3 వేల వరకు ఉన్నాయి. ఈ ప్రదర్శన ఈనెల 17 వరకు కొనసాగుతుంది. - సాక్షి, సిటీప్లస్ -
ఆభరణాలకు రూపమిచ్చే.. జువెలరీ డిజైనర్
అప్‌కమింగ్ కెరీర్: మేని ఆందాన్ని ద్విగుణీకృతం చేసే ఆభరణాలతో భారతీయుల అనుబంధాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆకర్షణీయమైన ఆభరణానికి రూపమిచ్చే కళాకారుడు.. జువెలరీ డిజైనర్. దేశంలో నగల వ్యాపారం వందల నుంచి వేల కోట్ల రూపాయలకు చేరడంతో డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. జువెలర్ డిజైనింగ్. జువెలరీ డిజైనింగ్ అనేది ప్రధానంగా సృజనాత్మక ప్రక్రియ. అప్పటివరకు మార్కెట్లోని లేని కొత్త డిజైన్‌ను తయారు చేయాలంటే అపూర్వమైన ఊహ శక్తి ఉండాలి. వినియోగదారుల అభిరుచులు, అవసరాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ప్రజల సంస్కృతులు, సంప్రదాయాలు, వారు ధరించే నగలపై అవగాహన పెంచుకోవాలి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న నూతన డిజైన్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. వాటి కంటే భిన్నంగా చేయగల నైపుణ్యం సాధించాలి. అనుభవజ్ఞులకు ఉపాధి అవకాశాలు దేశంలో జువెలరీ డిజైనర్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అనుభవం కలిగిన డిజైనర్లకు రూ.లక్షల్లో వేతనాలు లభిస్తున్నాయి. నిధులు లభిస్తే సొంతంగా డిజైనింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆభరణాల డిజైన్లను జువెలరీ సంస్థలకు విక్రయించుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందొచ్చు. మనదేశంతోపాటు విదేశాల్లోనూ డిజైనర్లకు మంచి అవకాశాలున్నాయి. అర్హతలు.. ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత జువెలరీ డిజైన్‌లో డిప్లొమా ప్రోగ్రామ్ లేదా గ్రాడ్యుయేషన్ కోర్సును చదవాలి. తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్, ఇంటర్న్‌షిప్ కూడా పూర్తిచేస్తే మెరుగైన అవకాశాలను దక్కించుకోవచ్చు. కొన్ని సంస్థలు స్వల్పకాలిక కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేతనాలు.. జువెలరీ డిజైనర్లకు ఎక్కువగా ప్రైవేట్ రంగంలో అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభంలో పనితీరు ఆధారంగా నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల దాకా అందుకోవచ్చు. తర్వాత సీనియారిటీని బట్టి నెలకు రూ.లక్ష దాకా వేతనం పొందొచ్చు. జువెలరీ డిజైన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) వెబ్సైట్: http://www.nift.ac.in/ ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ)-అహ్మదాబాద్ వెబ్సైట్: http://www.nid.edu/ ఏ జువెలరీ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్-నోయిడా వెబ్సైట్: http://www.jdtiindia.com/ ఏ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వెబ్సైట్: http://www.iiftindia.net/ మోడ్రన్ కెరీర్... జువెలరీ డిజైనింగ్ ‘ప్రజల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. దానికి తగినట్లుగా ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ కొత్తదనం చోటుచేసుకుంటోంది. జువెలరీ డిజైన్ కోర్సు ఇప్పుడున్న ఫ్యాషన్ ప్రపంచంలో అగ్రగామి అనే చెప్పొచ్చు. జువెలరీలోనూ విభిన్నమైన మోడల్స్ వస్తున్నాయి. డ్రెస్సింగ్, టైం సెన్స్, అప్పియరెన్స్‌కు తగిన ఆభరణాలను ధరించటం ఫ్యాషన్‌లో భాగమైంది. దీంతో ఈ కోర్సు చేసిన యువతకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, పుణె వంటి నగరాల్లో బాగా డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లో రెండు మూడేళ్లుగా క్రేజ్ సంపాదించుకుంది. మంచి వేతనంతో ఉద్యోగ అవకాశాలున్నాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటే.. డిజైనింగ్ షోరూం ఏర్పాటుచేసుకోవచ్చు’’ - డి.గోపాలకృష్ణ, జాయింట్ డెరైక్టర్ (నిఫ్ట్) హైదరాబాద్ -
చంద్రబింబం: జూన్ 15 నుండి 21 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) నూతన వ్యక్తుల పరిచయం. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. బంధువులతో విభేదాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు. వారం ప్రారంభంలో రుణయత్నాలు. దూరప్రయాణాలు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. సోదరులు, మిత్రులతో లేనిపోని వివాదాలు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలకు నిరుత్సాహమే. నిరుద్యోగుల యత్నాలు కొంతవరకూ సఫలం. వారం చివరిలో ధన,వస్తులాభాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ధనలాభం. ఆస్తి వివాదాలు తీరి లాభం చేకూరుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. కళాకారులకు పురస్కారాలు. వారం మధ్యలో అనారోగ్యం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతమైన కాలం. విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) పనులు సజావుగా పూర్తికాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వివాదాలు సునాయాసంగా పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. వారం మధ్యలో ఇంటాబయటా ఒత్తిడులు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. సోదరులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. విద్యార్థులకు అసంతృప్తి. ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానమార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధనలాభం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఈ వారం మీ సహనానికి పరీక్షా సమయమే. బంధువులు, మిత్రులతో వివాదాలు. మీ నిర్ణయాలపై కుటుంబసభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాల వారు కొంత నిరాశ చెందుతారు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సఫలం. నిరుద్యోగులకు ఊరట కలిగించే ప్రకటన రావచ్చు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహన, కుటుంబసౌఖ్యం. సోదరులతో వివాదాలు తీరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. పాతబాకీలు వసూలై అవసరాలు తీరతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారవచ్చు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పారిశ్రామికరంగం వారు ఆశించిన ప్రగతి. వారం చివరిలో అనారోగ్యం. ఆటంకాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఒక సమస్య తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
పైలట్ శిక్షణ.. పోలియో చికిత్స!
-
పైలట్ శిక్షణ.. పోలియో చికిత్స!
ఈ అవసరాల కోసమే తనిష్క్లో భారీ చోరీ గుంటూరుకు చెందిన సమీప బంధువులే దొంగలు సొత్తుతో ఒకరి లొంగుబాటు... మరొకరు పరారీ రూ. 5.75 కోట్ల విలువైన 15.5 కేజీల పసిడి రికవరీ సాక్షి, సిటీబ్యూరో/గుంటూరు: పైలట్ కావాలన్న కోరిక ఒకరికి.. ఇబ్బంది పెడుతున్న పోలియోకు చికిత్స పొందాలన్న తపన మరొకరికి..! ఇద్దరూ సమీప బంధువులు. ఈ రెండు అవసరాలు తీరాలంటే వారికి కనీసం రూ. 30 లక్షలు కావాలి. తాపీ మేస్త్రీలుగా పనిచేస్తున్న తమకు అంతమొత్తం సంపాదించాలంటే బంగారు ఆభరణాల దుకాణంలో దొంగతనం చేయడమే సరైన మార్గమనిపించింది. అంతే, ముందుగా రెక్కీ నిర్వహించి ఆ తరువాత పకడ్బందీగా.. ఈ శనివారం తెల్లవారుజామున నగరంలోని పంజాగుట్టలో ఉన్న తనిష్క్ జ్యువెలరీ దుకాణాన్ని కొల్లగొట్టారు. అయితే, ఆ మరునాడు మీడియాలో వచ్చిన వార్తలు, పోలీసుల ప్రకటనలు చూసి భయపడిపోయారు. ఒకరు పారిపోగా.. మరొకరు పోలీసులకు లొంగిపోయాడు. పూర్తి వివరాలు.. - గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం, ఈపూరు గ్రామానికి చెందిన భూమన కిరణ్ కుమార్(24) ఇంటర్మీడియెట్ మధ్యలో ఆపేశాడు. బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చి అనేక ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరకు రసూల్‌పుర ప్రాంతంలో ఓ గదిలో అద్దెకుంటూ తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. కిరణ్ సమీప బంధువు గంటినపాటి ఆనంద్ కూడా ఆ గదిలోనే ఉంటూ తాపీ పనే చేస్తున్నాడు. కిరణ్ మరోపక్క కొన్ని చిన్నాచితక పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నాడు. - కిరణ్‌కు శిక్షణ తీసుకుని పైలట్ వృత్తిలో స్థిరపడాలనే ఆశ ఉంది. ఆనంద్ ఎడమకాలుకు పోలియో ఉండటంతో దానికి వైద్యం చేయించుకుని తానూ అందరిలాగే తిరగాలని ఆశించేవాడు. ఆ అవసరాలకు దాదాపు రూ. 30 లక్షలు ఖర్చవుతుందని తెలియడంతో.. వాటికోసం వారిద్దరూ బంగారం షాపులో దొంగతనం చేయాలనుకున్నారు. - రసూల్‌పురకు దగ్గర కావడంతో పంజగుట్టను టార్గెట్‌గా ఎంచుకుని నెల రోజులుగా అక్కడున్న నాలుగు బంగారం దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించారు. తనిష్క్ బంగారం దుకాణానికి, దాని వెనుక ఉన్న కమర్షియల్/రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ప్రహరీ గోడకు మధ్య అడుగున్నర సందు ఉండటం గమనించి.. అదే సరైన లక్ష్యమనుకున్నారు. - తనిష్క్ జ్యువెలరీ షోరూమ్ నడుస్తున్న భవనం 1997-98ల్లో నిర్మించారు. 2009లో మరమ్మతుల సందర్భంగా వెనుక వైపున్న ఓ కిటికీని ఇటుకలతో మూసేశారు. దీనికి లోపలి వైపు మాత్రమే సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేయడంతో బయటకు (సందులోకి) ఇటుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటిని గమనించిన నిందితులు తేలిగ్గా లోపలకు ప్రవేశించవచ్చని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ తాపీ మేస్త్రీలే అయినప్పటికీ... గోడల్ని పగులకొట్టి కరెంటు పైపులు, వాటర్ పైపులు వేయడంలో అనుభవం ఉండడంతో ఆ ప్రాంతంలో రంధ్రం చేయడం తేలికని గుర్తించారు. ఒకటి రెండుసార్లు షోరూమ్ పని చేస్తున్న వేళల్లో కస్టమర్లుగా వెళ్లి అక్కడి పరిస్థితులు గమనించారు. సెక్యూరిటీ గార్డులు సైతం అప్రమత్తంగా లేరని గుర్తించారు. - నిజానికి బుధవారం రాత్రే వారు తమ పని ప్రారంభించారు. ఆ రోజు అర్ధరాత్రి పాత కిటికీ దగ్గరకు చేరుకున్న ఇరువురూ స్క్రూడ్రైవర్, స్పానర్ తదితరాలను వినియోగించి ఇటుకల మధ్య ఉన్న సిమెంట్‌ను కొద్దికొద్దిగా తొలగించారు. కొన్ని ఇటుకల్ని పక్కకు తీసి వెనుక ప్లాస్టరింగ్ కనిపించడంతో పని ఆపేసి ఇటుకల్ని వాటి స్థానంలో పెట్టేశారు. ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో ఒకరోజు గ్యాప్ ఇచ్చారు. తిరిగి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత షోరూమ్ వద్దకు వచ్చిన ఇద్దరూ ఇటుకల్ని తొలగించి బ్యాటరీ సాయంతో పని చేసే చిన్న డ్రిల్లింగ్ మిషన్ సాయంతో లోపలి సిమెంట్‌ను తొలగించారు. కిరణ్ బయటే ఉండిపోగా... ఆనంద్ ఆ రంధ్రంలో నుంచి లోపలకు వెళ్లాడు. కిరణ్ నుంచి స్క్రూడ్రైవర్ తీసుకుని అనువైన కౌంటర్ల తాళాల్ని పగులకొడుతూ సొత్తును కిరణ్‌కు అందించాడు. ముఖానికి, చేతికి తొడుగులు ధరించారు. కారం పొడి కూడా తీసుకెళ్లారు. - వాస్తవానికి ఇద్దరూ మొదట తమ అవసరాలు తీరడానికి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల విలువైన సొత్తునే ఎత్తుకుపోవాలని భావించారు. అయితే లోపలకు వెళ్లిన ఆనంద్ అక్కడి బంగారాన్ని చూసి అందినకాడికి బయట ఉన్న కిరణ్‌కు అందించాడు. దాదాపు గంటకు పైగా ఈ చోరీ చేసిన తరవాత ఇద్దరూ కలిసి అదే సందులో నుంచి బయటకు వచ్చి పంజగుట్ట చౌరస్తా వరకు వెళ్లారు. అక్కడ ఆటో తీసుకుని తిరిగి షోరూమ్ మీదుగానే రసూల్పురలో ఉన్న తమ రూమ్‌కు వెళ్లిపోయారు. - మరునాడు మీడియాలో హంగామా, పోలీసుల ప్రకటనలు చూశాక వారిలో భయం మొదలైంది. ఆనంద్ రెండు బంగారు గాజుల్ని తీసుకుని పారిపోగా... కిరణ్ ఓ ఉంగరాన్ని అమ్మి రూ.8,640 క్యాష్ చేసుకున్నాడు. మిగిలిన సొత్తు గదిలోనే బ్యాగ్‌లో ఉంచేశారు. ఆనంద్ పారిపోవడంతో పూర్తిగా భయపడిపోయిన కిరణ్ ఓ వార్తాచానెల్ను ఆశ్రయించి కొత్త నాటకానికి తెరలేపాడు. సమాజం కుళ్లిపోయిందని..! - ఆ చానెల్‌తో మాట్లాడిన కిరణ్ సమాజం కుళ్లిపోయిందని, రాజకీయాలు అవినీతి మయమైపోయాయని, మనుషుల్ని మేల్కొలపడంతో పాటు సెక్యూరిటీ విధానాల్లో ఉన్న లోపాల్నీ ఎత్తిచూపడానికే ఈ చోరీ చేశానంటూ ఘనంగా ప్రకటించాడు. తానొక్కడినే దొంగతనం చేశానని, పోలీసుల్ని తప్పుదోవ పట్టించడానికే అవిటివాడిలా నటించానంటూ నమ్మబలికి ఆనంద్‌ను రక్షించే ప్రయత్నం చేశాడు. పోలీసులకూ అదే కథ చెప్పడంతో.. వారు కిరణ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రూ.5.75 కోట్ల విలువైన 15.5 కేజీల బంగారం, రూ.8,640 నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఆనంద్ కోసం గాలిస్తున్నారు. - లొంగిపోకపోయినా.. ఒకటి రెండు రోజుల్లో నిందితులు దొరికేవారేనని పోలీసులు చెప్పారు. దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చిందని, లొంగిపోకముందే కిరణ్‌ను ప్రధాన అనుమానితుడిగా గుర్తించామని ఒక పోలీసు అధికారి తెలిపారు. మానసికస్థితి సరిగ్గా ఉండని ఆనంద్.. తనిష్క్ షోరూం దోపిడీలో కిరణ్‌తో పాటు పాల్గొన్న ఆనంద్ ఈపూరు నుంచి పది రోజుల క్రితమే కూలిపనికి హైదరాబాద్ వెళ్లాడు. మూడోతరగతితో చదువు ఆపేసిన ఆనంద్ చిన్నప్పట్నుంచి ఆవారాగా తిరుగుతుండే వాడని గ్రామస్తులు చెప్పారు. ఒక్కోసారి మానసిక పరిస్థితి బాగోలేక రోజులతరబడి ఎవరికీ చెప్పకుండా దూర ప్రాంతాలకు వెళ్లిపోతుండేవాడన్నారు. ఆడిటింగ్ తరవాత అసలు మొత్తం ‘చోరీ వెలుగులోకి వచ్చిన రోజు సంస్థ జనరల్ మేనేజర్ మణికందన్ ప్లెయిన్ గోల్డ్ ఆర్నమెంట్స్ 18 కిలోలు (విలువ సుమారు రూ.7.2 కోట్లు), కలర్ స్టోన్స్, ముత్యాలు పొదిగిన ఆభరణాలు 12 కిలోలు (విలువ సుమారు రూ.12 కోట్లు) పోయాయని ఫిర్యాదు చేశారు. ఆ తరవాత పూర్తి ఆడిట్ నిర్వహించి చోరీ అయిన సొత్తు రూ.5.98 కోట్ల విలువైన 15.57 కేజీలు మాత్రమే అని తెలిపారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేశాం. మరొకరి కోసం గాలిస్తూ వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. వివిధ సంస్థల్లో ఉన్న సెక్యూరిటీ లోపాలపై పోలీసులు కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలరు తప్ప ఆదేశాలు జారీ చేయలేరు. నిర్లక్ష్యంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఏ చట్టంలోనూ పేర్కొనలేదు’ - అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ రాజకీయాల్లోకి వెళ్తాననేవాడు ‘నా కొడుకు దొంగతనం చేశాడన్న విషయం నమ్మలేకపోతున్నాను. ఆయన వెనుక ఎవరి ప్రోద్బలమో ఉండిఉంటుంది. సంచలనం కోసం నాబిడ్డ దొంగగా ఎలా మారతాడు?’ అని ఈపూరు గ్రామం ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న కిరణ్ తల్లి అన్నపూర్ణమ్మ ప్రశ్నించారు. ఐదుగురు అన్నదమ్ముల్లో నాల్గోవాడైన కిరణ్ తండ్రి మర ణించిన దగ్గర్నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతూ.. ఎప్పటికైనా తాను రాజకీయ నాయకుడిని అవుతాననేవాడని తెలిపారు. గ్రామంలో ఉండగా కిరణ్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాడని గ్రామస్తులు తెలిపారు. -
మహేశ్ బ్యాంక్‌లో భారీ చోరీ
రూ. 5 కోట్లు విలువచేసే 16 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు అంతా ఖాతాదారులు కుదువబెట్టిన బంగారమే ఏఎస్ రావు నగర్లో ఘటన రూ. 24 లక్షల నగదు ఉన్న బీరువా తెరిచేందుకు విఫలయత్నం ఇంటి దొంగల పనేనని అనుమానం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఏఎస్ రావు నగర్‌లోని మహేశ్ బ్యాంక్‌లో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బ్యాంకు స్ట్రాంగ్ రూంలోని బీరువాలో ఉన్న సుమారు రూ. 5 కోట్ల విలువైన 16 కిలోల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్టు అనధికారికంగా తెలుస్తోంది. రూ. 24 లక్షల నగదు కలిగిన బీరువాలను తెరిచేందుకు కూడా వారు విఫలయత్నం చేశారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్, మల్కాజ్గిరి డీసీపీ కార్యాలయాలకు కూతవేటు దూరంలోనే ఈ చోరీ జరిగింది. ఏఎస్ రావునగర్‌లోని గణేష్ ఛాంబర్లోని మొదటి అంతస్తులో మహేష్ బ్యాంకు ఉంది. గురువారం సాయంత్రం 6.30కి సిబ్బంది బ్యాంకుకు తాళాలు వేసి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు పనిమనిషి విజయలక్ష్మి ఊడ్చేందుకు రాగా.. అప్పటికే తాళాలు తెరిచి ఉండడంతో మేనేజర్‌కు తెలియజేసింది. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మల్కాజ్గిరి డీసీపీ గ్రేవల్ నవ్‌దీప్‌సింగ్, క్రైమ్ అదనపు డీసీపీ జానకీ షర్మిల, అల్వాల్ ఏసీపీ ప్రకాష్‌రావు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో బ్యాంకు వద్దకు చేరుకుని విచారణ ప్రారంభించారు. వినియోగదారులు బ్యాంకులో కుదువబెట్టిన బంగారు ఆభరణాలే చోరీకి గురయ్యాయని తెలుస్తోంది. ఈ చోరీలో ఇద్దరు లేక ముగ్గురు పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకులోని సీసీ కెమెరాల వైర్లను దుండగులు కట్ చేసినట్టు గుర్తించారు. కాగా, ఎంత బంగారం పోయిందనే విషయంపై 15 గంటలు గడిచినా బ్యాంకు అధికారులు నోరు విప్పడంలేదు. అనధికార వర్గాల ప్రకారం 16 కిలోల బంగారం చోరీ అయిఉండొచ్చని సమాచారం. మారు తాళం చెవుల సాయంతో దుండగులు చోరీకి పాల్పడటాన్ని బట్టి ఇది ఇంటి దొంగల పనే అయిఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెక్కీ నిర్వహించాకే చోరీ చేశారని పోలీసులు చెపుతున్నారు. ఇందులో సిబ్బంది హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసుల అదుపులో వాచ్‌మేన్, మరో ముగ్గురు దోపిడీ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. దోపిడీ జరిగిన తీరును గమనిస్తే.. కేవలం మారు తాళం చెవులతోనే జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇవి తయారు చేయాలంటే ఒక్క వాచ్‌మేన్‌కే సాధ్యమని పోలీసులు చెబుతున్నారు. దీంతో బ్యాంకు వాచ్‌మేన్ రాములుతో పాటు మారు తాళాలు తయారు చేసే ముగ్గురు వ్యాపారులను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చోరీకి గురైన బంగారాన్ని కూడా పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించడంలేదు.