సామర్లకోట మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. చంద్రశేఖర స్వామి గుడి వీధిలో ఓ ఆగంతకుడు..
తూర్పుగోదావరి(సామర్లకోట): సామర్లకోట మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. చంద్రశేఖర స్వామి గుడి వీధిలో ఓ ఆగంతకుడు ఇంట్లో దూరి కంచర్ల వడ్డి కాసులు(58) అనే మహిళ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకోవడమే కాకుండా కత్తితో పొడిచి చంపాడు. బయటి వారికి అరుపులు వినపడకుండా లోపలి గడియపెట్టి టీవీ సౌండ్ పెంచాడు.
గ్యాస్‌సిలిండర్ లీక్ చేసి గొళ్లెం పెట్టి వెళ్లిపోయాడు. ఇంతలో భర్త ఇంటికి వచ్చి చూసేసరికి భార్య రక్తపుమడుగులో పడి ఉంది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.