
చోరీలకు పాల్పడుతోన్న ఐదుగురి అరెస్ట్
రాజేంద్రనగర్(హైదరాబాద్‌సిటీ): తాళం వేసిన ఇళ్ల తాళాలు పగులగొట్టి వరుస చోరీలకు పాల్పడుతోన్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 25 తులాల బంగారు ఆభరణాలు, 5 టీవీలు, ఒక బైక్, మూడు సిలిండర్లు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. పట్టుబడ్డ ఐదుగురు దొంగలు ఉప్పర్‌పల్లి వాసులుగా పోలీసులు వెల్లడించారు.