20 బంగారు పతకాలతో అగ్రస్థానం | India win 11 gold on opening day of South Asian Junior Athletics Championships | Sakshi
Sakshi News home page

20 బంగారు పతకాలతో అగ్రస్థానం

Published Mon, May 7 2018 5:09 AM | Last Updated on Mon, May 7 2018 5:10 AM

India win 11 gold on opening day of South Asian Junior Athletics Championships - Sakshi

కొలంబో: మొదటి రోజు 11 స్వర్ణాలతో మెరిసిన అథ్లెట్లు రెండో రోజు 9 బంగారు పతకాలతో సత్తా చాటడంతో దక్షిణాసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ అగ్రస్థానాన నిలిచింది. ఏడు దేశాలు తలపడిన ఈ మీట్‌ ఆదివారంతో ముగిసింది. మొత్తం 20 స్వర్ణాలు, 22 రజతాలు, 8 కాంస్యాలతో భారత్‌ పతకాల పట్టికలో మొదటి స్థానం దక్కించుకుంది. 12 స్వర్ణాలు, 10 రజతాలు, 19 కాంస్యాలతో ఆతిథ్య శ్రీలంక ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులు జపాన్‌లోని జిఫులో వచ్చే నెల 7 నుంచి 10 వరకు నిర్వహించే  ఆసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement