కర్ణాటక, బనశంకరి : సైబర్ నేరాల ముఠాల ఆగడాలను అరికట్టడానికి సతమతమవుతున్న పోలీసులకు మరో కొత్త చిక్కొచ్చిపడింది. హనీట్రాప్‌లో భాగంగా కాల్‌గర్ల్ పేరుతో ప్రకటనలు ఇస్తూ అమాయకులను బెదిరించి దోపిడీలకు పాల్ప డే వందలాది ముఠాలు రాష్ట్ర వ్యాప్తంగా చురుకుగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నా యి. ఈవంచకుల్లో చాలావరకు బయటి రాష్ట్రాలకు చెందినవారు కావడంతో వీరి ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది.
వెబ్‌సైట్స్ దుర్వినియోగం
కొన్ని వెబ్‌సైట్లలో ఇళ్లు, స్థలాల విక్రయాలు, హోటళ్లలో వసతి, విహారయాత్రలు, వాహనాల సౌలభ్యాల సమాచారం ఉచితంగా లభిస్తుంది. ఈ వెబ్‌సైట్స్‌లోకి హనీట్రాప్ ముఠాలు చొరబడి రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో యువతులు అందుబాటులో ఉన్నారని ప్రకటనలు ఇస్తారు. కస్టమర్లు ఈ నెంబరు గమనించి ఒకసారి ఫోన్ చేస్తే చాలు వంచనకు గురికావడం ఖాయం. ఒకసారి మీ నెంబరు వారి చేతిలో పడితే బెదిరింపులకు పాల్పడి దోపిడీకి పాల్పడుతాయి.
మసాజ్ పార్లర్లు అడ్డా....
రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో కొన్ని మసాజ్‌పార్లర్లు ఆన్‌లైన్ వేశ్యవాటిక దందాకు అడ్డాగా మారాయి. కొన్ని కేసుల్లో ఆన్‌లైన్ ద్వారా కస్టమర్లను గాలించే వంచకులు వారిని మసాజ్‌పార్లర్లుకు రప్పించుకుని ఆన్‌లైన్‌లో చెప్పిన ధర కంటే అధికంగా డబ్బు వసూలు చేస్తారు. రాష్ట్రంలో సగానికి పైగా మసాజ్‌పార్లర్లు ఆన్‌లైన్ వేశ్యవాటిక దందాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ మహిళలను అక్రమంగా నగరానికి రప్పించి వేశ్యావృత్తిలోకి దంచుతున్నారు. ఇలాంటి కేసుల్లో అరెస్టైన వారికి కోర్టుల్లో సులభంగా జామీను లభిస్తోంది. దీంతో వారు మళ్లీ బయటకు వచ్చి దందాలకు పాల్పడుతున్నారు. బెంగళూరు, మంగళూరు, మైసూరు, హుబ్లీ–ధార్వాడ, బెళగావి, బళ్లారి, దావణగెరె నగరాల్లో ఆన్‌లైన్ వేశ్యవాటిక దందా కార్యకలాపాలు పెచ్చుమీరాయి. కాల్‌గర్ల్స్ ఫొటోలు చూపించి ఆన్‌లైన్ నగదు జమచేయాలని సూచిస్తారు. దీనిని నమ్మి వారి అకౌంట్‌కు నగదు జమచేస్తే తక్షణం ఫోన్ స్విచ్ఛాప్ అవుతుంది. నగదు చెల్లించడానికి నిరాకరించే వారిని తమ వద్దకు పిలిపించి వారికి కాల్‌గరŠల్స్ చూపిస్తామని తీసుకెళతారు. డబ్బుతో వచ్చిన వారిని మార్గం మధ్యలో అడ్డుకుని దాడికి పాల్పడి నగదు లాక్కుని ఉడాయిస్తారు. తమ గౌరవానికి భంగం ఏర్పడుతుందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. వేశ్యావాటిక దందాకు సంబంధించి 2017లో రాష్ట్రంలో 295 కేసులు, 2018లో 218 కేసులు నమోదయ్యాయి. 2019 మార్చి వరకు 74 కేసులు నమోదు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment