Fake Website
-
నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!
సునీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫార్మల్షాప్’ పేరుతో ఓ యాడ్ చూశాడు. ‘బ్రాండెడ్ దుస్తులు తక్కువ ధరకే అందిస్తున్నాం. ఈ ఆఫర్ లిమిడెట్ పీరియడ్ మాత్రమే. స్టాక్ అయిపోయిందంటే మాత్రం మీరు నష్టపోతారు. త్వరపడండి’ అంటూ ప్రకటన సారాంశం. వెంటనే సునీల్ లింక్‌పై క్లిక్ చేశాడు. తనుకు కావాల్సిన దుస్తులు సెలక్ట్ చేసుకున్నాడు. 10 రోజుల రిటర్న్ పాలసీ, క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం ఉండడంతో ఎలాంటి అనుమానం చెందకుండా ఆర్డర్ బుక్ చేశాడు. ఇంటికి డెలివరీ అయిన తన ఆర్డర్‌ను తీసుకుని డబ్బు చెల్లించాడు. తీరా ప్యాక్ ఓపెన్ చేసి చిరిగిన, క్వాలిటీ లేని దుస్తులు ఉన్నాయని గ్రహించాడు. వెంటనే లింక్‌పై క్లిక్ చేసి రిటర్న్ పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అసలు ఆ ఆప్షన్ కనిపించలేదు. మెయిల్ చేసినా స్పందన కరవైంది. హెల్ప్‌లైన్ నంబర్ పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించాడు.ఆన్లైన్ షాపింగ్ పెరుగుతుండడంతో ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు నకిలీ వెబ్సైట్లు రూపొందించి ఆకర్షణీయ ఆఫర్లంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తూ వాట్సప్‌కు లింక్‌లు పంపుతున్నారు. కస్టమర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. తీరా బుక్ చేస్తే నకిలీ ఉత్పత్తులను పంపి మోసిగిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కింది జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.పాటించాల్సిన జాగ్రత్తలుఆన్లైన్ షాపింగ్ కోసం ప్రముఖ వెబ్సైట్లనే వినియోగించాలి.అధికారిక పోర్టల్స్, యాప్‌లను మాత్రమే వినియోగించాలి. ఎలాంటి లింక్‌లపై క్లిక్ చేయకూడదు.ప్రతి వెబ్సైట్లో ‘కాంటాక్ట్ అజ్’ అనే విభాగంలో సంస్థకు చెందిన చిరునామా, అధికారిక మెయిల్ చిరునామా వివరాలు ఉంటాయి. అవిలేని సంస్థ సేవలు వినియోగించకూడదు.కొన్ని సంస్థలు తప్పుడు చిరునామాను కూడా వెబ్సైట్లో ఉంచే ప్రమాదం ఉంది. ఆ అడ్రస్‌ను నెట్లో సెర్చ్ చేస్తే కార్పొరేట్ కార్యాలయం వివరాలు వస్తాయి. అలా ఒకసారి సరిచూసుకోవాలి.‘క్యాష్ ఆన్ డెలివరీ’ విధానంలోనే ఆర్డర్ బుక్ చేసుకోవడం మేలు. డెలివరీ బాయ్ ఆర్డర్ డెలివరీ అందించి దాన్ని ఓపెన్ చేసేలా చూసుకోవాలి.పార్శిల్ తెరిచేటప్పుడు కచ్చితంగా వీడియో రికార్డు చేయండి. ఇది మనకు ఆధారంగా ఉంటుంది.మోసం జరిగితే consumerhelpline.gov.in కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1800-11-4000 (ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 మధ్య) ఫోన్ చేయవచ్చు. -
Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి భార్యాభర్తల మోసాలు..
హైదరాబాద్: పెళ్లి పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు (భార్యాభర్తలను) హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ పోలీసులు వివరాల ప్రకారం యెలిగేటి రంజిత్ అలియాస్ యడ్ల శ్రీ రాధా కృష్ణ అలియాస్ రాకేష్, యెలిగేటి సంధ్య వీరిద్దరూ భార్యభర్తలు. వీరు సిరిసిల్ల జిల్లా వెంకంపేటకు చెందిన వారు. నగరంలోని పీర్జాదిగూడ వినాయక్ నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరు ఆన్లైన్లోని మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో ఉన్నత వర్గాలకు చెందిన అమ్మాయిల ప్రొఫైల్ ద్వారా వారి వివరాలను సేకరిస్తారు. ఆ వివరాల ఆధారంగా అమ్మాయిలను టార్గెట్ చేసి, నిందితుడు యెలిగేటి రంజిత్ తన పేరు యడ్ల శ్రీ రాధా కృష్ణగా నకిలీ పేరుతో పరిచయం చేసుకుంటాడు. తాను ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తినని రియల్ వ్యాపారాలు ఉన్నాయని నమ్మిస్తాడు. మాట్రిమోనీ సైట్లలో పరిచయమైన అమ్మాయిలతో పరిచయం చేసుకొని వారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వారితో చనువుగా మాట్లాడి పరిచయం పెంచుకుంటాడు. తన భార్య యెలిగేటి సంధ్యను తన మేనేజర్‌గా వారికి పరిచయం చేస్తాడు. అనంతరం అమ్మాయిల పేరెంట్స్‌తో సైతం వారి ఇంటికి వెళ్లి మాయమాటలు చెప్పి నమ్మించేవాడు.బాగా పరిచయం అయ్యాక వారిని పెళ్లి చేసుకుంటానని వారిని ఒప్పించేవాడు. అనంతరం తనకు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో అత్యవసరంగా డబ్బు అవసరం ఉందంటూ లక్షల రూపాయలు తీసుకునే వాడు. మరో కేసులో బాధితుల నుంచి కట్నం,పెళ్లి గిఫ్ట్‌ల పేరుతో లక్షల రూపాయలు దండుకున్నాడు. గతంలో బాధితలు పిర్యాదు పై కేసు నమోదు చేసుకుని, సీసీఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్ ఇ¯Œన్స్పెక్టర్ డి.బిక్షపతి ఆధ్వర్యంలో బృందం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విధంగా నిందితులు భార్యభర్తలు కలిసి 12 మంది బాధితుల నుంచి సుమారు రూ.30 లక్షలకు పైగా మోసాలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఓ సాంట్రో కారు,ద్విచక్ర వాహనం పోలీసులు సీజ్ చేశారు. -
ఆఫర్ ఉందని చలాన్లు కడుతున్నారా ?..జాగ్రత్త !
-
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ పై సైబర్ నేరగాళ్ల కన్ను
-
TS: వాహనదారులకు హెచ్చరిక.. ఆ వెబ్సైట్లో చలాన్లు కడితే ఇక అంతే..
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ చలాన్లను క్లియర్ చేయటానికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీ రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకున్న సైబర్ మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసిన సైబర్ క్రిమినల్స్.. వావాహనదారులను మోసం చేస్తున్నారు. www.echallantspolice.in పేరుతో ఫేక్ వెబ్సైట్ సృష్టించారు. ఈ సైట్లో పేమెంట్ చేయొద్దని, www.echallan.tspolice.gov.in/publicview వెబ్సైట్లో మాత్రమే నగదు పే చేయాలని పోలీసులు వెల్లడించారు. పేటీఎం, మీ-సేవా సెంటర్లలో పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. ప్రకటించిన రాయితీ ఆఫర్‌కు వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈనెల 10వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. చలాన్ల క్లియరెన్స్‌పై కన్నేసిన సైబర్ నేరగాళ్లు.. నకిలీ వెబ్సైట్ ద్వారా చలాన్లు వసూలు చేస్తూ వాహనదారుల జేబులు కొల్లగొడుతున్నారు. నకిలీ వెబ్ సైట్లను గుర్తించిన అధికారులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు. నకిలీ వెబ్ సైట్లలోకి వెళ్లి డబ్బులు చెల్లించ వద్దని హెచ్చరించారు. నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేసిన వాళ్లని గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు పడ్డారు. ఇదీ చదవండి: ఈ నెల 5 నుంచి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె -
నకిలీ వెబ్సైట్లో రూ.11 లక్షలు మోసపోయిన బెంగళూరు వాసి - ఎలా జరిగిందంటే?
ఆధునిక కాలంలో ఆన్లైన్ మోసాలు చాలా పెరిగిపోయాయి. ఆదమరిస్తే డబ్బు పోగొట్టుకోవడం ఖాయం. ఇలాంటి సంఘటలను గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన కర్ణాటకలో జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బెంగళూరుకు చెందిన 43ఏళ్ల వ్యాపారవేత్త ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంలో భాగంగా నకిలీ కేఎఫ్సి వెబ్సైట్లో రూ. 11 లక్షలు కోల్పోయాడు. దీనిపైన ఈస్ట్ CEN పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజానికి అతడు ఫ్రాంచైజీని కొనుగోలు చేసి నగరంలో అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేయడానికి కేఎఫ్సి సంప్రదింపు వివరాలను తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేసారు. అతడు ఓపెన్ చేసిన కేఎఫ్సి వెబ్సైట్ అతనికి సంబంధించిన వివరాలు కోరింది. ఇవన్నీ పూర్తి చేసిన తరువాత గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి. వారు కేఎఫ్సి ఉద్యోగులుగా పరిచయం చేసుకున్నారు. వారు అతనితో మాట్లాడిన తరువాత ఒక ఇమెయిల్ వచ్చింది. దీని ద్వారా కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించాడు. దాదాపు ఒక నెల రోజులు సంభాషణ తరువాత అతని అభ్యర్థనలను ప్రాసెస్ చేయడానికి డబ్బు అడిగారు. నిజమని నమ్మిన వ్యాపారవేత్త రూ. 11.8 లక్షలు బదిలీ చేసాడు. వారికి డబ్బు పంపిన తరువాత వారు ఎటువంటి సమాచారం అందించకపోగా.. ఆ కాంటాక్ట్ నంబర్లు స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించి.. మోసపోయినట్లు తెలుసుకున్నాడు. దీంతో పోలీసులకు పిర్యాదు చేసాడు. కేఎఫ్సి నోటీసు: కేఎఫ్సి తన అధికారిక వెబ్సైట్లో ఇటువంటి మోసాలు & నకిలీ కేఎఫ్సి ఫ్రాంచైజీ వెబ్సైట్ల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ చేసింది. బ్రాండ్ పేరుతో మోసం చేసేవారి సంఖ్య ఎక్కువైపోయింది. ఇప్పటికే చాలా మోసపూరిత వెబ్సైట్లు ఉన్నాయని తెలిపింది. కావున వినియోగదారులు చాలా జాగ్రత్త వహించాలని స్పష్టం చేసింది. -
నకిలీ వెబ్సైట్ పట్ల అప్రమత్తంగా ఉండండి
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టువెబ్సైట్ను కూడా వదిలిపెట్టలేదు. నకిలీ వెబ్సైట్ రూపొందించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యాయవాదులను, కక్షిదారులను గురువారం సూచనలు జారీ చేశారు. నకిలీ వెబ్సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సుప్రీంకోర్టు సైతం పబ్లిక్ నోటీసు జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వెబ్సైట్ లింక్‌లపై క్లిక్ చేయొద్దని, షేర్ చేయొద్దని వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు రూపొందించారని, యూఆర్ఎల్లో అందుబాటులో ఉంచారని తెలిపింది. ఈ వెబ్సైట్ ద్వారా వ్యక్తిగత, రహస్య సమాచారం సేకరించి, మోసగించే ప్రమాదం ఉందన్నారు. లాయర్ల, కక్షిదారుల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని, ఆర్థిక లావాదేవీల వివరాలను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎప్పుడూ కోరదని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. ఠీఠీఠీ.టఛిజీ.జౌఠి.జీn అనే వెబ్సైట్ మాత్రమే అసలైనదని స్పష్టం చేసింది. ఒకవేళ సైబర్ దాడి బారినపడితే బ్యాంకు ఆన్లైన్ ఖాతాల పాస్వర్డ్లు వెంటనే మార్చుకోవాలని, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. -
ఉద్యోగాల పేరుతో యువతకు ఎర
సాక్షి, అమరావతి: రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ అకడమిక్ సర్వీసెస్‌లో 78 ఉద్యోగాలు.. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో 156 ఉద్యోగాలు.. ఇదీ ఇటీవల వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ప్రకటనలు. ఏకంగా ఓ వెబ్సైట్ రూపొందించి మరీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు, సంస్కృత అకాడమీలో ఉద్యోగాల కల్పన పేరిట యువతను మోసగించేందుకు ఓ ముఠా వేసిన ఎత్తుగడ ఇది. సామాజికమాధ్యమాల్లో ఓ నకిలీ వెబ్సైట్ (https:// teluguacademy.org.recruitment), ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వైరల్ అవుతున్న విషయాన్ని గుర్తించిన అకాడమీ వెంటనే అప్రమత్తౖమెంది. తాము ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని అకాడమీ డైరెక్టర్ వి.రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సదరు నకిలీ నోటిఫికేషన్‌ను ఎవరూ విశ్వసించవద్దని కోరారు. ఆ వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేయడంగానీ ఫీజుల రూపంలో నగదు చెల్లించడంగానీ చెయ్యొద్దని కూడా ఆయన తెలిపారు. తమ అకాడమీకి ఇప్పటివరకు ఎటువంటి వెబ్సైట్ లేదని స్పష్టంచేశారు. యువతకు ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ప్రాజెక్టు డైరెక్టర్ పి. ఆంజనేయులు (ఫోన్ నంబర్: 9849616999)ను సంప్రదించాలని సూచించారు. ఇక రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ పేరుతో ఉద్యోగాల భర్తీకి నకిలీ నోటిఫికేషన్ ఇవ్వడంపై రామకృష్ణ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
దిశా పేరిట నకిలీ వెబ్సైట్.. తుమ్మయ్యపాలెంలో కలకలం..
సాక్షి, విజయనగరం: పూసపాటిరేగ మండలం తుమ్మయ్యపాలెం గ్రామంలో సర్వే పేరిట కొందరు అనధికార వ్యక్తులు హల్చల్ చేశారు. పీఎంజీవై దిశా పేరిట నకిలీ వెబ్సైట్ సృష్టించడంతో గ్రామంలో కలకలం రేగింది. గ్రామస్తుల ఆధార్ కార్డు వివరాలను ఆ సిబ్బంది అనధికారికంగా సేకరిస్తున్నారు. దిశా వెబ్సైట్ పేరిట మహిళల వేలిముద్రలు సేకరిస్తున్నారు. వారి ప్రవర్తన, చెప్పిన వాటికి ఏ మాత్రం పొంతన లేకపోవడంతో స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సరైన ఆధారాలు చూపకపోవడంతో ఆ సర్వేను పోలీసులు నిలిపివేయించారు. చదవండి: రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. పోలీసుల కాల్పులు -
ఇది నకిలీ ‘టీఎస్–బీపాస్’
సాక్షి, హైదరాబాద్: భవనాలు, లేఅవుట్లకు ఆన్లైన్లో అనుమతుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక టీఎస్–బీపాస్ పోర్టల్ (https:// tsbpass. tela ngana.gov.in)ను పోలినట్లుగా ఓ నకిలీ పోర్టల్ పుట్టుకొచ్చింది. గూగుల్‌లో ‘టీఎస్‌బీపాస్’అని సెర్చ్ చేస్తే ఒరిజినల్ పోర్టల్ కిందనే నకిలీ పోర్టల్ (http://10061994. xyz/ tsbpass2/ index. html) సైతం కనపడుతోంది. దరఖాస్తుదారులను మోసగించి వారికి సంబంధించిన పేటీఎం, ఫోన్‌పే, డెబిట్/క్రెడిట్ కార్డుల సమాచారాన్ని తస్కరించి బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టడానికి సైబర్ నేరగాళ్లు ఈ పోర్టల్‌ను తయారు చేశారు. అసలు పోర్టల్ హోం పేజీని పోలిన విధంగా నకిలీ హోం పేజీని డిజైన్ చేశారు. ‘తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం’పేరు, తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో ఇందులోనూ ఉండటంతో ప్రజలు సులువుగా మోసపోవడానికి అవకాశాలున్నాయి. ఒరిజినల్ పోర్టల్ తరహాలోనే నకిలీ దాంట్లోనూ ‘పర్సనల్ ఇన్ఫర్మేషన్, బిల్డింగ్ డిటైల్స్, పేమెంట్, ఫినిష్’పేర్లతో నాలుగు అంచెల్లో దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. పేమెంట్ ఆప్షన్లో పేటీఎం, ఫోన్‌పే, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా ఫీజులు చెల్లించే అవకాశం ఉన్నట్లు చూపుతోంది. ఆన్లైన్లో టీఎస్–బీపాస్ పోర్టల్‌ను సెర్చ్ చేసే క్రమంలో ‘సాక్షి’ప్రతినిధి ఈ అనుమానాస్పద వెబ్‌సైట్‌ను గుర్తించి రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను అప్రమత్తం చేశారు. ఆయన ఆ పోర్టల్‌ను పరిశీలించి నకిలీగా నిర్ధారించారు. దీనిపై సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతోపాటు గూగుల్‌కు సమాచారం ఇచ్చి బ్లాక్ చేయిస్తామని ‘సాక్షి’కి తెలిపారు. గతంలో సైతం ఇలాంటి ఘటనలు.. సైబర్ క్రైం భాషలో ఏదైనా అసలు వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టిస్తే దాన్ని స్ఫూఫింగ్ వెబ్సైట్ (Spoofing) అంటారు. గతంలో ప్రముఖ బ్యాంకులు, బీమా, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థల పేర్లతో నకిలీ వెబ్సైట్లను సైబర్ నేరస్తులు సృష్టించి అమాయక ప్రజల నుంచి ఫీజుల పేరుతో ఆన్లైన్లో డబ్బులు వసూలు చేయడంతోపాటు వారి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారు. ఇలా సున్నితమైన సమాచారాన్ని తస్కరించడాన్ని ఫిషింగ్ ( Phishing) అటాక్ అంటారు. -
ఎంఐ పేరుతో నకిలీ వెబ్సైట్
సాక్షి, సిటీబ్యూరో : ప్రముఖ ఫోన్ల విక్రయ సంస్థ ఎంఐ పేరుతో నకిలీ వెబ్సైట్ ఏర్పాటైంది. ఇది అసలుదే అని నమ్మిన బాధితుడు ఓ ఫోన్ ఖరీదు చేయడానికి రూ.18 వేలు బదిలీ చేసి మోసపోయాడు. చివరకు విషయం తెలుసుకున్న అతడు శనివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరంలోని పశ్చిమ మండలంలో ఉన్న జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఆన్లైన్లో ఎంఐ ఫోన్ ఖరీదు చేయాలని భావించారు. దీనికోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన ఆయనకు ఎంఐ సంస్థ పేరిట ఓ వెబ్సైట్ కనిపించింది. (www.mi-home.in) చిరునామాతో, అసలు వెబ్‌సైట్‌ను పోలినట్లే ఇది ఉంది. దీంతో దాని ద్వారా రెడ్మీ నోట్–9 ఫోన్ ఖరీదు చేసిన ఆయన ఆ సైట్ ద్వారానే రూ.18 వేలు చెల్లించారు. ఎప్పటికీ ఫోన్ డెలివరీ కాకపోవడంతో అనుమానం వచ్చి ఎంఐ సంస్థను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఆ సైట్ నకిలీదని తెలిసింది. దీంతో బాధితుడు శనివారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ తరహాకు చెందిన నకిలీ వెబ్‌సైట్స్ మరికొన్ని ఉండవచ్చని, చెల్లింపులు చేసే ముందు ప్రతి ఒక్కరూ సరి చూసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. -
కాల్‌గర్ల్స్ ఫొటోలు చూపించి నకిలీ వెబ్సైట్లతో
కర్ణాటక, బనశంకరి : సైబర్ నేరాల ముఠాల ఆగడాలను అరికట్టడానికి సతమతమవుతున్న పోలీసులకు మరో కొత్త చిక్కొచ్చిపడింది. హనీట్రాప్‌లో భాగంగా కాల్‌గర్ల్ పేరుతో ప్రకటనలు ఇస్తూ అమాయకులను బెదిరించి దోపిడీలకు పాల్ప డే వందలాది ముఠాలు రాష్ట్ర వ్యాప్తంగా చురుకుగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నా యి. ఈవంచకుల్లో చాలావరకు బయటి రాష్ట్రాలకు చెందినవారు కావడంతో వీరి ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. వెబ్‌సైట్స్ దుర్వినియోగం కొన్ని వెబ్సైట్లలో ఇళ్లు, స్థలాల విక్రయాలు, హోటళ్లలో వసతి, విహారయాత్రలు, వాహనాల సౌలభ్యాల సమాచారం ఉచితంగా లభిస్తుంది. ఈ వెబ్‌సైట్స్‌లోకి హనీట్రాప్ ముఠాలు చొరబడి రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో యువతులు అందుబాటులో ఉన్నారని ప్రకటనలు ఇస్తారు. కస్టమర్లు ఈ నెంబరు గమనించి ఒకసారి ఫోన్ చేస్తే చాలు వంచనకు గురికావడం ఖాయం. ఒకసారి మీ నెంబరు వారి చేతిలో పడితే బెదిరింపులకు పాల్పడి దోపిడీకి పాల్పడుతాయి. మసాజ్ పార్లర్లు అడ్డా.... రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో కొన్ని మసాజ్‌పార్లర్లు ఆన్లైన్ వేశ్యవాటిక దందాకు అడ్డాగా మారాయి. కొన్ని కేసుల్లో ఆన్లైన్ ద్వారా కస్టమర్లను గాలించే వంచకులు వారిని మసాజ్పార్లర్లుకు రప్పించుకుని ఆన్లైన్లో చెప్పిన ధర కంటే అధికంగా డబ్బు వసూలు చేస్తారు. రాష్ట్రంలో సగానికి పైగా మసాజ్‌పార్లర్లు ఆన్లైన్ వేశ్యవాటిక దందాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ మహిళలను అక్రమంగా నగరానికి రప్పించి వేశ్యావృత్తిలోకి దంచుతున్నారు. ఇలాంటి కేసుల్లో అరెస్టైన వారికి కోర్టుల్లో సులభంగా జామీను లభిస్తోంది. దీంతో వారు మళ్లీ బయటకు వచ్చి దందాలకు పాల్పడుతున్నారు. బెంగళూరు, మంగళూరు, మైసూరు, హుబ్లీ–ధార్వాడ, బెళగావి, బళ్లారి, దావణగెరె నగరాల్లో ఆన్లైన్ వేశ్యవాటిక దందా కార్యకలాపాలు పెచ్చుమీరాయి. కాల్‌గర్ల్స్ ఫొటోలు చూపించి ఆన్లైన్ నగదు జమచేయాలని సూచిస్తారు. దీనిని నమ్మి వారి అకౌంట్‌కు నగదు జమచేస్తే తక్షణం ఫోన్ స్విచ్ఛాప్ అవుతుంది. నగదు చెల్లించడానికి నిరాకరించే వారిని తమ వద్దకు పిలిపించి వారికి కాల్‌గరŠల్స్ చూపిస్తామని తీసుకెళతారు. డబ్బుతో వచ్చిన వారిని మార్గం మధ్యలో అడ్డుకుని దాడికి పాల్పడి నగదు లాక్కుని ఉడాయిస్తారు. తమ గౌరవానికి భంగం ఏర్పడుతుందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. వేశ్యావాటిక దందాకు సంబంధించి 2017లో రాష్ట్రంలో 295 కేసులు, 2018లో 218 కేసులు నమోదయ్యాయి. 2019 మార్చి వరకు 74 కేసులు నమోదు అయ్యాయి. -
లారెన్స్ పేరుతో డబ్బు వసూలు చేశారు
పెరంబూరు : నృత్యదర్శకుడు, నటుడు రాఘవలారెన్స్ పేరుతో నకీలీ వెబ్‌సైట్‌ను ప్రారంభించి ప్రజల నుంచి కొందరు డబ్బును దోచుకుంటున్నట్లు లారెన్స్ ప్రజాసేవా సంఘం కార్యదర్శి శంకర్ బుధవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో నటుడు లారెన్స్ పేరు, ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా కొందరు ఆయన పేరుతో నేనే లారెన్స్ అంటూ నకిలీ ఐడీతో వెబ్‌సైట్‌ను ప్రారంభించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. చెన్నైలోని కొలత్తూర్, సెలం, ఊటీ, రామనాథపురం, బెంగళూర్ ప్రాంతాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటివి నటుడు లారెన్స్ పేరు, ప్రతిష్టలకు కళంకం తీసుకొస్తున్నాయన్నారు. కాబట్టి లారెన్స్ పేరుతో నకిలీ వెబ్సైట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారిని కనిపెట్టి వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ప్రజలు, అభిమానులు సాయం చేయాలనుకుంటే నిజమైన రాఘవలారెన్స్ ట్రస్ట్‌ను సంప్రదించగలరని శంకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా
సాక్షి, విజయవాడ : సీఆర్డీఏ పేరుతో నకిలీ వెబ్సైట్ సృష్టించి ఉద్యోగాల పేరుతో ఒక యువకుడు నిరుద్యోగులకు టోకరా వేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే .. నిందితుడు ప్రకాశం జిల్లాకు చెందినవాడు. సీఆర్డీఏ పేరుతో నకిలీ వెబ్సైట్ రూపొందించి నిరుద్యోగులకు విజయవాడలో ఫేక్ ఇంటర్యూలు నిర్వహించాడు. అయితే యువకుడి మీద అనుమానం వచ్చిన నిరుద్యోగులు సీఆర్డీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిందితుడు రూపొందించిన వెబ్‌సైట్‌ను పరిశీలించగా అది నకిలీ వెబ్‌సైట్‌గా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పరారీలో ఉన్న యువకుడి మీద కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఘరానా మోసం..
సాక్షి, హైదారాబాద్: నగరంలో భారీ సైబర్ మోసం బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ వెబ్సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు మంగళవారం రట్టు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు నకిలీ వెబ్సైట్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నకిలీ వెబ్సైట్లతో ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా అక్రమాలకు పాల్పడుటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పట్టుబడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల నుంచి నగదు, సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఖాతాదారులకు ఆర్బీఐ హెచ్చరిక
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్బీఐ పేరిట ఓ నకిలీ వెబ్ సైట్ ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతోంది. ఖాతాదారుల నుంచి వివరాలను సేకరిస్తుండటంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది. అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులకు సూచిస్తూ గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘దయచేసి ఆ వెబ్‌సైట్‌ను ఎవరూ నమ్మకండి. అది నకిలీది. ఎవరూ అకౌంట్‌కు సంబంధించి వివరాలను సమర్పించకండి. బహుశా అది ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ముఠా అయి ఉండొచ్చు. ఈ వ్యవహారంలో సైబర్ విభాగానికి ఫిర్యాదు చేశాం. ఆర్బీఐ ఏనాడూ వినియోగదారుడి వివరాలను ప్రశ్నించదు. గమనించగలరు’ అంటూ ఆ ప్రకటనలో పేర్కొంది. www.indiareserveban.org పేరుతో అది చెలామణి అవుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. కాగా, గత కొన్నేళ్లుగా.. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ పేరిట భారీ మోసాలకు కొన్ని ముఠాలు పాల్పడుతున్నాయి. క్రెడిట్ కార్డుల జారీ, యాప్ ద్వారా నగదు బదిలీ తదితరాల ద్వారా కోట్ల రూపాయాల్లో ఖాతాదారుల నుంచి సొమ్మును దోపిడీ చేశాయి. ఆయా కేసుల్లో చాలా వరకు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎంత కట్టడి చేస్తున్నా నకిలీ వెబ్సైట్లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్నాయని.. వాటి హోం పేజీ... ఆర్బీఐ వెబ్‌సైట్‌ను పోలి ఉండటంతో ఖాతాదారులు సులువుగా మోసపోతున్నారని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఓ అధికారి సూచిస్తున్నారు. -
జియో కాయిన్ : ఆ వెబ్‌సైట్‌తో జాగ్రత్త
ముంబై : టెలికాం రంగంలో ప్రగతి పథంలో దూసుకుపోతున్న బిలీనియర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ జియోకాయిన్ పేరుతో మరో సంచలనానికి తెరతీయబోతున్న సంగతి తెలిసిందే. జియో కాయిన్ పేరుతో సొంతంగా ఈ క్రిప్టోకరెన్సీని సృష్టిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే రిలయన్స్ జియోకు మార్కెట్లో ఉన్న క్రేజ్‌ను బట్టి, జియో కాయిన్ పేరుతో నకిలీ వెబ్సైట్ ఒకటి తెరపైకి వచ్చింది. రిలయన్స్-జియోకాయిన్.కామ్ అనే యూఆర్ఎల్తో ఈ వెబ్సైట్ లిస్ట్ అయింది. అచ్చం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మాదిరిగేనే ఈ వెబ్సైట్ దర్శనమిస్తోంది. ఐకాన్ కూడా జియో పేరెంట్ కంపెనీదే ఉండటం గమనార్హం. దీనిలో ఒక్కో జియో కాయిన్‌ను వంద రూపాయలకు లాంచ్ చేయనున్నట్టు పేర్కొంది. పూర్తి పేరు, ఈ-మెయిల్ అడ్రస్‌తో రిజిస్టర్ అవ్వాలంటూ ఈ నకిలీ వెబ్సైట్ యూజర్లను తప్పుదోవ పట్టిస్తోంది. దీనిలో సమాచారం రాయడానికి కనీసం వెబ్‌సైటే ఓపెన్ అవడం లేదని తెలుస్తోంది. దీంతో ఇది నకిలీ వెబ్‌సైట్‌గా వెల్లడవుతోంది. ప్రజలు ఈ వెబ్‌సైట్‌తో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. మింట్ రిపోర్టు ప్రకారం ఇటీవల కాలంలో క్రిప్టోకరెన్సీలకు ఎక్కువగా డిమాండ్ పెరుగుతుండంతో, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా సొంతంగా జియో కాయిన్ పేరుతో క్రిప్టోకరెన్సీకి సృష్టిస్తుందని తెలిసింది. అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ సారథ్యంలో మొత్తం 50 మంది టీమ్ ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై పనిచేస్తున్నారని రిపోర్టు పేర్కొంది. -
ఉద్యోగాల పేరుతో గాలం..కోట్ల రూపాయలు టోకరా
-
అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ సేల్' పేరుతో..
ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో ఈ నెల 8,9,10 తేదీల్లో గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో వినియోగదారులకు బంపర్ ఆఫర్లను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదే అదనుగా చూసుకున్న కొంతమంది ఫ్రాడ్ స్టర్లు వాట్సాప్ ద్వారా ఫేక్ లింక్ లను షేర్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఆ లింక్ ను క్లిక్ చేసిన వారికి శాంసంగ్ గెలాక్సీ జే7 ఫోన్ ను కేవలం రూ.499లకే ఆఫర్ లో లభ్యమవుతున్నట్లు చూపుతున్నారు. ఒరిజినల్ అమెజాన్ లో దీని ధర రూ.13,490 లుగా ఉంది. ఆఫర్ లో కనిపిస్తున్న డీల్ ను కొనాలంటే ఎనిమిది వాట్సాప్ గ్రూపుల్లో ఆఫర్ వివరాలను షేర్ చేయాలని కోరుతోంది. షేర్ చేసిన తర్వాత డీల్ ను అందించకుండా ఆటోమేటిక్ గా ప్లే స్టోర్ లో ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన యాప్ పాకెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని చూపిస్తోంది. ఇలాంటి లింక్ లను క్లిక్ చేయడం వల్ల యూజర్ల సమాచారాన్ని తస్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. -
వెబ్సైట్ సృష్టికర్త పోలీసు ఉద్యోగి!
‘ఆర్థిక’ కోణాలు తేలాకే అరెస్టుపై నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించిన నిజామాబాద్ జిల్లావాసి క్రాంతికుమార్ ‘పోలీసు ఉద్యోగే’ నని సమాచారం. నవీపేట్‌కు చెందిన కాంత్రికుమార్ అక్కడ ఓ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడని తెలిసింది. నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని, కేవలం రేటింగ్స్ ద్వారా ఆన్లైన్ యాడ్స్ పొందడానికి మాత్రమే నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించానని వెల్లడించినట్లు తెలిసింది. మరోపక్క ఓ వైబ్‌సైట్‌తో సారూప్యత ఉన్న మరో సైట్‌ను సృష్టించడం నేరమేనా? పోలీసు లోగోను నకిలీ వెబ్‌సైట్‌పై వినియోగించడం కాపీరైట్ యాక్ట్ పరిధిలోకి వస్తుందా? తదితర న్యాయపరమైన అంశాలను అధికారులు ఆరా తీస్తున్నారు. నకిలీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు చెల్లించిన ఫీజు ఏ ఖాతాలోకి వెళ్లిందనేది కీలకంగా మారింది. ఈ వివరాలన్నీ బయటపడిన తరవాతే నిందితుడిపై చర్యలకు సంబంధించి పోలీసులు తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. తాను గతంలో పోలీసు కార్యాలయంలో ఔట్సోర్సింగ్ విధులు నిర్వర్తించానని, ప్రస్తుతం మానేశానని క్రాంతికుమార్ చెప్తున్నాడని ఓ అధికారి తెలిపారు. -
పోలీసుల అదుపులో నకిలీ వెబ్సైట్ సృష్టికర్త
సాక్షి, హైదరాబాద్: పోలీసు కొలువులకు సంబంధించిన రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌ను సృష్టించిన వ్యక్తి నిజామాబాద్‌కు చెందిన వేదకుమార్గా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మంగళవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వేదకుమార్ కేవలం వెబ్సైట్ రేటింగ్స్ కోసమే ఈ పని చేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించిన వెబ్సైట్ రూపకల్పనలో రిక్రూట్మెంట్ బోర్డ్ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదుతో..: ఈ బాగోతం సోమవారమే వెలుగులోకి రావడంతో రిక్రూట్మెంట్ బోర్డు వివరణతో కూడిన పత్రికా ప్రకటన సైతం విడుదల చేసింది. దీనికి సంబంధించి నగరానికి చెందిన శ్రీహరితో పాటు మరో వ్యక్తి మంగళవారం ఉదయం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందం వేదకుమార్‌ను అదుపులోకి తీసుకుంది. మోసం చేయడం ద్వారా డబ్బు సంపాదించాలనే ఉద్దేశం ఉంటే... పేమెంట్ గేట్ వే సైతం తన ఖాతాల్లోకి వచ్చేలా సృష్టించే వాడని, ఇది కేవలం వెబ్సైట్ రేటింగ్స్ కోసం చేసినట్లు అధికారులు చెప్తున్నారు. నకిలీ వెబ్సైట్ ద్వారా వచ్చిన దరఖాస్తుల్ని అసలు వెబ్సైట్ తిరస్కరిస్తుండగా... అభ్యర్థులు చెల్లించిన డబ్బు వారి ఖాతాల్లోకి తిరిగి రావడమో, రిక్రూట్మెంట్ బోర్డు ఖాతాలో జమ కావడమో జరిగింది. లక్షల మంది వ్యవహారంలో నిర్లక్ష్యంగా... ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు తీరునూ సైబర్ నిపుణులు తప్పుపడుతున్నారు. లక్షల మందికి సంబంధించిన వెబ్సైట్ సృష్టి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో నిర్వహించిన రిక్రూట్మెంట్కు తెలంగాణ 10 జిల్లాల నుంచి 2 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి రిక్రూట్మెంట్కు ఈ సంఖ్య 3 లక్షలు దాటుతుందనే అంచనా ఉంది. ఒక్కొక్కరి ఫీజు సరాసరిన రూ. 300 చొప్పున చూసినా... ఇది రూ. 9 కోట్లకు సంబంధించిన అంశం. అలాంటి వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సర్వర్‌లో కాకుండా ప్రైవేట్ డొమైన్లో హోస్ట్ చేయడం సబబు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్ఐసీ ద్వారా వచ్చిన వెబ్సైట్ భద్రంగా ఉండటంతో పాటు అడ్రస్ చివరలో (.జౌఠి.జీ) వస్తుందని, ప్రైవేట్ సర్వర్ అయిన కారణంగానే (.జీ) ఉందని ఓ నిపుణుడు తెలిపారు. ఒకటి నాడే సృష్టించాడు.. తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు 9,281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గత నెల 31న నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న వేదకుమార్ ఈ నెల ఒకటిన (శుక్రవారం) నకిలీ వెబ్సైట్ సృష్టించాడు. వాస్తవ వెబ్సైట్ (www.tslprb.in)కు సారూప్యంగా ఉండేలా (www.tslprb.com) అడ్రస్‌తో దీన్ని రూపొందించాడు. దీని చివరలో హైపర్ లింకు ఇచ్చిన నిందితుడు దాన్ని క్లిక్ చేస్తే అసలు వెబ్‌సైట్‌కు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశాడు. డాట్ ఇన్‌కు బదులుగా డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్లిన అనేక మంది దరఖాస్తుదారులు అందులోని పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లింపులూ చేశారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయిన తర్వాత నకిలీ వెబ్సైట్ అనే అంశం కంప్యూటర్ తెరపై ప్రత్యక్షం కావడం ప్రారంభించింది. -
పోలీస్ అభ్యర్థులపై నకిలీ ‘వల’!
-
పోలీస్ అభ్యర్థులపై నకిలీ ‘వల’!
♦ రిక్రూట్మెంట్ వెబ్‌సైట్‌ను పోలిన సైట్‌కు కేటుగాళ్ల రూపకల్పన ♦ చర్యలు తీసుకోవాలని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: నేరాలు నియంత్రించే పోలీసుల కొలువులో చేరుదామనుకుంటున్న అభ్యర్థులకు ఆ మోసాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవమయ్యేలా నేరగాళ్లు చూపిస్తున్నారు. ఆధునిక సాంకేతితకను అనుకూలంగా మార్చుకొని ఖాకీల కొలువులకు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముంటాయన్న పక్కా ప్లాన్‌తో ఏకంగా నకిలీ వెబ్‌సైట్‌కు రూపకల్పన చేశారు. ఇది అసలు వెబ్సైట్ పేరుకు దగ్గరగా ఉండటంతో చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. రిక్రూట్మెంట్ బోర్డు వాస్తవ వెబ్సైట్ www.tslprb.in కాగా.... అందుకు దగ్గరగా ఉండేలా నకిలీ వెబ్సైట్ www.telprb.com రూపొందించారు. నకిలీ వెబ్ స్క్రీన్‌పై ‘తెలంగాణ స్టేట్ పోలీస్ ఆన్లైన్ అప్లికేషన్’ అని ఉంది. దీంతో వెంటనే విషయం గ్రహించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. నకిలీ వెబ్సైట్ ఉదంతాన్ని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్రావు...నిందితులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు నేరగాళ్లు ఆన్లైన్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు...నకిలీ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులెవరైనా ఫీజులు చెల్లించినట్లయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. తొలి రోజే దాదాపు 10 వేల దరఖాస్తులు పోలీస్ కానిస్టేబుల్ దరఖాస్తులు తొలిరోజైన సోమవారం 10 వేలకు పైగా చేరినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు విధానంలో అభ్యర్థులు తప్పిదాలకు పాల్పడకుండా ఉండేందుకు అధికారులు వెబ్సైట్లో డమ్మీ అప్లికేషన్‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో నిర్వహించిన రిక్రూట్మెంట్కు తెలంగాణ పది జిల్లాల నుంచి 2 లక్షల దరఖాస్తులు రాగా ఈసారి రిక్రూట్మెంట్కు భారీగా వయసు సడలింపు ఉండటం, చాలా కాలంగా నియామకాలు లేకపోవడంతో దాదాపు 3 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెబ్సైట్లో అంతరాయం కలగకుండా ఉండటంతోపాటు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినా స్వీకరించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. -
శ్రీవారి దర్శనం టికెట్లతో నకిలీ వెబ్సైట్ మోసం!
భక్తులకు అంటగట్టిన రూ. 300 టికెట్లు .. విచారణకు ఆదేశించిన టీటీడీ ఈవో సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి ప్రవేశ పెట్టిన రూ.300 ఆన్లైన్ టికెట్లలో ఆదివారం నకిలీ టికెట్లు వెలుగుచూశాయి. చెన్నైకు చెందిన మనోజ్‌జైన్ దంపతులు స్థానికంగా ‘టెంపుల్ యాత్రీ’వెబ్సైట్ ద్వారా రెండు రూ.300 టికెట్లు రిజర్వు చేసుకున్నారు. వాటి ద్వారా ఆదివారం తిరుమలకు వచ్చారు. క్యూలోకి ప్రవేశించారు. అక్కడ తనిఖీల్లో అవి నకిలీ టికెట్లుగా గుర్తించారు. దీంతో వారిని దర్శనానికి అనుమతించలేదు. అక్కడే క్యూను తనిఖీ చేస్తున్న టీటీడీ ఈవో సాంబశివరావుకు బాధిత భక్తులు ఫిర్యాదు చేశారు. తాము టీటీడీ వెబ్సైట్ అనుకుని టికెట్లు బుక్ చేశామని వివరించారు. బాధితుల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు స్వీకరించి దర్శనానికి అనుమతించారు. నకిలీ టికెట్ల ఘటనపై టీటీడీ ఈవో సాంబశివరావు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. టీసీఎస్ ద్వారా టీటీడీ వెబ్సైట్ ఆధునికీకరణ టాటా కన్సల్టెన్సీ సాఫ్ట్వేర్ సంస్థ ద్వారా టీటీడీ వెబ్‌సైట్‌ను పూర్తి స్థాయిలో ఆధునికీకరిస్తున్నామని ఈవో తెలిపారు. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఆదివారం ఆయన ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డితో కలసి క్యూలను సందర్శించారు. సేవా టికెట్లను ఆగస్టు 25వ తేదీ వరకు విక్రయించామన్నారు. రూ.300 టికెట్లను 21వేల నుంచి 26 వేలకు పెంచామన్నారు. భక్తులకు సులభతరంగా శ్రీవారిదర్శనం, సేవా టికెట్లు లభించేలా మార్పులు, చేర్పులు చేస్తున్నామన్నారు. టీటీడీ వెబ్‌సైట్‌ను ఎవరూ హ్యాక్ చేసే అవకాశం లేదని ఈవో స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో వెబ్‌సైట్‌ను ఆధునికీకరించాక తిరిగి సేవా టికెట్ల బుకింగ్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు. -
ఫ్యేక్ల్టీ..
వారే వీరు.. వీరే వారు..!! ఇంజినీరింగ్ కళాశాలల్లో పొంతన లేని అధ్యాపకుల వివరాలు పాలిటెక్నిక్, డిగ్రీ, జానియర్ కళాశాలల లెక్చరర్లకు చోటు ఇతర రాష్ట్రాల వారిని చూపిన కొన్ని కళాశాలలు ఏకంగా వ్యక్తుల పేర్లనే మార్చిన మరికొన్ని..ఫిర్యాదు చేయవచ్చంటున్న యూనివర్సిటీ కోదాడటౌన్ : అనుమతుల కోసం ఇంజనీరింగ్ కళాశాలలు అడ్డదారులు తొక్కాయనే ఆరోపణలకు వర్సిటీ వెబ్సైట్లో పెట్టిన ఫ్యాకల్టీ వివరాలను పరిశీలించిన ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుందని పలువురు విద్యావేత్తలు అంటున్నారు. తనిఖీ చేసి నిగ్గుతేల్చామని చెపుతున్న వర్సిటీ అధికారులు చూసీచూడనట్టు నివేదికలను తయారు చేసినట్లు అర్థమవుతోంది. అనుమతుల కోసం బోగస్ అధ్యాపకులను చూపినట్లు స్పష్టంగా తేలిపోయింది. నకిలీ అధ్యాపకులనే కాకుండా ఒకే అధ్యాపకుడిని రెండు కళాశాలలో చూపాయి. గుర్తుపట్టకుండా అతని పేరునే ముక్కలుగా చేసి మార్చేసి వాడుకున్నాయి. కొందరి ఫొటోలను గుర్తుపట్టకుండా ఉండేందుకు వారు విద్యార్థి దశ ఫొటోలను వాడారు. మరికొన్ని కళాశాలలు ఆంధ్రప్రదేశ్ నుంచి అద్దెకు తెచ్చుకొని వెబ్సైట్లో పెట్టాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఉదాహరణ చూడండి.... జిల్లాలో అత్యధికంగా 720 ఇంజనీరింగ్ సీట్లకు అనుమతులు పొందిన కోదాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడిగా దేవరం రెడ్డి రామకృష్ణ తమ కళాశాలలో పని చేస్తున్నట్లు(సీరియల్ నెం:253) చూపించుకున్నారు. ఇతడినే కోదాడలోని మరో ఇంజనీరింగ్ కళాశాల తమ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడిగా (సీరియల్నెం:175) చూపారు. గుర్తుపట్టకుండా అతని పేరును రామకృష్ణారెడ్డి దేవరంగా నమోదు చేశారు. బోగస్ అధ్యాపకులను చూపినట్లు గత సంవత్సరమే ఈ కళాశాలపై కేసు నమోదైనా నిర్బయంగా ఈ ఏడాది అదేపని చేయడం గమనించదగ్గ విషయం. వాస్తవంగా అతని పేరు దేవరం రామకృష్ణారెడ్డి. ఇతను కోదాడలోని ఓ జూనియర్ కళాశాలలో అద్యాపకుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇదే విధంగా శ్రీరంగాపురం వద్ద ఉన్న కళాశాలలో పని చేస్తున్న రసాయనశాస్త్ర అధ్యాపకుడిని, శ్రీనివాస థియేటర్ వద్ద జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న గణితశాస్త్ర అధ్యాపకుడిని కూడా తమ ఫ్యాకల్టీగా చూపుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అంతా బోగస్సే.. జిల్లా వ్యాప్తంగా పలు ఇంజనీరింగ్ కళాశాలలు ఫ్యాకల్టీ విషయంలో అనేక అడ్డదారులు తొక్కాయి. రసాయనశాస్తం, భౌతికశాస్త్రం, గణితశాస్త్రం, ఇంగ్లీషు సబ్జెక్టుల అధ్యాపకులను స్థానికంగా వివిధ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో, వివిధ పాఠశాలల్లో పని చేస్తున్నవారిని తమ ఫ్యాకల్టీగా చూపాయి. ఇక ఇంజనీరింగ్ సబ్జెక్టులకు సంబంధించిన వారిని అద్దె ప్రాతిపదికన, వివిధ పాలిటెక్నిక్ కళాశాలల్లో, కంపెనీలలో పనిచేస్తున్న వారిని చూపాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోదాడలోని పలు కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలకు అనుబంధంగా పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. ఈ భవనాలను, ప్రయోగశాలలను, ఫ్యాకల్టీని కూడ ఇంజనీరింగ్ కళాశాలల్లో పని చేస్తున్న వారుగా చూపాయి. బ్యాంకు ఎకౌంట్లను, ఆధార్‌నంబర్‌ను తనిఖీ చేస్తే నూటికి 80 శాతం బోగస్ అధ్యాపకులుగా బయట పడతారని పలువురు విద్యావేత్తలు అంటున్నారు. ఎలా ఫిర్యాదు చేయాలంటే.. కళాశాలల్లో నెలకొన్న సమస్యలు కానీ, బోగస్ ఫ్యాకల్టీ వివరాలను కానీ వర్సిటీ దృష్టికి తీసుకురావాలనుకున్న వారు వెబ్సైట్లో ఉన్న కింది ఫోన్నంబర్లకు గానీ, మెయిల్‌కు గానీ వెంటనే ఫిర్యాదు చెయ్యవచ్చు. ఇంజనీరింగ్ కళాశాలల్లో పారదర్శకతను తీసుకురావడానికే ఈ విధనాన్ని అవలంభిస్తున్నట్లు వర్సిటీ తెలిపింది. వింతపేర్లు... తెలుగులో మనము ఎప్పుడు వినని పేర్లను ఇపుడు ఇంజనీరింగ్ కళాశాలలు మనకు చూపుతున్నాయి. కోదాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకురాలి పేరును ఏ విధంగా ఖూనీ చేశారు చూస్తే మీకే తెలుస్తుంది. అధ్యాపకురాలి అసలు పేరు కుక్కల రమాదేవి. కాగా ఆమె పేరును ఇపుడు కళాశాల వారు రమ కుక్కల దేవిగా మార్చివేశారు. సర్టిఫికెట్లలో ఉన్న పేర్లకు బదులు అన్ని వింత పేర్లు చూపుతున్న వైనం వెనుక భారీ మతలబు దాగిఉన్నట్లు తెలుస్తోంది. మరికొంత మందికి వారి పాఠశాలలో చదివే సమయంలో టై, బెల్టు పెట్టుకున్న ఫొటోలు, చిన్న తనంలో ఆడపిల్లలు రెండు జడలు వేసుకున్న ఫొటోలను కూడ వెబ్సైట్లో పెట్టారు. ఫిర్యాదు చేయండి : యూనివర్సిటీ జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ కళాశాలలో పని చేస్తున్న ఫ్యాకల్టీ వివరాలను వెబ్సైట్లో పెట్టిన యూనివర్సిటీ.. వారిలో నకిలీలు, బోగస్‌లు ఉంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని గత శుక్రవారం కోరింది. వర్సిటీ అకడమిక్ అడిట్ సెల్లో ఈ వివరాలు ఉన్నాయని, వాటిని స్థానికులు, తల్లిదండ్రులు పరిశీలించి వెంటనే ఫిర్యాదు చేయాలని పేర్కొంది. అక్రమాలు బయటపడితే సదరు కళాశాలతోపాటు, అధ్యాపకులపై కూడ చర్యలు తీసుకుంటామని వర్సిటీ తెలిపింది. -
ఆసిన్పై ఆగ్రహం
భావ స్వేచ్ఛ ఉంది కదా అని సమయం, సందర్భం చూడకుండా మాట్లాడేస్తే నటి ఆసిన్లా తలనొప్పికి గురి కావలసిందే. చివరికి పోలీసులను ఆశ్రయించాల్సిందే. పైగా ఆసిన్ నోరు జారింది. సాధారణ అంశం పైనా దేశమంతా క్రికెట్ క్రీడాభిమానులు ఉద్రేకంతో ఉడికిపోయిన తరుణంలో ఆమె వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఆసిన్ వ్యాఖ్యలు వ్యక్తిగతమే. అయితే ఆమె సగటు స్త్రీ కాదుగా. ప్రముఖ నటి. సెలబ్రెటి. ఇంతకీ ఆసిన్ చేసిన తప్పేమిటంటారా? చాలామందికి తెలిసినదే. ప్రపంచ కప్ క్రికెట్ క్రీడా పోటీలో ఆరు ఆటల్లో అజేయంగా నిలిచిన భారతజట్టు సెమీఫైనల్లో విరాట్ కొహ్లీ ఒకే ఒక్క రన్‌తో పీచేమూడ్ అనడం, భారతజట్టు ఓటమి పాలవడం క్రీడాభిమానులు జీర్ణించుకోలేని విషయం. ఆ పోటీలకు కోహ్లీ ప్రియురాలు అనుష్కశర్మ వెళ్లడం ఆమెకు శాపంగా మారింది. క్రికెట్ వీరాభిమానులు అనుష్క శర్మ కారణంగానే ఆటపై కాన్సంట్రేట్ చేయలేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అనుష్కశర్మను ఆడిపోసుకుంటున్నారు. సహనటిగా ఈ విషయాలు నటి ఆసిన్‌ను చిర్రెత్తేలా చేశాయి. దీంతో పరిస్థితుల ప్రభావాన్ని గుర్తించకుండా అనుష్క శర్మ చేసిన తప్పేంటి? అంటూ తన ట్విట్టర్లో పేర్కొని చాలా పెద్ద తప్పే చేశారు. దీంతో కొహ్లీని, అనుష్క శర్మను వదిలేసిన అభిమానులు ఆసిన్పై దుమ్మెత్తిపోయడం మొదలెట్టారు. వారి ఆగ్రహం ఎంతవరకు వెళ్లిందంటే ఏకంగా ఆసిన్ పేరుతో ఒక నకిలీ వెబ్‌సైట్‌ను ప్రారంభించి ఇష్టానికి మెసేజ్‌లు పోస్ట్ చేసేస్తున్నారు. క ఈ నకిలీ వెబ్సైట్ వ్యవహారం బాలీవుడ్ స్టార్ నటుడు అభిషేక్ లాంటి కొందరి చూపులకు చేరిపోయింది. వారు ఆసిన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆసిన్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. ఆసిన్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వర్గం చెబుతోంది.