నేరాలు నియంత్రించే పోలీసుల కొలువులో చేరుదామనుకుంటున్న అభ్యర్థులకు ఆ మోసాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవమయ్యేలా నేరగాళ్లు చూపిస్తున్నారు. ఆధునిక సాంకేతితకను అనుకూలంగా మార్చుకొని ఖాకీల కొలువులకు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముంటాయన్న పక్కా ప్లాన్‌తో ఏకంగా నకిలీ వెబ్‌సైట్‌కు రూపకల్పన చేశారు.