అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో..
ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో ఈ నెల 8,9,10 తేదీల్లో గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో వినియోగదారులకు బంపర్ ఆఫర్లను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదే అదనుగా చూసుకున్న కొంతమంది ఫ్రాడ్ స్టర్లు వాట్సాప్ ద్వారా ఫేక్ లింక్ లను షేర్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఆ లింక్ ను క్లిక్ చేసిన వారికి శాంసంగ్ గెలాక్సీ జే7 ఫోన్ ను కేవలం రూ.499లకే ఆఫర్ లో లభ్యమవుతున్నట్లు చూపుతున్నారు. ఒరిజినల్ అమెజాన్ లో దీని ధర రూ.13,490 లుగా ఉంది.
ఆఫర్ లో కనిపిస్తున్న డీల్ ను కొనాలంటే ఎనిమిది వాట్సాప్ గ్రూపుల్లో ఆఫర్ వివరాలను షేర్ చేయాలని కోరుతోంది. షేర్ చేసిన తర్వాత డీల్ ను అందించకుండా ఆటోమేటిక్ గా ప్లే స్టోర్ లో ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన యాప్ పాకెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని చూపిస్తోంది. ఇలాంటి లింక్ లను క్లిక్ చేయడం వల్ల యూజర్ల సమాచారాన్ని తస్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.