సాక్షి, హైదరాబాద్: పెండింగ్ చలాన్లను క్లియర్ చేయటానికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీ రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకున్న సైబర్ మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ చేసిన సైబర్ క్రిమినల్స్.. వావాహనదారులను మోసం చేస్తున్నారు.
www.echallantspolice.in పేరుతో ఫేక్ వెబ్‌సైట్ సృష్టించారు. ఈ సైట్‌లో పేమెంట్ చేయొద్దని, www.echallan.tspolice.gov.in/publicview వెబ్‌సైట్‌లో మాత్రమే నగదు పే చేయాలని పోలీసులు వెల్లడించారు. పేటీఎం, మీ-సేవా సెంటర్లలో పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు.
ప్రకటించిన రాయితీ ఆఫర్‌కు వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈనెల 10వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. చలాన్ల క్లియరెన్స్‌పై కన్నేసిన సైబర్ నేరగాళ్లు.. నకిలీ వెబ్‌సైట్ ద్వారా చలాన్లు వసూలు చేస్తూ వాహనదారుల జేబులు కొల్లగొడుతున్నారు. నకిలీ వెబ్ సైట్లను గుర్తించిన అధికారులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు. నకిలీ వెబ్ సైట్లలోకి వెళ్లి డబ్బులు చెల్లించ వద్దని హెచ్చరించారు. నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేసిన వాళ్లని గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు పడ్డారు.
ఇదీ చదవండి: ఈ నెల 5 నుంచి టీఎస్‌ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె
Comments
Please login to add a commentAdd a comment