పెరంబూరు : తమిళ సినీ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాక ముందే ఆయనపై రాజకీయ దాడి జరుగుతోందా? అని అనిపించేది. అయితే ఏ విషయాన్నైనా ఆచి తూచి మాట్లాడే రజనీకాంత్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో డ్రావిడులు అభిమానించే పెరియార్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురవుతున్నారు.1971లో పెరియార్ ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన ర్యాలీలో ఆయన హిందూ దేవుళ్ల చిత్ర పటాలను అవమానించేలా ప్రవర్తించారన్న విషయాన్ని నటుడు రజనీకాంత్ ప్రస్థావించారు. అది ఇప్పుడు ఆయనకు పెద్ద తల నొప్పిగా మారింది.
(రజనీపై పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు)
ద్రవిడ విడుదలై కళగం, డీఎంకే వంటి పార్టీ నాయకులు రజనీపై మండి పడుతున్నారు. ఆయనపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌కు రజనీకాంత్ తలొగ్గలేదు. పత్రికల్లో చదివిందీ, విన్నదే తాను చెప్పానని, సారీ చెప్పనని రజనీకాంత్ తెగేసి చెప్పారు. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రజనీకాంత్‌పై హాత్యాబెదిరింపులు వస్తున్నాయంటూ సినోరా పీఎస్.అశోక్ అనే వ్యక్తి చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం పిర్యాదు చేశారు. అందులో గత 22వ తేదీన స్థానిక తేనాపంపేట సమీపంలో సెంమొళి పూంగా వద్ద ద్రావిడ విడుదలై కళగంకు చెందిన కొందరు ఉమాపతి ఆధ్వర్యంలో రజనీకాంత్‌కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. రజనీకాంత్‌ను ప్రాణాలతో నవడవనీయమని హెచ్చరించారన్నారు. కాబట్టి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరపాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
(పెరియార్‌పై వ్యాఖ్యలు : క్షమాపణకు సూపర్‌స్టార్ నో..)
Comments
Please login to add a commentAdd a comment