మల్కన్ గిరి ఎన్ కౌంటర్ పై మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం శుక్రవారం స్పందించారు. విద్రోహశక్తుల కారణంగానే ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పారు. ఈ దాడిలో మావోయిస్టు పార్టీ సభ్యులు, నేతలు మరణించినట్లు వెల్లడించారు.
దాడిని పచ్చి బూటకపు ఎన్ కౌంటర్ గా పేర్కొన్న కైలాసం.. తమ అగ్రనేత ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నట్లు అనుమానాలున్నాయని చెప్పారు. ఎంత పెద్ద ఎన్ కౌంటర్ అయినా ఇంతమంది ఎప్పుడూ చనిపోరని అన్నారు. ఘటన వెనుక ఒడిశా పోలీసుల నిఘా వర్గాల ప్రమేయం ఉందని చెప్పారు.
కచ్చితంగా ప్రతీకారదాడులు చేస్తామని తెలిపారు. ఎన్ కౌంటర్ లో సాధారణ పౌరులు కూడా మరణించారని చెప్పారు. మరికొంత సమాచారన్ని త్వరలో చెబుతానని అన్నారు.
ప్రతీకార దాడులు చేస్తాం: కైలాసం
Published Fri, Oct 28 2016 7:16 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
Advertisement
Advertisement