cinema director
-
'ఆయ్'... మన కోనసీమేనండి!
మనం ఎంచుకున్న లక్ష్యానికి నిబద్ధత, శ్రమ, తపన తోడైతే దాని ఫలితం అద్భుతంగా ఉంటుందనే నమ్మకాన్ని ‘ఆయ్’ సినిమా దర్శకుడు అంజిబాబు కంచిపల్లి రుజువు చేశాడు. తొలి ప్రయత్నంలోనే సినీ దర్శకుడిగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణ శివారు కొంకాపల్లి అంజిబాబు స్వస్థలం. పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఒకరోజు...‘నేను సినిమా డైరెక్టర్ కావాలనుకుంటున్నాను’ అని తండ్రి బూరయ్య, సోదరులకు చెప్పాడు. ఆ వయసులో పిల్లల నోటి నుంచి వినిపించే కలలకు పెద్దలు ‘అలాగే’ అంటారు తప్ప అంత సీరియస్‌గా తీసుకోరు. కానీ అంజిబాబు మాత్రం యమ సీరియస్‌గా తీసుకున్నాడు. ‘ముందు నువ్వు డిగ్రీ పూర్తి చేయి. తర్వాత ఆలోచిద్దాం’ అని తండ్రి చెప్పాడు. తన లక్ష్యాన్ని సీరియస్‌గా తీసుకున్నప్పటికీ చదువును మాత్రం అశ్రద్ధ చేయలేదు. అమలాపురంలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఓ మంచి రోజు తన కలల దారిని వెదుక్కుంటూ హైదరాబాద్ బస్సెక్కేశాడు. ఎంతోమంది దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు.కోనసీమలో బాల్యం నుంచి స్నేహంగా చిగురించిన బంధాలు, అనుబంధాలు పెద్దయ్యాక కులాల కుంపటి రాజుకుని నాశనమవుతున్నాయి. కులాల బీటలతో స్నేహం, ప్రేమ విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇదే తన కథలో ప్రధానాంశంగా ఎంచుకుని సినిమా కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు.తాను రాసుకున్న కథను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, భాగస్వామి బన్నీ వాసులకు వినిపించాడు. గీతా ఆర్ట్స్‌కు నచ్చడంతో అంజిబాబు కథా రచయితగా తొలి విజయం సాధించాడు. సినిమాని కోనసీమ నదీ పరీవాహక గ్రామాల్లో చిత్రీకరించడం రెండో విజయం. అమలాపురం వేదికగా రూపుదిద్దుకున్న ‘కోనసీమ ఫిలిమ్ అసోసియేషన్’కు చెందిన సినీ ఆర్టిస్ట్‌లతో కొంత మందికి అంజిబాబు ‘ఆయ్’ సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చి వారి నుంచి మంచి నటనను రాబట్టాడు. తన తండ్రిపై ఉన్న అభిమానంతోనే ‘ఆయ్’ సినిమాలోని హీరో తండ్రి క్యారెక్టర్‌కు ‘బూరయ్య’ అని పేరు పెట్టాడు.చిన్నతనం నుంచి తాను పుట్టి పెరిగిన కోనసీమలోని ప్రకృతి అందాలు, గ్రామీణ సౌందర్యాలను తాను తీసే తొలి చిత్రంలో తెరకెక్కించాలనే కలను నిజం చేసుకున్నాడు. కోనసీమ యాస, నేటివిటీకి హాస్యాన్ని జోడించి ‘ఆయ్’ చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకున్నాడు అంజిబాబు. – పరసా సుబ్బారావు, సాక్షి, అమలాపురం టౌన్"తొలి ప్రయత్నంలోనే సినీ దర్శకుడు కావాలన్న నా శ్రమ, కల ఇప్పుడు ’ఆయ్’ చిత్ర రూపంలో ఫలించినందుకు సంతోషంగా ఉంది. సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాలన్న నా కోరిక కూడా ‘ఆయ్’ చిత్రం ద్వారా తీరింది. కోనసీమ అందాలు, అచ్చమైన పల్లె వాతావరణం, గోదారోళ్ల యాస మాటలు, సందర్భోచిత హాస్యంతో సినిమాను తీయాలనే ఆలోచనతో ‘ఆయ్’ చిత్రం కథను రాశాను. నా క«థను మెచ్చి చిత్రాన్ని తెరకెక్కించేలా చేసిన గీతా ఆర్ట్స్‌కు, అల్లు అరవింద్, బన్నీ వాసులకు నా ధన్యవాదాలు." – అంజిబాబు కంచిపల్లి, ఆయ్ చిత్ర దర్శకుడు -
ఆ హిట్ డైరెక్టర్‌తో స్టార్ హీరో మరో సినిమా.. !
వైవిధ్య భరిత కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. గతంలో సూర్య నటించిన సూరారై పోట్రు, జై భీమ్ చిత్రాలు ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కంగువ అనే భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిరుతై శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జేఈ జ్ఞానవేల్ రాజా యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. త్రీడీ ఫార్మాట్లో రూపొందుతున్న కంగువ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్స్ ఇప్పటికే విడుదల కాగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కాగా ఈ చిత్ర షూటింగ్‌లోనే నటుడు సూర్య గాయాల పాలై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం మిగిలిన షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. కంగువ తర్వాత మరోసారి సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది సూర్య నటించే 43వ చిత్రం కానుంది. దీనిని సూర్య తన 2డీ ఎంటర్టైన్ పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో నటి నజ్రియా నాయకిగా నటించనుండగా.. మలయాళ యువ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. అదే విధంగా విజయవర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఈయనకు సంగీత దర్శకుడుగా 100వ చిత్రం కావడం విశేషం. కాగా ఈ చిత్ర పాటల రికార్డింగ్ మొదలైంది. తొలిపాటను ఓ యువ గాయని పాడారు. ఈ విషయాన్ని జీవీ ప్రకాష్‌కుమార్ మంగళవారం తన ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు. అందులో సక్సెస్ఫుల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్ర పాటల రికార్డింగ్ గాయని ‘దీ‘తో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. -
తెలుగు హీరో- డైరెక్టర్ లిప్‌లాక్ ఫోటో వైరల్!
సాక్షి, హైదరాబాద్: హీరో, హీరోయిన్ లిప్‌లాక్ సీన్లు సినిమాలో ఉండటం సాధారణమైన విషయం కానీ హీరో-డైరెక్టర్ లిప్‌లాక్ ఫోటోలు బయట పడితే అది సెన్సేషన్ విషయమే అవుతుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలైన లేటెస్ట్ తెలుగు సినిమా ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’. రవికాంత్ పెరుపు దర్శకత్వంలో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో గురువారం విడుదలై మంచి టాక్‌ను సంపాదించుకుంది. అందరూ సినిమా గురించి మాట్లాడుకుంటున్న సమయంలో హీరో- డైరెక్టర్ల లిప్‌లాక్ ఫోటో ఇప్పుడు వారందరికి షాక్ ఇస్తోంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా పూర్తయి గురువారం నాడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది. ఈ మూవీలో సిద్దూ జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాధ్, షాలిని వడ్నికట్టి నటించారు. (‘అప్పటి నుంచే ఆ అలవాటు ఉంది’) -
‘మహాబలి‘ సినిమాలో స్థానికులకు అవకాశాలు : డైరెక్టర్ రోహిత్
దామెర: స్థానిక కళాకారులను ప్రోత్సహించి సినిమాలో అవకాశం కల్పిస్తున్నట్లు మహాబలి సినిమా డైరెక్టర్ రోహిత్ గురువారం తెలిపారు. మహాబలి చిత్రం యునిట్ మండలంలోని పులుకుర్తి గ్రామంలో గత నాలుగు రోజులుగా సందడి చేస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ మాట్లాడారు. ఎస్ఆర్ ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై సన్నీ నిర్మాతగా, ప్రధాన తారాగణం రాధాకృష్ణ, మిత్రలు నటిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 9 ప్రముఖ డైరెక్టర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ, 10న ప్రముఖ హీరో చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసోసియేట్ డైరెక్టర్ నిరంజన్, సురేందర్, వర్మ, బాలు, సర్పంచ్ గోవిందు అశోక్, రైతు సమన్వయ సమితి మండల డైరెక్టర్ ముదిగొండ క్రిష్ణమూర్తి, సినిమా యునిట్ సభ్యులు పాల్గొన్నారు. -
భగవాన్ టీచరంటే ఎందుకంత ప్రేమ?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు తిరువల్లూర్‌లోని వెలైగారం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు టీచర్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల భగవాన్ బదిలీపై మరో పాఠశాలకు వెళ్లడాన్ని తట్టుకోలేని ఆ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, ఆయన్ని వెళ్లద్దంటూ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో తీవ్రంగా హల్చల్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనిపై ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నటుడు హృతిక్ రోషన్లు, కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్‌లు కూడా తమదైన శైలిలో స్పందించారు. ఇలాంటి ‘గురుశిష్యుల’ అనుబంధం తానెక్కడా చూడల్లేదంటూ రెహమాన్ వ్యాఖ్యానించగా, వీరి అనుబంధం తన హృదయాన్ని ఎంతో హత్తుకుందని హృతిక్ రోషన్ వ్యాఖ్యానించారు. భగవాన్ లాంటి ఉపాధ్యాయులు తమకు ఎంతో మంది అవసరం అంటూ కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిల్ వ్యాఖ్యానించారు. తాను ఇంతగా విద్యార్థినీ విద్యార్థులతో ఎలా అనుబంధాన్ని పెంచుకున్నారో భగవాన్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా విన్నవించారు. ‘నేను విద్యార్థులతో ఓ అనుబంధాన్ని ఏర్పరుచుకోవడంలో భాగంగా వారికి ఆసక్తికరమైన కథలను చెప్పేవాడిని. పాఠాలను కూడా అదే తరహాలో బోధించేందుకు ప్రయత్నించేవాడిని. వారి వారి కుటుంబాల నేపథ్యం గురించి విచారించే వాడిని. వారి భవిష్యత్ ప్రణాళికల గురించి గుచ్చి గుచ్చి అడిగి తెలుసుకునేవాడిని. వారి కుటుంబ నేపథ్యాలు, వారి భవిష్యత్తు కలలను దృష్టిలో పెట్టుకొని వారు భవిష్యత్తులో ఎంచుకోవాల్సిన మార్గాల గురించి సూచించే వాడిని’ అని చెప్పారు. భగవాన్ ఉదంతాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్న రెండు ప్రధాన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భగవాన్ ఇంగ్లీషు టీచరు. అయినప్పటికీ ఆయన తప్పులు లేకుండా ఇంగ్లీషును మాట్లాడలేక పోతున్నారు. ఆయన సాదాసీదా అందరికి తెలిసిన సాధారణ పదాల్లోనే తన అభిప్రాయాలను చెబుతూ వచ్చారు. వాటిలోనూ వ్యాకరణ దోషాలు కనిపించాయి. ఆయన కూడా చదువుకున్నది ప్రస్తుత ప్రభుత్వ విద్యా విధానంలోనే కావడం వల్ల ఆయనకు కూడా భాష అంతగా అబ్బినట్లు లేదు. ఇది ప్రభుత్వ విద్యావిధానంలో ఉన్న ప్రధాన లోపాల్లో ఒకటి. ఇక రెండో లోపం కూడా విద్యార్థులతో ఆయన పెనవేసుకున్న బంధమే సూచిస్తోంది. ఏ ఉపాధ్యాయుడికైనా విద్యార్థులతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నప్పుడే విద్యారంగంలో గురుశిష్యులు రాణించగలరు. ఇలాంటి బంధాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విద్యా విధానాలు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం విద్యారంగాన్ని కూడా అన్ని ప్రభుత్వ విభాగాల్లాగే చూస్తోంది. ఉపాధ్యాయులను ఇతర విభాగాల గుమాస్తాలుగా పరిగణిస్తోంది. ఆ ధోరణి మారాలి. అవసరమైతే బదిలీ నిబంధనల్లో మార్పులు తీసుకరావాలి. వెలైగారంలో భగవాన్ టీచర్ బదిలీని ఆపాల్సిందిగా గ్రామస్థులు కూడా కోరగా అది తన చేతిలో లేదంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చేతులెత్తేశారు. నచ్చిన టీచర్‌ను కాకుండా ఉత్తమ టీచరును రిటేన్ చేసుకునే అధికారం ప్రధానోపాధ్యాయుడికి ఉండాలి. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే కనుక సామాజిక శాస్త్రంలో వారికి సరైన శిక్షణ ఉండాలి. విద్యార్థులకు కూడా చిన్పప్పటి నుంచే సమాజాన్ని అర్థం చేసుకునే పాఠ్యాంశాలు ఉండాలి. ఎందుకంటే భగవన్ను, విద్యార్థుల మధ్య బంధాన్ని పెంచిందీ ఈ అంశాలే. భగవాన్‌కు సంబంధించిన వీడియో వైరల్ కాగానే కొంత మంది సినీ నిర్మాతలు ఆయనపై సినిమా తీసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. గురుశిష్యుల అనుబంధం గురించి చెప్పి నాలుగు డబ్బులు వెనకేసుకునే విధంగా ఆయనపై సినిమా ఉండకూడదు. ఆయన విద్యార్థులతో ఎందుకు అలాంటి అనుబంధాన్ని ఏర్పరుచుకోవాల్సి వచ్చిందో వివరణ ఉండాలి. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే విధంగానూ సినిమా ఉండాలి. -
ఆ ఉపాధ్యాయుడి నేపథ్యంపై సినిమా
పళ్లిపట్టు: ఉపాధ్యాయుడు భగవాన్‌పై విద్యార్థుల ప్రేమ పోరాటానికి సంబంధించి సినిమా తీసేందుకు వీలుగా సినీ డైరెక్టర్లు ఇద్దరు శుక్రవారం వెలిగరం పాఠశాల్లో భగవాన్ను కలిసి చర్చలు జరిపారు. అదే సమయంలో డీఈఓ విచారణ, తమ ఉపాధ్యాయుడిని బదిలీని నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు విద్యాశాఖ మంత్రిని కలిసిందుకు నిర్ణయించుకోవడంతో వెలిగరం పాఠశాల్లో శుక్రవారం సైతం హడావుడి చోటుచేసుకుంది. పళ్లిపట్టు సమీపంలోని వెలిగరం పాఠశాల్లో ఆంగ్లం బీటీ టీచర్ భగవాన్ నాలుగేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఈ స్థితిలో పాఠశాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల ఉండేలా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం 35 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ నిష్పత్తిలో ఉండాలి. అయితే వెలిగరం పాఠశాల్లో 280 మంది విద్యార్థులకు ప్రస్తుతం 19మంది టీచర్లు (తెలుగు మీడియం ఉపాధ్యాయులతో కలిపి) ఉన్నారు. వారిలో టీచర్ పోస్టులో ఉన్న జూనియర్లను స్థాన చలనం చేయాల్సి రావడంతో ఇద్దరు టీచర్లను వేర్వేరు పాఠశాలకు బదిలీ చేస్తూ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు కేటాయించారు. అయితే భగవాన్ బదిలీ సమాచారంతో పాఠశాల విద్యార్థులు చలించి తరగతులు బహిష్కరించి ప్రేమ పోరాటం నిర్వహించిన విషయం తెలిసిందే. బదిలీ అయ్యేందుకు పాఠశాలకు వచ్చిన భగవాన్ను విద్యార్థులు చుట్టిముట్టి తమ పాఠశాలను వీడి వెళ్లరాదని బోరున విలపించడంతో విద్యార్థుల ప్రేమకు చలించిన టీచర్ సైతం విలపించారు. విద్యార్థులు గ్రామీణుల కోర్కె మేరకు కొద్ది రోజుల పాటు బదిలీ నిలిపివేస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం భగవాన్ యథావిధిగా వెలిగరం పాఠశాలకు వెళ్లి విధులు నిర్వహించారు. ఈ స్థితిలో ఉదయం పది గంటల సమయంలో చెన్నైకు చెందిన సినిమా డైరెక్టర్లు ఇద్దరూ పాఠశాలకు వెళ్లి భగవాన్‌కు కలుసుకుని విద్యార్థులు, టీచర్ అనుబంధం మీద సినిమా తెరకెక్కించడంపై మంతనాలు జరిపారు. అదే సమయంలో పాఠశాలకు చేరుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి అరుల్‌సెల్వం ప్రధానోపాధ్యాయులు అరవింద్ సహా 18 మంది ఉపాధ్యయులతో సంఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. విచారణ వివరాలను జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారికి సమర్పించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అదే సమయంలో మరో వారంలో భగవాన్ను మరో పాఠశాలకు బదిలీ చేయనుండడంతో, బదిలీని నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ డైరెక్టర్‌ను కలిసి వేడుకోవాలని నిర్ణయించారు. -
ఆయన మా జీవితాలతో ఆడుకుంటున్నాడు!
చెన్నై: ఆ దర్శకుడు హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నాడని పూనం కౌర్ సంచలన ఆరోపణలు గుప్పించారు. నెంజిరుక్కువరై చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ఆ తరువాత ఉన్నైపోల్ ఒరువన్, పయనం, వెడి, 6 మిలగువత్తిగల్, ఎన్ వళి తనీ వళి చిత్రాల్లో నటించారు. హీరోయిన్గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోలేకపోయినా, ఇటీవల వివాదాంశ సంఘటనలతో బాగానే పాపులర్ అయ్యారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా ఒక హిందీ చిత్రంలో నటించారు. నటుడు పవన్ కల్యాణ్‌కు సన్నిహితం అనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. తాజాగా ఒక సినీ దర్శకుడు తనను తరచూ అవమానపరుస్తున్నాడని పూనంకౌర్ తన ట్వటర్లో పేర్కొన్నారు. ఆ దర్శకుడికి అధిక చిత్రాలేమీ లేవని, అయినా ఇతరుల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాడని ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడని, తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని అన్నారు. ఆ విషయాల గురించి ఆయన్ని నేరుగా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఏమీ తెలియనట్లు బదులిచ్చాడన్నారు. తనకు కావలసిన వారే సినిమాలో ఉండాలని భావిస్తున్నాడని అన్నారు. అతని గురించిన బయటకు చెప్పరాని పలు విషయాలు తన వద్ద ఆధారాలు సహా ఉన్నాయని చెప్పింది. అతనికి కావలసిన నటీమణులు నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా, వారికే అవకాశాలు ఇస్తున్నాడని తెలిపారు. ఇతరుల మనోభావాలను ఖూనీ చేస్తున్నాడని ఆరోపించారు. అయితే అతని చర్యలే త్వరలో తగిన శిక్ష విధిస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ దర్శకుడెవరన్నది మాత్రం పూనం కౌర్ బయట పెట్టలేదన్నది గమనార్హం. -
సినీ దర్శకుడి ఇంట్లో చోరీ
చెన్నై: సినీ దర్శకుడి ఇంట్లో చొరబడ్డ దుండగులు అతని తల్లిదండ్రులను గాయపరచి చోరీకి పాల్పడ్డ సంఘటన శుక్రవారం కలకలం రేపింది. విన్,మహారాణి కోట్టై చిత్రాల దర్శకుడు వినోద్‌కుమార్. ఈయన తల్లిదండ్రులు సదాశివం(66), అంగయర్కన్ని(60) తంజావూర్ సమీపంలోని పిళ్లైయార్‌పట్టి, శ్రీనగర్‌లో నివశిస్తున్నారు. సదాశివం విశ్రాంతి బ్యాక్ ఉద్యోగి. దంపతులు ఇంట్లో నిద్రపోతుండగా శుక్రవారం తెల్లవారుజామున ముగ్గురు దుండగులు ముఖానికి ముసుగేసుకుని ఇంట్లోకి చొరబడ్డారు. అలికిడికి నిద్రలేసిన సదాశివం ఆయన భార్య దొంగల్ని చూసి అరవబోగా చంపుతామని బెదిరించారు. అయినా భయంతో సదాశివం భార్య కేకలు పెట్టటంతో ఆ దంపతులిద్దర్ని కత్తితో బెదిరించి గాయపరచారు. ఇంతలో ఒక వ్యక్యి అంగ యర్కన్ని మెడలోని ఆర సవర్ల బంగారు గొలుసును బలవంతంగా లాక్కుని పారిపోయాడు. గాయపడ్డ ఆ దంపతుల్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. తమిళ్పళకలగ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాజమౌళి అద్భుత దర్శకుడు: కేటీఆర్
హైదరాబాద్: 'నేను సినిమా ప్రియుణ్ని.. రాజమౌళి అద్భుత దర్శకుడు..' ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఆయన శుక్రవారం ట్విట్టర్లో 'ఉయ్ ఆర్ హైదరాబాద్' లైవ్ చాట్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా అన్నారు. ఈ లైవ్ షోలో పలువురు నెటిజన్ల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఓటుకు కోట్లు వ్యవహారంపైనే కేటీఆర్‌కు ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. బాస్ అరెస్టు ఇంకా ఎందుకు అరెస్టు కాలేదంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని కేటీఆర్ సమాధానమిచ్చారు. త్వరలోనే హైదరాబాద్‌కు గూగుల్ స్ట్రీట్ వ్యూ వస్తుందని తెలిపారు. అదే విధంగా వరంగల్, కరీంనగర్‌లలో పలు కంపెనీల బీపీఓలు ఏర్పాటు కానున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నెటిజన్ల ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్.. 'నేనొక సినిమా ప్రియుణ్ని.. రాజమౌళి అద్భుత దర్శకుడు' అని ట్వీట్ చేశారు. -
ఫ్యాషన్ కేరాఫ్ రామ్జ్
‘రాజోలు నుంచి సినీదర్శకులు తయారవుతారంటే నమ్మొచ్చు గానీ, ఓ ఫ్యాషన్ డిజైనర్ తయారవడం నమ్మశక్యం కాని విషయం’.. ఇదీ రామ్ జీబు గురించి టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ కితాబు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు కుర్రాడు రామ్ ప్రస్తుతం నగరంలో ఫ్యాషన్ డిజైనర్‌గా సత్తా చాటుకుంటున్నాడు. ఫ్యాషన్ డిజైనర్ చంద్రికా గుప్తాతో కలసి బంజారాహిల్స్ రోడ్ నం: 14లో రామ్ నిర్వహిస్తున్న ‘రామ్జ్ డిజైన్ స్టూడియో’.. ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ‘వివిధ సందర్భాలకు, వేడుకలకు తగిన డిజైన్లను ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా రూపొందిస్తున్నాం. ఫ్యాషన్ రూపకల్పన అంతా అబ్జర్వేషన్లోనే ఉంటుంది’ అనే రామ్, పుణేలోని మిట్కాన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు. ఫ్యాషన్ రంగంపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండటంతో పుణేలో ఉండగానే మ్యాగజైన్ల ఫొటోషూట్స్ కోసం ఫ్రీలాన్స్ డిజైనర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. ఇక ‘రామ్జ్’ సహ వ్యవస్థాపకురాలు చంద్రికాగుప్తా చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి నిట్వేర్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చెన్నై, తిరుపూరుల్లో డిజైనర్‌గా పనిచేసింది. దర్శకుడు సుకుమార్ తొలిసారిగా 2007లో తన ‘జగడం’ సినిమా కోసం రామ్‌కు అవకాశం ఇచ్చారు. ‘జగడం’ సక్సెస్‌తో రామ్ కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత పలు సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు. - సిద్ధాంతి -
కె.బాలచందర్ తనయుడు కైలాసం కన్నుమూత
చెన్నై: ప్రముఖ దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాతైన కె. బాలచందర్ (కైలాసం బాలచందర్) తనయుడు కైలాసం శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నేడు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కైలాసం అనారోగ్యంతో బాధపడుతున్నటు సినీవర్గాలు తెలిపాయి. -
సినీ దర్శకుడిపై నిర్మాత ఫిర్యాదు
చెన్నై: సినీ దర్శకుడు మోసానికి పాల్పడ్డాడంటూ నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేయడం కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. కొన్ని నెలల క్రితం విడుదలైన చిత్రం ఈగో. ఈ చిత్ర ఓవర్సీస్ హక్కుల్ని వేందర్ మూవీస్ సంస్థ కొనుగోలు చేసి ఆ తరువాత శంకరనారాయణన్ అనే వ్యక్తికి విక్రయించింది. ఆయన నుంచి ఎఫ్‌సీఎస్ క్రియేషన్ అధినేత వీరశేఖర్ ఈగో ఓవర్సీస్ హక్కులను పొందారు. ఈయన నుంచి సేతురామన్ ఈగో చిత్ర ఓవర్సీస్ హక్కుల్ని పొందారు. ఆయన ఈ చిత్రాన్ని మలేషియాలో విడుదల చెయ్యడానికి అక్కడి అస్ట్రో టీవీ సంస్థను సంప్రదించారు. అయితే అదే చిత్రం హక్కులు తన వద్ద ఉన్నట్టు మరో వ్యక్తి తమను సంప్రదించారని అస్ట్రో టీవీ సంస్థ నిర్వాహకులు తెలిపారు. దీనిపై అసలైన హక్కుదారులు ఎవరన్న విషయం గురించి ప్రశ్నించారు. అయితే ఈగో చిత్ర హక్కులను మరో వ్యక్తికి చిత్ర దర్శకుడు శక్తివేల్ విక్రయించినట్లు తెలిసింది. దీంతో సేతుమాధవన్ దర్శకుడు శక్తివేల్‌తో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్‌లోఉంది. దీంతో సేతురామన్ స్థానిక విరుగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు సరిగా స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశంతో దర్శకుడు శక్తివేల్‌పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. -
తవ్వారు పల్లె టు ఫిలిం నగర్
పల్లెటూరులో పుట్టాడు.. సినిమా డెరైక్టర్ కావాలని కలలుగన్నాడు.. స్కూల్ ఎగ్గొట్టి హైదరాబాదుకు వెళ్లాడు. కాళ్లరిగేలా స్టూడియోల చుట్టూ తిరిగాడు. ఫలితం లేదు. అయినా అలసిపోలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్లీ ప్రయత్నించాడు. ఈ సారి డెరైక్ట్‌గా కథే రాసుకుని పోయాడు. చివరికి దర్శకుడిగా మారి కల సాకారం చేసుకున్నాడు. కృషి ఉంటే సాధించలేనిదేదీ లేదని యువతకు స్ఫూర్తినిస్తున్నాడు. ఆయనే ‘ప్రేమ ప్రయాణం’ సినిమా దర్శకులు, ఖాజీపేట మండలం తవ్వారుపల్లెకు చెందిన ఎస్.ఎస్. రవికుమార్. ఆదివారం తన స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా ‘న్యూస్‌లైన్’ పలకరించింది. తన సినిమా ప్రయాణ విశేషాలు ఆయన మాటల్లోనే..- న్యూస్‌లైన్, మైదుకూరు(చాపాడు) పదో తరగతి నుంచే.. మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగింది. నేను కూడా సినిమాలకు కథలు రాయగలను.. సినిమాలు తీయగలనని అప్పుడే అనుకున్నా. దీంతో ఎన్నోసార్లు తరగతులు ఎగ్గొటి హైదరాబాదుకు వెళ్లాను. స్టూడియోల చుట్టూ తిరగటం.. ఉండేందుకు డబ్బుల్లేక తిరిగి ఇంటికి రావటం జరిగేది. దీంతో ‘ముందు బాగా చదువుకో తర్వాత సినిమాలు చేద్దువుగానీ’ అంటూ నాన్న మందలించారు. ఎలాగోలాగా ఇంటర్ వరకు చదివా. ఆ తర్వాత ఇంట్లో చెప్పకుండానే హైదారాబాదుకు వెళ్లాను. రాజశేఖర్, జీవితల ప్రేరణతో.. ముందుగా ఒక కథ రాసుకుని రాజశేఖర్, జీవితలకు విన్పించా. అనంతరం వారి సూచనలు, సలహాల మేరకు హైదరాబాదులోని ఫిల్మ్ ఇన్స్ట్యూట్లో చేరి శిక్షణ పొందాను. ఆ తర్వాత మామూలే. సినిమా అవకాశాల కోసం వేట మొదలెట్టా. ఎనిమిదేళ్లు అసిస్టెంట్ డెరైక్టరుగా... 2004లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన అనంతరం కొంతకాలానికి రోశిరాజు అనే దర్శకుడు వద్ద అసిస్టెంటుగా అవకాశం సంపాదించాను. అక్కడి నుంచి సభాపతి, నరేంద్ర, దేవిప్రసాద్, సముద్రలతో పాటు ఇంకా పలువరి దగ్గర 2012 వరకు పని చేశాను. హ్యపీ జర్నీ, బ్లేడ్‌బాబ్జీ, ఏకవీర, ఇంకా పలు చిత్రాలకు అసిస్టెంటు డెరైక్టరుగా పని చేశా. ప్రముఖ ఆర్టిస్టులతో.. ఇటీవలే ముఖ్య క్యారెక్టర్ ఆర్టిస్టులు గా ఉన్న పోసాని కృష్ణమురళి, నాగీనీడులతో పాటు హీరోగా మనోజ్ నందం, హీరోయిన్గా నీతూ అగర్వాల్, ఆర్టీస్టులుగా బస్టాఫ్ కోటేశ్వరావు, చిత్రం శ్రీను, ఉత్తేజ్, పొట్టిరాంబాబు, యాం కర్ ఫన్నీ, భానుశ్రీ, రమ్య చౌదరి ఇలా పలువురితో ప్రేమ ప్రయాణం చిత్రాన్ని తీశాను. మరికొన్ని కథలు రాస్తున్నాను. వరుణ్ సందేశ్‌తో సినిమా.. యూత్ ఫాలోయింగ్ హీరో అయిన వరుణ్ సందేశ్‌తో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్లు రవికుమార్ తెలిపారు. దీంతో పాటు రెండు ప్రముఖ నిర్మాణ సంస్థల్లో యువహీరోలతో సినిమాలు చేయబోతున్నట్లు తెలిపారు. -
లవ్యూ అనేయకుండా ప్రివ్యూ ప్లాన్ చేశారు!
‘నిన్నే పెళ్లాడతా’ షూటింగ్ లో... ఫస్ట్ టైమ్... గీతను చూశారు వైవీఎస్ చౌదరి. ఆ సినిమా కో-డెరైక్టర్ ఆయన. అందులో హీరో చెల్లెలు.... గీత. అమెను చూడగానే... ‘ఐ లవ్యూ’ చెప్పాలన్నంత ఫీల్ కలిగింది వైవీఎస్కి. చెబితే ఎంత బాధ్యతగా ఉండాలో ఆయనకు తెలుసు. అందుకే... నేరుగా వెళ్లి పెద్దవాళ్లకు చెప్పారు! ‘నిన్ను పెళ్లాడాలంటే...’ అంటూ... కండిషన్ మీద కండిషన్ పెట్టారు గీత. అన్నిటికీ ‘ఓకే’ అన్నారు వైవీఎస్. పెళ్లయింది, డెరైక్టర్‌గా కొన్ని సినిమాలయ్యాయి. కొన్ని ఆటుపోట్లూ ఎదురయ్యాయి. ‘అర్థం చేసుకునే భార్య ఉంటే భర్త ఎప్పుడూ విజేతే’ అంటారు వైవీఎస్. ‘భర్తను అర్థం చేసుకోవాలంటే ప్రేమతో పాటు సహనమూ ఉండాలి’ అంటారు గీత. ఈ ఆలూమగల మధ్య అండర్‌స్టాండింగే ఈవారం ‘మనసే జతగా...’ వారిమాటల్లోనే... వైవీఎస్ చౌదరి: మా ఊరు గుడివాడ. అక్కడే పుట్టి పెరిగాను. నన్ను ఇంజినీర్ని చేయాలని అమ్మానాన్న ఆశ. కాని కాలేజీ రోజుల్లో సినిమాల పట్ల ఆసక్తి ఎక్కువైంది. దాంతో ఇంజనీరింగ్ చదువుదామని మద్రాస్ వెళ్లి, ఆ తర్వాత డిస్కంటిన్యూ చేసి సినిమాల వైపు వచ్చాను. చదువు విషయంలో ఎలాగూ నిరాశపరిచాను కాబట్టి, పెళ్లి విషయంలో మాత్రం అమ్మానాన్నను నిరాశపరచకూడదనుకున్నా. ఆ ఆలోచనతోనే ఏడాదిపాటు నా మనసులోని భావాలేవీ గీతకు చెప్పలేదు. ఇరు కుటుంబాల వారినీ ఒప్పించాలి... ‘నిన్నేపెళ్లాడుతా’ సినిమా షూటింగ్ సమయంలో గీతను మొదటిసారి చూశాను. హీరోకి చెల్లెలు పాత్ర చేయడానికి వచ్చింది తను. మొదటి చూపులోనే ‘దిల్ తో పాగ ల్ హై’ లాంటి ఫీలింగ్ కలిగింది. కాని తనతో చెప్పలేదు. ఎట్టకేలకు అమ్మనాన్నలను కన్విన్స్ చేయగలను అని నమ్మకం కలిగాక ఒక రోజు గీతతో ‘నువ్వూ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. ‘సరే’ అంది తను. గీతను, వాళ్ల అన్నయ్యను ఇంటికి భోజనానికి పిలిచి అమ్మానాన్నలకు స్నేహితురాలిగా పరిచయం చేశాను. వాళ్లు వెళ్లిపోయాక చెప్పాను ‘నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం... కాని ‘వారి కుటుంబం, పట్టింపులేమిటో’ తెలియదు’ అన్నాను. ‘నచ్చింది కదా, అంతే చాలు’ అన్నారు. ఆ తర్వాత గీత అమ్మానాన్నలను కలిశాను. అందరినీ కన్విన్స్ చేసి పెళ్లికి ఒప్పించాను. అలా రెండు మూడు నెలల్లోనే (జూన్ 14, 1997) గీత నా అర్ధాంగి అయ్యింది. అమ్మ, అర్ధాంగి ఇద్దరూ కావాలి... గీత చాలా మృదుస్వభావి. అందుకే (అత్త-కోడలు) ఇద్దరి మధ్యా విభేదాలు రావు. పొరపాటున వస్తున్నాయనిపించినా ఇద్దరినీ కన్విన్స్ చేసే నేర్పు నాలో ఉంది. గీతతో నా అనుబంధం ఎలా పెరుగుతూ వచ్చిందో సౌకర్యాలూ అలాగే వచ్చాయి. అయినా గీత ఎన్నడూ అహం చూపలేదు. ఇంట్లోనూ, బంధువులతోనూ కలివిడిగా ఉంటుంది. ఏ చిన్న అకేషనైనా మా ఇద్దరి కుటుంబాలు తప్పక కలిసేలా ప్లాన్ చేస్తుంది. అండగా ఉండాలి... ‘లాహిరి లాహిరి లాహిరి’ సినిమాతో ప్రొడ్యూసర్నయ్యాను. అమ్మానాన్నలే కాదు, అత్తింటి వారు కూడా ఆ సినిమాకు ఆర్థికంగా సపోర్ట్ చేశారు. మొదట్లో వరుస సినిమాల సక్సెస్ చవిచూసిన నేను, రెండు సినిమాల ఫెయిల్యూర్స్‌తో బ్యాడ్ పిరియెడ్ కూడా చవిచూశాను. ఎవరు ఎంతగా నిరాశ పరిచినా జయాపజయాలన్నింటిలో నాకు ఎప్పుడూ తోడుగా నిలిచింది గీత! తనకు తెలుసు నా పనిలో ఉండే క్లారిటీ! నేను కష్టపడే విధానం. అర్థం చేసుకునే తత్వం అర్ధాంగిలో ఉంటే ఆ భర్త ఎప్పుడూ విజేతే! గీత: నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! మా ఇంట్లో ఒక్కత్తే అమ్మాయిని అని అపురూపంగా పెంచారు. అమ్మ వైపు వారంతా ప్రభుత్వ ఉద్యోగులే! అందుకే చిన్నప్పటి నుంచి ‘బాగా చదువుకోవాలి. అమెరికాలో మంచి జాబ్ చేస్తూ, అక్కడే స్థిరపడాలి...’ ఇలాగే ఉండేవి నా కలలు. అనుకోకుండా అమ్మను తెలిసినవారు అడగడంతో కొన్ని పత్రికలకు, మ్యాగజీన్లకు మోడలింగ్ చేశాను. ఆ తర్వాత సీరియల్లో, అటు తర్వాత సినిమాలో అవకాశం వచ్చింది. అక్కడే కో డెరైక్టర్‌గా ఈయన్ని చూశాను. ఈయనతో మాట్లాడుతుంటే టైమ్ తెలిసేది కాదు. పెళ్లయ్యాక ఈయనతో కలిసి అమెరికా అంతా చుట్టివచ్చాను. హామీ అవసరం... పెళ్లినాటికి డిగ్రీ ఫస్టియర్‌లో ఉన్నాను. ఈయన పెళ్లి విషయం ఎత్తినప్పు డు... ‘నేను చదువుకోవాలి. పిల్లలకోసం కొంత గ్యాప్ తీసుకోవాలి. పిల్లలు పుడితే వారికోసం మీరు సమయం కేటాయించాలి, మా పేరెంట్స్‌ను బాగా చూసుకోవాలి... అలా అయితేనే పెళ్లి’ అని చెప్పాను. అలాగే పెళి ్లతర్వాత కూడా చదువు కొనసాగించాను. రోజూ ఈయనే నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేసేవారు. డిగ్రీ పూర్తయ్యేంతవరకు నాకు వంట కూడా రాదు. మా అత్తగారు నాకు అండగా నిలిచారు. ఈయన మా ఇద్దరు అన్నయ్యల్లో ఒకరిగా కలిసిపోతారు. అంత బాగానూ అత్తమామలతో ఉంటారు. వైవాహిక జీవితం పరిపూర్ణం కావాలంటే ఇరువైపు కుటుంబాల ఆప్యాయతలూ అవసరమే! అర్థం చేసుకోవాలి... ఒక ప్రాజెక్ట్ ఎంచుకున్నారంటే పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తారు. సృజనాత్మక పనిలో ఎంతటి కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఈయన నుంచి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి. వస్తాయి. ఆ ఆలోచనతోనే ఇంటి బాధ్యత నేను తీసుకున్నాను. భాగస్వామిని అర్థం చేసుకోవాలంటే ప్రేమతో పాటు సహనమూ ఉండాలి. మేం గొడవపడని సందర్భాలు అస్సలు ఉండవని కాదు. మాకు ఇద్దరు పిల్లలు ‘యుక్తా, ఏక్తా’. పెళ్లికి ముందు పిల్లల కోసం టైమ్ కేటాయిస్తానని హామీ ఇచ్చి, నిలబెట్టుకోవడం లేదని సరదాగా దెబ్బలాడుతుంటాను. నాకు ప్రపంచంలోని ఫుడ్ వెరైటీలన్నీ టేస్ట్ చేయాలని ఉంటుంది. ఈయన ఇంట్లో పచ్చడి వేసుకునైనా తినగలరు. ఫంక్షన్‌కి వెళ్లినా ముందు ఇంట్లో తిని వెళతారు. ‘రొటీన్ ఫుడ్ ఎందుకు’ అని అంటాను. ఈయన సినిమాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటే నేను వంటల్లో ప్రయోగాలు చేసి, ప్రశంసలు పొందుతుంటాను. సరదాలే కాదు అలగడం, కోపం చూపించడం మా మధ్య అప్పుడప్పుడూ ఉంటూనే ఉంటాయి. అవన్నీ బంధాన్ని మరింత బలోపేతం చేసేవే! - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇన్నేళ్లూ నా ప్రతి కష్టంలోనూ, సుఖంలోనూ తనూ నాతో కలిసి ప్రయాణించింది. గీతలో నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఇంగ్లీషు సినిమాలు బాగా చూస్తుంది. ఇంగ్లీష్ నవలలు విపరీతంగా చదువుతుంది. ఒక కథ డెరైక్టర్ కంటే బాగా చెప్పగలదు. అందుకే నాకు ఏదైనా కథ ఐడియా వస్తే ముందు గీతకే చెప్పి విశ్లేషిస్తాను. నేను తీసే ప్రతి సినిమాలో గీత కంట్రిబ్యూషన్ తప్పక ఉంటుంది. - వైవీఎస్ చౌదరి మా ఇంటి నేమ్ ప్లేట్ మీద మా అత్తమామల పేర్లు ఉంటాయి. ఈయన తీసే సినిమా ప్రాజెక్ట్‌కు నా పేరు ఉంటుంది. ‘మీ పేరు పెట్టచ్చు కదా’ అంటే... ‘ఇంట్లో ఎవరినీ తక్కువ చేయడం ఇష్టం ఉండదు’ అంటారు. అంతేకాదు... ఎవరు ఏ మూడ్‌లో ఉన్నా కన్విన్స్ చేయగల నేర్పు తన సొంతం. అయితే అందులో ఉండే నిజాయితీని చూసి నాకు చాలా ముచ్చటేస్తుంది. - గీత