పోరాట సన్నివేశం చిత్రీకరిస్తున్న దృశ్యం
దామెర: స్థానిక కళాకారులను ప్రోత్సహించి సినిమాలో అవకాశం కల్పిస్తున్నట్లు మహాబలి సినిమా డైరెక్టర్ రోహిత్ గురువారం తెలిపారు. మహాబలి చిత్రం యునిట్ మండలంలోని పులుకుర్తి గ్రామంలో గత నాలుగు రోజులుగా సందడి చేస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ మాట్లాడారు. ఎస్‌ఆర్ ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై సన్నీ నిర్మాతగా, ప్రధాన తారాగణం రాధాకృష్ణ, మిత్రలు నటిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 9 ప్రముఖ డైరెక్టర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ, 10న ప్రముఖ హీరో చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసోసియేట్ డైరెక్టర్ నిరంజన్, సురేందర్, వర్మ, బాలు, సర్పంచ్ గోవిందు అశోక్, రైతు సమన్వయ సమితి మండల డైరెక్టర్ ముదిగొండ క్రిష్ణమూర్తి, సినిమా యునిట్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment