సినీ దర్శకుడి ఇంట్లో చొరబడ్డ దుండగులు అతని తల్లిదండ్రులను గాయపరచి చోరీకి పాల్పడ్డ సంఘటన శుక్రవారం కలకలం రేపింది.
చెన్నై: సినీ దర్శకుడి ఇంట్లో చొరబడ్డ దుండగులు అతని తల్లిదండ్రులను గాయపరచి చోరీకి పాల్పడ్డ సంఘటన శుక్రవారం కలకలం రేపింది. విన్,మహారాణి కోట్టై చిత్రాల దర్శకుడు వినోద్‌కుమార్. ఈయన తల్లిదండ్రులు సదాశివం(66), అంగయర్‌కన్ని(60) తంజావూర్ సమీపంలోని పిళ్లైయార్‌పట్టి, శ్రీనగర్‌లో నివశిస్తున్నారు. సదాశివం విశ్రాంతి బ్యాక్ ఉద్యోగి. దంపతులు ఇంట్లో నిద్రపోతుండగా శుక్రవారం తెల్లవారుజామున ముగ్గురు దుండగులు ముఖానికి ముసుగేసుకుని ఇంట్లోకి చొరబడ్డారు.
అలికిడికి నిద్రలేసిన సదాశివం ఆయన భార్య దొంగల్ని చూసి అరవబోగా చంపుతామని బెదిరించారు. అయినా భయంతో సదాశివం భార్య కేకలు పెట్టటంతో ఆ దంపతులిద్దర్ని కత్తితో బెదిరించి గాయపరచారు. ఇంతలో ఒక వ్యక్యి అంగ యర్‌కన్ని మెడలోని ఆర సవర్ల బంగారు గొలుసును బలవంతంగా లాక్కుని పారిపోయాడు. గాయపడ్డ ఆ దంపతుల్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. తమిళ్‌పళకలగ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.