ఆయన మా జీవితాలతో ఆడుకుంటున్నాడు! | Poonam Kaur Allegations On Movie Director | Sakshi
Sakshi News home page

ఆయన మా జీవితాలతో ఆడుకుంటున్నాడు!

Published Mon, May 14 2018 8:38 AM | Last Updated on Mon, May 14 2018 9:06 AM

Poonam Kaur Allegations On Movie Director - Sakshi

చెన్నై: ఆ దర్శకుడు హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నాడని పూనం కౌర్‌ సంచలన ఆరోపణలు గుప్పించారు. నెంజిరుక్కువరై చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ఆ తరువాత ఉన్నైపోల్‌ ఒరువన్, పయనం, వెడి, 6 మిలగువత్తిగల్, ఎన్‌ వళి తనీ వళి చిత్రాల్లో నటించారు. హీరోయిన్‌గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోలేకపోయినా, ఇటీవల వివాదాంశ సంఘటనలతో బాగానే పాపులర్‌ అయ్యారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా ఒక హిందీ చిత్రంలో నటించారు. నటుడు పవన్‌ కల్యాణ్‌కు సన్నిహితం అనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. తాజాగా ఒక సినీ దర్శకుడు తనను తరచూ అవమానపరుస్తున్నాడని పూనంకౌర్‌ తన ట‍్వటర్‌లో పేర్కొన్నారు. ఆ దర్శకుడికి అధిక చిత్రాలేమీ లేవని, అయినా ఇతరుల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాడని ఆరోపించారు.

తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడని, తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని అన్నారు. ఆ విషయాల గురించి ఆయన్ని నేరుగా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఏమీ తెలియనట్లు బదులిచ్చాడన్నారు. తనకు కావలసిన వారే సినిమాలో ఉండాలని భావిస్తున్నాడని అన్నారు. అతని గురించిన బయటకు చెప్పరాని పలు విషయాలు తన వద్ద ఆధారాలు సహా ఉన్నాయని చెప్పింది. అతనికి కావలసిన నటీమణులు నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అవుతున్నా, వారికే అవకాశాలు ఇస్తున్నాడని తెలిపారు. ఇతరుల మనోభావాలను ఖూనీ చేస్తున్నాడని ఆరోపించారు. అయితే అతని చర్యలే త్వరలో తగిన శిక్ష విధిస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ దర్శకుడెవరన్నది మాత్రం పూనం కౌర్‌ బయట పెట్టలేదన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement