మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయించేందుకు తమిళ సినిమా వర్గం నడుంకట్టనుంది.
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయించేందుకు తమిళ సినిమా వర్గం నడుంకట్టనుంది. ఆ హంతకులను మానవతా దృక్పథంతో వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ ఓ భారీ ర్యాలీని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. 1991 మే 21న రాజీవ్ గాంధీ హత్య జరిగిన విషయం తెలిసిందే.
ఆయన హత్యకు సంబంధించి ప్రస్తుతం ఏడుగురు జైలు శిక్షను 20 ఏళ్లుగా అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 20 ఏళ్లలో ఆ దోషుల్లో చాలా మంచి మార్పు వచ్చిందని, ఇప్పటికైనా ఆ విషయాన్ని మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకొని వారిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి జయలలితకు విజ్ఞప్తి చేయనున్నారు.