convicts release
-
Bilkis Bano Case: సుప్రీంను ఆశ్రయించిన దోషులు
ఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో తాము లొంగిపోయే గడువును పెంచాలని కోరుతూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు పొడిగించాలని కోరుతూ ముగ్గురు దోషులు పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దోషులలో ఒకరైన గోవింద్‌భాయ్.. తన 88 ఏళ్ల తండ్రి, 75 ఏళ్ల తల్లిని చూసుకునే బాధ్యతను పేర్కొంటూ గడువు పొడిగింపును కోరాడు. తల్లిదండ్రులకు ఏకైక సంరక్షకుడనని ఆయన పేర్కొన్నాడు. మరో దోషి రమేష్ రూపాభాయ్ చందనా తన కుమారుడి పెళ్లికి సమయం కావాలని, ఆరు వారాల పొడిగింపును కోరాడు. మూడవ దోషి మితేష్ చిమన్లాల్ భట్ కూడా ఆరు వారాల పొడిగింపును అభ్యర్థించాడు. శీతాకాల పంట కోతకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అఘాయిత్యం చోటు జరిగింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. ఈ శిక్ష కాలాన్ని తగ్గిస్తూ గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగానే వీళ్లను విడుదల చేసింది. అయితే.. ఈ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. దోషులు మళ్లీ జైలులో జనవరి 21లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
‘బిల్కిస్ బానో’ కేసులో దోషులను వదలొద్దు
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో దోషులు ఓ వర్గం ప్రజలను వెంటాడి, హత్య చేయడమే లక్ష్యంగా రక్తదాహం ప్రదర్శించారని బాధితురాలి తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని కోరారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే గర్భిణిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె కుటుంబంలోని ఏడుగురి హత్య చేశారు. ఈ కేసులో మొత్తం 11 మంది దోషులకు యావజ్జీవ శిక్షపడగా, గత ఏడాది గుజరాత్ ప్రభుత్వం వారికి క్షమాభిక్ష ప్రసాదించింది. దోషులను జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
బిల్కిస్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం
న్యూఢిల్లీ: బిల్కిస్ బాను అత్యాచార ఘటన దోషుల ముందస్తు విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు సీపీఎం నేత సుభాషిణీ అలీ, తృణమూల్ కాంగ్రెష్ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా ఎం.త్రివేదీల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కాసేపటికే, ఈ విషయమై గతంలో బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌పై విచారణ నుంచి గత డిసెంబర్ 13న జస్టిస్ త్రివేదీ తప్పుకున్న విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దాంతో న్యాయమూర్తులిరువురూ కాసేపు చర్చించుకున్నారు. అనంతరం ఈ విచారణ నుంచి కూడా ఆమె తప్పుకుంటున్నట్టు జస్టిస్ రస్తోగీ చెప్పారు. ఆమె స్థానంలో మరో న్యాయమూర్తితో కలిసి ఫిబ్రవరి నుంచి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. తాజా పిటిషన్లను బిల్కిస్ ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌కు కలిపి విచారిస్తామని వెల్లడించారు. -
11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేసిన బిల్కిస్ బానో
న్యూఢిల్లీ: తనపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడాన్ని బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 1992 ఉపశమన నిబంధనలకు ఈ కేసుకు వర్తింపజేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో అనుమతివ్వడాన్ని ఆమె వ్యతిరేకించారు. అలాగే 11 మంది దోషులను ముందుగానే విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మరో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను ఒకేసారి, ఒకే ధర్మాసనం విచారించే విషయాన్ని పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె మూడెళ్ల కుమార్తె సహా కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. అప్పుడు ఆమె వయసు 21 ఏళ్లు. ఐదు నెలల గర్భవతి కూడా. ఈ దారుణ ఘటనలో 11 మందిని దోషులుగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. అయితే 15 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వీరిని ఈ ఏడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చదవండి: 'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా' -
‘రాజీవ్’ దోషుల విడుదలలో ఊహించని ట్విస్ట్
న్యూఢిల్లీ: దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజీవ్ హత్య కేసు దోషులను విడుదల చేయడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది కేంద్ర ప్రభుత్వం. దోషుల విడుదల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీం కోర్టులో గురువారం ఓ పిటిషన్ దాఖలు చేసింది. తగిన విచారణ లేకుండా దోషుల విడుదల జరిగిందని, ఇలా చేయడం న్యాయసూత్రాలను ఉల్లంఘించినట్లవుతుందని పిటిషన్లో పేర్కొంది కేంద్రం. గత మూడు దశాబ్దాలుగా వారి జైలు జీవితం తమిళనాడులో రాజకీయ సమస్యగా మారిందని, ఇలాంటి సున్నితమైన అంశంలో కేంద్రం సలహా అవసరమని అభిప్రాయపడింది. ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చేందిన వారు కాగా.. ఉగ్రవాదులుగా ముద్ర పడినవారికి క్షమాభిక్ష పెట్టడం అంతర్జాతీయంగా ప్రభావం చూపిస్తుందని తెలిపింది. ఈ కేసులో తామూ ఒక భాగమేనన్న కేంద్రం.. తమ వాదన వినకుండా విడుదల చేయడం సబబు కాదని పిటిషన్లో పేర్కొంది. కేసులో ప్రభుత్వాన్ని ఇంప్లీడ్ చేయకుండా దోషుల శిక్ష తగ్గింపు కోరారని వివరించింది. కావున.. విడుదల ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరింది కేంద్రం. ఇదీ చదవండి: రాజీవ్ హత్య కేసు: సుప్రీంకోర్టు తీర్పు మాకు అంగీకారం కాదు.. సోనియా కుటుంబం క్షమించినా.. -
‘సుప్రీం’ నిర్ణయం సబబే
రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్షపడి మూడు దశాబ్దాలుగా జైళ్లలో మగ్గుతున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఆహ్వానించదగ్గది. సుదీర్ఘకాలం శిక్ష అను భవించటంతోపాటు వారి సత్ప్రవర్తన అంశం కూడా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. రాజీవ్‌గాంధీ హత్య జరిగిన 1991 మే 21 మొదలుకొని చాలా తరచుగా ఈ కేసు జనం నోళ్లలో నానుతూనే ఉంది. ఈ ఉదంతంలో రాజీవ్‌తోపాటు ఒక ఎస్పీ స్థాయి అధికారి సహా 15 మంది మరణించారు. 1984లో ప్రధానిగా ఉంటూ ఖాలిస్థాన్ ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు ఇందిరాగాంధీ బలైతే, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ సైతం మరో ఏడేళ్లకు ఎల్టీటీఈ మిలిటెంట్లు చేసిన అదే మాదిరి మతిమాలిన చర్యకు ప్రాణాలు కోల్పోయిన తీరు దేశ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు 90వ దశకం అంతా రాజీవ్ హత్య కేసు దర్యాప్తు, విచారణ సాగుతూనే ఉన్నాయి. సీబీఐ ఈ కేసులో దర్యాప్తు జరిపి 41 మందిని నిందితులుగా చూపగా, టాడా కోర్టు అందులో 26 మందిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. తదుపరి సుప్రీంకోర్టు వారిలో 19 మందిని నిర్దోషు లుగా తేల్చి విడుదల చేసింది. ముగ్గురి మరణశిక్షను యావజ్జీవ శిక్షలుగా మార్చింది. నలుగురు దోషులు–మురుగన్, శంతన్, పేరరివాళన్, నళినిలకు మరణశిక్ష ఖరారు చేసింది. ఇక అప్పటినుంచి ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. ఇందులో తమిళనాడు రాజకీయాలు కూడా కలగలిశాయి. చివరకు 2000 సంవత్సరంలో సోనియాగాంధీ స్వయంగా తమిళనాడు గవర్నర్‌కు లేఖరాసి మరణశిక్ష పడిన నళినికి క్షమాభిక్ష పెట్టాలని కోరారు. దాంతో ఆమెకు ఉరికంబం బెడద తొలగింది. అప్పటినుంచి ఆమె యావజ్జీవ ఖైదీగా ఉంటున్నారు. తమ తండ్రి హంతకులను క్షమిం చామని ప్రియాంక, రాహుల్ కూడా వేర్వేరు సందర్భాల్లో చెప్పారు. మరో పద్నాలుగేళ్లకు ఉరిశిక్ష అమలులో జాప్యం జరిగిందన్న కారణంతో మురుగన్, శంతన్, పేరరివాళన్‌ల ఉరిశిక్షలను సర్వో న్నత న్యాయస్థానమే యావజ్జీవ శిక్షలుగా మార్చింది. నిర్ణయ రాహిత్యంగా నిర్ధారించాలో లేక రాజకీయ అయోమయంగా పరిగణించాలో... ఆ తర్వాత కాలమంతా రాజీవ్ హంతకుల విషయంలో డోలాయమాన స్థితి ఏర్పడింది. సర్వోన్నత న్యాయస్థానం తేల్చాక కూడా దోషులకు శిక్షలు అమలు చేయకపోవటం గమనిస్తే తమిళనాడు రాజకీయాలను ఈ వ్యవహారం ఎంతగా ప్రభావితం చేసిందో గ్రహించవచ్చు. డీఎంకే, అన్నాడీఎంకే సహా ప్రధాన ద్రవిడ పార్టీలన్నీ రాజీవ్ కేసు దోషులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా వారితో కలిసి కూటమి కట్టడానికి అభ్యంతరం లేని కాంగ్రెస్‌కు ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టు నిర్ణయం ‘తీవ్ర బాధాకరం, దురదృష్టకరం’ ఎందుకైందో అర్థం కాదు. పైగా ఇది కేవలం కాంగ్రెస్ అభిప్రాయం తప్ప సోనియా ఉద్దేశం కాదట. ఈ ప్రకటన విడుదల చేసిన పార్టీ నేత జైరాం రమేశ్ సుప్రీంకోర్టు తాజా నిర్ణయాన్ని ‘తీవ్ర తప్పిదం’గా విమర్శించారు. మరి యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఆ దోషులకు అమలు చేయాల్సిన శిక్ష గురించి ఎందుకు ఆలోచించలేక పోయారు? మరణశిక్ష విధించటం అనాగరికమని చాలా దేశాలు ఆ శిక్షలను రద్దు చేశాయి. మన దేశం సైతం ఆ మాదిరి నిర్ణయమే తీసుకోవాలని కోరుకుంటున్న ప్రజాస్వామికవాదులున్నారు. దాన్నెవరూ తప్పు బట్టరు. పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురును అతని కుటుంబానికి ముందస్తుగా తెలియజేయాలన్న నిబంధనను సైతం కాలదన్ని యూపీఏ సర్కారు ఉరి అమలు చేసిన సంగతి జైరాం రమేశ్ మరిచిపోకూడదు. రాజకీయ లబ్ధి కోసం తాము ఇష్టానుసారం ఏమైనా చేయొచ్చుగానీ సుప్రీంకోర్టు మాత్రం నిర్ణయాత్మకంగా వ్యవహరించరాదనటం అర్ధరహితం. దోషుల పిటిషన్లను విచారిస్తున్న సందర్భాల్లో మీ అభిప్రాయమేమిటని సుప్రీంకోర్టు పలు మార్లు కేంద్రాన్ని అడిగింది. యూపీఏ హయాంలోనూ, ప్రస్తుత ఎన్డీఏ హయాంలోనూ కేంద్రం ఒకే మాదిరి వ్యవహరించింది. 2018లో అన్నా డీఎంకే ప్రభుత్వ కేబినెట్ రాజీవ్ కేసు దోషులందరినీ విడుదల చేయాలని గవర్నర్‌కు సిఫార్సు చేస్తూ తీర్మానించింది. ఆయన ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపారు. ఆ విషయంలో తుది నిర్ణయం రాష్ట్రపతిదేనని నిరుడు ఫిబ్రవరిలో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘అసలు మీరు ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతికి పంపార’ని గవర్నర్‌ను కోరితే ఆయన నుంచి మౌనమే సమాధానమైంది. శిక్షల తగ్గింపులో తమదే తుదినిర్ణయమంటూ కేంద్రం చేసిన వాదన సరికాదనీ, నిబంధనలు నిర్దిష్టంగా ఉన్న సందర్భాల్లో తప్ప రాష్ట్రాలకు కూడా ఆ విషయంలో సమానాధికారాలున్నాయనీ సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. చివరికి అటు రాష్ట్రపతి, ఇటు గవర్నర్ ఏ నిర్ణయమూ ప్రకటించని పరిస్థితుల్లో దోషులు దీర్ఘకాలం శిక్ష అనుభవించిన సంగతిని, వారి సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని విడుదల చేసింది. తెలిసిచేసినా, తెలియకచేసినా నేరం చేసినవారు శిక్ష అనుభవించాల్సిందే. కానీ అందుకు కొన్ని నిబంధనలుంటాయి. శిక్ష ఉద్దేశం నేరగాళ్లను సంస్కరించటమే తప్ప వారిపై ప్రతీకారం తీర్చుకోవటం కాదు. రాజీవ్ విషయంలో దోషులను పట్టుకోవటం, శిక్షించటం అయింది. మరి ఇందిర హత్యానంతర మారణకాండలో సిక్కుల ఊచకోత దోషులను ఇంతవరకూ ప్రభుత్వాలు ఎందుకు శిక్షించలేకపోయాయి? న్యాయం సమానంగా ఉండటమే కాదు, అలా ఉన్నట్టు కనబడాలి కూడా. ఆ పరిస్థితి లేనప్పుడు సుప్రీంకోర్టు న్యాయబద్ధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం తప్పెలా అవుతుంది? -
రాజీవ్ హత్య కేసు: సుప్రీంకోర్టు తీర్పు మాకు అంగీకారం కాదు..
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న మొత్తం ఆరుగురు దోషుల ముందస్తు విడుదలకు సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో దోషిగా 30 ఏళ్లకు పైగా శిక్ష అనుభవించిన ఎ.జి.పెరారివళన్ సుప్రీంకోర్టు ఆదేశం మేరకు గత మే 18న విడుదలవడం తెలిసిందే. మిగతా దోషులకూ అదే వర్తిస్తుందని న్యాయమూర్తులు బి.ఆర్.గవాయ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘వారికి క్షమాభిక్ష పెట్టాలంటూ గతంలోనే తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసింది. దీంతోపాటు దోషుల సత్ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకున్నాం’’ అని తెలిపింది. దాంతో 30 ఏళ్లకు పైగా జైల్లో ఉన్న ఎస్.నళిని, ఆమె భర్త వి.శ్రీహరన్ అలియాస్ మురుగన్, ఆర్.పి.రవిచంద్రన్, జయకుమార్, రాబర్ట్ పయస్, శంతన్‌కు విముక్తి లభించింది. శ్రీహరన్, శంతన్, రాబర్ట్, జయకుమార్ శ్రీలంక దేశస్తులు. నళిని, రవిచంద్రన్ ముందస్తు విడుదలకు పెట్టుకున్న పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సహ దోషి పెరారివాళన్ విడుదలను కోర్టు దృష్టికి తెచ్చారు. 2021 డిసెంబర్ 27 నుంచి వారిద్దరూ పెరోల్‌పై బయటే ఉన్నారు. మిగతా నలుగురు తమిళనాడులోని వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఇది పూర్తిగా తప్పుడు నిర్ణయం. మాకెంతమాత్రమూ అంగీకారం కాదు. కోర్టు సరైన స్ఫూర్తితో వ్యవహరించలేదు’’ అని పార్టీ నేతలు రణ్‌దీప్ సుర్జువాలా, అభిషేక్ సింఘ్వి, జైరాం రమేశ్ తదితరులన్నారు. సుప్రీం తీర్పుపై సమీక్ష కోరడమా, న్యాయపరంగా ఇతరత్రా చర్యలు చేపట్టడమా యోచిస్తున్నట్టు స్పష్టం చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు విన్పించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మాజీ ప్రధానిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల విడుదలను సమర్థిస్తారో, లేక తీర్పుపై సమీక్ష కోరతారో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘దోషులను సోనియా, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ క్షమించి ఉండవచ్చు. అది వారి గొప్పదనం. కానీ పార్టీగా వారి నిర్ణయాన్ని మాత్రం కాంగ్రెస్ సమర్థించబోదు. ఈ విషయంలో పార్టీ వైఖరి ముందునుంచి ఒకేలా ఉంది’’ అని చెప్పారు. తమిళనాట మాత్రం కాంగ్రెస్ భాగస్వామ్య పక్షమైన అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే దోషుల విడుదలను స్వాగతించాయి. ఇది చరిత్రాత్మక తీర్పని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ అన్నారు. నళిని తల్లి హర్షం సుప్రీం తీర్పు పట్ల నళిని తల్లి ఎస్.పద్మ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ‘‘అంతులేని ఆనందమిది. నళిని, మేమంతా ఇంతకాలం అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు’’ అన్నారు. పెరోల్‌పై బయట ఉన్నందున తీర్పుపై స్పందించేందుకు నళిని నిరాకరించింది. ఆమె కూతురు ప్రస్తుతం లండన్‌లో ఉంటోంది. ఆ రోజు ఏం జరిగింది...? 1991 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 21న రాజీవ్‌గాంధీ తమిళనాడులో చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరులో రాత్రి వేళ సభలో పాల్గొన్నారు. రాత్రి 10:10 సమయంలో శ్రీలంకలోని జాఫ్నాకు చెందిన తెన్మొళి రాజారత్నం అలియాస్ థాను అనే ఎల్టీటీఈ మహిళా ఆత్మాహుతి దళ సభ్యురాలు ఆర్డీఎక్స్తో కూడిన బెల్టు బాంబు పెట్టుకుని రాజీవ్‌ను సమీపించింది. ఆయనకు పూలమాల వేసింది. కాళ్లకు మొక్కేందుకన్నట్టుగా కిందకు వంగింది. ఆమెను పైకి లేపేందుకు రాజీవ్ కాస్త ముందుకు వంగుతూనే తనను తాను పేల్చేసుకుంది. దాంతో రాజీవ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 14 మంది కూడా మరణించారు. ఎల్టీటీఈని అడ్డుకునేందుకు శ్రీలంక ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు శాంతి పరిరక్షణ దళం పేరిట అక్కడికి భారత సైన్యాన్ని పంపుతూ ప్రధానిగా రాజీవ్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహించి సంస్థ అధిపతి వేలుపిళ్లై ప్రభాకరన్ ఈ దురాగతానికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. విచారణలో మలుపులు 1991 మే 21: రాజీవ్ హత్య. ఈ కేసులో ఏడుగురి అరెస్టు. నళిని ఆ సమయంలో గర్భవతి. జైల్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 1991 జూన్ 11: పెరారివాళన్‌ను అరెస్టు చేసిన సిట్. టాడా చట్టం కింద కేసు. 1991: బెంగళూరులో పేలుడు సూత్రధారి శివరాసన్ తలదాచుకున్న ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు. దాంతో మరో ఆరుగురితో కలిసి శివరామన్ ఆత్మహత్య. 1992: రాజీవ్ హత్యలో ఎల్టీటీఈ పాత్ర ఉందని తేల్చిన సిట్. 1990లోనే జాఫ్నా అడవుల్లో ఇందుకు ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ పథక రచన చేసినట్టు వెల్లడి. 1998: మురుగన్, సంథాను, పెరారివళన్, నళిని సహా మొత్తం 26 దోషులకు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. 1999: నలుగురు నిందితుల అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మురుగన్, శంతను, పెరారివాళన్, నళినిలకు కింది కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది. ముగ్గురికి జీవితకాల శిక్ష విధిస్తూ మిగతా 19 మందిని వదిలేసింది. నళిని, మురుగన్, శంతను, పెరారివాళన్ క్షమాభిక్ష అభ్యర్థనను తమిళనాడు ప్రభుత్వం తోసిపుచ్చింది. 2001: శంతను, మురుగన్, పెరారివాళన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తిరస్కరించారు. ముగ్గురికి విధించాల్సిన మరణశిక్షపై మద్రాస్ హైకోర్టు సెప్టెంబర్ 9న స్టే విధించింది. దాన్ని జీవితకాల శిక్షకు తగ్గించాలన్న తీర్మానానికి నాటి తమిళనాడు సీఎం జయలలిత ఆమోదం తెలిపారు. 2011: రాజీవ్‌ను హత్య చేసినందుకు భారత్‌కు ఎల్టీటీఈ క్షమాపణ. 2014: రాజీవ్ భార్య సోనియా గాంధీ అభ్యర్థన మేరకు నళిని మరణశిక్షను జీవితకాల శిక్షగా తగ్గించిన సుప్రీంకోర్టు. 2018: మొత్తం ఏడుగురు నిందితులనూ విడుదల చేయాలని తమిళనాడు కేబినెట్ సిఫార్సు. 2019: నళినికి తొలిసారి పెరోల్. 2021: నళిని, రవిచంద్రన్‌లకు పెరోల్. 2022: సుప్రీంకోర్ట్ తీర్పుతో మే 18న పెరారివాళన్ జైలు నుంచి విడుదలయ్యాడు. 2022 సెప్టెంబర్: నళిని, రవిచంద్రన్ విడుదలకు సుప్రీంకోర్ట్ ఆదేశం. నవంబర్ 2022: మిగతా ఆరుగురు దోషులను కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్ట్ తీర్పు. -
బిల్కిస్ బానో కేసు: రిలీజ్‌కు కేంద్రం కూడా పర్మిషన్
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల ముందస్తు విడుదలకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదకొండు మంది ఖైదీల త్వరగతిన విడుదలను సీబీఐ, ప్రత్యేక న్యాయాస్థానాలు వ్యతిరేకించినా.. కేంద్రం కేవలం రెండే వారాల్లో విడుదలకు అనుమతి ఇచ్చిందని వెల్లడైంది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం సోమవారం.. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. పద్నాలుగేళ్లు జైల్లో గడిపిన బిల్కి బానోస్ నిందితులను సత్ప్రవర్తన ఆధారంగానే విడుదల చేశామని, ఇందుకు కేంద్రం సైతం ఆమోదం తెలిపిందని గుజరాత్ ప్రభుత్వం, సుప్రీం కోర్టుకు నివేదించింది. రెమిషన్ కింద 11 మంది దోషులను విడుదల చేసేందుకు ఈ జూన్ 28వ తేదీన.. గుజరాత్ ప్రభుత్వం కేంద్ర అనుమతి కోసం ప్రయత్నించింది. అయితే జులై 11వ తేదీన కేంద్ర హోం వ్యవహారాల శాఖ దానికి అప్రూవల్ ఇచ్చినట్లు పత్రాల్లో స్పష్టంగా ఉంది. సీపీఎం పొలిబ్యూరో సభ్యులు సుభాషిని అలీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మెహువా మోయిత్రాలే కాకుండా మరొకరు కూడా బిల్కిస్ బానో దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని సెక్షన్ 435 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా గుజరాత్ ప్రభుత్వం మాత్రమే దోషులను విడుదల చేయడంపై పిటిషనర్ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం, గుజరాత్ ప్రభుత్వాన్ని దోషుల రెమిషన్(విడుదలకు సంబంధించిన) ఆదేశాలతో సహా బిల్కిస్ బానో కేసుకు సంబంధించి మొత్తం రికార్డు ప్రొసీడింగ్స్ సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. ముంబైలోని సీబీఐ స్పెషల్ బ్రాంచ్ ఎస్పీతో పాటు గ్రేటర్ బాంబే సిటీ సివిల్ సెషన్స్ కోర్టు సీబీఐ ప్రత్యేక సివిల్ న్యాయమూర్తి సైతం ఖైదీల విడుదలను వ్యతిరేకించినట్లు అఫిడవిట్లో పేర్కొంది గుజరాత్ ప్రభుత్వం. దోషుల క్షమాభిక్షకు సంబంధించిన నిర్ణయం గురించి తనను స్పందించలేదని బిల్కిస్ బానో చెప్తున్నారు. ఒక దోషులను విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వం తరపున సూచించిన అడ్వైజరీ కమిటీ పది మంది సభ్యుల్లో.. సగం మంది బీజేపీతో సంబంధం ఉన్నారనే విషయం వెలుగు చూసింది. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఇదీ చదవండి: ముందు షారూక్‌ను తీసేయండి: బీజేపీ -
బిల్కిస్ బానో దోషుల విడుదల.. సుప్రీం నోటీసులు
ఢిల్లీ: బిల్కిస్ బానో సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి పదకొండు మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేయడంపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. దోషుల విడుదలపై గురువారం గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గుజరాత్ నిబంధనల ప్రకారం, దోషులు ఉపశమనం పొందేందుకు అర్హులా కాదా?. ఉపశమనాన్ని మంజూరు చేసేటప్పుడు దరఖాస్తును ఎలా పరిగణనలోకి తీసుకున్నారో చూడాల్సి ఉందంటూ అంటూ సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం దోషుల విడుదలపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది సుప్రీం కోర్టు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను రెండువారాల పాటు వాయిదా వేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆమె కుటుంబ సభ్యులతో సహా పలువురిని హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు అనంతరం నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకుని.. జీవిత ఖైదుగా మార్చాయి. తాజాగా 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ పాలసీ ప్రకారం.. ఆ పదకొండు మందిని విడుదల చేసింది. ఈ విడుదలపై బాధితురాలితో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయంగానూ గుజరాత్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బిల్కిస్ బానో తరపున న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పదకొండు మంది విడుదలను సవాల్ చేస్తూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఇదీ చదవండి: నాలుక కోస్తా.. ఎమ్మెల్యేకు వార్నింగ్ లెటర్ కలకలం -
నేరస్థులను సన్మానించడం ముమ్మాటికీ తప్పే..
ముంబై: బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులు ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. వారికి కొందరు పూలమాలలు వేసి సన్మానాలు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై తాజాగా మహారాష్ట్ర హోంమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే దోషులు విడుదలయ్యారని, వారంతా దాదాపు 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారని పేర్కొన్నారు. అయితే నేరస్థులకు పూలమాలలు వేసి సన్మానాలు చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే అని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఇలా చేయటం సరికాదన్నారు. మహారాష్ట్ర భండారాలో 35ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై శాసన మండలిలో చర్చ సందర్భంగా ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్కిస్ బానో ఘటనను సభలో ప్రస్తావించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 2002 గుజరాత్ అలర్ల సమయంలో బాల్కిస్ బానో సామూహిక అత్యాచార ఘటన జరిగింది. బాధితురాలి కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో మొత్తం 11 మందిని 2008లో దోషులుగా తేల్చింది ముంబయిలోని సీబీఐ న్యాయస్థానం. అందరికీ యవజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. అయితే 14 ఏళ్ల శిక్షకాలం పూర్తి చేసుకున్నందున తమను జైలు నుంచి విడుదల చేయాలని దోషుల్లో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని గుజారత్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న 11 మందిని విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. వీరంతా జైలు నుంచి బయటకు రాగానే కొందరు పూలమాలలు వేసి మిఠాయిలు తినిపించారు. దోషులందరినీ జైలు నుంచి విడుదల చేయడం, సన్మానించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే! -
‘బిల్కిస్ బానో’ దోషుల విడుదలపై సుప్రీం కోర్టులో పిల్
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేయటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు పలువురు మహిళా హక్కుల కార్యకర్తలు. సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో దోషులుగా తేలిన వారిని విడుదల చేయొద్దని పిటిషన్లో పేర్కొన్నారు. బిల్కిస్ బానో కేసు దోషుల రెమిషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు మహిళా హక్కుల కార్యకర్తలు సుభాషిని అలీ, రేవతి లాల్, రాప్ రేఖ వర్మలు. ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్, అపర్నా భట్. 14 మంది హత్య, గర్భిణీపై అత్యాచారానికి సంబంధించిన కేసులో దోషులను విడుదల చేయటాన్ని సవాల్ చేసినట్లు కపిల్ సిబాల్ పేర్కొన్నారు. ఈ పిల్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. అంతకు ముందు.. సుమారు 6వేల మంది హక్కుల కార్యకర్తలు, చరిత్రకారులు దోషుల విడుదలను వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు. ఇదీ చదవండి: నమ్మకం పోయింది.. జీవితాంతం భయంతో మనశ్శాంతి లేకుండా బతకాల్సిందేనా?: దోషుల విడుదలపై బిల్కిస్ ఆవేదన -
సిగ్గుచేటు నిర్ణయం
ప్రభుత్వానికి ఉన్న విచక్షణాధికారాలు చట్టబద్ధమైనవే కావచ్చు. కానీ, రాజకీయ కారణాలతో వాటిని విచక్షణా రహితంగా వాడితే? ఇరవై ఏళ్ళ క్రితం గుజరాత్ మారణకాండ వేళ దేశాన్ని కుదిపేసిన బిల్కిస్ బానో కేసులో ఆ రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడదే జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ‘నారీశక్తి’ గురించి గొప్పగా చెప్పారు. ‘మహిళల్ని తక్కువగా చూసి, బాధించే మన ప్రవర్తననూ, సంస్కృతినీ, రోజువారీ జీవనవిధానాన్నీ మార్చుకోలేమా’ అని అడిగారు. కానీ, సరిగ్గా అదే రోజున సాక్షాత్తూ ప్రధాని మాటల స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఆయన స్వరాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం దిగ్భ్రాంతికరం. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో యావజ్జీవ కారాగార వాసం అనుభవించాల్సిన 11 మంది దోషులకు శిక్ష తగ్గించి, విడుదల చేయడం శోచనీయం. మతఘర్షణల్లో మూడేళ్ళ పసికందు తలను బండకేసి కొట్టి, మరో 13 మంది ముస్లిమ్‌లను చిత్రహింసలు పెట్టి క్రూరంగా చంపి, 5 గ్యాంగ్ రేపులు చేసిన 11 మంది దోషుల అమానుషత్వం ఇప్పటికీ దేశాన్ని నిద్రపోనివ్వని పీడకల. అయినా సరే ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో పాలకులు ఇలా క్షమించి, వదిలేశారంటే – దాని వెనుక కారణాలు ఏమై ఉంటాయో ఊహించడం కష్టమేమీ కాదు. ఈ రాజకీయ నిర్ణయంతో దోషులకు శిక్ష మాటేమో కానీ, బాధితులకు జరగాల్సిన న్యాయం తగ్గిందనే భావన కలుగుతోంది. తక్షణమే ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోకుంటే, ఇది ఒక పూర్వోదాహరణగా మారే ప్రమాదం ఉంది. పాలకుల చేతిలోని శిక్షాకాలపు తగ్గింపు అధికారాలు ఎక్కడికక్కడ తరచూ దుర్వినియోగం కావచ్చనే భయమూ కలుగుతోంది. 2002 గుజరాత్ అల్లర్లలో రాష్ట్రం విడిచి పారిపోవడానికి ప్రయత్నించిన వందలాది గుజరాతీ ముస్లిమ్లలో బిల్కిస్ బానో ఒకరు. మార్చి 3న ఆమె తన మూడేళ్ళ పాపతో, 15 మంది కుటుంబ సభ్యులతో కలసి గ్రామం విడిచిపోతూ, పొలంలో తలదాచుకున్నారు. కత్తులు, కర్రలు, కొడవళ్ళు పట్టుకొని దాడికి దిగిన దుర్మార్గులు అయిదునెలల గర్భిణి అయిన 21 ఏళ్ళ బానోపై సామూహిక అత్యాచారం జరిపారు. ఆమె కళ్ళెదుటే ఆమె కుటుంబ సభ్యులు ఏడుగుర్ని దారుణంగా చంపారు. ఆమె తల్లినీ, సోదరినీ వదలకుండా హత్యాచారం చేశారు. కొనఊపిరితో మిగిలిన బానో కళ్ళు తెరి చాక, ఓ ఆదివాసీ మహిళ ఇచ్చిన వస్త్రాలతో బయటపడి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేక మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో చివరకు సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకుంది. బానోకు ప్రాణహాని బెదిరింపుల మధ్య సరైన న్యాయవిచారణ కోసం కేసు గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేశారు. దోషులకు 2008లో సీబీఐ కోర్ట్ విధించిన శిక్షను 2017లో బొంబాయి హైకోర్ట్, ఆపైన సుప్రీమ్ సమర్థించాయి. తీరా ఇప్పుడు కనీసం 14 ఏళ్ళ జైలుశిక్ష పూర్తయిన ఖైదీలను విడుదల చేసే విచక్షణాధికారాన్ని అడ్డం పెట్టుకొని, దోషులను గుజరాతీ సర్కార్ విడుదల చేసింది. గోధ్రా జైలు నుంచి బయటకొచ్చిన దోషుల్లో పలువురు విశ్వహిందూ పరిషత్ సభ్యులని వార్త. రేపిస్టు, హంతకులను సమర్థిస్తూ, దండలు వేసి స్వాగతిస్తూ, లడ్డూలు పంచుతున్న దృశ్యాలు తల దించుకొనేలా చేస్తున్నాయి. బాధితురాలు బానో బిక్కుబిక్కుమంటూ 15 ఏళ్ళలో ఇరవై ఇళ్ళు మారి, దీర్ఘకాలం చేసిన పోరాటం వృథాయేనా? బాధితురాలు నివసిస్తున్న అదే గ్రామంలో ఆమె ఎదుటే, ఇప్పుడా 11 మంది దోషులు రొమ్ము విరుచుకు తిరుగుతుంటే, అదెంత మానసిక క్షోభ? కక్ష కట్టిన దోషుల నుంచి ఆమె ప్రాణాలకు ఎవరు రక్ష? కేంద్రాన్ని సంప్రతించకుండా శిక్షాకాలపు తగ్గింపు నిర్ణయం తీసుకోరాదని చట్టం. సంప్రతించడమంటే, అనుమతి అనే తాత్పర్యం. అంటే, హేయమైన నేరం చేసినవారిని వదిలేయాలన్న గుజరాత్ సర్కార్ పాపంలో కేంద్రానికీ వాటా ఉందనేగా! అదేమంటే, నిందితులకు శిక్షపడిన 2008 నాటికి అమలులో ఉన్న పాత 1992 నాటి విధి విధానాల ప్రకారమే నడుచుకున్నామంటూ సర్కార్ తప్పించుకోజూస్తోంది. నిజానికి ఆ నిబంధనల్ని కొట్టేసి, 2013లో కొత్త నిబంధనలూ వచ్చాయి. సున్నితమైన కేసుల్లో నిబంధనల్లోని లొసుగుల్ని వాడుకొనే కన్నా, సామాన్యులకు జరిగిన అన్యాయంపై పాలకులు కఠినంగా ఉండాలనే ప్రజలు ఆశిస్తారు. గుజరాత్ సర్కార్ ప్రవర్తన అలా లేదు. పైగా, బానో కేసు దోషులకు శిక్షాకాలం తగ్గించమన్న సలహా సంఘంలో ఇద్దరు సభ్యులు బీజేపీ ఎమ్మెల్యేలే. వృందా గ్రోవర్ లాంటి లాయ ర్లన్నట్టు ఆ 1992 నాటి నిబంధనల కాపీ పబ్లిక్ డొమైన్లో కనిపించకుండాపోవడం ఆశ్చర్యకరం. బానో కేసులో దోషుల్ని జైలు నుంచి విడిచిపెట్టి, గుజరాత్ అల్లర్లపై గళం విప్పిన ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్, పోలీసు అధికారులు సంజీవ్ భట్, ఆర్పీ శ్రీకుమార్ లాంటివారిని కటకటాల వెనక్కి నెట్టడం వక్రోక్తి. నోరెత్తిన నేరానికి వయోభారం, వైకల్యంతో ఉన్నాసరే కవుల్నీ, ప్రొఫెసర్లనీ విచారణ సాకుతో అక్రమ కేసుల్లో ఏళ్ళ తరబడి జైలులో మగ్గబెడుతున్న మన పాలక, న్యాయవ్యవస్థ లకు క్రూరమైన హత్యాచార దోషులపై ఎక్కడలేని జాలి కలగడం విడ్డూరం. 2012లో ‘నిర్భయ’ తర్వాత దేశంలో కఠిన చట్టాలు చేశామని జబ్బలు చరుచుకుంటున్న పాలకుల చిత్తశుద్ధిని ఇప్పుడేమ నాలి? స్త్రీలు సరైన దుస్తులు ధరించకపోతే అత్యాచార వ్యతిరేక చట్టం వర్తించదంటున్న కేరళ కోర్టును చూస్తే మన వ్యవస్థలు ఏం మారినట్టు? ఈ మాటలు, నిర్ణయాలు సమాజానికే సిగ్గుచేటు. బానో కేసులో పాలకుల నిర్ణయం మహిళలెవ్వరూ సహించలేని ఘోరం! క్షమించలేని నేరం! -
ఇంకెంత కాలం జాప్యం..!
సాక్షి, చెన్నై: ఇంకెంత కాలం జాప్యం చేస్తారు..? తీర్మానంపై నిర్ణయం వెలువడేదెప్పుడో? అని రాజీవ్ హత్యకేసు నిందితుల విడుదల వ్యవహారంలో రాజ్‌భవన్ తీరుపై మద్రాసు హైకోర్టు అసంతప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానంపై ఎలాంటి నిర్ణయం అన్నది తీసుకోకుండా రాష్ట్రగవర్నర్ చేస్తున్న జాప్యంపై హైకోర్టు బుధవారం స్పందించడం గమనార్హం. రాజీవ్ హత్యకేసులో నిందితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్‌తో సహా ఏడుగురి ఉరి శిక్ష యావజ్జీవంగా మారిన విషయం తెలిసిందే. ఆ శిక్షా కాలం ముగిసినా తాము జైలుకే పరిమితం కావడంతో విడుదల చేయాలని కోరుతూ నింథితులు కోర్టుల్ని ఆశ్రయిస్తూ వస్తున్నా ఫలితం శూన్యం. వీరి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినా, అది రాజ్ భవన్‌కే పరిమితం అయింది. దీంతో తమను విడుదల చేసే రీతిలో గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని మళ్లీ కోర్టు తలుపులు తట్టినా ప్రయోజనం శూన్యం. చివరకు బంతి రాజ్ భవన్ కోర్టులో పడింది. ఈ వ్యవహారంలో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ ఇచ్చే నివేదిక మీద విడుదల ఆధార పడి ఉన్నది. అదే సమయంలో శిక్షాకాలం ముగిసినా, జైలులోనే జీవితాలు మగ్గుతున్నాయంటూ నళిని దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ సమయంలో అదనపు సొలిసిటర్ జనరల్ రాజగోపాల్ కోర్టుకు ఇచ్చిన వివరణ సర్వత్రా షాక్‌కు గురి చేసింది. తమిళనాడు ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడో తిరస్కరించినట్టు వివరిస్తూ, దీని విలువను ‘సున్న’ గా పరిగణించాలని వాదించడం చర్చకు దారి తీసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ తీర్మానం గురించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు పలు మార్లు సిఫారసు చేస్తూ వస్తున్నా, స్పందన అన్నది కరువే. ఈ తీర్మానం చేసి రెండేళ్లు కావస్తున్నా, ఇంత వరకు రాజ్ భవన్ నుంచి తీర్మానం ఆమోదం లేదా తిరస్కరణ అన్న నిర్ణయం కూడా వెలువడ లేదు. మనస్తానికి లోనైన నళిని జైలులో ఆత్మహత్యాయత్నం కూడా చేయక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో జాప్యంపై హైకోర్టు సైతం అసంతప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. జాప్యంపై అసంతప్తి.. రాజీవ్ కేసు నిందితుల్లో ఒకడైన పేరరివాలన్‌కు 90 రోజులు పరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తల్లి అర్బుదమ్మాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తులు కపాకరణ్, వేలుమణి బెంచ్‌ముందు విచారణకు వచ్చింది. ఇప్పటికే 2017, 2019లో పేరరివాలన్‌కు పెరల్ మంజూరు చేసి ఉన్నట్టు, ప్రస్తుతం చేసుకున్న విజ్ఞప్తి పరిశీలనలో ఉన్నట్టు ప్రభుత్వం తరపున వాదన కోర్టుకు చేరింది. ఈసందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ, రాజీవ్ కేసు నింథితుల విడుదల తీర్మానం ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ తీర్మానం మీద నిర్ణయంలో జాప్యం ఎందుకో అని ప్రశ్నించారు. ఇంకెంత కాలం జాప్యం చేస్తారోనని పేర్కొంటూ, అసంతప్తిని న్యాయమూర్తులు వ్యక్తం చేశారు. ఈ తీర్మానం మీద ఎలాంటి నిర్ణయం అన్నది తీసుకోకుండా తుంగలో తొక్కి పెట్టి ఉండటం మీద అసహనం వ్యక్తంచేస్తున్నట్టు పేర్కొన్నారు.ప్రభుత్వం, మంత్రి వర్గం తీర్మానం మీద ఏదో ఒక నిర్ణయం ప్రకటించడంలో ఇంకెంత కాలం జాప్యం చేస్తారో? అని ప్రశ్నించారు. రాజకీయ శాసనాల మేరకు కీలక పదవిలో ఉన్న వారి మీద ఉన్న నమ్మకంతో నిర్ణయానికి గడువు అన్నది విధించ లేదని, దీనిని ఆసరగా చేసుకుని జాప్యం చేయడం శోచనీయమని అసంతప్తిని వ్యక్తం చేశారు. ఆ తీర్మానం ఎంత వరకు వచ్చిందో అన్న అంశంతో పాటుగా పెరోల్ విషయంగా వారంలోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 29వ తేదికి వాయిదా వేశారు. కాగా, హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ తీర్మానం ఆమోదం లేదా, తిరస్కరణ విషయంలో గవర్నర్ స్పందించేనా, రాజ్ భవన్ నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చేనో అన్న ఎదురు చూపులు పెరిగాయి. -
రాజీవ్ హంతకుల్ని విడుదల చేయండి
సాక్షి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడుదల చేయాల్సిందిగా తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఆదివారం చెన్నైలో ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. కాంగ్రెస్ మినహా తమిళనాడులోని మిగిలిన పార్టీలన్నీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రాజీవ్ హత్య దోషులను విడుదల చేసేందుకు విముఖంగా ఉండటం తెలిసిందే. రాజీవ్ హత్య కేసులో మురుగన్, శాంతన్, అరివు, జయకుమార్, రాబర్ట్ పయాస్, నళిని, రవిచంద్రన్‌లు గత 27 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రాజ్యాంగంలోని 161వ అధికరణం ప్రకారం వీరిని విడుదల చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. 2014లో జయలలిత సీఎం ఉండగానే దోషులను విడుదల చేయాలని నిర్ణయించినా కేంద్రం అప్పట్లో సుప్రీంను ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సుప్రీంకోర్టు కూడా గవర్నర్‌కే వదిలేసింది. మరి ఇప్పుడు గవర్నర్ కేంద్రాన్ని కాదని దోషులను విడుదల చేస్తారా అని ప్రశ్నించగా, ఇది రాష్ట్ర ప్రభుత్వ, ప్రజల నిర్ణయమనీ, గవర్నర్ అందుకు అనుగుణంగా నడచుకోవాల్సిందేనని మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు. -
రాజీవ్ హంతకుల విడుదలకై సినిమావాళ్లు..
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయించేందుకు తమిళ సినిమా వర్గం నడుంకట్టనుంది. ఆ హంతకులను మానవతా దృక్పథంతో వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ ఓ భారీ ర్యాలీని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. 1991 మే 21న రాజీవ్ గాంధీ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆయన హత్యకు సంబంధించి ప్రస్తుతం ఏడుగురు జైలు శిక్షను 20 ఏళ్లుగా అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 20 ఏళ్లలో ఆ దోషుల్లో చాలా మంచి మార్పు వచ్చిందని, ఇప్పటికైనా ఆ విషయాన్ని మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకొని వారిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి జయలలితకు విజ్ఞప్తి చేయనున్నారు. -
మలాలా కేసులో దోషుల విడుదల
లండన్: ప్రపంచ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌పై హత్యాయత్నం కేసులో 10 మంది తాలిబన్లకు పాతికేళ్ల పాటు జైలు శిక్ష విధించామని పాకిస్తాన్ ప్రకటిస్తే అది నిజమని ప్రపంచం నమ్ముతూ వస్తోంది. వాస్తవానికి రహస్యంగా జరిగిన ఈ కేసు విచారణలో 8 మంది తాలిబన్లను నిర్దోషులుగా పేర్కొంటూ గుట్టుచప్పుడు కాకుండా వారిని విడుదల చేసిందని పాకిస్తాన్ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ బ్రిటన్‌కు చెందిన ‘డెయిలీ మిర్రర్’ పత్రిక శుక్రవారం వెల్లడించింది. మలాలా కేసులో పాకిస్తాన్ అంతర్జాతీయ ఒత్తిళ్లకు తట్టుకోలేక ఝరుల్లా, ఇస్రార్ ఉర్ రెహమాన్ అనే ఇద్దరు తాలిబన్లకు మాత్రమే శిక్షలు విధించిందని, మిగతా ఎనిమిది మందిని విడుదల చేసిందని స్వాత్ వ్యాలీ పోలీసు చీఫ్ ఆజాద్ ఖాన్ స్వయంగా వెల్లడించినట్టు, ఈ విషయాన్ని లండన్‌లోని పాకిస్తాన్ హై కమిషన్ కూడా ధ్రువీకరించిందని డెయిలీ మిర్రర్ తెలిపింది. నేరస్తుల విచారణ కూడా సరిగ్గా జరగలేదని, ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్, జడ్జీ, నిందితులు, ఒకరిద్దరు సైనికాధికారులు మాత్రమే విచారణలో పాల్గొన్నారని, ఒక్క ప్రత్యక్ష సాక్షి కూడా హాజరుకాలేదని ఆ పత్రిక పేర్కొంది. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్ల మేరకు మలాలా కేసులో తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)కి చెందిన పదిమంది నిందితులను అరెస్టు చేశామని పాకిస్తాన్ సెప్టెంబర్ నెలలో ప్రకటించింది. వారంతా దోషులని తేలడంతో పది మందికి పాతికేళ్లపాటు జైలు శిక్ష విధించినట్టు ఏప్రిల్ నెలలో వెల్లడించింది. ఇది ఇంతకాలం నిజమేనని భారత్ సహా ప్రపంచ దేశాలు నమ్ముతూ వచ్చాయి. పాకిస్తాన్లో బాల బాలికలకు సమాన హక్కులు, బాలికల విద్యా హక్కుకోసం పోరాడుతున్న మలాలాపై 2012, అక్టోబర్ నెలలో తాలిబన్లు దాడిచేసి హత్యచేయడానికి ప్రయత్నించిన విషయం తెల్సిందే. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన 14 ఏళ్ల మలాలాను బర్మింగ్ హామ్‌లోని క్వీన్ హెలిజబెత్ ఆస్పత్రికి తరలించడం, కోలుకున్న తర్వాత మలాలాకు లండన్‌లోనే ఆశ్రయం కల్పించడం తెల్సిందే.