న్యూఢిల్లీ: బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో దోషులు ఓ వర్గం ప్రజలను వెంటాడి, హత్య చేయడమే లక్ష్యంగా రక్తదాహం ప్రదర్శించారని బాధితురాలి తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని కోరారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే గర్భిణిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అంతేకాకుండా ఆమె కుటుంబంలోని ఏడుగురి హత్య చేశారు. ఈ కేసులో మొత్తం 11 మంది దోషులకు యావజ్జీవ శిక్షపడగా, గత ఏడాది గుజరాత్ ప్రభుత్వం వారికి క్షమాభిక్ష ప్రసాదించింది. దోషులను జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment