Rajiv Gandhi assassination
-
మమ్మల్ని క్షమించండి... ఆ దారుణానికి చింతిస్తున్నా!: నళిని శ్రీహరన్
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులుగా తేలిన నళిని తోపాటు మరో ఐదుగురు నిందితులను విడుదల చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజీవ్ గాందీ హత్య కేసులో దోషులలో ఒకరైన నళిని శ్రీహరన్ మీడియాతో మాట్లాడుతూ...."ఆ దారుణం గురించి ఆలోచిస్తూ చాలా ఏళ్లు గడిపాం. మమ్మల్ని క్షమించండి. ఆ ఆత్మహుతి దాడి ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారు ఆ విషాదం నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాను." అని బాధితుల కుటుంబాలకు నళిని పశ్చాత్తాపంతో కూడిన సందేశం ఇచ్చింది. తాను తన భర్తతో కలిసి యూకే వెళ్లి స్థిరపడాలనుకున్నట్లు తెలిపారు. గాంధీ కుటుంబాన్ని కలుస్తారా అని మీడియా ప్రశ్నించగా...వారు కలుస్తారని అనుకోను, కలిసే సమయం అయిపోయిందని భావిస్తున్నాను అని నళిని అన్నారు. అయితే రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఐతే ఈ తీర్పుని తమిళనాడులో చాలా మంది స్వాగతించారు. ఖైదీల సత్ప్రవర్తన, ఈ కేసులో దోషిగా తేలిన మరో వ్యక్తి ఏజీ పెరరివాలన్ మేలో విడుదల కావడం, అతడు అరెస్టు అయ్యే సమయానికి 19 ఏళ్లు కావడం, అదీగాక దోషులంతా 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించడం తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. (చదవండి: రాజీవ్ హత్య కేసు: ఎట్టకేలకు నళినికి విడుదల.. జైలు జీవితం ఎన్ని రోజులో తెలుసా?) -
రాజీవ్ హత్య.. సినిమాను మించే ట్విస్ట్‌లు.. అసలు ఆనాడేం జరిగింది?
నరకం, అవును నిజంగా నరకమే. చేసిన పాపం వెంటాడుతుంటే.. కటకటాల వెనక దశాబ్దాల పాటు ఉంటుంటే.. రేపు అనేది ఏమవుతుందో తెలియకపోతే.. నిజంగా నరకమే. 1991లో అప్పటి సమీకరణాల దృష్ట్యా రాజీవ్‌ను మట్టుపెట్టిన ఎల్టీటీఈ గ్యాంగులో మెజార్టీ దోషులు సెనైడ్ మింగి ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన కొందరు ఏళ్ల కొద్ది జైల్లో ఉన్నారు. వీరికి ఉరి శిక్ష తృటిలో తప్పినా.. యావజ్జీవం మాత్రం వెంటాడింది. మెజార్టీ తమిళులు మద్దతివ్వడంతో బయటకు వస్తామన్న ఆశలు పెరిగి చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే పరిస్థితి కలిగింది. అసలు నాడేమీ జరిగింది.? జైలు పక్షుల సమగ్ర కథనం ఇది.. ఒక నాయకుడు... ఒక నిర్ణయం... ఒక హత్య, తెర వెనక కొన్ని వందలమంది, అరెస్టయింది 26 మంది... శిక్ష పడింది ఏడుగురికి, ఉరి శిక్ష మాత్రం నలుగురికి. సినిమాను మించిన ఎన్నో ట్విస్టులను ఒక్కబిగిన చూపించే ఇలాంటి కేసు బహుశా భారతదేశ చరిత్రలో మరొకటి ఉండదేమో. 1991లో రాజీవ్ హత్య జరిగింది. ఆ కేసు చాలా మలుపులు తిరిగింది. ఎంతో మందిని ఈ కేసులో అరెస్ట్ చేసినా.. చివరికి దోషులుగా తేలింది 26మంది. అయితే వీరిలోనూ నేరుగా ప్రమేయమున్న వాళ్ల సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. దాదాపు ఐదేళ్ల పాటు సిట్ విచారణ జరిగింది. ఆ తర్వాత కోర్టులోనూ సుదీర్ఘంగా కేసు నడిచింది. 1999లో ఏడుగురికి మరణశిక్ష పడింది. ఇక తమ జీవితం ముగిసిందనుకున్నారు దోషులు. రాజీవ్‌ను చంపిన పాపానికి నేడో, రేపో ఉరి తీయడం ఖాయమనుకున్నారు. అయితే ఎక్కడో ఆశ మిగిలింది. సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లారు. కేసు మరికొంత కాలం సాగింది. ఈలోగా తమిళనాడులో సీను మారింది. రాజీవ్‌ను హత్య చేయడం సరే కానీ, అరెస్టయిన వాళ్లు అమాయకులు, కేవలం ఓ ఆపరేషన్‌లో భాగమయ్యారన్న ప్రచారం తమిళనాడంతా పాకింది. దీంతో దేశంలో ఎప్పుడూ లేనట్టుగా నేరస్థులపై సానుభూతి వెల్లువెత్తింది. 1999లో నలుగురికి మరణశిక్షను నిర్దారించింది సుప్రీం. అయితే తమిళనాడులో పరిస్థితి మాత్రం మారింది. దోషులకు అనుకూలంగా రాజకీయ పార్టీలు, ప్రముఖులు, ఒకరేంటీ తమిళనాట జనమంతా ఒక్కతాటిపైకి వచ్చారు. ఇటు కేంద్రంలో పరిస్థితి మారింది. కాంగ్రెస్ స్థానంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈలోగా కేంద్రంలో బలమైన ప్రభుత్వాలు లేకపోవడం, తమిళనాడులో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదో ఒక పార్టీ అటు ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం రావడంతో శిక్ష అమలులో జాప్యం జరిగింది. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు లేకున్నా.. అనధికారికంగా నాన్చివేత ధోరణిని ప్రదర్శించారు ఢిల్లీ పెద్దలు. ఈ లోగా 2006లో మరో బాంబు పేల్చింది ఎల్టీటీఈ. 2006లో రాజీవ్ హత్య వెనక అసలు కారణాలను బహిరంగంగా ప్రపంచానికి వెల్లడించింది ఎల్టీటీఈ. తమ పట్ల శాంతి దళాలు అమానుషంగా ప్రవర్తించాయని, అసలు భారత దళాలను రాజీవ్ పంపడం వల్లే తాము కక్ష పెంచుకున్నామని తెలిపాడు ప్రభాకరన్. నిజానికి 1990లలో ప్రభాకరన్ ఢిల్లీకి వచ్చినట్టు చెబుతారు. అప్పట్లో కొందరు తమిళ నేతలు, ఎల్టీటీఈ లీడర్లతో కలిసి ఢిల్లీ వచ్చిన ప్రభాకరన్.. నేరుగా రాజీవ్‌ను కలిసినట్టు చెబుతారు. ఈ చర్చల్లో ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకపోవడంతో ఎల్టీటీఈ నుంచి ఇక సమస్య ఉండదనుకున్నారు రాజీవ్. రాజీవ్ చేసిన ప్రతిపాదనను ఢిల్లీలో అంగీకరించిన ప్రభాకరన్.. జాఫ్నా వెళ్లిన తర్వాత మాత్రం అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నట్టు తమిళ వర్గాల సమాచారం. ఈ విషయంలోనే రాజీవ్‌కు కాసింత ఆగ్రహం వచ్చిందట. దీన్నే ఆసరాగా తీసుకుని అప్పట్లో ఇంటలిజెన్స్ అధికారులు కొందరు శాంతి దళాలు పంపే విషయంలో రాజీవ్‌తో అంగీకారం తీసుకున్నట్టు ఢిల్లీ వర్గాల బోగట్టా. నిజానికి ఆ సమయంలో ప్రధాని ఎవరున్నా.. నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చన్నది సీనియర్ అధికారులు ఎవరయినా చెబుతారు. ఎవరూ ఊహించనివిధంగా పెరంబూదూర్లో హత్యకు స్కెచ్ వేసిన ఎల్టీటీఈ పకడ్బందీగా దాన్ని నిర్వహించింది. ఆ తర్వాత అంతే వేగంగా సిట్ అధికారులు హత్య కేసును చేధించారు. 2006లో ఈ విషయన్నాంతా వెల్లడించిన ఎల్టీటీఈ.. తప్పు చేశాడు కాబట్టే శిక్షించాం అన్న రీతిలో వ్యవహరించింది. ఎల్టీటీఈ ప్రకటనతో జైల్లో ఉన్న ఖైదీల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో యూపీఏలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే ఎప్పటికప్పుడు ఉరి విషయానికి బ్రేకులు వేస్తూ వచ్చింది. ఇదే సమయంలో కథ మరో మలుపు తిరిగింది. (రాజీవ్ హత్యకేసుకు సంబంధిత కథనాల కోసం కింద లింక్స్ క్లిక్ చేయండి) (Rajiv Gandhi Case: ఆ ఫొటోగ్రాఫర్ ఇంట్లో దొరికిన రసీదే.. హంతకులను తెరపైకి తెచ్చిందా?!) (రాజీవ్ గాంధీ హత్యకు ఇంత ప్లాన్ చేశారా.. గంధపు దండ వల్లే దారుణం!) (ఇందిర చేసిన తప్పే రాజీవ్‌ను బలి తీసుకుందా?) -
‘సుప్రీం’ నిర్ణయం సబబే
రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్షపడి మూడు దశాబ్దాలుగా జైళ్లలో మగ్గుతున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఆహ్వానించదగ్గది. సుదీర్ఘకాలం శిక్ష అను భవించటంతోపాటు వారి సత్ప్రవర్తన అంశం కూడా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. రాజీవ్‌గాంధీ హత్య జరిగిన 1991 మే 21 మొదలుకొని చాలా తరచుగా ఈ కేసు జనం నోళ్లలో నానుతూనే ఉంది. ఈ ఉదంతంలో రాజీవ్‌తోపాటు ఒక ఎస్పీ స్థాయి అధికారి సహా 15 మంది మరణించారు. 1984లో ప్రధానిగా ఉంటూ ఖాలిస్థాన్ ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు ఇందిరాగాంధీ బలైతే, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ సైతం మరో ఏడేళ్లకు ఎల్టీటీఈ మిలిటెంట్లు చేసిన అదే మాదిరి మతిమాలిన చర్యకు ప్రాణాలు కోల్పోయిన తీరు దేశ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు 90వ దశకం అంతా రాజీవ్ హత్య కేసు దర్యాప్తు, విచారణ సాగుతూనే ఉన్నాయి. సీబీఐ ఈ కేసులో దర్యాప్తు జరిపి 41 మందిని నిందితులుగా చూపగా, టాడా కోర్టు అందులో 26 మందిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. తదుపరి సుప్రీంకోర్టు వారిలో 19 మందిని నిర్దోషు లుగా తేల్చి విడుదల చేసింది. ముగ్గురి మరణశిక్షను యావజ్జీవ శిక్షలుగా మార్చింది. నలుగురు దోషులు–మురుగన్, శంతన్, పేరరివాళన్, నళినిలకు మరణశిక్ష ఖరారు చేసింది. ఇక అప్పటినుంచి ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. ఇందులో తమిళనాడు రాజకీయాలు కూడా కలగలిశాయి. చివరకు 2000 సంవత్సరంలో సోనియాగాంధీ స్వయంగా తమిళనాడు గవర్నర్‌కు లేఖరాసి మరణశిక్ష పడిన నళినికి క్షమాభిక్ష పెట్టాలని కోరారు. దాంతో ఆమెకు ఉరికంబం బెడద తొలగింది. అప్పటినుంచి ఆమె యావజ్జీవ ఖైదీగా ఉంటున్నారు. తమ తండ్రి హంతకులను క్షమిం చామని ప్రియాంక, రాహుల్ కూడా వేర్వేరు సందర్భాల్లో చెప్పారు. మరో పద్నాలుగేళ్లకు ఉరిశిక్ష అమలులో జాప్యం జరిగిందన్న కారణంతో మురుగన్, శంతన్, పేరరివాళన్‌ల ఉరిశిక్షలను సర్వో న్నత న్యాయస్థానమే యావజ్జీవ శిక్షలుగా మార్చింది. నిర్ణయ రాహిత్యంగా నిర్ధారించాలో లేక రాజకీయ అయోమయంగా పరిగణించాలో... ఆ తర్వాత కాలమంతా రాజీవ్ హంతకుల విషయంలో డోలాయమాన స్థితి ఏర్పడింది. సర్వోన్నత న్యాయస్థానం తేల్చాక కూడా దోషులకు శిక్షలు అమలు చేయకపోవటం గమనిస్తే తమిళనాడు రాజకీయాలను ఈ వ్యవహారం ఎంతగా ప్రభావితం చేసిందో గ్రహించవచ్చు. డీఎంకే, అన్నాడీఎంకే సహా ప్రధాన ద్రవిడ పార్టీలన్నీ రాజీవ్ కేసు దోషులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా వారితో కలిసి కూటమి కట్టడానికి అభ్యంతరం లేని కాంగ్రెస్‌కు ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టు నిర్ణయం ‘తీవ్ర బాధాకరం, దురదృష్టకరం’ ఎందుకైందో అర్థం కాదు. పైగా ఇది కేవలం కాంగ్రెస్ అభిప్రాయం తప్ప సోనియా ఉద్దేశం కాదట. ఈ ప్రకటన విడుదల చేసిన పార్టీ నేత జైరాం రమేశ్ సుప్రీంకోర్టు తాజా నిర్ణయాన్ని ‘తీవ్ర తప్పిదం’గా విమర్శించారు. మరి యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఆ దోషులకు అమలు చేయాల్సిన శిక్ష గురించి ఎందుకు ఆలోచించలేక పోయారు? మరణశిక్ష విధించటం అనాగరికమని చాలా దేశాలు ఆ శిక్షలను రద్దు చేశాయి. మన దేశం సైతం ఆ మాదిరి నిర్ణయమే తీసుకోవాలని కోరుకుంటున్న ప్రజాస్వామికవాదులున్నారు. దాన్నెవరూ తప్పు బట్టరు. పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురును అతని కుటుంబానికి ముందస్తుగా తెలియజేయాలన్న నిబంధనను సైతం కాలదన్ని యూపీఏ సర్కారు ఉరి అమలు చేసిన సంగతి జైరాం రమేశ్ మరిచిపోకూడదు. రాజకీయ లబ్ధి కోసం తాము ఇష్టానుసారం ఏమైనా చేయొచ్చుగానీ సుప్రీంకోర్టు మాత్రం నిర్ణయాత్మకంగా వ్యవహరించరాదనటం అర్ధరహితం. దోషుల పిటిషన్లను విచారిస్తున్న సందర్భాల్లో మీ అభిప్రాయమేమిటని సుప్రీంకోర్టు పలు మార్లు కేంద్రాన్ని అడిగింది. యూపీఏ హయాంలోనూ, ప్రస్తుత ఎన్డీఏ హయాంలోనూ కేంద్రం ఒకే మాదిరి వ్యవహరించింది. 2018లో అన్నా డీఎంకే ప్రభుత్వ కేబినెట్ రాజీవ్ కేసు దోషులందరినీ విడుదల చేయాలని గవర్నర్‌కు సిఫార్సు చేస్తూ తీర్మానించింది. ఆయన ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపారు. ఆ విషయంలో తుది నిర్ణయం రాష్ట్రపతిదేనని నిరుడు ఫిబ్రవరిలో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘అసలు మీరు ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతికి పంపార’ని గవర్నర్‌ను కోరితే ఆయన నుంచి మౌనమే సమాధానమైంది. శిక్షల తగ్గింపులో తమదే తుదినిర్ణయమంటూ కేంద్రం చేసిన వాదన సరికాదనీ, నిబంధనలు నిర్దిష్టంగా ఉన్న సందర్భాల్లో తప్ప రాష్ట్రాలకు కూడా ఆ విషయంలో సమానాధికారాలున్నాయనీ సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. చివరికి అటు రాష్ట్రపతి, ఇటు గవర్నర్ ఏ నిర్ణయమూ ప్రకటించని పరిస్థితుల్లో దోషులు దీర్ఘకాలం శిక్ష అనుభవించిన సంగతిని, వారి సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని విడుదల చేసింది. తెలిసిచేసినా, తెలియకచేసినా నేరం చేసినవారు శిక్ష అనుభవించాల్సిందే. కానీ అందుకు కొన్ని నిబంధనలుంటాయి. శిక్ష ఉద్దేశం నేరగాళ్లను సంస్కరించటమే తప్ప వారిపై ప్రతీకారం తీర్చుకోవటం కాదు. రాజీవ్ విషయంలో దోషులను పట్టుకోవటం, శిక్షించటం అయింది. మరి ఇందిర హత్యానంతర మారణకాండలో సిక్కుల ఊచకోత దోషులను ఇంతవరకూ ప్రభుత్వాలు ఎందుకు శిక్షించలేకపోయాయి? న్యాయం సమానంగా ఉండటమే కాదు, అలా ఉన్నట్టు కనబడాలి కూడా. ఆ పరిస్థితి లేనప్పుడు సుప్రీంకోర్టు న్యాయబద్ధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం తప్పెలా అవుతుంది? -
రాజీవ్ గాంధీ హత్య.. ఆ రోజు ఏం జరిగిందంటే..?
అది 1991 మే 21. సమయం రాత్రి 10.30. కొత్త ఢిల్లీలోని 10– జనపథ్ రోడ్లో ఉన్న మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ పర్సనల్ సెక్రెటరీ వి. జార్జ్ రూమ్‌లో టెలిఫోన్ ఆగకుండా మోగుతోంది. జార్జ్ రిసీవర్ ఎత్తి హలో అనగానే, అటు నుండి ‘దిస్ ఈస్ సీఐడీ ఆఫీసర్ ఫ్రమ్ చెన్నై సర్. మేడం (సోనియా గాంధీ)తో మాట్లాడాలండీ‘ అని ఆదుర్దాగా అన్నాడు. జరగరానిదేదో జరిగిందని జార్జ్ సిక్స్త్ సెన్స్ శంకించింది. ‘బాస్ (రాజీవ్) ఎలా ఉన్నారు?’ వణకుతున్న గొంతుతో జార్జ్ ప్రశ్న. ‘సర్ మేడంకి ఇవ్వండి ఫోన్’ అటునుండి అర్థింపు. ‘నేను అడుగుతుంది బాస్ ఎలా ఉన్నాడు అని’... ఈ సారి కటువుగానే అడిగాడు పీఏ జార్జ్. ‘సర్... హి ఈస్ నో మోర్...’ అంతే... లైన్ డిస్ కనెక్ట్ అయింది. చదవండి: ఇప్పటికీ నేర్వని ఆహార పాఠాలు ఆ రోజు ఉదయం (21.5.1991) నుండి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు? ఒరిస్సాలో ఎన్నికల సభల్లో మాట్లాడి సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం సర్క్యూట్ హౌజ్ చేరుకున్నారు. పదవ లోక్‌సభ (1991) ఎన్నికలకు 40 శాతం సీట్లను ఆయన యువతకే కేటా యించారు. అందులో వైజాగ్ లోక్‌సభ కాండిడేట్, 38 సంవత్సరాల ఉమా గజపతి రాజు కూడా ఒకరు. ఆమె కూడా ఆయన దగ్గరే ఉన్నారు. అప్పుడే ఢిల్లీ నుండి సోనియా ఫోన్! వెంటనే బయల్దేరి ఢిల్లీకి వచ్చేయమని ఆమె కోరింది. ‘మరగతం (చంద్రశేఖర్) ఆంటీ... మమ్మీ (ఇందిరాజీ) క్లోజ్ ఫ్రెండ్. ఈ రాత్రి ఆమె సభను (శ్రీపెరుం బుదూర్) అడ్రస్ చేసి రేపు ఉదయం ఫస్ట్ ఫ్లైట్‌కి ఇంటికి చేరుకుంటాను’ అన్నారు రాజీవ్. ఫోన్ పెట్టేశారు సోనియా. తమ ఇంట్లో డిన్నర్ చేసి వెళ్లమన్నారు ఉమ. ‘నో ఉమా, లెట్ మీ మూవ్’ (మృత్యువు పిలుపు కాబోలు) అంటూ, మందహాసంగా ఆమె రిక్వెస్ట్‌ను తోసిపుచ్చారు బాస్. తమిళనాడు శ్రీపెరుంబుదూర్ సభా ప్రాంగణం ఆ రాత్రి ఫ్లడ్ లైట్ల కాంతిలో, కాంగ్రెస్ కార్యకర్తలు, క్రిక్కిరిసిన శ్రోతలతో పండగ వాతావరణం సంతరించుకుంది. లౌడ్ స్పీకర్లలో తమిళ తల్లిని కీర్తిస్తూ పాటలు! మరో వైపు రంగు రంగుల పూలతో అలంకరించిన అతి పెద్ద వేదిక మీద తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుపయ్య మూపనార్, ఇతర నాయకులూ; పార్టీ అభ్యర్థీ, సీనియర్ నాయకురాలూ అయిన మరగతం చంద్రశేఖర్ వంటివారు ఉత్సాహంగా రాజీవ్‌గాంధీ కోసం ఎదురు చూస్తున్నారు. చెన్నై నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూర్ ప్రాంతం చుట్టుముట్టు తమిళ ఉగ్రవాదుల ‘స్లీపర్ సెల్స్’ మాటేసి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ‘లిబరే షన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం’ (ఎల్టీటీఈ) హిట్ లిస్ట్‌లో ఉన్న మొదటి ఇండియన్ లీడర్ రాజీవ్ గాంధీ! రాత్రి వేళల్లో తమిళనాడులో ఓపెన్ మీటింగులకు ఆయన రావటం రిస్కుతో కూడుకున్న పని అని పోలీసు నిఘావర్గం అప్పటికే తెలిపింది. అయినా రాత్రి 9 గంటలకు ఈ సభలో ప్రసంగించాలని బయలు దేరారు రాజీవ్. విధిలీల! సభా ద్వారం నుండి ఎర్ర తివాచీపై నడుస్తూ... నవ్వుకుంటూ అభిమానుల చేతులు కలుపుతూ ఒక్కొక్క అడుగే వేస్తున్నారు. జనసమూహం నుండి ఆతన్ని వేరు చేయటానికి స్థానిక పోలీసులు, ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రదీప్ గుప్తా శత విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంతలోనే పంజాబీ డ్రస్ ధరించి కళ్లజోడు పెట్టుకున్న 16 ఏళ్ల చామన చాయ యువతి, చందనపు దండ పట్టుకుని రాజీవ్‌కు ఎదురుగా ప్రత్యక్షమైంది. నవ్వుతూ ఆయన మెడలో ఆ దండ వేసింది. ఆమెను వారిస్తూ ఒక వైపు తోసే ప్రయత్నం చేసింది లేడీ పోలీస్ ఇన్స్పెక్టర్. ఆమెను చూసి చిరునవ్వుతో ‘రిలాక్స్ బేబీ’ అని అపారాయన. అదే అదునుగా ఆయనకు పాదాభివందనం చేస్తున్నట్టు ముందుకు వంగింది ఆ అమ్మాయి (థాను). అంతే...! చెవులు చిల్లులు పడే శబ్దంతో బాంబు పేలటం, రెప్పపాటులోనే రాజీవ్ గాంధీ శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరి పోవటం జరిగిపోయింది. ఈ భీకర సంఘటన అప్పటి దేశ రాజకీయ చదరంగంలో అతి పెద్ద మలుపునకు దారితీసింది. 48 సంవత్సరాల కాంగ్రెస్ యువనేత రాజీవ్ గాంధీకి బదులు 68 సంవత్సరాల దక్షిణాది తెలుగువాడు పీవీ నరసింహారావు ప్రధాని పీఠం అధిరోహించారు. (రషీద్ కిద్వాయి గ్రంథం ‘24 అక్బర్ రోడ్’ ఆధారంగా...) - జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్ కమిషనర్ (మే 21న రాజీవ్ గాంధీ వర్థంతి) -
జైలులోనే సజీవ సమాధి అవుతా..
- సంచలనానికి తెరలేపిన ‘రాజీవ్ గాంధీ హంతకులు’ - ఆమరణ నిరశనకు సిద్ధపడ్డ మురుగన్.. హైకోర్టుకు నళిని - దంపతులు త్వరలో విడుదలవుతారన్న న్యాయవాది వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులుగా జైలు శిక్ష అనుభవిస్తోన్న మురుగన్, నళిని దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు. గడిచిన 26 ఏళ్లుగా కారాగారవాసం గడుపుతోన్న తనకు.. విడుదలవుతానన్న నమ్మకం లేదని, అందుకే జైలులోనే సజీవ సమాధి కావాలనుకుంటున్నట్లు మురుగన్ కోరుతున్నాడు. ఈ మేరకు తాను ఉంటోన్న వేలూరు సెంట్రల్ జైలులోనే ఆగస్టు 18 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశాడు. శనివారం జైలులో మురుగన్‌ను కలిసివచ్చిన అనంతరం అతని తరఫు లాయర్ పుగళేంది ఈ విషయాలను మీడియాకు వెల్లడించాడు. రాజీవ్ గాంధీ హత్య కేసులో వేలూరు మహిళా జైలులో నళిని, పురుషుల సెంట్రల్ జైలులో మురుగన్, పేరరివాలన్, శాంతనులతో పాటు ఏడుగురు జీవిత శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. మురుగన్-నళిని దంపతుల కుమార్తె.. ప్రస్తుతం లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తోన్న అరిత్ర త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నది. కుమార్తె వివాహన్ని దగ్గరుండి జరిపేందుకుగానూ ఆరు నెలల పెరోల్ అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వారి న్యాయవాది తెలిపారు. పెరోల్ కోసం నళిని గత నవంబర్లోనే వినతి పత్రం సమర్పించారని, గత జనవరిలో రెండోసారి కూడా విన్నవించుకున్నా అధికారుల నుంచి స్పందన రాలేదని, అందువల్లే హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు న్యాయవాది చెప్పారు. సోమవారం చెన్నై హైకోర్టులో నళిని తరఫున పిటిషన్ వేయబోతున్నట్లు పేర్కొన్నారు. నళిని-మురుగన్ త్వరలో విడుదలవుతారు! తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నళిని-మురుగన్‌లను విడుదల చేసే అవకాశం ఉందని న్యాయవాది పుగళేంది అన్నారు. కాగా, గతంలోనూ వీరి విడుదలకు తమిళ ప్రభుత్వం ప్రతిపాదను పంపడం, కేంద్ర ప్రభుత్వం దానిని నిరాకరించడం పలుమార్లు జరిగింది. 1991లో జైలుకు వచ్చేనాటికి నళిని రెండు నెలల గర్భవతి అని, ఆమెకు అరిత్రా అనే కుమార్తె జన్మించిందని, నాలుగు సంవత్సరాల పాటు ఆ పాప తల్లితోపాటే జైలులో ఉందని, ప్రస్తుతం లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నదని నళిని-మురుగన్ల న్యాయవాది పుగళేంది గుర్తుచేశారు. (చదవండి: రాజీవ్ గాంధీ హత్య: ఇంకొన్ని విషయాలు..) -
రాజీవ్ గాంధీ హత్య: ఇంకొన్ని విషయాలు..
చెన్నై: ‘నా కూతుర్ని చూసి పదేళ్లైంది. తను లండన్‌లో డాక్టర్ అయిందని బంధువులు చెప్పారు. ఈ మధ్యే తనకో ఉత్తరం రాశా. నా కూతురు, జైల్లోనే ఉన్న నాభర్తతో కలిసి ఒకే ఒక్కరోజు గడపాలి. కని, అనాథగా వదిలేసినందుకు క్షమాపణ అడగాలి. తనను గుండెలనిండా కౌగిలించుకోవాలి’ ఇది..ప్రపంచంలోనే సుదీర్ఘకాలంగా జైలు శిక్ష అనుభవిస్తోన్న మహిళ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషి నళిని శ్రీహరన్ చివరికోరిక. ఉరిశిక్ష పడిన దోషిగా గడిచిన 25 ఏళ్లుగా చెన్నైలోని వేలూరు సెంట్రల్ జైలులో ఉంటోన్న నళినిపై ఇప్పటివరకు ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ మొదటిసారి ఆమె తన ఆత్మకథను చెప్పుకుంటున్నారు. తమిళంలో 500 పేజీల్లో పొందుపర్చిన నళిని ఆత్మకథ నవంబర్ 24న విడుదల కానున్న సందర్భంగా ఆ పుస్తకంలోని కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి.. తన తల్లి పేరు పద్మావతి అని, చెన్నైలో నర్స్ గా పనిచేసేదని, మహాత్మా గాంధీ ఓ సారి చెన్నై వచ్చినప్పుడు ఆమెకు పేరు పెట్టారని నళిని చెప్పుకొచ్చింది. 1991లో.. శ్రీహరన్ అనే వ్యక్తి నళిని ఇంట్లో ఇంట్లోకి అద్దెకు దిగడం, క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం, తల్లిని ఒప్పించి శ్రీలంక తమిళుడైన శ్రీహరన్ ని నళిని పెళ్లి చేసుకోవడం, కొంతకాలానికి ఇంట్లో చుట్టాల తాకిడి పెరిగగడం, శ్రీహరన్ కోసం శ్రీలంక నుంచి చాలా మంది వస్తూపోతుండటం తదితర విషయాలను నళిని తన ఆత్మకథలో పూసగుచ్చినట్లు వివరించారు. ఒక భయంకరమైన రోజు భర్తతో కలిసి ఇల్లు విడిచి పారిపోయానని, కొద్ది రోజులకే సీబీఐ వాళ్లు తమతోపాటు 14 మందిని అరెస్ట్ చేశారని, దాదాపు 50 రోజులపాటు ఇంటరాగేషన్ లో థార్డ్ డిగ్రీలో ఎన్నిరకాలుగా టార్చర్ పెడతారో అన్నీ అనుభవించానని నళిని పేర్కొన్నారు. ఇటీవల కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంలో నళిని(ఇన్సెట్ నళిని-శ్రీహరన్ ల కూతురు అరిత్రా) ‘ఒక సారి జైల్లో నాతో మాట్లాడటానికి ఒకామెవచ్చింది. తనను తాను ప్రియాంకా గాంధీ అని పరిచయం చేసుకుంది. చాలా సేపు నాతో మాట్లాడింది. ‘మా నాన్న చాలా మంచివారు. ఆయనను ఎందుకు చంపారు?’అని పదేపదే ప్రశ్నించింది. నావరకు అది సమాధానం తెలియని ప్రశ్న! అసలు రాజీవ్ గాంధీ గురించి నాకేమీ తెలియదు. ప్రియాంకా గాంధీ నన్ను ఎందుకు కలిశారో అప్పుడే కాదు, ఇప్పటికీ నాకు అర్థంకాదు. నా భర్త పేరు శ్రీహరన్ అని కాకుండా మురుగన్ గా మారిపోవడమూ నాకు అంతుపట్టని విషయం. అరెస్ట్ అయ్యే నాటికి నేను రెండు నెలల గర్భవతిని. థార్డ్ డిగ్రీ టార్చర్ ను భరించానంటే కేవలం నా కడుపులో పెరుగుతున్న నలుసు కోసమే. కోర్టు విచారణకు తీసుకెళ్లినప్పుడా పోలీసులు మాకు వైద్యపరీక్షలు చేయిచేవాళ్లు. ఉరిశిక్ష పడబోతున్న నాకు అబార్షన్ చేయాలని పోలీసులు డాక్టర్లమీద ఒత్తిడి చేసేవారు. అందుకు డాక్టర్లు ఒప్పుకోలేదు. ఆ డాక్టర్లు ఎక్కడున్నారోగానీ వాళ్లకు నా నమస్కారాలు. జైలులోనే బిడ్డను కన్నా. పక్కనే మగవాళ్ల జైలులో నా భర్త శ్రీహరన్ ఉంటాడు. అప్పట్లో కలుసుకునే వీలండకపోయేది. పాపకు అరిత్రా అని పేరుపెట్టుకున్నాం. తనకు రెండేళ్లు నిండాక మా ఆయన తరఫు బందువులు అరిత్రను తీసుకెళ్లారు. 2005లో చివరిసారిగా నా కూతుర్ని చూశా. ఇప్పుడు తను లండన్ లో డాక్టర్ గా పనిచేస్తోందని, నన్ను, నా భర్తను విడుదల చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని బంధువుల ద్వారా తెలిసింది. 2000లో నాకు క్షమాభిక్ష పెట్టినప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి భర్తను కలిసి మాట్లాడే అవకాశం కల్పించారు. ఆ కొద్దిసేపే కాస్త ఊరట దొరుకుతుంది. జైలు అధికారులు.. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఏఐడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తారు. జయలలిత సీఎంగా ఉన్నన్నాళ్లూ మాపై వేధింపులు ఉండవు. ఈ మధ్యే కొందరు బెదిరింపులు పంపుతున్నారు.. ‘నీ బిడ్డను లండన్ నుంచి శ్రీలంక వెళ్లిపొమ్మను.. లేకుంటే చంపేస్తాం’ అంటున్నారు. వాళ్ల చంపుళ్లు ఎలా ఉన్నా నాకు మాత్రం ఒక్కసారైనా బిడ్డను కలుసుకోవాలని ఉంది. నేను, నా భర్త, కూతురు.. ముగ్గురం కలిసి ఒక్కరోజు గడపాలి’ అని నళిని తన ఆత్మకథలో చివరి కోరికను వెల్లడిస్తారు. నవంబర్ 24న విడుదల కానున్న ఈ పుస్తకానికి మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి డి. హరిపరానథమన్, ఎండీఎంకే పార్టీ నేత వైకో, వీసీకే నేత తిరుమావలవన్, రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు సీమాన్ తదితరులు ముందు మాటలు రాశారు. రాజీవ్ గాంధీ హత్య అనంతరం సీబీఐ అదుపులో మురుగన్ అలియాస్ శ్రీహరన్, నళిని(ఫైల్ ఫొటో) రాజీవ్ హత్యకేసుకు సంబంధించి కీలక పరిణామాలు.. -
రాజీవ్ హంతకుల విడుదలకై సినిమావాళ్లు..
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయించేందుకు తమిళ సినిమా వర్గం నడుంకట్టనుంది. ఆ హంతకులను మానవతా దృక్పథంతో వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ ఓ భారీ ర్యాలీని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. 1991 మే 21న రాజీవ్ గాంధీ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆయన హత్యకు సంబంధించి ప్రస్తుతం ఏడుగురు జైలు శిక్షను 20 ఏళ్లుగా అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 20 ఏళ్లలో ఆ దోషుల్లో చాలా మంచి మార్పు వచ్చిందని, ఇప్పటికైనా ఆ విషయాన్ని మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకొని వారిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి జయలలితకు విజ్ఞప్తి చేయనున్నారు. -
రాజీవ్ ఇంట్లోనే ఎల్టీటీఈ మనిషి?
దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హతమార్చడానికి చాలా ముందుగానే కుట్రపన్నిన ఎల్టీటీఈ వర్గాలు ఏకంగా 10 జన్‌పథ్ నివాసంలోకే ప్రవేశించాయా? ఆయన ఎప్పుడు, ఎక్కడ ఎలా తిరుగుతారన్న విషయాలన్నింటినీ అక్కడినుంచే గ్రహించాయా? అవునంటోంది ఓ పుస్తకం. గతంలో రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆర్డీ ప్రధాన్ ఈ పుస్తకం రాశారు. సోనియాగాంధీ కూడా అలాగే అనుకుంటున్నారని ఆయన అంటున్నారు. ''రాజీవ్ హత్యకేసులో చాలామంది నిందితులను అరెస్టుచేసి, కొంతమందిపై నేరం నిరూపించినా.. పూర్తి వాస్తవం బయటకు రాలేదని అనిపిస్తోంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న చాలామంది పెద్దమనుషులు కలిసి చేసిన కుట్రలో భాగమే ఈ హత్య అని తెలుస్తోంది. 10 జన్‌పథ్ నివాసంలో ఉన్నవాళ్లే కీలక సమాచారాన్ని బయటకు చేరవేశారు. ఆ సమయానికి 1991 లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి అమేథీలో ఉన్న సోనియాగాంధీకి కూడా ఇలాంటి అనుమానమే ఉంది'' అని ప్రధాన్ ఆ పుస్తకంలో రాశారు. హత్యకు దారితీసిన భద్రతాలోపాలపై జస్టిస్ వర్మ కమిషన్ విచారణ జరపగా, మొత్తమ్మీద భద్రతాలోపాలను జైన్ కమిషన్ పరిశీలించింది. కేవలం తమిళనాడు సర్కారుకు మాత్రమే ఎల్టీటీఈ కుట్రల గురించి తెలిసే అవకాశం ఉందని, కానీ ఈ విషయంలో ఐబీ, తమిళనాడు గవర్నర్ (భీష్మ నారాయణ్ సింగ్) విఫలమైనట్లు తనకు అనిపిస్తోందని ప్రధాన్ చెప్పారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఏడాదిన్నర పాటు ప్రధాన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు. -
నళిని పెరోల్‌కు విముఖత
తండ్రిని చూసేందుకు అనుమతి కోరిన రాజీవ్ గాంధీ హంతకురాలు నళినికి ఒక నెల రోజుల పాటు సెలవు మంజూరు చేసేందుకు విముఖత తెలుపుతూ జైళ్ల శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజీవ్ హత్య కేసులో వేలూరు జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నళిని హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. తన తండ్రి రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ 95 ఏళ్ల వయసులో చివరి దశలో ఉన్నారని, చివరి రోజుల్లో ఆయనతో గడిపేందుకు ఒక నెల రోజుల పాటు తనకు సెలవు ఇవ్వాలని కోరారు. ఈ కేసు న్యాయమూర్తులు ఎస్.రాజేశ్వరన్, పిఎన్ ప్రకాష్ సమక్షంలో మంగళవారం విచారణకు వచ్చింది. వేలూరు జైలు సూపరింటెండెంట్ కరుప్పన్నన్ సంజాయిషీ పిటిషన్ దాఖలు చేశారు. తిరునెల్వేలి జిల్లా విక్రమ సింగ పురం జిల్లా సమీపాన గల అంబలవానపురంలో పిటిషనర్ నళిని తండ్రి శంకరనారాయణన్ నివసిస్తున్నారని ఆయన ఆరోగ్యకరంగా ఉన్నారని తెలిపారు. విక్రమసింగపురం కొండ ప్రాంతం కావడంతోను, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నందున నళిని అక్కడ గడపడం సరికాదని అన్నారు. అంతేకాకుండా రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆమెను కలిసే అవకాశం ఉందని విక్రమసింగపురం పోలీసు ఇన్స్పెక్టర్ ఆక్షేపణ వ్యక్తం చేసినట్లు తెలిపారు. దీని గురించి జైళ్ల శాఖ అధికారి కూడా నివేదిక దాఖలు చేసినట్లు తెలిపారు. నళిని పిటిషన్‌ను నిరాకరించాలని కోరారు. దీంతో ఈ కేసు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు.