థియేటర్స్ తెరవాలని ఏడు నెలలుగా థియేటర్స్ ఓనర్స్, నిర్మాతలు.. ఇలా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 15 నుంచి థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే పాటించాల్సిన గైడ్‌లైన్స్ కూడా సూచించింది. కానీ తమిళనాడులో థియేటర్స్ ప్రారంభం అవుతాయో లేదో అనే సందిగ్ధత నెలకొంది. తమిళనాడు రాష్ట్ర మంత్రి కడంబూర్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. సినిమా థియేటర్స్ ప్రారంభించే అవకాశం లేదని పేర్కొన్నారు. ‘థియేటర్స్ అంటే ఎక్కువమంది జనం చేరే చోటు. ఇప్పుడు అది అంత శ్రేయస్కరం కాదు. అందుకని త్వరలో థియేటర్స్ ఓపెన్ చేయడానికి కుదరకపోవచ్చు. ఏదైనా ముఖ్యమంత్రితో చర్చించి ప్రకటిస్తాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment