‘అమ్మా’ అని పిలుస్తున్నారు! | manchu lakshmi speach at media press meet | Sakshi
Sakshi News home page

‘అమ్మా’ అని పిలుస్తున్నారు!

Published Fri, Apr 24 2015 11:23 PM | Last Updated on Wed, Apr 3 2019 9:12 PM

‘అమ్మా’ అని పిలుస్తున్నారు! - Sakshi

‘అమ్మా’ అని పిలుస్తున్నారు!

‘‘తమిళ, మలయాళ భాషల్లో మంచి సినిమాలు వస్తున్నాయి.. తెలుగులో రావడం లేదంటుంటారు. కానీ, ఇప్పుడు మంచి సినిమా వచ్చింది. ఆ చిత్రాన్ని అందరూ ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని నటి లక్ష్మీ మంచు అన్నారు. చల్లా మన్‌మోహన్ దర్శకత్వంలో లక్ష్మీ మంచు, శ్రీధర్ రావు, మాస్టర్ ప్రేమ్‌బాబు ముఖ్య తారలుగా భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘బుడుగు’. శుక్రవారం హైదరాబాద్‌లో లక్ష్మీ మంచు పత్రికల వారితో మాట్లాడుతూ - ‘‘ఏ పాత్ర చేసినా అందులోకి పరకాయ ప్రవేశం చేస్తావనీ, ఇందులో అమ్మ పాత్రకు ప్రాణం పోశావనీ సినిమా చూసినవాళ్లు అభినందిస్తుంటే ఆనందంగా ఉంది.

సామాజిక మాధ్యమాల ద్వారా నన్ను అనుసరించేవాళ్లు ‘లక్ష్మీ’ అని పిలవడానికి మొహమాటపడి ‘అక్కా’ అని పిలుస్తుంటారు. ఏం పిలవాలో తెలియక ‘అక్కా’ అని కూడా పిలిచేవాళ్లున్నారు. ఈ చిత్రం చూశాక ‘అమ్మా’ అని పిలుస్తున్నారు. ఆ పిలుపు నన్నెంత ఆనందానికి గురి చేసిందో మాటల్లో చెప్పలేను. కథను నమ్మి దర్శకుడు ఈ సినిమా తీశారు. ఆ నమ్మకం నిజమైంది’’ అని చెప్పారు. ఈ చిత్రవిజయం ఇచ్చిన ప్రోత్సాహంతో ‘బుడుగు 2’ తీయబోతున్నానని నిర్మాతల్లో ఒకరైన సారికా శ్రీనివాస్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement