Archana Gautam Reveals About Her Struggles In Film Industry In Career Starting Days - Sakshi
Sakshi News home page

సినిమా అవకాశాలు రావాలంటే ఇలాంటివి తప్పవు: అర్చన

Published Thu, Jun 22 2023 4:50 PM | Last Updated on Thu, Jun 22 2023 5:20 PM

Archana Gautam Shocking Comments On Film Industry - Sakshi

బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ నటి అర్చన గౌతమ్. ఆమె ప్రస్తుతం రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ఖత్రోన్ కే ఖిలాడీ షోలో నటిస్తోంది.  ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పుట్టి పెరిగిన ఆమె పని కోసం ముంబైకి వలస వచ్చింది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. అంతే కాకుండా పలు షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

(ఇదీ చదవండి: కీర్తి సురేష్‌తో ఉన్న వ్యక్తి ఎవరు.. ఫోటో వైరల్‌?)

తను ముంబైలో పీజీ చదువుతున్నప్పుడు సినిమా పరిశ్రమకు చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడిందట.. తనకు సినిమాలపై ఉన్న ఇష్టాన్ని ఆ మహిళ గుర్తించి ఆడిషన్స్‌కు వెళ్లాలనుకుంటున్నావా అని అడగడంతో తన ఆనందానకి రెక్కలు వచ్చినట్లు అయిందని తెలిపింది.  కానీ ఆడిషన్స్ కోసం వెళ్తున్నప్పుడు షార్ట్‌లు వేసుకుని వెళ్లాలని, అలా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతావని ఆ మహిళ సలహా ఇచ్చిందట. పై భాగంలో టాప్ కూడా అలాగే షార్ట్‌గా ఉంటే తప్పకుండా సెలెక్ట్ అవుతావని చెప్పడంతో కొంచెం ఇబ్బంది పడినట్లు అర్చన తెలిపింది.

(ఇదీ చదవండి: మెగా ప్రిన్సెస్‌ రాకతో చిరు ఏం చేయబోతున్నాడంటే..?)

ఆమె చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగించినా అదే నిజం అని తర్వాత తెలుసుకున్నట్లు ఆమె తెలిపింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో కొంతమంది మహిళలు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి  తెలుసుకున్నా, అలా రోజుకు మూడువేలతో తన  ప్రయాణం మొదలైంది అని అర్చన గౌతమ్ చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement