Archana Gautam
-
నడిరోడ్డుపై జరిగే అత్యాచారానికి ఇదేమీ తక్కువ కాదు: నటి
బిగ్‌బాస్ బ్యూటీ అర్చన గౌతమ్‌కు ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే! మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీని కలిసి అభినందించేందుకు తండ్రితో కలిసి ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లింది నటి. కానీ, అక్కడ కొందరు వారిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా దాడి కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. ఆడవాళ్లు కూడా అమర్యాదగా.. తాజాగా ఈ ఘటనపై స్పందించింది అర్చన గౌతమ్. ఓ ఛానల్‌తో మాట్లాడుతూ.. 'వారు మమ్మల్ని ఆఫీస్‌లోకి రానివ్వలేదు. కనీసం గేటు కూడా తెరవలేదు. మమ్మల్ని లోనికి పంపించొద్దని ఆదేశాలొచ్చాయన్నారు. అందుకు గల కారణాలేంటో నాకు తెలియదు. నేను కేవలం శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లాను. బిగ్‌బాస్ అయిపోయాక పార్టీ ఆఫీస్‌కే వెళ్లలేదు. వెళ్తే బాగుంటుందని ఆలోచించాను. కానీ అక్కడున్న మగవాళ్లే కాదు ఆడవాళ్లు సైతం అమర్యాదగా ప్రవర్తించారు. అక్కడున్న వారికి కాస్తైనా జాలి కలగలేదు. చేతులెత్తి వేడుకున్నా కనికరించలేదు మా డ్రైవర్‌ను తలపై కొట్టారు. నాన్నకు సైతం గాయాలయ్యాయి. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండటం మంచిది కాదని వెళ్లిపోతుంటే మమ్మల్ని వెంబడించారు, నా జుట్టు పట్టుకుని లాగారు. ఇది రోడ్డుపై జరిగే అత్యాచారం కంటే తక్కువ నేరమేమీ కాదు. మమ్మల్ని వదిలేయండని చేతులెత్తి వేడుకున్నా వినిపించుకోలేదు. ఈ ఘటన వల్ల మా నాన్న చాలా భయపడ్డాడు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేసింది అర్చన గౌతమ్. చదవండి: పిల్లల దగ్గర ఏదీ దాచను.. నా లవ్ బ్రేకప్‌లు, డేటింగ్లు అన్నీ చెప్పేశా.. -
టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన
బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ నటి అర్చన గౌతమ్. ఆమె ప్రస్తుతం రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ఖత్రోన్ కే ఖిలాడీ షోలో నటిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పుట్టి పెరిగిన ఆమె పని కోసం ముంబైకి వలస వచ్చింది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. అంతే కాకుండా పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: కీర్తి సురేష్‌తో ఉన్న వ్యక్తి ఎవరు.. ఫోటో వైరల్?) తను ముంబైలో పీజీ చదువుతున్నప్పుడు సినిమా పరిశ్రమకు చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడిందట.. తనకు సినిమాలపై ఉన్న ఇష్టాన్ని ఆ మహిళ గుర్తించి ఆడిషన్స్‌కు వెళ్లాలనుకుంటున్నావా అని అడగడంతో తన ఆనందానకి రెక్కలు వచ్చినట్లు అయిందని తెలిపింది. కానీ ఆడిషన్స్ కోసం వెళ్తున్నప్పుడు షార్ట్‌లు వేసుకుని వెళ్లాలని, అలా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతావని ఆ మహిళ సలహా ఇచ్చిందట. పై భాగంలో టాప్ కూడా అలాగే షార్ట్‌గా ఉంటే తప్పకుండా సెలెక్ట్ అవుతావని చెప్పడంతో కొంచెం ఇబ్బంది పడినట్లు అర్చన తెలిపింది. (ఇదీ చదవండి: మెగా ప్రిన్సెస్ రాకతో చిరు ఏం చేయబోతున్నాడంటే..?) ఆమె చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగించినా అదే నిజం అని తర్వాత తెలుసుకున్నట్లు ఆమె తెలిపింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో కొంతమంది మహిళలు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలుసుకున్నా, అలా రోజుకు మూడువేలతో తన ప్రయాణం మొదలైంది అని అర్చన గౌతమ్ చెప్పుకొచ్చింది. -
షూటింగ్లో ప్రమాదం.. బిగ్ బాస్ నటికి తీవ్రగాయాలు!
బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ నటి అర్చన గౌతమ్. ఆమె ప్రస్తుతం రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ఖత్రోన్ కే ఖిలాడీ షోలో నటిస్తోంది. ఈ షో షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. తాజాగా జరిగిన షూటింగ్లో అర్చనా గౌతమ్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో వెల్లడించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను పంచుకుంది నటి. (ఇది చదవండి: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!) అర్చన గడ్డం కింద బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఆమె గాయానికి వైద్యులు కుట్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ షోలో ధైర్యవంతులైన కంటెస్టెంట్లలో అర్చన గౌతమ్ ఒకరు. డేరింగ్ స్టంట్ చేస్తుండగానే తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. షూటింగ్ ప్రారంభమైన కొన్ని వారాల్లోనే రోహిత్ బోస్ రాయ్, అంజుమ్ ఫకీ అర్జిత్ తనేజా, ఐశ్వర్య శర్మ, నైరా బెనర్జీ పలువురు విన్యాసాలు చేస్తూ గాయపడ్డారు. కాగా.. అర్చన గౌతమ్ ఇటీవల హర్ష్ లింబాచియా షో ఎంటర్టైన్మెంట్ కా రాత్-హౌస్‌ఫుల్‌లో కనిపించింది. రాజకీయ నాయకురాలైన అర్చనా 'బిగ్ బాస్- 16'లో మరింత గుర్తింపు సాధించింది. (ఇది చదవండి: మహిళతో సహజీవనం.. లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!) View this post on Instagram A post shared by khatron ke khiladi 13 Khabri (@kkk13_biggbossott2.tazakhabar) -
నటిని చంపుతానంటూ ప్రియాంక గాంధీ పీఏ బెదిరింపులు
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్సనల్ అసిస్టెంట్ సందీప్ సింగ్‌పై కేసు నమోదైంది. హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అర్చన గౌతమ్‌ను సందీప్ అసభ్యంగా దూషించాడంటూ ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేశారు. ప్రియాంక గాంధీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 26న ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ జనరల్ కన్వెన్షన్‌లోని ప్లీనరీ సమావేశానికి హాజరయ్యేందుకు అర్చన వెళ్లిందని ఆమె తండ్రి గౌతమ్ బుద్ధ్ తెలిపాడు. కానీ ప్రియాంక పీఏ సందీప్ తనను లోనికి వెళ్లనివ్వలేదని పేర్కొన్నాడు. కులం పేరుతో అసభ్యంగా దూషిస్తూ తనను చంపేస్తానని బెదిరించాడని ఆరోపించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. సందీప్ సింగ్ తనను దుర్భాషలాడిన విషయాన్ని అర్చన ఫేస్బుక్ లైవ్‌లో వెల్లడించింది. -
డబ్బుల్లేక సిలిండర్లు మోశా, టెలీకాలర్‌గా పనిచేశా: నటి
హిందీ బిగ్‌బాస్ 16వ సీజన్ కంటెస్టెంట్ అర్చన గౌతమ్ ఇండస్ట్రీకి రావడానికి ముందు ఎన్నో కష్టాలు పడింది. కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉండటంతో ఖాళీ సిలిండర్లు మోసింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పుట్టి పెరిగిన ఆమె పని కోసం ముంబైకి వలస వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో తాను బాల్యం నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పెట్టింది. 'మా కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడటంతో నేను కూడా ఏదో ఒక పని చేసేదాన్ని. 2007-08 సంవత్సరంలో ఖాళీ సిలిండర్లను సైకిల్ లేదా బండిపై తీసుకెళ్లి ఇచ్చేదాన్ని. ఇందుకుగానూ రూ.10-20 దాకా ఇచ్చేవారు. ఇక నా మొదటి జాబ్ టెలీకాలర్. నాకు ఆరువేల జీతం ఇచ్చారు. కానీ పెద్దగా ఇంగ్లీష్ రాకపోయేసరికి నన్ను ఉద్యోగంలోంచి పీకేశారు. ఆ తర్వాత పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేసేదాన్ని. చివరగా నేను పని చేసిన కంపెనీ మూతపడటంతో గతి లేని స్థితిలో సొంతూరికి వెళ్లిపోయాను' అని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ 16వ సీజన్ టాప్ 5 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిల్చిన అర్చన పలు అందాల పోటీల్లో రాణించింది. మిస్ ఉత్తరప్రదేశ్ 2014, మిస్ బికినీ ఇండియా 2018, మిస్ బికినీ యూనివర్స్ 2018గా నిలిచింది. జంక్షన్ వారణాసి అనే ఐటం సాంగ్‌లో అతిథి పాత్రలో మెరిసింది. చదవండి: త్వరగా ఎదిగేందుకు ఇంజక్షన్స్ తీసుకున్న హన్సిక -
‘ఐపీఎల్’ పెద్ద హిట్ కొట్టాలి
విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐపీఎల్’. బీరం వరలక్ష్మి సమర్పణలో అంకిత మీడియా హౌస్ బ్యానర్‌పై బీరం శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘చిన్న చిత్రాలు హిట్ అయినప్పుడు సంతోషంగా ఉంటుంది. ‘ఐపీఎల్’ మూవీ కూడా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘‘క్రికెట్, తీవ్రవాదం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. సినిమా బాగా వచ్చింది.. అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సురేష్ లంకలపల్లి. ‘‘మాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు బీరం శ్రీనివాస్. ‘‘ఈ సినిమాలో పాటలు హిట్ కావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ వేంగి సుధాకర్’’ అన్నారు విశ్వ కార్తికేయ. -
తిరుమల కొండపై నటి అర్చనా గౌతమ్ రచ్చ... అసలు నిజాలు ఇవే
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన యూపీ నటి అర్చన గౌతమ్ సోమవారం నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. రూ.10,500 పెట్టి టికెట్ కొన్నా.. టీటీడీ సిబ్బంది తనకు టికెట్ ఇవ్వలేదని, తనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను టీటీడీ కొట్టిపారేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. అసలు ఆరోజు ఏం జరిగింది? నిజా నిజాలు ఏంటి ఈ వీడియోలో చూడండి. -
Fact Check: నటి అర్చనా గౌతమ్ అసత్య ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దు: టీటిీడీ
-
తిరుమల కొండపై నటి అర్చన రచ్చ.. స్పందించిన టీటీడీ
యూపీ చెందిన నటి అర్చన గౌతమ్ తిరుమల కొండపై నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం తిరుపతి దర్శనానికి వచ్చింది. ఈ క్రమంలోనే రూ.10,500 పెట్టి టికెట్ కొన్న కూడా టీటీడీ సిబ్బంది తనకు టికెట్ ఇవ్వాలేదని ఆరోపించింది. కౌంటర్‌కి వెళ్లి అడగ్గా సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. ఈ సంఘటనకు సంబంధించిన ఆమె సెల్ఫీ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. చదవండి: బిగ్‌బాస్‌పై సింగర్ స్మిత సంచలన వ్యాఖ్యలు.. ‘చచ్చినా ఆ తప్పు చేయను’ అయితే తాజాగా ఈ ఘటనపై టీటీడీ అధికారులు స్పందించారు. తమ సిబ్బంది నటిపై దాడి చేయడం అబద్ధమని టీటీడీ పేర్కొంది. ఈ మేరకు పూర్తి వివరాలతో టీటీడీ అధికారిక ట్విటర్ ఖాతాలో అధికారులు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. టీటీడీ ఉద్యోగులపై నటి అర్చనా గౌతమ్ దాడి హేయమైన చర్య అని, అవాస్తవ ఆరోపణలతో ఉద్యోగులపైనే తప్పుడు ఫిర్యాదు చేయటాన్ని టీటీడీ ఖండిస్తు ఈ ఘటనకు సంబంధించి వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చారు. చదవండి: సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీ శివకాంత్ తివారి, నటి అర్చనా గౌతమ్‌తోపాటు మరో ఏడుగురికి ఆగస్టు 31న శ్రీవారి దర్శనం కోసం కేంద్ర సహాయమంత్రి నుంచి సిఫారసు లేఖను తీసుకుని తిరుమలకు వచ్చారు. అదనపు ఈవో కార్యాలయంలో దర్శనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. (2/n) — Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 5, 2022 -
తిరుమలలో సినీనటి అర్చనా గౌతమ్ వీరంగం
-
అందమైన అమ్మాయి
అల్తాఫ్, అర్చనా గౌతమ్ హీరోహీరోయిన్లుగా వేముగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్యూటీ గర్ల్’. లక్ష్మీ నారాయణ సినిమా పతాకంపై దేవదాస్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేవదాస్ నారాయణ మాట్లాడుతూ– ‘‘షోలాపూర్‌లో నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్‌గా 400కి పైగా పెద్ద సినిమాలు రిలీజ్ చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాను. వేముగంటిగారి దర్శకత్వంలో ఈ సినిమా బాగా వస్తోంది. అన్ని వాణిజ్య అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశాం.. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టై¯Œ మెంట్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏలేంద్ర మహావీర్, కెమెరా: మురళీ కృష్ణ. వై. -
మా ఆయన నుంచి విడాకులు ఇప్పించండి
పట్నా: అత్తవారింట్లో టాయ్‌లెట్ నిర్మించనందుకు నిరసనగా ఓ నవ వధువు భర్త నుంచి విడాకులు కోరింది. బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా కొతవా గ్రామానికి చెందిన అర్చనా గౌతమ్ ఈ నిర్ణయం తీసుకుంది. మలవిసర్జనకు చీకట్లో ఆరుబయట ప్రదేశానికి వెళ్లడం అవమానంగా ఉందని అర్చన వాపోయింది. అంతేగాక భూమి యజమాని తనను పలుమార్లు అవమానించాడని చెప్పింది. ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాల్సిందిగా తన భర్త బబ్లూ కుమార్‌కు ఎన్నిసార్లు చెప్పినా వినలేదని అర్చన పంచాయతీ పెద్దల ముందు చెప్పింది. బబ్లూ నుంచి తాను విడిపోతానని, విడాకులు ఇప్పించాలని పంచాయతీ పెద్దలను కోరింది. గత మేలో బబ్లూ, అర్చన వివాహం చేసుకున్నారు. బిహార్‌లో లక్షలాదిమందికి ఇళ్లలో టాయ్లెట్లు లేవు. టాయ్లెట్లు నిర్మిస్తేనే అత్తగారింటికి వెళ్తామని గతంలో చాలామంది వివాహితులు షరతు పెట్టిన సంఘటనలు ఉన్నాయి.