బిగ్‌బాస్ బ్యూటీ అర్చన గౌతమ్‌కు ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే! మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీని కలిసి అభినందించేందుకు తండ్రితో కలిసి ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లింది నటి. కానీ, అక్కడ కొందరు వారిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా దాడి కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి.
ఆడవాళ్లు కూడా అమర్యాదగా..
తాజాగా ఈ ఘటనపై స్పందించింది అర్చన గౌతమ్. ఓ ఛానల్‌తో మాట్లాడుతూ.. 'వారు మమ్మల్ని ఆఫీస్‌లోకి రానివ్వలేదు. కనీసం గేటు కూడా తెరవలేదు. మమ్మల్ని లోనికి పంపించొద్దని ఆదేశాలొచ్చాయన్నారు. అందుకు గల కారణాలేంటో నాకు తెలియదు. నేను కేవలం శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లాను. బిగ్‌బాస్ అయిపోయాక పార్టీ ఆఫీస్‌కే వెళ్లలేదు. వెళ్తే బాగుంటుందని ఆలోచించాను. కానీ అక్కడున్న మగవాళ్లే కాదు ఆడవాళ్లు సైతం అమర్యాదగా ప్రవర్తించారు. అక్కడున్న వారికి కాస్తైనా జాలి కలగలేదు.
చేతులెత్తి వేడుకున్నా కనికరించలేదు
మా డ్రైవర్‌ను తలపై కొట్టారు. నాన్నకు సైతం గాయాలయ్యాయి. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండటం మంచిది కాదని వెళ్లిపోతుంటే మమ్మల్ని వెంబడించారు, నా జుట్టు పట్టుకుని లాగారు. ఇది రోడ్డుపై జరిగే అత్యాచారం కంటే తక్కువ నేరమేమీ కాదు. మమ్మల్ని వదిలేయండని చేతులెత్తి వేడుకున్నా వినిపించుకోలేదు. ఈ ఘటన వల్ల మా నాన్న చాలా భయపడ్డాడు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేసింది అర్చన గౌతమ్.
చదవండి: పిల్లల దగ్గర ఏదీ దాచను.. నా లవ్ బ్రేకప్‌లు, డేటింగ్‌లు అన్నీ చెప్పేశా..
Comments
Please login to add a commentAdd a comment