
కులం పేరుతో అసభ్యంగా దూషిస్తూ తనను చంపేస్తానని బెదిరించాడని ఆరోపించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. సందీప్
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్సనల్ అసిస్టెంట్ సందీప్ సింగ్‌పై కేసు నమోదైంది. హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అర్చన గౌతమ్‌ను సందీప్ అసభ్యంగా దూషించాడంటూ ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేశారు. ప్రియాంక గాంధీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 26న ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ జనరల్ కన్వెన్షన్‌లోని ప్లీనరీ సమావేశానికి హాజరయ్యేందుకు అర్చన వెళ్లిందని ఆమె తండ్రి గౌతమ్ బుద్ధ్ తెలిపాడు.
కానీ ప్రియాంక పీఏ సందీప్ తనను లోనికి వెళ్లనివ్వలేదని పేర్కొన్నాడు. కులం పేరుతో అసభ్యంగా దూషిస్తూ తనను చంపేస్తానని బెదిరించాడని ఆరోపించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. సందీప్ సింగ్ తనను దుర్భాషలాడిన విషయాన్ని అర్చన ఫేస్‌బుక్ లైవ్‌లో వెల్లడించింది.