Khatron Ke Khiladi 13: Archana Gautam suffers severe injury, pic goes viral - Sakshi
Sakshi News home page

Archana Gautam: షూటింగ్ సెట్‌లో తీవ్రగాయాలు.. ఫోటోలు షేర్ చేసిన నటి!

Published Wed, Jun 14 2023 12:44 PM | Last Updated on Wed, Jun 14 2023 12:57 PM

Bigg Boss Actress Archana Gautam suffers severe injury pic goes viral - Sakshi

బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ నటి అర్చన గౌతమ్. ఆమె ప్రస్తుతం రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ఖత్రోన్ కే ఖిలాడీ షోలో నటిస్తోంది. ఈ షో షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. తాజాగా జరిగిన షూటింగ్‌లో అర్చనా గౌతమ్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో వెల్లడించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను పంచుకుంది నటి. 

(ఇది చదవండి: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!)

అర్చన గడ్డం కింద బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఆమె గాయానికి వైద్యులు కుట్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ షోలో ధైర్యవంతులైన కంటెస్టెంట్‌లలో  అర్చన గౌతమ్ ఒకరు. డేరింగ్ స్టంట్‌ చేస్తుండగానే తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. షూటింగ్ ప్రారంభమైన కొన్ని వారాల్లోనే రోహిత్ బోస్ రాయ్, అంజుమ్ ఫకీ అర్జిత్ తనేజా, ఐశ్వర్య శర్మ, నైరా బెనర్జీ పలువురు విన్యాసాలు చేస్తూ గాయపడ్డారు. కాగా.. అర్చన గౌతమ్ ఇటీవల హర్ష్ లింబాచియా షో ఎంటర్‌టైన్‌మెంట్ కా రాత్-హౌస్‌ఫుల్‌లో కనిపించింది. రాజకీయ నాయకురాలైన అర్చనా 'బిగ్ బాస్- 16'లో మరింత గుర్తింపు సాధించింది.  

(ఇది చదవండి: మహిళతో సహజీవనం.. లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement