హీరో సూర్య తలకు గాయం.. నిర్మాత క్లారిటీ! | Producer Responds On kollywood Star Hero Suriya Injury In Shooting | Sakshi
Sakshi News home page

Suriya: ఆందోళన వద్దు.. సూర్య బాగానే ఉన్నాడు: నిర్మాత ట్వీట్‌

Published Fri, Aug 9 2024 7:59 PM | Last Updated on Fri, Aug 9 2024 8:28 PM

Producer Responds On kollywood Star Hero Suriya Injury In Shooting

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వర్కింగ్ టైటిల్‌ సూర్య44 పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌లో హీరో సూర్యకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయనకు తలకు బలమైన గాయమైనట్లు కోలీవుడ్‌లో వార్తలు రావడంతో ఫ్యాన్స్‌కు షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్న ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

నిర్మాత రాజశేఖరన్‌ పాండియన్‌ సోషల్‌ మీడియా వేదికగా సూర్య గాయంపై స్పందించారు. సూర్యకు గాయమైన మాట వాస్తవమేనని.. అయితే చిన్నదేనని తెలిపారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా.. ఈ మూవీ షూటింగ్‌ ఇటీవలే ఊటీలో ప్రారంభమైంది. సూర్యకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా అక్టోబరు 10న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement