కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి(Vidaamuyarchi Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించగా.. త్రిష హీరోయిన్‌గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించింది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లోనూ రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు.
అయితే ఈ మూవీని అజర్ బైజాన్ అనే దేశంలో చిత్రీకరించారు. ఇందులో కారుతో అజిత్ కుమార్ కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేశారు. ఆ సమయంలో ఓసారి అజిత్ నడుపుతున్న కారు అదుపుతప్పి కిందపడిపోయింది. అజిత్ కుమార్‌కు కారు రేసింగ్‌తో రియల్ స్టంట్స్ చేయడమంటే సరదా. అలా సినిమాల్లోనూ డూప్ లేకుండానే రియల్‌గా కొన్ని సీన్స్ చేస్తుంటారు.
తాజాగా విదాముయార్చి ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. విదాముయార్చి షూటింగ్ సమయంలో ఎదురైన పరిస్థితులను వీడియో రూపంలో ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇందులో అజిత్ కుమార్ స్టంట్స్‌తో పాటు.. ఎముకలు కొరికే చలిలోనూ షూటింగ్ చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాతావరణం అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ ఈ మూవీని షూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటో మీరు కూడా చూసేయండి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
The toughest challenges forge the greatest triumphs! 🔥 Step behind the scenes of VIDAAMUYARCHI 💪 Pushing limits in the harshest terrains. ⛰️
🔗 https://t.co/WPFLwCykLR
FEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar… pic.twitter.com/haDfk8fono— Lyca Productions (@LycaProductions) February 3, 2025
Comments
Please login to add a commentAdd a comment